ప్రాతః కాలపు సరదా పూరణ: తళతళలాడి దీదికడ తన్నుకు వచ్చెడి కయ్యమందునన్ కళకళలాడి కాంగ్రెసుకు కంపము లేపుచు నెల్లవేళలన్మిలమిలలాడు భాజపవి మేలుగ పూయగ వంగభూమినిన్ జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
(స్వాతంత్ర్యదినోత్సవంనాడు మనదేశంలోని అన్నిరాష్ట్రాల పిల్లల ఆనందకోలాహలం)కలకలలాడు మోములును;కమ్మనిపల్కులు;కంటికాంతులున్;కిలకిలలాడు నవ్వులును;కేకిసలొల్కెడి హస్తయుగ్మమున్;మిలమిలలాడు నేత్రములు;మిన్నలు భారతబాలబాలికల్ జలజల జాలువారు జలజంబులు;చాలును జాతు లేలొకో? (కేకిసలు -చప్పట్లు)
👏👏👏👏
ధన్యవాదాలండీ!
కలహము లేని నాడు కులకాంతకు తీరదు తృప్తి బొత్తిగాఅలకలు తీర్చు వేళ పరి హాసము లాడక లొంగి వచ్చునావలపును చోరగొన్న తుది పాకము తప్పక వచ్చి తీరులేజలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో"
వలపున చేర దీయ తుది పాకము తప్పక వచ్చి తీరులే
మైలవరపు వారి పూరణ కులమతభేదభావఘనకుడ్యములన్ బెకలించి , భారతీ.... య లలిత భావరాగమయమై రవళింప మనమ్ము , శాంతిసం... కలితమనస్సరోవరవికాసిత తామరసమ్ములెన్నియోజలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో ?!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
జలజములు చాలును మనకు జాతు లేలనే జిలేబియ ! వంకాయ నేతి బీరకాయలే చాలు; రుచిచూడ కాయ లెన్ని యున్న నేమి, వలయు కొంత యూర గాయ !యాడ పోయినా తిండి యావే :)జిలేబి
చులకన చేయ బూని కడు శుంఠలు మూలము సుంత చూడకన్పలుచటి మాటలాడుటకు పంతము బూనిరి తెల్సు కొందురోకలహము లాడ నేల? విని కయ్యము మానుము చేయి కల్పగా"జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో!!
మిలమిల లాడుచున్ వరుస మీరక ముద్దుగ నేటవాలుగాజలజల జాలువారు జలజంబులు చాలును; జాతు లేలొకోకలకల చేటు లెల్ల దరి కాంచుట కేను! విశాల మై కచంగలము జనాళి బాగు కొరకై విల సిల్లెను నేర్పుగానుమా!జిలేబి
ఇందులో ఒక్క ముక్కా అర్థం కాలే మరీ జిలేబిమయము గా వున్నది భాష్యకారులెవరైన వివరణ తెలియ చేయవలె :)జిలేబి
వెలవెలఁ బోయెఁ జూడగను వెల్లులుఁ జిందిన'చంద్రు'మోమదే!వలవలఁ నేడ్చుచుండెఁగనబావురు మంచును కాంగిరేచులే!మలమల మాడిరందరును మర్కుని వోట్లకుఁ బూచెఁనంతటన్జలజల జాలువారు జలజంబులు, చాలును జాతు లేలొకో?
సలుపగ మిమ్ము వామ దళ సైన్యము బాణము లెక్కు బెట్టుచున్కలతలు రేప నింట కడు కర్కస మాటలు పల్కు చుండగావిలవలు మంట గల్పుచును వీధుల కెక్కవివేక ముంచుమాజలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
మిత్రులందఱకు నమస్సులు![గలగలా ఆడే హంసలాగా, కమ్మని పాటలు పాడే కోకిలలాగా, సంతసాన్నిచ్ఛే కవిత్వమనే పద్మాలకు ఆకరమైన నిర్మల ఝరిలాగా, పద్యాల మాంత్రికులైన మాన్యులు శ్రీ మద్దూరి రామమూర్తిగారి గళమునుండి జలజలా జాలువారే ఉత్పలములు, చంపకములు అనెడి వృత్తములు చాలు, కందములు మొదలైన జాతులెందుకు? అనుట]గలగల నాడు హంసి వలె, కమ్మని పాటల కాకలీరవమ్ముల నల కోకిలమ్మవలె, మోద మొసంగు కవిత్వ పద్మ నిర్మల ఝరి, పద్య మాంత్రికుఁడు మద్దురి "యుత్పల చంపకమ్ము" లన్జలజల జాలువారు జలజంబులు చాలును, జాతు లేలొకో?[ఉత్పలచంపకమ్ములు+అన్=ఉత్పల చంపకమ్ము లనెడి; జలజంబులు=ఉత్పల చంపకమాల వృత్తములు; జాతులు=కందము మొదలైనవి]
అద్భుతమైన పూరణ మరియు మార్గదర్శనము మధురకవిగారూ!అభినందనలు,ధన్యవాదములు!
మీ అభిమానమునకు కడుంగడు కృతజ్ఞుడను. ధన్యవాదములండీ సీతాదేవిగారూ!
భరత మాత కు బిడ్డ లై వరలు చుండి భేద భావాలు విడనాడి ప్రేమ కలిగి పూత చరిత లు గా మేల్గి పూజ సల్పజలజము లు చాలును మనకు జాతు లేల?
మలమల మాడు టెండల మంత్ర మేమొ సలసల కాగి పోయెను జలము లన్ని కిలకిల నవ్వు మరచెను కీక వెట్టి జలజములు చాలును మనకు జాతు లేల
అలుపెరుగక పృచ్ఛకులకు నాశువుగనుప్రతివచనమీయ రమ్యపువాక్కుల,ఘనపండిత సభలో,మద్దూరివారి పద్యజలజములు చాలునుమనకు జాతులేల?
డా.పిట్టా సత్యనారాయణనా తెలంగాణ రాష్ట్రము న్నమ్మి నపుడుమట్టి బుట్టిన వారమై మసలుచుండజాతి భారతిదను భావ జాల మొకటెజలజములు చాలును మనకు జాతులేల?
డా.పిట్టా సత్యనారాయణకలకలమాయె వర్షములు గారడి జేసెను నీతిమాలి వేబలబల రాలు జల్లులదె భాగ్యము భూమి నరాలు క్రుంగగామలమలమాడి చచ్చుటె;యమాయకు మాడ్కిని రత్న రాశులైజలజల జాలువారు జలజంబులు చాలును జాతు(రత్నవిశేషాలు)లేలనో?!
విమల హృదయ సరసి జ్ఞాన విభల విరియుజలజములు చాలును మనకు జాతు లేలజనుల నజ్ఞాన తిమిరాన జారవిడుచునట్టి జాతి మతముల పోనాడ మేలు
తెలతెల వార గానె ఘనదీప్తుల భానుని మైత్రి గోరుచున్జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకోమిలమిలలాడు చుక్కలను మింటను జూపుచు నాశ రేపుచున్విలవిలలాడు చీకటుల వేదనలన్ బడ దోయునట్టివే
ఆవహములు మాని యవని యందుప్రేమ మీరగ జనమంత పిలుచు కొనగశాంతి కాముక మైనట్టి చలువ శ్వేత జలజములు చాలును మనకు జాతు లేల
పద్యరచనకుననువగువృత్తములగుజలజములుచాలునుమనకుజాతులేలచంపకోత్పలములనునవియింపుగూర్చుగందములకంటెభావానకవివరేణ్య!
పద్మనాభునిఁ బూజింప భక్తి తోడ విత్త రాశుల పనియేమి వినయ మొప్ప భగవ దర్పణమునకు నపారమగను జలజములు చాలును మనకు జాతు లేల గెలువఁగఁ జేసె నూది యనిఁ గృష్ణుఁడు దివ్యపుఁ బాంచజన్యమే గెలిచెను శంఖ మూది యనిఁ గీర్తి కిరీటియ దేవదత్తమే సులువుగ నూదఁ గల్గు విన సొంపగు తియ్యని శబ్ద భంగముల్ జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో [జలజము = శంఖము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) తళతళలాడు మోమునను దంభము నప్పదు దీది నీకికన్ కళకళలాడు కన్నులను కార్చకు నీరము తిట్టిపోయుచున్ మిలమిలలాడు కంఠమున మ్రింగుము హాహలమమ్మ తీరుగన్...జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో?జలజము = (భాజపా) చిహ్నము
క్రొవ్విడి వెంకట రాజారావు: ఏకదంతుని పూజకై నిటకు నేడు భక్తితో దెచ్చు వస్తుసంభారమందు కుసుమములు ఫలముల దోడు కొలను లోని జలజములు చాలును మనకు జాతులేల?
కంది వారికి జేజేలు :)అలిగిన ప్రియురాలె కరమున లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్, వలపు తెలుప తక్కువయిన కలముంగని కవివరుండు కలవరమందెన్ !జిలేబి
ఆకాశవాణి లో చదువ బడెను !అలుకగ శంకరాభరణ మందున, దిద్దగ దిద్దగాను తామలుకయు లేక పూజ్యులు సమస్యల పూరణ దీటుతేలగాకులికెడు కన్నె పిల్ల మది క్రోడపు టెత్తుల రేగు కైపులన్పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!జిలేబి
తెలుపు నలుపెరుపు పసుపు దేవనములలోన నేది ముఖ్య మనెడాలోచనేల?జలజములు చాలు మనకు జాతులేలవిష్ణు మానస రాణినిన్ వేడ్కఁ గొలువ.
పలువిధముల్ గనన్ వివిధ వర్ణము లందున దేవనమ్ములే మిలమిల లాడుచున్నవట మేలగు తామర లేవియో యనన్ విలసిత మందహాసినిని విష్ణుమనోహరిఁ గొల్వనెంచగన్ జలజల జాలువారు జలజంబులు చాలును జాతులేలకో.
తళతళలాడునీరమునతామరతూడులగట్టకైవడిన్ మిలమిలలాడుచేపలకుమీసములుంటకుగారణంబహోకళకళలాడుపైరులకుకైపదమీయగగోరుచుండగాజలజలజాలువారు జలజంబులుచాలునుజాతులేలకో
సరళముగసాగిపోయెడు చంపకములుఉరికురికియెగసిపడునా యుత్పలములుమాలలుగనుండ వృత్తముల్ మాన్యవర్య జలజములు చాలును మనకు జాతు లేల(చెలువఁపు చంపకమాలలుఉలుకుచుఁనూపుగఁనురికెడియుత్పలమాలల్ కలవింకమనకుగావునజలజమ్ములుచాలుమనకు జాతులవేలా?)
తేటగీతిఅందమొలకించి యాత్మ కాహ్లాదమొసగుజలజములెచాలు ,జాతులేలజాతి మతభేద కలహాలు సంతరించిఐకమత్యము లోపించె హైందవమున ఆకుల శివరాజలింగం వనపర్తి
తేటగీతిఅందమొలకించి యాత్మ కాహ్లాద మొసగుజలజములె చాలును , మనకు జాతులేలజాతి మతభేద కలహాలు సంతరించిఐకమత్యము లోపించె హైందవమున.ఆకుల శివరాజలింగం వనపర్తిఈపద్యము సరియైనదిగా గ్రహించ మనవి
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండితళతళలాడి దీదికడ తన్నుకు వచ్చెడి కయ్యమందునన్
కళకళలాడి కాంగ్రెసుకు కంపము లేపుచు నెల్లవేళలన్
మిలమిలలాడు భాజపవి మేలుగ పూయగ వంగభూమినిన్
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
(స్వాతంత్ర్యదినోత్సవంనాడు మనదేశంలోని అన్నిరాష్ట్రాల పిల్లల ఆనందకోలాహలం)
రిప్లయితొలగించండికలకలలాడు మోములును;కమ్మనిపల్కులు;కంటికాంతులున్;
కిలకిలలాడు నవ్వులును;కేకిసలొల్కెడి హస్తయుగ్మమున్;
మిలమిలలాడు నేత్రములు;మిన్నలు భారతబాలబాలికల్
జలజల జాలువారు జలజంబులు;చాలును జాతు లేలొకో?
(కేకిసలు -చప్పట్లు)
👏👏👏👏
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండికలహము లేని నాడు కులకాంతకు తీరదు తృప్తి బొత్తిగా
రిప్లయితొలగించండిఅలకలు తీర్చు వేళ పరి హాసము లాడక లొంగి వచ్చునా
వలపును చోరగొన్న తుది పాకము తప్పక వచ్చి తీరులే
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో"
వలపున చేర దీయ తుది పాకము తప్పక వచ్చి తీరులే
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికులమతభేదభావఘనకుడ్యములన్ బెకలించి , భారతీ....
య లలిత భావరాగమయమై రవళింప మనమ్ము , శాంతిసం...
కలితమనస్సరోవరవికాసిత తామరసమ్ములెన్నియో
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిజలజములు చాలును మనకు జాతు లేల
నే జిలేబియ ! వంకాయ నేతి బీర
కాయలే చాలు; రుచిచూడ కాయ లెన్ని
యున్న నేమి, వలయు కొంత యూర గాయ !
యాడ పోయినా తిండి యావే :)
జిలేబి
చులకన చేయ బూని కడు శుంఠలు మూలము సుంత చూడకన్
రిప్లయితొలగించండిపలుచటి మాటలాడుటకు పంతము బూనిరి తెల్సు కొందురో
కలహము లాడ నేల? విని కయ్యము మానుము చేయి కల్పగా
"జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో!!
రిప్లయితొలగించండిమిలమిల లాడుచున్ వరుస మీరక ముద్దుగ నేటవాలుగా
జలజల జాలువారు జలజంబులు చాలును; జాతు లేలొకో
కలకల చేటు లెల్ల దరి కాంచుట కేను! విశాల మై కచం
గలము జనాళి బాగు కొరకై విల సిల్లెను నేర్పుగానుమా!
జిలేబి
తొలగించండిఇందులో ఒక్క ముక్కా అర్థం కాలే మరీ జిలేబిమయము గా వున్నది భాష్యకారులెవరైన వివరణ తెలియ చేయవలె :)
జిలేబి
వెలవెలఁ బోయెఁ జూడగను
రిప్లయితొలగించండివెల్లులుఁ జిందిన'చంద్రు'మోమదే!
వలవలఁ నేడ్చుచుండెఁగన
బావురు మంచును కాంగిరేచులే!
మలమల మాడిరందరును
మర్కుని వోట్లకుఁ బూచెఁనంతటన్
జలజల జాలువారు జల
జంబులు, చాలును జాతు లేలొకో?
సలుపగ మిమ్ము వామ దళ సైన్యము బాణము లెక్కు బెట్టుచున్
రిప్లయితొలగించండికలతలు రేప నింట కడు కర్కస మాటలు పల్కు చుండగా
విలవలు మంట గల్పుచును వీధుల కెక్కవివేక ముంచుమా
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[గలగలా ఆడే హంసలాగా, కమ్మని పాటలు పాడే కోకిలలాగా, సంతసాన్నిచ్ఛే కవిత్వమనే పద్మాలకు ఆకరమైన నిర్మల ఝరిలాగా, పద్యాల మాంత్రికులైన మాన్యులు శ్రీ మద్దూరి రామమూర్తిగారి గళమునుండి జలజలా జాలువారే ఉత్పలములు, చంపకములు అనెడి వృత్తములు చాలు, కందములు మొదలైన జాతులెందుకు? అనుట]
గలగల నాడు హంసి వలె, కమ్మని పాటల కాకలీరవ
మ్ముల నల కోకిలమ్మవలె, మోద మొసంగు కవిత్వ పద్మ ని
ర్మల ఝరి, పద్య మాంత్రికుఁడు మద్దురి "యుత్పల చంపకమ్ము" లన్
జలజల జాలువారు జలజంబులు చాలును, జాతు లేలొకో?
[ఉత్పలచంపకమ్ములు+అన్=ఉత్పల చంపకమ్ము లనెడి; జలజంబులు=ఉత్పల చంపకమాల వృత్తములు; జాతులు=కందము మొదలైనవి]
అద్భుతమైన పూరణ మరియు మార్గదర్శనము మధురకవిగారూ!అభినందనలు,ధన్యవాదములు!
తొలగించండిమీ అభిమానమునకు కడుంగడు కృతజ్ఞుడను. ధన్యవాదములండీ సీతాదేవిగారూ!
తొలగించండిభరత మాత కు బిడ్డ లై వరలు చుండి
రిప్లయితొలగించండిభేద భావాలు విడనాడి ప్రేమ కలిగి
పూత చరిత లు గా మేల్గి పూజ సల్ప
జలజము లు చాలును మనకు జాతు లేల?
మలమల మాడు టెండల మంత్ర మేమొ
రిప్లయితొలగించండిసలసల కాగి పోయెను జలము లన్ని
కిలకిల నవ్వు మరచెను కీక వెట్టి
జలజములు చాలును మనకు జాతు లేల
అలుపెరుగక పృచ్ఛకులకు నాశువుగను
రిప్లయితొలగించండిప్రతివచనమీయ రమ్యపువాక్కుల,ఘన
పండిత సభలో,మద్దూరివారి పద్య
జలజములు చాలునుమనకు జాతులేల?
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినా తెలంగాణ రాష్ట్రము న్నమ్మి నపుడు
మట్టి బుట్టిన వారమై మసలుచుండ
జాతి భారతిదను భావ జాల మొకటె
జలజములు చాలును మనకు జాతులేల?
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికలకలమాయె వర్షములు గారడి జేసెను నీతిమాలి వే
బలబల రాలు జల్లులదె భాగ్యము భూమి నరాలు క్రుంగగా
మలమలమాడి చచ్చుటె;యమాయకు మాడ్కిని రత్న రాశులై
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు(రత్నవిశేషాలు)లేలనో?!
విమల హృదయ సరసి జ్ఞాన విభల విరియు
రిప్లయితొలగించండిజలజములు చాలును మనకు జాతు లేల
జనుల నజ్ఞాన తిమిరాన జారవిడుచు
నట్టి జాతి మతముల పోనాడ మేలు
తెలతెల వార గానె ఘనదీప్తుల భానుని మైత్రి గోరుచున్
తొలగించండిజలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
మిలమిలలాడు చుక్కలను మింటను జూపుచు నాశ రేపుచున్
విలవిలలాడు చీకటుల వేదనలన్ బడ దోయునట్టివే
ఆవహములు మాని యవని యందు
రిప్లయితొలగించండిప్రేమ మీరగ జనమంత పిలుచు కొనగ
శాంతి కాముక మైనట్టి చలువ శ్వేత
జలజములు చాలును మనకు జాతు లేల
పద్యరచనకుననువగువృత్తములగు
రిప్లయితొలగించండిజలజములుచాలునుమనకుజాతులేల
చంపకోత్పలములనునవియింపుగూర్చు
గందములకంటెభావానకవివరేణ్య!
పద్మనాభునిఁ బూజింప భక్తి తోడ
రిప్లయితొలగించండివిత్త రాశుల పనియేమి వినయ మొప్ప
భగవ దర్పణమునకు నపారమగను
జలజములు చాలును మనకు జాతు లేల
గెలువఁగఁ జేసె నూది యనిఁ గృష్ణుఁడు దివ్యపుఁ బాంచజన్యమే
గెలిచెను శంఖ మూది యనిఁ గీర్తి కిరీటియ దేవదత్తమే
సులువుగ నూదఁ గల్గు విన సొంపగు తియ్యని శబ్ద భంగముల్
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో
[జలజము = శంఖము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
తొలగించండి(జిలేబి గారికి అంకితం)
తళతళలాడు మోమునను దంభము నప్పదు దీది నీకికన్
కళకళలాడు కన్నులను కార్చకు నీరము తిట్టిపోయుచున్
మిలమిలలాడు కంఠమున మ్రింగుము హాహలమమ్మ తీరుగన్...
జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో?
జలజము = (భాజపా) చిహ్నము
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఏకదంతుని పూజకై నిటకు నేడు
భక్తితో దెచ్చు వస్తుసంభారమందు
కుసుమములు ఫలముల దోడు కొలను లోని
జలజములు చాలును మనకు జాతులేల?
రిప్లయితొలగించండికంది వారికి జేజేలు :)
అలిగిన ప్రియురాలె కరము
న లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్,
వలపు తెలుప తక్కువయిన
కలముంగని కవివరుండు కలవరమందెన్ !
జిలేబి
రిప్లయితొలగించండిఆకాశవాణి లో చదువ బడెను !
అలుకగ శంకరాభరణ మందున, దిద్దగ దిద్దగాను తా
మలుకయు లేక పూజ్యులు సమస్యల పూరణ దీటుతేలగా
కులికెడు కన్నె పిల్ల మది క్రోడపు టెత్తుల రేగు కైపులన్
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!
జిలేబి
తెలుపు నలుపెరుపు పసుపు దేవనముల
రిప్లయితొలగించండిలోన నేది ముఖ్య మనెడాలోచనేల?
జలజములు చాలు మనకు జాతులేల
విష్ణు మానస రాణినిన్ వేడ్కఁ గొలువ.
పలువిధముల్ గనన్ వివిధ వర్ణము లందున దేవనమ్ములే
రిప్లయితొలగించండిమిలమిల లాడుచున్నవట మేలగు తామర లేవియో యనన్
విలసిత మందహాసినిని విష్ణుమనోహరిఁ గొల్వనెంచగన్
జలజల జాలువారు జలజంబులు చాలును జాతులేలకో.
తళతళలాడునీరమునతామరతూడులగట్టకైవడిన్
రిప్లయితొలగించండిమిలమిలలాడుచేపలకుమీసములుంటకుగారణంబహో
కళకళలాడుపైరులకుకైపదమీయగగోరుచుండగా
జలజలజాలువారు జలజంబులుచాలునుజాతులేలకో
సరళముగసాగిపోయెడు చంపకములు
రిప్లయితొలగించండిఉరికురికియెగసిపడునా యుత్పలములు
మాలలుగనుండ వృత్తముల్ మాన్యవర్య
జలజములు చాలును మనకు జాతు లేల
(చెలువఁపు చంపకమాలలు
ఉలుకుచుఁనూపుగఁనురికెడియుత్పలమాలల్
కలవింకమనకుగావున
జలజమ్ములుచాలుమనకు జాతులవేలా?)
రిప్లయితొలగించండితేటగీతి
అందమొలకించి యాత్మ కాహ్లాదమొసగు
జలజములెచాలు ,జాతులేల
జాతి మతభేద కలహాలు సంతరించి
ఐకమత్యము లోపించె హైందవమున
ఆకుల శివరాజలింగం వనపర్తి
రిప్లయితొలగించండితేటగీతి
అందమొలకించి యాత్మ కాహ్లాద మొసగు
జలజములె చాలును , మనకు జాతులేల
జాతి మతభేద కలహాలు సంతరించి
ఐకమత్యము లోపించె హైందవమున.
ఆకుల శివరాజలింగం వనపర్తి
ఈపద్యము సరియైనదిగా గ్రహించ మనవి