18, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3051 (ప్రాణము లేని వస్తువులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె"
(లేదా...)
"ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ"
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

48 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  జాణలు చోరులున్ కలిసి జంబము మీరగ భాగ్యవంతులై
  రాణుల రాజులన్ కొనగ రమ్యపు రీతిని రాజకీయమున్
  నాణెము నోటులన్ కనుడు నందము నొందుచు చేయి మారెనే:
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  *పాప* మ్...

  వాణి సునామధేయ చరవాణిని శీతలవాయుయంత్రమున్
  ప్రాణసమమ్మనంగ పలు రంగుల దీర్చెను కాగితమ్ముపై
  వీణను కూడ దిద్దె , నటు వేగమె వచ్చిన గాలి తాకిడిన్
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరొక పూరణ..

   ప్రాణసమాననాథుడు సువాసనలీనెడి పారిజాతమున్
   జాణతనమ్మునన్ బిలిచి చక్కగ రుక్మిణికిచ్చెనంచు , దా
   వీణను గాజులన్ విసిరివేయ కరండము చామరమ్మటన్
   ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 3. అవసరమ్ముల కోసమై యవని యందు
  మానవుడు సృజియించె తాఁ జ్ఞాని కనుక
  వాహనమ్ముల నెన్నియో, వాసిగ నవి
  ప్రాణమే లేని వస్తువుల్, పరుగు లెత్తె.

  రిప్లయితొలగించండి
 4. వింత యుగమున జ్ఞానులు గంతు లేయు
  మధువు గ్రోలిన విరించి మైక మందు
  ధరను సృష్టించె వింతలు బరవ సమున
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె

  రిప్లయితొలగించండి
 5. (ఘటోత్కచుడు మాయాశశిరేఖగా పెండ్లింట పిండివంటలను తినబోవటం)
  మన ఘటోత్కచధీరుడు మారి శశిగ
  వచ్చి తీరుగ కూర్చొని వంటయింట
  నోరు తెరచుచు లడ్డుల తేరి జూడ
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె.

  రిప్లయితొలగించండి
 6. మానవునిమేథతోఁబుట్టె మాన్యమైన
  నేలపైనను నింగిని నీటియందు
  సంచరించుటకనువైన సాధనములు
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 7. ఒట్ల కోసమై నాయుకు లురుకులాడ
  ఫ్రిజులు నేసీలు కూలర్లు పేద వారి
  వసతి కాగమేఘాలపై వచ్చె కనుడు
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 8. సృజన గల్గిన ఙానులుసృృష్టిచేయ
  చేత చరవాణి ధరియింపచిత్రముగను
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్త
  మురిసి పోయిరి బాలలు ముచ్చటలర

  రిప్లయితొలగించండి


 9. మీనము లెల్ల చూడగ సమీచము బోలెడు తొట్టిలోనటన్
  తానము లాడె కైపుల సుతారము గా పలు మార్లు దొర్లుచున్!
  నేను వడిన్ దరిన్ వెడలి నెమ్మది గా గమనింప బొమ్మలా
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. జాణలు మీరిరంట బహు చక్కగ విద్యలు నేర్చినం తనే
  వేణువు నూదుచున్ మదిని వీవెన వీచగ మోహమం దునన్
  స్థాణువు లైనవంచు నిల స్థాపిత మైనమ నోహరం బులే
  ప్రాణము లేని వస్తువులు పర్విడు చున్నవి చిత్రమే సుమీ

  రిప్లయితొలగించండి


 11. మీనములు వేగిరముగ సమీచమువలె
  నుండు తొట్టి లో వెంబడి యురుకు చుండె
  చూడ గానవి బొమ్మలు జోటి! గోల!
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె"

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ప్రాణ మది లేకపోవుట వస్తువులకు

  ధరణి సహజమే యగు గాని పరుగు లెత్తె

  నన్న నసహజ మగుట ని ట్లనగ రాదు

  "ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  18.6.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 13. ఓక గారడీ విన్యాసం

  ఇంద్రజాలములకును మహేంద్రజాల
  ములకు వశములు సర్వము-చలన సూత్రము
  ములకు భిన్నముగా-నటు కలయఁజూడు!
  ప్రాణమేలేని వస్తువుల్ని పరుగులెత్తె.

  రిప్లయితొలగించండి
 14. వస్తువుల్ పరుగులెత్తి అని చదువ ప్రార్ధన

  రిప్లయితొలగించండి
 15. సమస్య :-
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  *తే.గీ**

  ఆట బొమ్మల లారీయు పాటు పడగ
  చూసిన జనులు వాటిని మోసు కొనుచు
  తిరిగి చూడక పరుగు లెత్తిరి సదనము
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె
  .......‌..................✍చక్రి

  రిప్లయితొలగించండి
 16. వాణి కరముల స్పర్శకు పరవశించి
  వీణ గానమ్ము జేయగా విశ్వమంత
  ప్రాణ శక్తియె ప్రసరించె ప్రాభవముగ
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వీణను జేత బట్టి తన వీనుల విందగు గానమందునా
   జాణయె గట్టి వైచె జలజాసనునే ఘన పారవశ్యమున్
   ప్రాణుల సృష్టి యాగె స్వర భారతి రాగ సుధా ప్రవాహమున్
   ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

   తొలగించండి
 17. బుద్ధిజీవుల మేధనుబుట్టి తాము
  నింగి రాకెట్టు క్షిపణులు నేర్పుమీర
  నింట రోబోలు దిరుగగ నింపుగాను
  ప్రాణమేలేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 18. కురియ శ్రావణ మందున కుంభ వృష్టి
  వాగు లన్నియు జూడంగ వరదలెత్తె
  వస్తు వాహనములు పడె వరద నీట
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 19. బాలలందరు గుమిగూడి పంచజేరి
  తెఱవగు మరబొమ్మలనెన్నో తెచ్చిపేర్చి
  యొక్కమాటున మీటలు నొక్కినంత
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 20. శ్రీ గురుభ్యోన్నమః🙏

  తోక లేనిపిట్టcలనాడు దూర మేగె
  ధనము మూలాన దేశాల దవ్వు తగ్గె
  కడకు మిగిలెను మతిలేని కట్టెపిట్ట
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!

  తోకలేనిపిట్ట - పోస్టుకార్డు
  కట్టెపిట్ట - బక్కచిక్కిన మనిషి

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. ప్రాణమనంగ చేతనము ప్రాణికి మూలము కాద! యంతటం
   బ్రాణము లేనివెట్లగును బ్యాటరి మూలముగా చరించ, వి
   న్నాణపు వింతరూపమది నాణ్యముగా నడిపించనింక నే
   "ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి? చిత్రమే సుమీ!"

   - విట్ఠుబాబు

   తొలగించండి
 22. ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె
  డిక్సను మహాశయుండు వెండితెర మీద
  కనుల విందుగ తానది గానిపించ
  మాటలాడె బొమ్మలు నేడు ఆటలాడె
  మనదు యింట కొలువుదీరి మరులు గొలిపె

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  త్రాణ ద్రవ్యోల్బణాద్రక్ష తనరె ననిరి
  దేశమార్థిక వనరుల దేలె ననిరి
  కూరగాయల బట్టగ గోరి యేర
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 24. ఘ్రాణము కైన నోర్వని లగాయతు మాదక ద్రవ్య సేవనల్
  హూణుల కంటె నెక్కుడుగ హోమపు నాజ్యములయ్యె నేడు స
  త్త్రాణగ నింటిలో గృహిణి రాజిలు పేరిట బీరు,బ్రాంది లా
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమఘ సుమీ!
  డా.పిట్టా సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 25. నీరు గృహమందుఁ జొరఁబడి మూరి పాఱఁ
  బూసల పగిది గోదావరీ సరిత్తు
  వఱద ధాటికి మిక్కిలి కుఱుచ లౌచుఁ
  బ్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె


  ద్రోణి పయోధి భంగముల దుర్బలమై వడి నూగు నట్లుగన్
  వేణులు పట్టి లాగఁబడు భీత మృగాక్షుల భంగి తోఁచుచున్
  ద్రోణుఁడు వేయ ఘోరతర దుస్సహ భీకర మారు తాస్త్రమే
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

  రిప్లయితొలగించండి
 26. జాణతనమ్ము హెచ్చి నరజాతియె జాగృతభావశూన్యులై
  రేణు సమానమవ్వగను శ్రేయమిటన్,చరవాణులై శిర
  స్త్రాణవిహీన వాహన ప్రధాన విభాగములై పథమ్ములన్
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెన్ను మురళి గానమ్మును వినగఁదలచి
   గోవులేకాదు రేపల్లె గోపికలును
   చెట్టుపుట్టయుఁ గాల్వలుఁ జెవులనొగ్గె
   ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె

   తొలగించండి
 27. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మీనము కుంభమున్ తులయు మేషము సింహము కన్య రాశులున్
  నాణెపు తారలున్ ఋషులు నందము నొందుచు రేయిరేయినిన్
  కోనల కోనలన్ గనుము గోళము నందున నాకసమ్మునన్
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

  రిప్లయితొలగించండి
 28. కారణమున్న లేకున్న వాడబడునది పలుకుల
  తోరణమల్లి తరంగములుగ ఖండాంతరములు
  విహరణ చేయించునది, "ప్రాణములేని వస్తువుల్
  పరుగులెత్తె"నా?ప్రాణుల తెగ పరుగు లెత్తించెనా?!!

  సముద్రాల

  రిప్లయితొలగించండి
 29. మిత్రులందఱకు నమస్సులు!

  [మానవుని బుద్ధివిశేషమున రూపొందింపఁబడిన యంత్రములైన కారులు, బస్సులు, లారీలు, జీపులు, ఆటోలు, బైకులు ప్రాణములేనివైనను ప్రాణ మున్నవాని వలెఁ బరుఁగులెత్తుట చిత్రమే సుమా! అనుట]

  ప్రాణముఁ గల్గు మానవుఁడు ప్రాభవ మందెడు యంత్రజాలమున్
  బ్రాణములున్నయట్లు కనుపట్ట నొనర్చి, పథమ్ము నుంపఁ, బెన్
  రాణనుఁ గారు బస్సు మఱి లారియు జీపును నాటొ బైకు లన్

  బ్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి, చిత్రమే సుమీ!
  (బైకులన్=బైకులు+అన్=బైకులు అనెడి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండో పాదంలో చిన్న సవరణము...
   ప్రాణముఁ గల్గు మానవుఁడు ప్రాభవ మందెడు యంత్రజాలమున్
   బ్రాణములున్నయట్లు కనుపట్ట నొనర్చి, పథాన నుంపఁ, బెన్
   రాణనుఁ గారు బస్సు మఱి లారియు జీపును నాటొ బైకు లన్
   బ్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి, చిత్రమే సుమీ!

   తొలగించండి
 30. ఎంతదూరమునకునైనవింతగాను
  ప్రాణమేలేనివస్తువుల్ పరుగులెత్తె
  రయ్యుమనుచునురహదారిరగులునట్లు
  కారుబస్సులుమోటారుకారులెన్నొ

  రిప్లయితొలగించండి
 31. వీణ మీటిన గమకముల్ వీను లలరె
  వేణు వూదిన రాగాలు విరిసి పొరలె
  స్పందనన్ గొన్న నిట వస్తు చయము జూడ
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!

  రిప్లయితొలగించండి


 32. భోరున కురియ వానలు పుడమి యందు
  వరదలగుచు నెల్లెడ పొంగి పారుచుండ
  ధాన్యమాదిగా నింటను దాచినట్టి
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.
  మరొక పూరణ

  పొగను విడుచుచు నల్దిశల్ భువిని ముందు
  జను‌ల నెక్కించు కొని గమ్య స్థానమునకు
  చేర్చపలు వాహనమ్ములు సిద్ధమగుచు
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.


  రిప్లయితొలగించండి
 33. ప్రాణములేనివస్తువులుపర్విడుచున్నవిచిత్రమేసుమీ
  ప్రాణములేకపోయిననుబ్రాణపుటింధనబోయగాదగన్
  జాణతనంబునన్మిగులసవ్వడిజేయుచునుర్కలెత్తుచున్
  బాణినిజక్రముండగనుబర్వులుసాగునుగాదుచిత్రమున్

  రిప్లయితొలగించండి

 34. మరి రెండు పూరణ
  గాలిపటములవి యెగిరి గాలిలోన
  మరులు గొల్పుచు నుండును మహిని జనులు
  సూత్రమొక్కటి పట్టిన చిత్రముగను
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.


  క్షోణిని బాణవిద్యలను కోరుచు నేర్చె ధనంజయుండుతా
  నేణిని యైనగాని మరి యేనుగు నైనను కొట్టి నెంచగన్
  ప్రాణములెల్ల దీయుటకు బత్తళికన్విడి వేగవచ్చునీ
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

  రిప్లయితొలగించండి
 35. జానెడు పొట్టకోసమని చాకిరి చేసిన మానవాళి వి
  జ్ఞానము తోచరించి పలు నాణ్యము లౌ పరిశోధనమ్ము తో
  తానిల సృష్టిజేసిన పదార్థము లందున వాహనమ్ములే
  ప్రాణము లేని వస్తువులు, పర్విడుచున్నవి చిత్రమే సుమీ.

  రిప్లయితొలగించండి
 36. తేటగీతి
  మానవుడె ఘనుడాయె విజ్ఞాన పటిమ
  వింత యంత్రాల సృజియించె విశ్వమందు
  బస్సు రైలు విమానాది వాహనముల
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 37. బాలబాలిక లాడుయీకాలమందు
  బొమ్మలెన్నియొ గదులు కనుబొమ్మలట్లు
  యంత్రతంత్రాలు నిడెడి నియంత్రణాన
  ప్రాణమేలేని వస్తువుల్ పరుగులెత్తె!

  రిప్లయితొలగించండి
 38. ఉత్పలమాల
  ప్రాణము కన్న నా పదవిఁ బట్టుట మిన్న యటంచు నెన్నికన్
  జాణతనమ్మునన్ గెలువ సారెలు పంచెడు లారి నిల్వగన్
  రాణము మీర చుట్టుకొని లాగుచు చేగొన నోటు రాయులున్
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!

  రిప్లయితొలగించండి
 39. తేటగీతి
  బడుగు బలహీన వర్గాల ప్రజల ఓట్ల
  యండ గోరుచు కాన్కల నిండు లారి
  వచ్చి నిల్చిన గంటలో కచ్చితముగ
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 40. పాపచింతనలేక పాపాలజేసి
  భయము నొందగ నాతడు భ్రష్టు డేను
  పుణ్య సాధనమున దానములను జేయ
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!!

  రిప్లయితొలగించండి
 41. సామజ వరగమనుడగు స్వామి వెంట
  తడబుడు యడుగులన్ కడువడిగ సిరి జ
  నగ వెనుకన శంకువు చక్ర యుగము వెడలె
  ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె

  రిప్లయితొలగించండి