12, జూన్ 2019, బుధవారం

సమస్య - 3045 (కారణము లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు"
(లేదా...)
"కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో దోమల భిక్షపతి గారి సమస్య)

90 కామెంట్‌లు:

  1. మదిని దలచిన శుభమగు మంచి పనిని
    పరవ శించగ నలుగురు బహుళ ప్రీతి
    ఫలిత మెంచక భక్తిని వరమ టంచు
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    సూరుడు రోజురోజునను సుందర రూపున వేగునట్టులన్
    వారిజ నేత్రలన్ గనుచు బాలుడు చీరలు దోచినట్టులన్
    శూరుడు రాతినిన్ తడవి సుందర రూపసి జేసినట్టులన్
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ. నేరపు ప్రక్రియా గుణము నిందల బాపగ నింటివారికిన్
      దూరుట మానినన్ వెకిలి దొమ్మర గుడ్సెలఁ నాకతాయి జే
      కూరవె శాంతి సౌఖ్యములు ,కూరిమి గోరిన మంచి వారితో
      కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తడవి' అన్నదే సాధురూపం అనుకుంటాను.
      *************
      శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఉ.మీరిన వాంఛలే మనిషి మేధను బాధలఁ బెట్టు మిత్రమా
    దారిన కానువన్నియును దక్కగలందుకు పాకు లాడకన్
    కోరుట మానినన్ మదిని గూడునుమందిర మా విభుండకై!
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కానువన్నియును.... విభుండకై'...?

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ధారుణి సర్వమానవహితమ్ము మదిన్ దలపోసి , నిత్యని..
    ష్కారణవైరముల్ తొలగగా నడుగుల్ కదిలించి , ప్రేమసం...
    పూరితచిత్తులై మెలగ మోదము గల్గును , నమ్ము ! నీకు శం...
    కా ?! రణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ విలక్షణమైన విరుపుతో ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
  5. (అరణ్యవాససమయంలో పాండవులను అవమానించాలని వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో
    అవమానితుడైన దుర్యోధనుని గురించి భీముడు ధర్మరాజుతో )
    వైరము బూని యిచ్చటకు
    వైళమ వచ్చిన రాజరాజు దో
    స్సారము మాయమై తనదు
    చంచలబుద్ధికి చిత్రసేను డిం
    పార చపేటమున్మిగుల
    పట్టుగ నీయగ ఖిన్నుడాయెగా!
    కారణ మేమి లేనిదగు
    కార్యమదే ఘనతం గనుం గదా!!
    (వైళమ -వేగముగా;దోస్సారము-బాహుబలము;చపేటము-చెంపదెబ్బ)

    రిప్లయితొలగించండి
  6. భారము గాదటం చుమది పారవ శంబున భక్తితో నిలన్
    కోరిన సన్నుతిం పగను కూరిమి నొందుచు సంతసం బునన్
    వారిజ లోచనుండు పరివారము రక్షణ జేసినం తనే
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పారవశ్యము' అన్న పదం ఉంది కాని 'పారవశము' లేదు.

      తొలగించండి
  7. ఉ. నేరపు ప్రక్రియా గుణము నిందల బాపగ నింటివారికిన్
    దూరుట మానినన్ వెకిలి దొమ్మర గుడ్సెలఁ నాకతాయి జే
    కూరవె శాంతి సౌఖ్యములు ,కూరిమి గోరిన మంచి వారితో
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"

    రిప్లయితొలగించండి

  8. सब के साथ सब का विकास :)


    పనికి మాలిన దనిపించు ఫలము లేని,
    కారణము లేని కార్యమె; ఘనతఁ గాంచు
    భువిని లక్ష్యము తోడుగ పూనుకొనుచు
    నందరి నొకతాటి కలిపి నాట నేల!


    जिलेबी

    రిప్లయితొలగించండి
  9. కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు,
    వలదు ముస్లిము జాతిపై కలహ మెపుడు
    భరత బిడ్డల నెప్పుడు తరుమ వలదు ,
    ననుచు పలికె మోహను దాసు జనుల గాంచి


    స్వాతంత్ర్యము వచ్చిన పిదప ముస్లిము సముహములపై కొందరు దాడి చేసి వారిని పాకిస్తానుకు తరుము చున్న సమయములో జనులను వారించి “ హింస వలదు హింస లేని పనులు మనకు ఘనత గూర్చును “అని చెప్పు సందర్భము

    కారణము = హింస లేక వధ

    రిప్లయితొలగించండి


  10. ప్రేరణ నివ్వ దెవ్వరికి పేలవ మై జగ మందు నిల్చునా
    కారణమేమి లేనిదగు కార్యమదే; ఘనతం గనుం గదా
    వీరుని ధీరమున్ మదిని వేగపుటూయల లాడ జేయుచున్
    వేరము చేర్చకన్ జనుల వేగిర చేసెడు దోహలమ్ములున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేరము' క్రొత్తపదం తెలిసింది.

      తొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    పూరణ లేని బూరె యది పొంగియు వ్యర్థము గాదె తింటకున్?
    గారణమేమి లేనిదగు కార్యమ దే ఘనతం గనున్? గదా
    ధారి వృకోదరుండు తమ దాయలు కౌరవ భ్రాతృవర్గమున్
    గోరి వధింపఁ బూనుటయుఁ గ్రూరపుఁ గారణ ముంటచేఁ గదా!

    రిప్లయితొలగించండి
  12. పోరు వలనను నష్ట ము ల్ తోరమగును
    హింస విధ్వంస దాడులు హేయమగును
    భ్రాంతి విడ నాడి మసలు మో శాంతి కాము
    కా ! రణ ము లేని కార్య మె ఘనత గాంచు

    రిప్లయితొలగించండి
  13. కోరికలేలనే మనస కూర్చునె కూర్మిని? లోకమందునన్
    నేరపు దారులందుఁబడ నెట్టును కాల్చును నిప్పులేకనే
    చేరగ వచ్చునే ధనము చేదది సంపద యూసు నుండగన్
    కారణమేమి? లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
  14. కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు
    గాని, మీరెపుడైనను గాంచి రే! త
    లంచి చూడగ కారణరహిత మైన
    కార్య రచనయే నగునొక కారణంబు

    రిప్లయితొలగించండి
  15. నెలత సీతను విడిపించు నెపము గాదె
    రావణున్ వధింపఁదలచి రాము డేగె
    నేల చెప్పెద వోబాల యివ్విధమున
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    రిప్లయితొలగించండి
  16. కారణభూతమై జరుగు కార్యములిచ్చట నెంచి చూడగాఁ
    గారణకారణం బెవడొ? కర్మము సేసెడి దెవ్వడో? నిరా
    కారునిఁ గాంచలేని మన కన్నుల జంటకుఁ దోచునిట్లు నా
    "కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం! గదా!!"

    రిప్లయితొలగించండి
  17. కార్య సాధకులెన్నడు కలిసి నడిచి
    చక్క జేతురు పనులను జనుల కొరకు
    జనుల హితము పాడి దలచి జరుపు స్వార్ధ
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    పారమేది* సమస్యల*పంపకమున
    గారు వీరంద రవధాన ఘనులు, గాని
    ఏరికేమి యొసంగునీ యింటి పనియె
    కారణము లేని కార్యమే ఘనత గాంచు!?

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    ఊరను ఛంద రీతులను నూపిరిగా బిగబట్టి పుస్తకాల్
    ఏరులు వార నల్బదిగ నింపుగ నచ్చును వేతు, కాదనన్
    పూరణ కంకితంబయితి పుణ్యమె పాపమదౌనె?, వాణి!యే
    కారణ మేమి లేనిదగు కార్యమ, దే ఘనతం గనుం గదా!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఛందోరీతులు' అన్నది సాధు ప్రయోగం. "పుస్తకా । లేరులు.." అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా,
      ఊరను ఛందమున్ గొలిచి....గా సరిచేశాను. ధన్యవాదాలు

      తొలగించండి


  20. చేరుచు కైపదమ్ముల కచేరిని వ్యర్థము చేసి కాలమున్
    మేరు సమోన్నతంబనుచు మేధ్యము దేవికటంచు వాసియౌ
    పూరణ లంచు పూసి మసి, పుష్పపు గుచ్ఛము లంచు పెట్టిరే
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా!


    నారదా! ఈ రోజేమగునో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కైపదాలతో పాటు ఏదైనా కావ్యం వ్రాసే పని పెట్టుకోండి.

      తొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. 🙏శ్రీ గురుభ్యోన్నమః.

    హేతువేమౌను వెలుగీయ హేమమాలి?
    కతన మేమౌను సుధనీయ కడలివెన్న?
    దారువునుగూడ చలువీయ దర్కమేమి?
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు!

    హేమమాలి-సూర్యుడు;
    కడవెన్న - చంద్రుడు
    దారువు - చెట్టు

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    కారణమేమి లేక రవి కాల్చడె యెండల పేద గూటినిన్
    సారమదెంత మేఘుడు నసాధువునై వరదల్ సృజించు వే
    భారము నీడ్వ ముంచుటది పాడియె గాలికి గప్పు లేవగన్
    వీరలసాధ్యులేమెరిగి వింతల జేర్చిరి వందనీయులై
    కారణ మేదిలేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా!

    రిప్లయితొలగించండి
  24. అంబరీషునిశపియించె నంత కోపి
    మత్స్యకూర్మ రూపంబులు మాధవుండు
    దాల్చి రక్షించె జగతిని, తాల్మితోడ
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    రిప్లయితొలగించండి
  25. ఊరక నేత లాస్తులను బొందగ జేసెడి యత్నముల్ గదా
    వారిటు కారణంబులవి వందలు వేలని లెక్క జూపినన్
    ఊరికి మేలొనర్చుటె ప్రయోజనమౌనదె గాని వేరుగా
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
  26. కారణములేనికార్యమెఘనతగాంచు
    గార్యకారణఘటనలకర్తభవుడె
    కారణములేనికార్యముగానబడదు
    జగతినెచ్చటనెఱుగుమా శర్వపుత్ర!

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    సందర్భము:
    సూర్యుడు ప్రకాశించడానికి చంద్రుడు వెన్నెల చిందించడానికి గాలి వీచడానికీ అగ్ని మండడానికీ అట్లే లోకం లోని అన్ని సంఘటనలకూ కారణం ఒకే ఒక్క పరమాత్ముడు.. అందుకే అతడు మూలకారణమై యున్నాడు. మూల కారణం బెవ్వడు.. వానినే శరణంబు వేడెద నన్న పోతన్నను మరువరాదు. కాబట్టి దేనికీ కారణం లేదని వాటంతటవే నడుస్తూ వున్నా యనీ భావించరాదు.
    మన యింట్లో చిన్న బల్బు వెలుగడానికీ ఒక స్విచ్ వుంటుంది. అంత పెద్ద సూర్యుడు వెలుగడానికి ఒక స్విచ్ వుండదా! చంద్రుడు వెలుగడానికి మరొక టుండదా! కనిపించనంతమాత్రాన లే దనుకుంటే ఎలా? ఆ స్విచ్చే పరతత్వం.. అన్నారు.
    సూర్య చంద్రులు తమంత తామే వెలిగేట్టయితే మన యిళ్ళల్లో బల్బులూ వాటంత టవే వెలుగాలి కదా! అట్లే మిగతావి కూడా.

    భీషాఽస్మా ద్వాతః పవతే
    భీషోదేతి సూర్యః
    భీషాఽస్మా దగ్ని శ్చేంద్రశ్చ
    మృత్యు ర్ధావతి పంచమ ఇతి..
    (తైత్తరీయోపనిషత్తు)
    పరమాత్ముని యెడల భయంతో గాలి వీస్తున్నది. సూర్యు డుదయిస్తున్నాడు. అగ్ని ఇంద్రుడు మృత్యువు తమతమ కార్యాలు చేస్తూ వున్నారు... అని భావం.
    అంటే కారణం లేకపోవటం కాదు. కనిపించకపోవటం. దాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డు రావటంవల్ల మానవుడు కారణం లే దంటున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సూర్యు డాకసమందు శోభిల్లుచుండును
    చందురు డిల జ్యోత్స్నఁ జిందుచుండు
    గాలి యొయ్యారమ్ముగా వీచుచుండును
    మహి నగ్నిహోత్రుండు మండుచుండు
    నదులు చల్లన మెల్లనై పారుచుండును
    మించి మేఘాలు వర్షించుచుండు
    పాదపాల్ పుష్పించి ఫలియించుచుండును
    కులగిరు లట్టులే నిలిచియుండు
    మూల కారణ మొక్కడే! ముఖ్య కార
    ణ మ్మొకడె!పరమాత్ముండు సుమ్ము..మనము
    కనఁ దలచినచో హేతువే కానరాదె!
    కారణము లేని కార్యమె ఘనత గాంచు

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.6.19
    -----------------------------------------------------------
    శ్రీ తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి గారి ప్రేరణతో..
    శ్రీ సూరం శ్రీనివాసులు గారి సూచనతో..

    రిప్లయితొలగించండి
  28. కారణమేమిలేనిదగుకార్యమదేఘనతంగనుంగదా
    కారణమేమియుంగనకకార్యములెప్పుడుగానరావుగా
    కారణకార్యపుంఘటనగాగలజేయునుశర్వపుత్రుడే
    కారణభూతుడేయతడుకార్యములన్నియుజక్కజేయగన్

    రిప్లయితొలగించండి
  29. స్వార్థముం గోరి చేసిన పనుల మెచ్చ
    నేర రెవ్వరు నిక్కము భార మైన
    వీఁకఁ జేసిన, మది నుంచ లోక హితపుఁ
    గారణము లేని, కార్యమె ఘనతఁ గాంచు

    [కారణములు + ఏని]


    దారను బొంద సంపదల తంపరతోఁ జదివించు విద్యలున్
    మూర ధనమ్ము వేశ్మముల భూరి విధమ్ముగఁ జేయు పూజలున్
    ఘోర మహత్తు లన్నిటినిఁ గూర్చెడు మంత్రములున్ వృథల్ సుమీ
    కారణ మేమి లేని దగు కార్య మదే ఘనతం గనుం గదా

    [కారణమన నిక్కడ ఫలితము]

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పోరుచు గిల్లికజ్జలను మోడియు దీదియు నాడునట్టులన్
    ధీరుడు రాహులుండునట తీరిక మీరగ చిందినట్టులన్
    కారును తోలుచున్ ఘనుడు కాంగ్రెసు నేతల లాగినట్టులన్
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
  31. జలము జలధినిఁ జేకొని జలధరంబు
    పర్ర భూముల వర్షించి పసిఁడినొసగు
    అరయ నేస్వార్థ మెరుగదా యంబుదమ్ము
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు

    రిప్లయితొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మంచిదై యున్న మనసుతో మసలు చుండి
    పరుల సేవకే బ్రదుకును పాదు జేసి
    క్రమముగా వారికై జేయు కలుష స్వార్థ
    కారణము లేని కార్యమే ఘనత గాంచు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలుష స్వార్థ' అన్నపుడు 'ష' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. " కలుష గుణపు " అనవచ్చును గదా!

      తొలగించండి
  33. వీరుడ శూరుడన్ గెలుతు వేగమె శాత్రవ వీరులన్ యనన్
    కారణమేమి లేనిదగు;కార్యమదే ఘనతం గనున్ గదా
    కౌరవ సైన్యమున్ నొకడె క్ష్రాత్రముజూపుచు నడ్డగించుచున్
    పారెడు నుత్తరున్ నిలిపి పాండవమధ్యము డొప్పినట్లుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు కామేశ్వరరావుగారి ప్రేరణతో!( కారణము=ఫలితము ) వారికి ధన్యవాదములు,నమస్సులు!

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీరులన్ + అనన్' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

      తొలగించండి
  34. మంచి పనులను చేయంగ మహిని చూడ
    కారణము లేని కార్యమే ఘనత కూర్చు
    నొక్క తల్లి పిల్లలు యిట్లు నొప్పు గాను
    కలసి మెలసి యుండగ రాదు కలహ మెపుడు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పిల్లలు + ఇట్లు" అన్నపుడు యడాగమం రాదు. "పిల్ల లిటుల" అనండి.

      తొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మంచిదై యున్న మనసుతో మసలు చుండి
    పరుల సేవకే బ్రదుకును పాదు జేసి
    క్రమముగా వారికై జేయు కలుష గుణపు
    కారణము లేని కార్యమే ఘనత గాంచు.

    రిప్లయితొలగించండి
  36. దారము లేనిదే విరులఁ దండగ గ్రుచ్చుట వంటిదే సదా
    నీరసమౌను గాదె కృషినిష్ఫలమౌను వృధాప్రయాసయే
    కారణమేమిలేని దగు కార్యమదే, ఘనతం గనుం గదా
    ప్రేరణ పొంది ధీరుడటు పిమ్మట చేసెడు కార్యమైనచో.

    రిప్లయితొలగించండి
  37. సమరము వలన ప్రజకు ప్రశాంతి నాశ
    మగును భూతలమందున ననవరతము
    దర్పమును విడు మయ్య గాంధారి పుత్ర
    కా! రణము లేని కార్యమే ఘనత గాంచు

    రిప్లయితొలగించండి
  38. నేరరు పరమానందయ్య చారుశీల
    మంతుబట్టదుఛాత్రులకెంత జడత
    తప్పులొప్పులైశుభమయ్యె ధరకు హితము
    *"కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు"*

    రిప్లయితొలగించండి
  39. కారణమేమి యోగులు దిగంబరులైచరియించ, బుణ్యులన్
    బారులబారలౌకికుల పాపులుదూరుట, పాకుసైనికుల్
    భారతశాంతిదూతలను భండనమైయెదిరించబూనుటల్
    *"కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"*

    రిప్లయితొలగించండి
  40. కారణమేమి శంతనుని గంగ వరించె మనోహరుండనన్
    కారణమేమిశాబకులగంగకునాహుతినిచ్చెజాహ్నవీ
    కారణమేమికాతరునికైవడి దిర్గెను శంతనుండహో
    *"కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"*

    రిప్లయితొలగించండి
  41. భారత వీరకేసరులు ప్రాణమునే తృణ ప్రాయమంచు నా
    భారతమాత స్వేచ్ఛకయి పౌషము జేసిన వేళ గాంధి తా
    గోరెను రక్తపాతమది కూడదటంచు నహింసతోడనే
    ధీరులమౌచువారలగు తెల్ల దొరల్ విడిపోవునంతదా
    కా, రణమేమిలేని దగు కార్యమదే, ఘనతం గనుం గదా

    రిప్లయితొలగించండి
  42. తేటగీతి
    సీతను విడి శ్రీరాముని జేర్చినంత
    వంశనాశమునకు నిన్నుఁ బట్టి చూపు
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు
    రావణాసుర శుభమెంచు భావనమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదము క్రింది విధంగా స్వీకరించ ప్రార్థన

      'రావణాసుర!శుభమెంచు భావనమున'

      తొలగించండి
  43. సారము శాస్త్రమందిటుల సాగుచునున్నది సంచరించు వి
    స్తార జగాన సాగనిది స్థావరమై పడియుండు న్యూటనే
    చారుజడత్వసూత్రమనె శక్తియ హేతువు నీడ్వనాపగా
    *"కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"*

    రిప్లయితొలగించండి
  44. ఉత్పలమాల
    శ్రీరఘు రామమూర్తి సతిఁ జేర్చుచు లంకకు తప్పు జేయుచున్
    మీరితె వంశనాశనము మిత్తిని గొందువు యుద్ధమందునన్
    వారిజ నేత్రినిన్ ప్రభువు పంచకుఁ బంపిన సేమమందు నీ
    కా రణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా?

    రిప్లయితొలగించండి
  45. పట్టువీడక పద్యముల్ వ్రాయగోర
    అమ్మ దయలేక పూరణనరయ బోము
    విధి లిఖితమేను వెలుగొంద వేరుగాదు
    కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు!!

    రిప్లయితొలగించండి