26, జూన్ 2019, బుధవారం

సమస్య - 3059 (అంబనుఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్"
(లేదా...)
"అంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్"

61 కామెంట్‌లు:

  1. "అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్" అని గతంలో 'శంకరాభరణం' బ్లాగులో ఇచ్చిన సమస్యయే. ఇప్పుడు అదనంగా వృత్తపాదాన్ని సమస్యగా చేర్చి ఇచ్చాను. గమనించండి. చూడండి.... https://kandishankaraiah.blogspot.com/2014/10/1532.html

    రిప్లయితొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి

    """""""""""""""""""" """"""""""


    గురుభ్యో నమః ( నిన్నటి పూరణ స్వీకరింప మనవి )


    . గో పి కా రా స కే ళి
    ...........................


    " రారా మాధవ . వేణులోల . యదుబాలా ! త్వత్పరిష్వంగపున్

    గారాగారము నందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్ ?

    గారం బార ననున్ సతమ్ము రసశృంగార స్థవిన్ దేల్చు " మం

    చారాటించెను గోపకామిని , కుచాహర్య ద్వయిన్ > సుందరా

    కారుండౌ నవనీతచోరు ఘన వక్షస్థలిన్ వడిన్ మొత్తుచున్


    { స్థవి = స్వర్గము ; అహర్యము = కొండ ;

    కుచ + అహర్య ద్వయిన్ = కుచశైలయుగముతో ;

    వక్షస్థలిన్ మొత్తుచున్ = శ్రీ కృష్ణుని వక్షమును బా దు చు }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు
      చివరి పాదంలో గణదోషం. "ఘన వక్షఃస్థానమున్ మొత్తుచున్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  3. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తుంబురు నారదుల్ వలెను తుంటరి మిత్రులు పాటపాడగా
    సంబర మొందుచున్ విరివి చంకలు కొట్టుచు రాజనీతినిన్
    జంబము తోడ కాంగ్రెసున జందెము నూనుచు బ్రహ్మచర్యమౌ
    నంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి


  4. తంబీ ! శకార ! శరణు ! వి
    లంబనమికవలదయ సరళముగ తెలుపుడీ
    డంబార కైపదమొకటి!
    అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. శంబర రాజకన్యక వృషాంకుని భర్తగ కోరి చీని చీ
    నాంబర భూషణంబుల ప్రియంబుగ వీడి సదా కరేణు చ
    ర్మాంబరధారి గూర్చి నియమంబుగ తాను తపంబొనర్ప నా
    యంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  6. సంబర మందున యీసుం
    డంబను బెండ్లాడె , భీష్ముఁ డందరు మెచ్చన్
    అంబిక యంబాలి కలను
    శంబర మందున గెల్చి సాళ్వున కొసగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంబర మందున నీశుం డంబను... శంబరమందునను గెల్చి..." అనండి.

      తొలగించండి
  7. (రాజ్యం తీసికోననీ,వివాహం చేసికోననీ భీషణప్రతిజ్ఞలు చేసిన దేవవ్రతుడు)
    అంబర మష్టదిక్కులును
    నాదర మొప్పగ మెచ్చుచుండగా;
    సంబరమంద సత్యవతి
    శంతను కీయగ దాశరాజటన్;
    కంబువు మించు భాషణము
    గణ్యుని జేయగ;కీర్తికాంత;నా
    యంబను బెండ్లియాడె జను
    లందరు మెచ్చక భీష్ము డయ్యెడన్.
    (కంబువు-శంఖము;గణ్యుని-గొప్పవానిని)

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    బింబము సామాజికమున
    జంబలకడి పంబ యనుచు జాయను వీడన్
    సంబరమే మోదిని గన
    అంబను బెండ్లాడె భీష్ము డందరు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    లంబపు దారివీడియు చలాకిగ గర్ణమునంట లావ(వివేకము)గున్(Lateraltninking)
    కంబము మాడ్కి నిల్చి మనగావలె నేటి గృహస్థు నీతినిన్
    వెంబడి వచ్చు నాతి గొని వేయడె దండ *జనాళి సేనకున్*
    అంబను బెండ్లియాడె జనులందరు మెచ్చగ భీష్ము డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గురుభ్యోన్నమః🙏

    అంబుజ వదన మహోగ్ర త
    పంబును మెచ్చిన కపర్ది పద్మాక్షునితో
    డంబర మెగయగఁ నా జగ
    దంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  11. అంబర దేవతలందరు
    సాంబుని నెడ మోకరించి శరణంబన-లో
    కంబుల గాచెడు నెపమున
    యంబను బెండ్లాడె భీష్ముడందరు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  12. అంబను బెండ్లాడ మనుచు
    నంబరకేశుని సురాళి యభ్యర్థింపన్
    నంబుజ నేత్రిని యా జగ
    దంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్.

    రిప్లయితొలగించండి


  13. అంబరకేశుడు సుమ్మీ
    అంబను బెండ్లాడె, భీష్ముఁ డందరు మెచ్చన్
    అంబను నంపెను సాల్వుడు
    కెంబసువునిడ తననుదుట కిన్నరి వినుమా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. సంబర మందున నీశుం
    డంబను బెండ్లాడె , భీష్ముఁ డందరు మెచ్చన్
    అంబిక యంబాలి కలను
    శంబర మందునను గెల్చి సాళ్వున కొసగెన్

    రిప్లయితొలగించండి
  15. డంబము లేల పలికెదవు
    సంబరమౌ నీ తెలివికి సద్గురు పుత్రా
    జంబమ్మే గానెచ్చట
    అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంబర వీధి దేవతలు యక్షులు సిద్ధులు బంధు వర్గమై
      అంబుజనాభు సోదరి ననంతుడె దోడ్కొన విశ్వ వేదికన్
      అంబుజ నేత్రి శైల సుత నార్త పరాయణి నాది శక్తియౌ
      అంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    అంబరకేశుఁ డక్షరున కద్రిజ సేవలు సేయుచుండఁగా,
    శంబరసూదనుండు సుమసాయకముం దగ వేసె! నప్డు కో
    పంబున బూది సేసి, ఘనబంధపుఁ బేర్మిని సత్ప్రయత్నుఁడై

    యంబను బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్!

    [అంబ=పార్వతి; భీష్ముఁడు=శివుఁడు]

    రిప్లయితొలగించండి
  17. శంబరమర్దనుఁ సుమముల
    అంబకములు మేనుతాకి యాఱడిపుచ్చెన్
    సంబరపడ సకలజగముఁ
    లంబను బెండ్లాడె భీష్ముఁడందరుమెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మర్దను' తరువాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    త్ర్యంబకుడైన సాంబుడు రథమ్ముపయిన్ విహరించి వీథులన్
    సంబరమంటనంబరము శాస్త్రవిధిన్ వర కాళహస్తినా..
    డంబరమొప్ప దాను వరుడై గిరిజావధువున్ శుభాంగి జ్ఞా...
    నాంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. భీష్ముడు నెల్లూరు వారిని కాళహస్తి దాకా లాక్కొచ్చేసేడు :)


      అద్బుతః


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. వెంబడి శృంగియు,భృంగియు,
    సంబరపడి రాగ,మంచి సమయమునందున్
    త్ర్యంబకు డద్రిజ గుణ నికు
    రంబను పెండ్లాడె భీష్ము డందరు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  20. కంబు శిరోధి శీతనగ కన్యక కౌశికి తా నపర్ణయై
    యంబరకేశుడా శివుని నార్యుగ పొందగ నిశ్చయించి ఘో
    రంబగు దీక్షచేఁ దపముఁ రాజిలఁ జేసె,ఝషాంకుఁ గూల్చినన్
    యంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  21. అంబరవాసులుగోరగ
    నంబనుబెండ్లాడెభీష్ముడందఱుమెచ్చన్
    సంబరమొందుచుబ్రజలును
    సంబరములుసేసికొనిరిసఖ్యతతోడన్

    రిప్లయితొలగించండి
  22. తుంబుర నారద ప్రముఖుల.
    సంబరమున బ్రస్థుతింఛు సంగీథముథో
    నంబర మంటంగను ఙ్ఞా
    నాంబను పెండ్లాడె భీష్ము డందరు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  23. అంబర మంట యశము ధవ
    ళాంబరము పఱచిన రీతి నాహ్లాదముగా
    నంబ కొఱకు భీషణ శప
    థాంబను బెండ్లాడె భీష్ముఁ డందఱు మెచ్చన్


    సంబర మొప్ప మన్మథుఁడు శస్త్రము నేయ దహించ భర్గుఁడే
    యంబక యుగ్మ మారయ నగాత్మజ సేయఁ దపమ్ము కాంక్ష ది
    క్కంబర మైన వాఁడు శివుఁ డంబర కేశుఁడు మెచ్చి భక్తికే
    యంబను బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

    [భీష్ముఁడు=శివుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అంబను నాలినిన్ విడిచి యాత్రలు చేయుచు దేశమంతటన్
    సంబర మొందుచున్ గెలిచి జంకులు లేక ప్రధానమంత్రిగా
    కంబము కొట్టి కాంగ్రెసున గండర గండుల గర్వభంగమౌ
    నంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

    అంబ = అమ్మ

    రిప్లయితొలగించండి
  25. సాంబని చెంతకేగి సురసంఘము వేదనతో నుతింపగా
    నంబసుతుండు తారకుడనంతము జేసెడి వాడి జన్మకై
    యంబుజ పత్రనేత్రి సతి యద్రిజ చేయుతపమ్ము మెచ్చి తా
    నంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  26. అంబరవాసులున్దనిసియగ్గిరిజాపతిబ్రీతిగోరగా
    నంబనుబెండ్లియాడెజనులందఱుమెచ్చగభీష్ముడయ్యెడన్
    నంబరమంటగాజనులునద్భుతరీతినిజేసిరంతటన్
    తంబురసంబరాలొగినిచాలినభక్తినియాదిదేవుకున్

    రిప్లయితొలగించండి
  27. కందము
    అంబరకేశుడు ముదమున
    నంబను బెండ్లాడె, భీష్ముడందరు మెచ్చన్
    సంబరము న సాల్వునికడ
    కం బను బొమ్మనుచు బలికె నాదర మొప్పన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  28. నిన్నటి పూలణ

    రా రా జాలమదేలనో ప్రియసఖీ! రమ్యాకృతీ! శ్రీమతీ!
    సారాసారవిచారభారకలనాసంసారమందొప్పు, ని
    ర్వారప్రేరితరాగరంజితపరిష్వంగాంగసమ్మోహకృ
    త్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్

    రిప్లయితొలగించండి
  29. శంబరసూదనుని దునిమి
    యంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్
    సంబరములు మిన్నంటగ
    నంబరమునగల యనిమిషు లానందింపన్

    రిప్లయితొలగించండి
  30. అంబరకేశుడు ముదమున
    అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్"*
    సంబరమున నంబాలిక
    యంబలనెత్తుకొని వచ్చి యనుజున కొసగెన్

    రిప్లయితొలగించండి