4, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3037 (చీమ కఱచి చచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమ కఱచి చచ్చె సింహబలుఁడు"
(లేదా...)
"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"
(మద్దూరి రామమూర్తి గారి భువనగిరి అష్టావధానంలో సమస్య)

110 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    రంగాపూరు నియోజకాధిపతియై రాణించగా నెంచి , ‌ శీ

    ర్షాంగం బందున టోపియున్ గడుల పంచన్ మేనిపై దాల్చుచన్

    రంగారంగ తురుష్క మానవుల " ఓట్లన్ " బ్రయోషించగా

    రంగాచారి నమాజు జేసె నతుడై రంజాను పర్వంబునన్

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దాల్చుచున్" టైపాటు. మూడవ పాదంలో గణదోషం. "ఓట్లన్ దా బ్రయోషించగా" అనండి.

      తొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పామును వోలుచున్ వడిగ పాకుచు గుట్టుగ నన్ని గ్రామముల్
    గోముగ నాలకించుచును గొప్పగు రీతిని కష్టనష్టముల్
    సామును జేయుచున్ జగను చంద్రుని దించెను గద్దెనుంచిటుల్:
    "చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    చీమగ జేరు కామము , రుచించును బెంచు మదమ్ము మోహమున్ !
    పాముగ మారి కాటునిడి ప్రాణము దీయు ! నిజమ్ము ! సేవికన్
    కాముకదృష్టి కీచకుడు గాంచి యమాలయమేగె , కామమన్
    చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ కామమనే చీమతో అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. చావు చెప్పి రాదు సాధుపుంగ వుకైన
    శివుని యాజ్ఞ మేర జెఱ్ఱి కుట్టు
    బలము గలిగి నంత బ్రతుకంగ సరిపోదు
    చీమ కఱచి చచ్చె సింహ బలుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాధుపుంగవునకు' అనండి.

      తొలగించండి
    2. చావు చెప్పి రాదు సాధుపుంగ వునకు
      శివుని యాజ్ఞ మేర జెఱ్ఱి కుట్టు
      బలము గలిగి నంత బ్రతుకంగ సరిపోదు
      చీమ కఱచి చచ్చె సిం హ బలుడు

      తొలగించండి
  5. శివుని యాన లేక చీమైన కుట్టదు
    చీమ కఱచి చచ్చె సింహబలుడు
    విధి విలాసమిదియ వీరుడెవ్వండైన
    మడియకుండబోడు మృడుడిలీల

    రిప్లయితొలగించండి
  6. పామరుని విమర్శ ప్రాజ్ఞుని భయపెట్టె
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు
    యివ్విధముగ జరుగు నిలయందపుడపుడు
    వింత గొలుపు గాని చింత వలదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బలుడు + ఇవ్విధము' అన్నపుడు యడాగమం రాదు. "జరుగు నివ్విధమున జగతి నపుడపుడు" అనండి.

      తొలగించండి


  7. ప్రేమ లోన చిక్కె, ప్రేయసి ముదమార
    చూచు కొనెనతడిని ; శూన్య మాయె
    బతుకు తాను బోవ, బలహీనుడై , ప్రేమ
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
  8. కుట్టగానె చచ్చు నట్టివరము నంది
    చీమ కఱచి చచ్చె, సింహబలుడు
    పడతి కృష్ణఁ గోరి వలలుని చేతిలో
    నృత్యశాలలోన నిహతి జెందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఏమది వింతగాదు కద యేమరు పాటున జేయగా పనుల్
    నీమము వీడిపో వగను నెయ్యము కయ్యము గాదటన్ గనన్
    పాముకు పాలుపో సినను పాపము నెంచక కాటువేయునే
    చీమ పరాకునన్ గఱచె సింహ బలుండు గతించె వింతగన్

    రిప్లయితొలగించండి
  10. (నర్తనశాలలో మృతుడైన కీచకుని చూచి అక్క సుధేష్ణ;బావ విరాటరాజు)
    సీమల నున్న శాత్రవుల
    ఛేదన సల్పుచు ఘోరవీరసం
    గ్రామము నందు భీకరపు
    గర్జన జేసెడి కీచకుండిసీ!
    కాముకుడౌచు మాలినిని
    కాంక్షను వీడక వెంటనంటెనే!
    చీమ పరాకునన్ గరచె;
    సింహబలుండు గతించె వింతగన్.
    (మాలిని -సైరంధ్రీవృత్తిలోని ద్రౌపదిపేరు;సింహబలుడు -కీచకుడు)

    రిప్లయితొలగించండి
  11. నారి రూపు దాల్చి నర్తన శాల లో
    చీమ భంగి చే రె భీముడం త
    కీచ కుండు రాగ పీచ మ డ చె గా దె
    చీమ కరచి చచ్చే సింహ బలు డు

    రిప్లయితొలగించండి
  12. కామపిపీళికంబు నరకంబును జేర్చెడు వాహనంబు సం
    గ్రామము నన్నదమ్ములకు గామిని మూలమె గల్గె, దైత్యులున్
    గామినిమోహమందు సుధగానకజచ్చిరి, భస్మదైత్యుడున్
    గామిని గాంచిమోహమున గాలునిజేరెవచింప గామమన్
    *"జీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"*

    రిప్లయితొలగించండి
  13. లేమను గోరిరావణుడు లింగము నెత్తిన భీమవిక్రముం
    డేమడిసెన్ శివాజ్ఞ నరుడే వధియించెవరాళిబొందియున్
    గామపిపీళికమ్మొకటె గాయము గూల్చగ జాలు వింతయౌ
    *"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. ఏమని చెప్ప వీలు గలదెందరు యోధల నోడగొట్టిరో?
    నీమము నిష్టయున్ గలుగు నేతకు పట్టము గట్టనెంచనన్
    సాములు గెల్వసాధ్యమయె! సాదర భావము పొంగి పొర్లగా
    చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్!!

    రిప్లయితొలగించండి
  15. బలము గలిమి యున్న బ్రతికించు యొరులను
    విఱ్ఱవీగు టెపుడు విలువ నీదు
    చిన్ననాటి యందె జెప్పిరి నీతులు
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బ్రతికించు నొరులను... చిన్ననాడె గురులు సెప్పిరి...' అనండి.

      తొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భయము చెంది... సన్నివేశమ్ములో నట్టి । చీమ...' అనండి. మూడవ పాదంలో గణదోషం.

      తొలగించండి
    2. సవరించి ప్రచురించాను. ధన్యవాదములు గురువు గారు.

      తొలగించండి
  17. కాల మహిమ లెన్న కలి లోన సాధ్యమే
    తాడు పామై కరచు దారిలోన
    మనసు పట్టు జారి మాయనే క్రమ్మంగ
    చీమ కరచి చచ్చె సిం హ బలుడు.

    రిప్లయితొలగించండి
  18. యాంటు మాను యనెడి యాంగ్ల చిత్రములోన
    బాలలెల్ల మిగుల భయము నొంది
    వీక్ష జేయు సన్నివేశము నందున
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    Ant Man అనే ఆంగ్ల భాషా చలనచిత్రములో పిల్లలను భయపెట్టే సన్నివేశంలో అద్భుత శక్తులు కలిగిన చీమ గొప్ప బలం కల వారిని సంహరించింది

    రిప్లయితొలగించండి
  19. ఏమది వింత కాదె చెలి!ఎట్టులజచ్చెనొ యంచునచ్చటా
    భామినులంత కీచకుని వార్తను తేల్చిరి యివ్విధంబుగన్
    "దోమ కుత్తకన్ జొరిన దోర్బల కుంజర శ్రేణి వోలెనే
    చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దోమ కుత్తుకన్' అన్నచోట గణభంగం. "దోమ గళంబునన్ జొరిన" అనండి.

      తొలగించండి
  20. ఏమనందు విధిని దెంత చిత్రము జూడ
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు
    కాల మహిమ దెలియ గల వారలెవ్వరు
    యెంత వారలైన నేమి ఫలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చీమ యిదేమి జేయునని చిందులు వైచుచు చీదరించుచున్
      ఛీ మన సాటి గాదనుచు జిక్కుల బెట్టుచు త్రోసి బుచ్చినన్
      చీమయె నేడు గెల్చె జన సేనలు తోడుగ నిల్వ జూడుమా
      చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ఎవ్వరు + ఎంత' అన్నపుడు యడాగమం రాదు. "వార లెవ్వార । లెంత..." అనండి.

      తొలగించండి
  21. కృష్ణుడంతవాని కృంగదీసెను బోయ
    మౌని శాపమచట మాయజేసె
    కాల మెల్లజనుల కబళించు కుహరము
    చీమగరచి చచ్చె సింహబలుడు

    రిప్లయితొలగించండి
  22. 🙏
    మీరన్నట్లుగా వ్రాసిన అర్థము మారునని - మార్పు చేసాను. నాకీ పురిటి నొప్పులు ఎన్నాళ్ళో!
    తప్పయన జెప్ప ప్రార్ధన.

    బలము గలిమి యున్న బ్రతికించు మొరులను
    విఱ్ఱవీగు టెపుడు విజ్ఞతవదు
    చిన్ననాడె గురులు సెప్పిరి నీతులు
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విజ్ఞత + అవదు' అన్నపుడు సంధి లేదు. 'అవదు' అన్న ప్రయోగమూ సాధువు కాదు.
      నిరుత్సాహ పడకుండా మీ వ్యాసంగాన్ని కొనసాగించండి. బాలారిష్టాలు సహజమే!

      తొలగించండి
    2. 🙏ధన్యవాదములు. ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    రాణ నుత్తమునకు రాలేదు గుణములు
    పలుక బట్టరాని భడవ వలన
    కొండ బిండి జేయ గ్లోబరీననియెడి
    చీమ కరచి చచ్చె సింహ బలుడు!

    రిప్లయితొలగించండి
  24. భామను జూచు మత్తునను భల్వెడలెన్ బలశాలి, యంతటం
    జీమల పుట్టఁ గాల్బడగఁ జెంగున దూకుచుఁ బట్టుఁదప్పె నా
    కామము మంటఁగల్సె ఘనకాయము వీడె ప్రమాదమందు! హా!
    "చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"

    రిప్లయితొలగించండి
  25. ప్రజల మోస పుచ్చి ప్రల్లడు డొక్కడు
    చీమ కఱచి చచ్చె, సింహబలుఁడు
    నీచుడైన వాని పీచమడఁగజేసి
    గద్దెనెక్కె నేడు గౌరవముగ

    రిప్లయితొలగించండి
  26. డా.పిట్టా సత్యనారాయణ
    క్షేమము కాదు పొందనగ ఖిన్నను కుంతిని గూడ ప్రేమమై
    నీమము శాపమున్ గనగ నేటికి యంచని గ్రుడ్డి ప్రేమమై
    ధీమతి యుద్ధవీరుడు, విధేయతనున్ మరువంగ దైవమా
    చీమ పరాకునన్ గరచె సింహ బలుండు గతించె వింతగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేటికి నంచని' అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా, ధన్యవాదాలు.

      తొలగించండి
  27. బలము కలదనుచును బాద్యతలమరిచి
    క్రూరమైన మనసు కరుణలేమి
    తనను మించి నట్టి ఘనపాటిలేడన
    చీమ కరచి చచ్చె సింహబలుడు!!

    **సింహబలుని దృష్టిలో సైరంధ్రి మొగుడు చీమలాంటి వాడని అర్థం.

    రిప్లయితొలగించండి
  28. విషముగలదియగుటవిసవిసలాడుచు
    చీమకఱచిచచ్చెసింహబలుడు
    విషముముందుబలమువెలవెలలాడును
    సత్యమిదియవలదుసందియంబు

    రిప్లయితొలగించండి
  29. భీమ బలుండ నంచు కడు బీరములాడుచు నేతయొక్క డా
    రామము నందు చేరగ విరామము పొందగ వైరి వర్గముల్
    సోమము చూపి గెల్చిరయొ! చోద్యముగా కనుచుండ నేతతాన్
    చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్

    రిప్లయితొలగించండి
  30. ఏమనిబల్కుచుంటిరిటయీపదమిచ్చటవ్రాయుచుంటినీ
    చీమపరాకునన్గఱచెసింహబలుండుగతించెవింతగన్
    చీమయకారణంబహహసింహబలుండటచావునొంటకున్
    నేమనిజెప్పవచ్చునిక?నీశుడెకాచునురంగనాధుడా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చావు బొంద నే । నేమని...' అనండి.

      తొలగించండి
  31. పడగ విప్పి తిరుగు పాము చూడగ చలి
    చీమ కఱచి చచ్చె, సింహబలుఁడు
    రాజు మదమడఁచె బిరాన బడుగులంత
    కలుగు జయము మీకు కలిసి యున్న

    రిప్లయితొలగించండి
  32. విశ్వమెల్ల గెలిచి వీరుడైతిననుచు
    దుండగములు చేయు చుండ కనలి
    బుద్ధిమంతుడైన పురుషుడొకడు కూల్చ
    చీమ కఱచి చచ్చి సింహబలుడు

    రిప్లయితొలగించండి
  33. నీతి వీడి బ్రతుక నేడు కీర్తిగ నెంచు
    చేవచచ్చి బ్రతుకు జీవి నరయ
    దయయు సత్యము విడి ధనవంతుడైననూ
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమోహన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనవంతుడైనను' అనండి.

      తొలగించండి
  34. కాల కంఠు గెలిచి గాండీవి యక్కట
    వింటి విద్య మేటి వీర వరుఁడె
    యోడెఁ జోర తతికి నువిదల మనుపఁగఁ
    జీమ కఱచి చచ్చె సింహబలుఁడు


    ఏమని చెప్పఁగా నగు మహేశ్వరు లీలలు సంక్షయమ్మునే
    నీమముగాఁ దలంచి యతి నేర్పునఁ దీర్చును స్వీయ కార్యమే
    కామపుఁ జింత కారణముగా వలలాహ్వయ కాలు రూపపుం
    జీమ పరాకునం గఱచె సింహబలుండు గతించె వింతగన్

    [పరాకు = తత్పరత]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వంగ పురాణము:

    చీమయె గండుదౌ బలిసి సింహపు చెవ్వున దూరి కుట్టగా
    భీముని బోలు సింహమట వ్రేటులు వేయుచు పంజతోడుతన్
    చీమను కొట్టబోవగను చెన్నుగ చచ్చెను నాత్మహత్యనున్:
    "చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. మిత్రులందఱకు నమస్సులు!

    [మహిషాసుర మర్దన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]


    "చీమవు నీవు! నేను గద సింహ!" మనెన్ మహిషాసురుండు దా
    నేమరుపాటునన్ గనుచు నీశ్వరిఁ గాళిఁ గపాళి దుర్గనున్!
    వేమఱుఁ దూలనాడ నడఁపెం దగ దైత్యునిఁ దల్లి! చూడఁగాఁ
    జీమ పరాకునం గఱచె; సింహబలుండు గతించె, వింతగన్!

    రిప్లయితొలగించండి
  37. పై భావమే...
    [2]
    "చీమ వీవు! నేను సింహమ్ము!" నంచును
    మహిషుఁ డపుడు పలికి, ’మహిత శక్తిఁ’
    దూలనాడ, శక్తి దుర్జనుం జంపెను!
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  38. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. చిన్న వాని చేత నెన్నిక లందున
    పెద్ద నేత యోడ వింత గాను
    జనులు పలికి రిటుల చకితులయ్యి యపుడు
    "చీమ కఱచి చచ్చె సింహబలుఁడు"

    రిప్లయితొలగించండి
  40. ఈగరోగమంటి మూగగ బాధలు
    పాముకాటువంటి దోమకాటు
    అంటు జబ్బులన్ని వెంటాడు సమయాన
    చీమకరచి చచ్చె సింహబలుడు!(నిందలేకబొందెబోదు)

    రిప్లయితొలగించండి
  41. కాలి తోడ త్రొక్క కాననొకడు చలి
    చీమ కఱచి చచ్చి, సింహబలుడె
    యైన తప్పు చేయ నందవలయు శిక్ష
    తప్ప కనుట నిజము ధరణి యందు



    చీమవు నీవు నేనెపుడు సింహ మటంచు బకాసురుండనన్
    వేమరు లెక్కచేయకను భీముడు భీకర రూపుడై యటన్
    యేమర పాటునున్న ఖలు నివ్విధి కూల్చక తప్పదంచు
    నా
    చీమ పరాకునన్ గరచె సింహబలుండు గతించె వింతగన్


    రిప్లయితొలగించండి
  42. ఆటవెలది
    సరసమాడబోయి సైరంధ్రితో నాడు
    నర్తనంపు శాల నార్తిఁ జేరి
    వలలుఁ బాలఁ బడుచు పాపంబున వలపు
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
  43. గోముగ బాల్యమందుననె కొండనుదాల్చిన గోపబాలుని
    న్నేమరుపాటునన్ నెరుకవేసిన బాణము పాదమంటగా
    హైమవతీశు నాఙ్ఞయని హాయిగ వైష్ణవ ధామమేగగా
    చీమ పరాకునం గరచె సింహబలుండు గతించె వింతగన్

    రిప్లయితొలగించండి
  44. భీమ బలుడువాడు భీకరమైనట్టి
    సింహమైననొంటి చేయిఁజంపు
    దైవలీలదెలియదెవరికినైనను
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
  45. చెదలు వేరు చేరి చెట్టును పడగొట్టె
    కాల్చె నిప్పు రవ్వ గడ్డి వాము
    ఎంత చిన్న నున్బ నీశు నానయె మిన్న
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షేమము నుంటిరే? తమరి చిత్తము సుస్థిర మున్నదా ప్రభూ?
      ఏమని చెప్పినారు? తమ రేసురనైనను పుచ్చుకుంటిరా?
      తాము పరాకుతో నిడిన తప్పు సమస్య విచిత్ర మయ్యదే
      "చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె" వింతగన్

      తొలగించండి
  46. ఉత్పలమాల
    ప్రేమగ వ్యాప్తిజేసి గజలే! ప్రియ శిష్య వధూటులన్ సదా
    కామపు దృష్టితోడగన గ్రక్కున నొక్కతె రచ్చజేయుచున్
    జీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్
    వేమరు మెచ్చు రంగమున! వేర్పడెఁ దా పరకాంత మోజునన్! !

    రిప్లయితొలగించండి
  47. నీమములెంచరెన్నటికి నీచపుబుద్ధి చరించు కాముకుల్
    కామముకళ్ళుగప్పిపరకాంతసుఖంబునుఁగోరు కీచకున్ 
    భీముడుమారువేషమున భీకరుడై కడదేర్చె కాముకున్
    చీమ పరాకునం గరచె సింహబలుండు గతించె వింతగన్

    రిప్లయితొలగించండి
  48. మూడవపాదంలో కాముకున్ బదులు ఈగతిన్ అని చదవ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  49. పులులుసింహములకు పొట్టచీల్చగలడు
    భయమువీనిచూచి పారిపోవు
    కాలమహిమచూడు కళ్ళు కాళ్ళు సడలె
    చిమకరచిచచ్చె సింహబలుడు.

    రిప్లయితొలగించండి
  50. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అతడు సింహబలుడు..
    వ్యాయామ శాలలో

    బరువు లెత్తు వేళ కరచె చీమ..

    బరువు జారి మీద
    పడి చచ్చె..నని రిట్లు...

    "చీమ కఱచి చచ్చె సింహబలుడు"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.6.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  51. నిన్నటి సమస్యకు పూరణ

    సమస్యః-

    *"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"*

    కాముకుడైన కీచకుని కామిని రమ్మని పిల్చినంత నా
    భామనుఁ బొందగోరి చని ప్రాణము వీడెనటంచు తెల్యగా
    చీమ పరాకుగన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్
    సామజమున్ వధించెనొక జాగిలమంచు జనాళి పల్కెనే.

    రిప్లయితొలగించండి