29, జూన్ 2019, శనివారం

సమస్య - 3062 (మోసముఁ జేయువారలకె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము"
(లేదా...)
"మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

52 కామెంట్‌లు:

  1. దోసమె లేదు నీదిటను దోసెల పిండిదె దోసమంచు, నే
    వాసన లేకపోయినను వన్నెగ నున్నవి పూలటంచు, నీ
    వీసపు టెత్తుబంగరువు వీసెడు కాంతియె కూర్చునంచు పెన్
    మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్.

    (శ్రీ కంది వారి సవరణలతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెళ్ళాన్ని ప్రసన్నం చేసికొనే భర్తల మోసపు మాటలుగా మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      అలా మోసం చేసి దక్కించుకొన్న 'పుణ్యఫలం' ఏమిటో అనుభవైక వేద్యమే కదా!

      తొలగించండి
  2. ఆశలు మీరగన్ మదిని యారడి వెట్టగ మోహమం దునన్
    రోసము తోడుతన్ మిగుల రోయుచు రొప్పుచు కార్యసా ధనన్
    వేసము మార్చియై నతన వేడుక తీరిన సంతసం బునన్
    మోసముఁ జేయువా రలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మదిని నారడి..." అనండి.

      తొలగించండి


  3. మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము!
    ఆశ దోసె అప్పడము వడా జిలేబి!
    కుదర దే బామ్మ యిట్లాంటి కుంటి సాకు
    నీతియు నిజాయితి వలయు నిక్కమమ్మ !


    జిలేబి


    రిప్లయితొలగించండి


  4. నీ సుఖ సౌఖ్యముల్ బతుకు నీదకొ? ఈశుని తోడు లేనిదే
    యీ సువిశాల జీవితమ దెట్లు విలాసము గాంచు ? పల్కకే
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్,
    కాసులు దస్కముల్ సఖియ కాటికి దానిని‌దాటి వచ్చునా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. ఆకాశవాణి వారికి పంపినది


    దాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్
    మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
    వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదా
    కాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నైతలంబు'? "వేయకుండ పతి వేడుచు" అనండి. (వేయక... అన్నది కళ. దానికి ద్రుతం రాదు)

      తొలగించండి

    2. నైతలము - నరకము ఆంధ్ర భారతి ఉవాచ


      జిలేబి

      తొలగించండి
  6. చూచు వారలు లేరని దోచు కొనుట
    గర్భ గుడిలోన దేవుని కన్ను గప్పి
    నగలు నాణెము లన్నియు దొంగ పాలు
    మోస గాండ్రకె లభియించుఁ బుణ్య ఫలము

    రిప్లయితొలగించండి
  7. విషపు పాల్గుడ్పి పూతన విష్ణు జేరె
    బాల ఘాతుడు కంసుకు పరమ పదము
    చిదమ వచ్చిన దనుజులు సిద్ధినొంద
    మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము
    నన్ను మరిచితి వేమయ్య నారసింహ?

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    నీ సమదృష్టి మేలు ధరణీకమలావర ! భక్తకోటి వి...
    శ్వాసమె మానకమ్ము ! సహజమ్ముగ నమ్మిన ముక్తి గల్గు , దా
    మాసగ లౌకికమ్మె పరమార్థముగా దలపోసి భక్తులన్
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. వేసము వేసి చక్కగను వేదిక లెక్కుచు వాక్కుశుద్ధితో
    మూసగ మాటలాడుచును ముప్పును ముంచగ మానవాళినే
    గ్రాసము లేని దీనులను కావగ, వంచన జేయు దుష్టులన్
    మోసము చేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్!!!

    రిప్లయితొలగించండి
  10. చిన్నారి పాపలను చేయెత్తి భయపెట్టి
    "బూచి"ని చూపించి బొంకు వేళ;
    చందురుని యద్దమున బంధించి మరిరించి
    పాలను త్రాగించి పరగు వేళ;
    పద్యాలు, పాటలును పూడుచు ప్రేమతో
    నిద్దుర బుచ్చేటి నిదుర వేళ;
    ఆటలాడిన వేళ నైనట్టి గాయముల
    మంత్రాలు చదువుచు మాన్పువేళ;

    అన్ని చేష్టలు చేయించు నవసరమ్ము,
    పనులు పూరింప సాధింప ప్రతి దినమ్ము,
    వేషమేదైన మంచికి వేయుమనుము,
    మోసగాండ్రకె లభియించు పుణ్య ఫలము!

    రిప్లయితొలగించండి
  11. దోసము కల్గు పృథ్విపయి దూరుచు పెద్దల నిచ్చ రోజుకో
    వేషము వేయుచున్ ప్రజల విత్తము దోచుచు సంచరించుచున్
    మోసముచేయు వారలకె, పుణ్యఫలంబు లభించు నెయ్యెడన్
    కాసులపై దురాశ విడి కాంచ ముదమ్మును ప్రజాళి సేవలన్(దైవసన్నిధిన్)
    అసనారె

    రిప్లయితొలగించండి
  12. (మంత్రికుమారుడు సుకుమారుడు దురాచారుడై
    తుదకు మహాశివరాత్రినాడు శివపూజ తిలకించి ముక్తుడైనాడు)
    తా సుకుమారనామమున
    దండిగ చెట్టల జేసినాడటే!
    భాసురమౌ ప్రతిష్టనిల
    పాడొనరించెను దుర్మదాంధుడై;
    త్రాసము లేక వర్తిలుచు
    ధన్యత నందెను నీశు గాంచుటన్;
    మోసము జేయువారలకె
    పుణ్యఫలంబు లభించు నెల్లెడన్.
    (చెట్టలు-చెడుపనులు;త్రాసము-భయము)

    రిప్లయితొలగించండి
  13. నమ్మి నట్టి వారి ధనము నంత దోచు
    పాతకమ్ముల మూటల పాప ఫలము
    మోసగాండ్రకె లభియించుఁ; బుణ్యఫలము
    దక్కు పరుల హితము గోరు ధన్యులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మోసపు తీరు జూపుచును మోహినియై మలగించె దైత్యులన్
      మోసపు రీతి చాటునొక మూలను దాగుచు గూల్చె వాలినే
      మోసపు చేతలల్లుచు విమూఢుల గూల్చెను కౌరవాదులన్
      మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
      మోసపు మూల హేతువది ముఖ్యముగా జన సౌఖ్యమైనచో

      తొలగించండి
  14. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.....
    "వ్యసనము వేయి రీతుల శుభప్రదమై యశమొందఁ జేయునే"
    మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
    padyamairhyd@gmail.com
    ఇది శంకరాభరణంలో 13-4-2015 నాడు ఇచ్చిన సమస్య. కాకుంటే 'యశమొంద జేయురా' అని ఇచ్చినదానిని 'యశమొంద జేయునే' అని మార్చారు. ఇక సమస్యే లేదు. కేవలం పద్య పూరణమే.
    https://kandishankaraiah.blogspot.com/2015/04/1646.html#comment-form

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. G P Sastry (gps1943@yahoo.com)జూన్ 06, 2018 9:13 PM

      పసితనమందు ధూమమును పానము జేయుట తీర్చిదిద్దగా
      ముసిముసి నవ్వులందునను ముద్దుల నీయక దార మొత్తగా
      తసదియ పీకలన్నిటిని దబ్బున కాల్వల త్రోయ, త్యక్తమౌ
      వ్యసనము, వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా!

      తొలగించండి


    2. దెసదెసలన్ బికారులుగ దేభ్యపు రీతుల దేశమెల్లడన్
      కొసకొసలన్ విలాసముల కోరుచు బోగముచాన వాడలన్
      మసకములాడి వేడుకగ మాధవ! కేశవ! యంచు వేడగా
      వ్యసనము వేయి రీతుల శుభప్రదమై యశమొందఁ జేయునే?



      జిలేబి

      తొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు. నేనీరోజు శ్రీశైలం వెళ్తున్నాను. మల్లి సిరిపురం గారి 'శంభు శతకం' హైదరాబాదులో ప్రింటు చేయించి వారికి ఇవ్వడానికి తీసికొని వెళ్తున్నాను. రెండు, మూడు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    [శివవరగర్వమున శివునే భస్మము సేయఁబూనిన భస్మాసురుని, విష్ణువు మోహినీ రూపమునఁ దన యాటపాటలతో మురిపించి, భస్మము చేసి, నుతికెక్కినాఁడు! ఇటుల మోసముతో వరముఁగొనిన ప్రమాదకారినే మోసగించిన విష్ణువు వంటి వారలకే తత్పుణ్యఫలము దక్కును గదా! అనుట]

    హాసవిలాసనర్తనల నాటలఁ బాటల ముంచి తేల్చి కా
    దే సెలరేఁగు బూదిపొలదిండినిఁ గూల్చి పొగడ్త లందెఁ బ
    ద్మాసనుతండ్రి మోహినిగఁ దాలిచి రూపము! మోసగాండ్రనే

    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్!!

    రిప్లయితొలగించండి
  17. నీదు బీదతనమదియె నీకు రక్ష
    వనరుట కొరకై చక్కని వసతి నిచ్చి
    యింట నొకరికి నుద్యోగమిచ్చె దనను
    మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము

    రిప్లయితొలగించండి
  18. ఆసలుబోవవెన్నటికినాయువుగల్గెడునంతకాలమున్
    మోసముజేయువారలకె,పుణ్యఫలంబులభించునెల్లెడన్
    నాసలజోలికిన్జనకయాపరమేశ్వరుపాదపద్మముల్
    దోసిలబట్టివేడగనుదోరపుభక్తినిదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  19. మంచి నటియించి మనుజుల మాయజేసి
    దుష్ట మతులౌచు వంచనన్ దోచు కొనుచు
    సంఘ మందున నేతలై సాగు నట్టి
    మోసగాండ్రకు లభియించు పుణ్యఫలము

    రిప్లయితొలగించండి
  20. గురువు గారు బిజీగా ఉన్నారు. కనపక మితృలు, గురుతుల్యులెవరైనా నా పద్యం గమనించి సూచనలివ్వవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి మిత్రులు వామన కుమార్ గారు మీ పూరణము చక్కని భావముతో నలరారు చున్నది.
      అయితే సీసపు టన్ని పాదములలో గణ దోషములు గలవు.
      తేటగీతి నిర్దోషమే. అయితే సీసము తరువాత తేటగీతి లో మొదటి పాదము కూడ నచ్చుతో ప్రారంభము కారాదు.
      సవరించిన పద్యమును పరిశీలించి మీ పద్య మందలి దోషములు గమనించండి.


      చిన్నారి పాపలఁ జేయెత్తి భయపెట్టి
      "బూచి"ని చూపించి బొంకు వేళ;
      చందురు నద్దము నందుఁ జూపించుచుఁ
      బాలను ద్రాగించి పరగు వేళ;
      పద్యాలు, పాటలు పాడుచు ప్రేమతో
      నిద్దుర బుచ్చెడు నిదుర వేళ;
      నాటలాడిన వేళ నైనట్టి గాయముల్
      మంత్రాలు చదువుచు మాన్పువేళ

      నన్ని చేష్టలు చేయించు నవసరమ్ము,
      పనులు పూరింప సాధింప ప్రతి దినమ్ము,
      వేషమేదైన మంచికి వేయుమనుము,
      మోసగాండ్రకె లభియించు పుణ్య ఫలము!

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  21. వీసపుటెత్తుఁ దల్లియెడఁ బ్రేమనుఁ జూపకఁ నీదుతమ్ముడున్,
    పాసెనొకండుఁ సోదరుని వైరిగఁ మారగఁ నీదు పక్షమై
    చేసిరి మోసమున్ దనర క్షేమముఁ గోరెడుఁ వారికేఁ, గనన్
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారు పనులలో ఉన్నపుడు కామేశ్వరరావు గారి వంటి వారు సలహాలొసగితే ప్రోత్సాహకంగా ఉంటుందని నా వినతి.

      తొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    వీసము చేతలేతనువెల్ల గృశింపగ బొట్ట(పొట్ట)దైవమై
    గ్రాసము విత్తమై చెలగ గౌరవ మిచ్చిన వారలేరి?జి
    జ్ఞాసయె నీతిగా మెలగ జన్నము జేయని దీనుకన్న బల్
    మోసము జేయువారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    కాడి మోసిన బంటును గడప నడప
    ఉసురు తల్గునటనిరయ్య ఊరి వారు
    ఏసు కని చండికా యాగ మొనర జేయు
    మోసగాండ్రకె లభియించు పుణ్య ఫలము

    రిప్లయితొలగించండి
  24. ఆకాశవాణిలో ప్రసారం:
    దోసముకాదు సజ్జనులఁదూరు దురాత్ముల, ద్రోహబుద్ధులన్,
    మోసముజేసియైనఁ ననుమోదముఁ గూర్చగఁ నెల్లవారికిన్
    వేసటఁ నొందుఁ నార్తులకు వేదన తీర్చుఁ నుపాయశాలురై
    మోసముఁ జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్!

    రిప్లయితొలగించండి
  25. కాంచఁ బాప పుణ్యము లూరక సన వెందు
    జనులకు, దురితములు పెక్కయిన నరులకుఁ
    బాప ఫలము పశ్చిమమునఁ జూప ముందు
    మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము

    [నరులకు విశేషణము మోసగాండ్రు]


    దోసము లెంచ కుండ మది ద్రోహపుఁ జింతలఁ జేరనీకయే
    వీసము నైన నార్తులకుఁ బేరిమి పెల్లుగఁ బంచుచుండి సం
    త్రాస జనాళి కింపొసఁగ దానము, చిత్తమునం దెఱుంగ కే
    మోసముఁ, జేయు వారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  26. సరదాగా...

    ఆలి యలిగిన కడుపులో కాలుచున్న
    సంధ్య వేళను వర్షపు జల్లు వేళ
    మొద్దుబారిన జిహ్వకు ముదము నిడు "స
    మోసగాండ్ర"కె లభియించుఁ బుణ్యఫలము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పొద్దుటే దోస అప్పడము వడ జిలేబి వచ్చేయి.

      ఇప్పుడు
      సమోసా కూడా వచ్చేసే :)

      ఇక బకాయి మిష్టీదొయ్ ఒక్కటే ! జీపీయెస్ వారు ఊపందుకోవాలె :)



      జిలేబి

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్వానుభవం:

    కాసిని పద్యసూత్రములు కమ్మగ నేర్చుచు నాంధ్రభాషనున్
    దాసిగ నాంధ్రభారతికి దండము లిచ్చుచు మాటిమాటికిన్
    వాసిగ శంకరాభరణ ప్రాంగణ మందున చేసి పూరణల్
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  28. పాపులనుముద్రజగతినిబాతకులగు
    మోసగాండ్రకెలభియించు,పుణ్యఫలము
    భాగవతులనుసేవింపవచ్చుసుమ్ము
    ప్రత్యగాత్మునిసరిగదభాగవతులు

    రిప్లయితొలగించండి
  29. చిత్తశుద్ధితో శివపూజ జేయువారి
    కెల్ల దక్కెడు పథమది, యేవిధమ్ము
    పాప భీతిని విడచుచున్ బరుల ముంచు
    మోస గాండ్రకె లభియించు బుణ్యఫలము?

    రిప్లయితొలగించండి
  30. ఆ సమ వర్తియే నరక మందున శిక్షలు వేయునే సదా
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
    వాసిగ నమ్ముచున్ సతము పన్నగ భూషణుఁ జేరి కొల్చుచు
    న్నాశగ చేయిఁజాపిన క్షుధార్థుల యాకలిఁ దీర్చు వారికిన్.

    రిప్లయితొలగించండి
  31. నీ సరి సుందరాంగి నిల నెచ్చట కానగ లేనటంచు తా
    వాసిగ పల్కినట్టి మగ వారలె యక్కర తీరినంతనే
    యా సరసాంగులన్ మరచి యక్షర లక్షల కట్నపాశతో
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  32. కాసులు రాసులై కురియగాజపమాలను హేల ద్రిప్పుచున్

    మా, సములెవ్వరంచు, బహుమానములందగ రమ్మటంచు, స

    న్న్యాసులు, దొంగ సాములు, ఘనంబుగ వెల్గెడునట్టి యీకలిన్

    మోసముజేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  33. మోసపు జూదమోడగను పూనుచుఁ గౌరవులంప కానకున్
    గాసిలి, కృష్ణమూర్తి దయఁ గయ్యము నందున పాండునందనుల్
    వాసిగ లౌక్యమున్ దెలిసి పట్టగ గెల్పు, నధర్మ మోడగన్
    మోసముఁ జేయువారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  34. ఘోరమైన శిక్ష తుదకు కువలయాన
    మోసగాండ్రకె లభియించుఁ; బుణ్యఫలము
    దక్కు వంచన చేయని ధర్మపురుల
    కనెడి విబుధ జనుల మాట లాలకించు.

    రిప్లయితొలగించండి