7, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3040 (పారెద రోరుగల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి"
(లేదా...)
"పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో నేనిచ్చిన సమస్య)

99 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  నారులు ధీరులున్ కలిసి నందన మొందగ నాంధ్రభాషనున్
  గారము హెచ్చగా మురిసి కార్యము లన్నియు చక్కబెట్టుచున్
  కోరిక మీరగా చనుచు గొప్పగు కయ్యము చూడగోరుచున్
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "ఇది సరదా పూరణ ఎంతమాత్రం కాదు.. చక్కని పూరణ 🙏అభినందనలు"

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మైలవరపు వారు చెప్పినట్లు ఇది సరదా పూరణ కాదు. అన్ని విధాల ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. వారలు సాహితీ రసపిపాసులు , చండనిదాఘవేళ మ...
   ద్దూరి శతావధాన ఘన తోయద వర్షిత పద్యవృష్టిలో
   భూరిముదమ్మునన్ తడిసిముద్దవనెంచగ నాప శక్యమా !
   పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కాక తీయుల పాలన గాంచ లేదు
  రాణి రుద్రమ దేవియె రాజ్య మేలె
  వీర వనితగ పేరొందె భరత భూమి
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
 4. (అసమర్థుడైన అవధానిని అవలోకించిన సభ్యులు పరుగో పరుగు)
  సారము లేని పద్యములు;
  సౌష్థత కానగరాని భాషణల్;
  కేరడమైన చూపులును;
  ఖేదము గొల్పెడి గానరీతియున్;
  కారణశూన్యహాసములు;
  గాంచగలేకనె శీఘ్రగాములై
  పారెద రోరుగల్ నగర
  వాసులయో!యవధాన మన్నచో.
  (కేరడమైన -వంకరయైన;శీఘ్రగాములై-త్వరగా వెళ్లేవారై)

  రిప్లయితొలగించండి
 5. భాషపై మక్కువున్నట్టి ప్రజలు కాన
  భూరి సంఖ్యన తరలేరు ముదము నంది
  యోరుగల్ వాసు, లవధాన మొప్ప మనిరి
  యనుచు పల్కంగను తగునటయ్య మీకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగన్నది. అభినందనలు.
   'భూరి సంఖ్యను... మొప్పమని ర। టంచు పల్కంగను...' అనండి.

   తొలగించండి

 6. తెలివైన వాళ్లప్పుడప్పుడు ఉల్టా పల్టా చేస్తుంటారు :)


  కంది వర్యుల పురమది ; కాస్త తెలివి
  గలిగి వెలిగిన నగరమ్ము! కాని నేడు
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి;
  కారణము నాకు తెలియదు కంబుకంఠి!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  సందర్భము: అంతర్ముఖుడై భగవత్ప్రీర్థం తన యింట్లో తాను కూర్చుని కవిత్వం వ్రాసుకున్నాడు పోతన. ఏ కార్యక్రమం కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు. అదే సత్కవితగా వందలేండ్లుగా వెలిగిపోతున్నది.
  అవధానాలు కార్యక్రమం ఏర్పాటు చేస్తేనే కొనసాగుతాయి. కార్యక్రమం అయినంతవరకే అలరిస్తాయి. అని ఓరుగల్ వాసులు అవధానం ఏర్పాటు చేస్తా మంటే.. వద్దులే బాబూ.. అన్నా రట!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *మహిని పోతన కార్యక్రమంబుకొరకు*

  *కవిత వెలయించె నేమి? యా కవిత నిలిచె*

  *వందలేం.. డ్లట్టి కవిత కావలయు ననుచు*

  *నోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి*

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  7.619
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 8. ఉ. వీరులకోరుగల్లు పురి పెట్టిన పేరని గొప్ప చాటగా
  సారము యున్న ప్రాజ్ఞులట, సౌఖ్యము బొందగ కాకతీయ వి
  స్తారముఁ కోవిదుల్ కవుల సంస్కృతిఁమెచ్చగ సాహసమ్ముఁవి
  ప్పారద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర ప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సారము + ఉన్న' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "సారము గల్గు" అనండి. 'విప్పారెద రోరుగల్...' టైపాటు.

   తొలగించండి
 9. వాడి యప్రస్తుతము లేదు, వరుస లేదు;
  కఠిన న్యస్తంబు, దత్తపది గాన రావు;
  కటు నిషిద్ధాక్షరియు గూడ గగనమయ్యె;
  ఇవియు లేనట్టి యవధానమింపు గాదు.

  కూర కరివేప లేకున్న గుడియగలమె?
  జున్ను మిరియంబు లేకుండ జుర్ఱగలమె?
  ఇట్టి నవధానమొప్పదు నిపుడు - గాన
  ఓరుగల్ వాసులవధానమొప్పమనిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వామన్ కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం."కఠిన న్యస్త దత్తపదులు గానరావు" అనండి. "ఇట్టి యవధాన మిక నొప్ప నిపుడు..." అనండి.

   తొలగించండి
 10. పారెద రందరున్ వినరు పద్యము లెవ్వరు నాలపించినన్
  కోరెద రెవ్వరైన నికఁ గ్రొత్తగు ధోరణు లంచునెంచగా
  కారము కన్నులన్ బడగ కాటును వేయుచు నిండిరంత, యిం
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "శాస్త్రీ"యమైన ధోరణిలో...😀

   "ఓరుగల్ వాసు లవమాన మొప్ప మనిరి"
   యనెడు వాక్యము మారిపో యెనిటఁ గ్రమ్మి
   కనుల నిద్దుర గమనింప మనవి, కాదు
   "ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి"

   తొలగించండి
  2. రాకుమార గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. సరస సాహిత్య పదజాల సంభృతంబు
  నైన కవనంబు గోరెడు నట్టివారు
  ఓరుగలు వాసు లవధాన మొప్పమనిరి
  చౌకబారగు వారల తోక విరిచి.

  రిప్లయితొలగించండి
 12. పదమువెదుకుచు యతులకైప్రాసలకును
  ప్రాకులాడుచుదుష్కరప్రాసలకును
  వెరచి మమయనిపించె దుర్విధిని తలచి
  *"యోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి"*

  రిప్లయితొలగించండి
 13. పారుడు బోతనార్యుడు నవక్రపరాక్రముడేవధానమం
  దారయశబ్ధకోవిదుడునాశుకవిత్వపటుత్వశక్తితో
  గారవమందినాడు గవికార్ముకుజీవపుగడ్డపైనెటుల్
  *"పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో"*?

  రిప్లయితొలగించండి
 14. శారద గౌరవాస్పదుడు చారు గవిత్వము నమ్మనోడు సం
  సారము కోసమై ప్రభుల సాయము గోరని, భక్తిముక్తి దు
  ర్వార విరక్తి విత్తమను భాగవతామృత మాదరించి సం
  స్కారము జాటినారు యశ కాముకు లీరు వచింపరంచు నొ
  *"ప్పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో"*

  రిప్లయితొలగించండి
 15. ప్రతిభ తో పద్య ము ల నల్లు ప్ర జ్ఞ shaali
  ధార ధారణ గల్గిన ధీర వరుడు
  వలయు మద్దూరి యన్యు లు వచ్చు నె డ ల
  ఓరుగల్లు వాసు ల వ ధాన మొప్ప మని రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రజ్ఞాశాలి' అనడం సాధువు కదా? "ప్రాజ్ఞుడగుచు" అందామా?

   తొలగించండి
 16. వారలు సద్గుణోత్తములు ప్రాజ్ఞులు మిక్కిలి సాహితీ ప్రియుల్
  వారె మరాళి వాహి ప్రియ భక్తులు, కుట్రకుతంత్రమన్నచో
  పారెద రోరుగల్ నగర వాసులయో, యవధాన మన్నచో
  భూరిగ వత్తురా సభకు మోదము మీర రసజ్ఞులై సదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 17. డా.పిట్టా సత్యనారాయణ
  మా కిషన్ రావు యవధాని మనిన నేల
  హాస్య మొలికించ సరి రాగ నవతరించు
  వారలేరి?వచనగేయ పరులు కవులు
  ఓరుగల్ వాసులవధాన మొప్పమనిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రావు + అవధాని' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
   మా కిషన్ రాయు డవధాని మనిన నేల
   ఆర్యా, ధన్యవాదాలు

   తొలగించండి


 18. ప్రేరణ పోతనార్యులది! భేషజమేమియు లేక నెల్లరున్
  జోరుగ నెచ్చటైనను హుజూరని హాజర టంచు జెచ్చెరన్
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో
  వారికి ప్రాణమయ్య తమ వారధి సంస్కృతి యన్న పేర్మితోన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జాను తెనుగున పద్యముల్ జాలు వార్చి
   తేనె పలుకుల మధురిమ తెల్లమవగ
   పోతనార్యుని ప్రోఢిని పొగడకున్న
   ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

   తొలగించండి
  2. వేరుగ జెప్పనేల మరి వీని కవిత్వ మహత్వ మేమనన్
   సారమ దించుకైన గన జాలము ఛందము ప్రాస గల్గినన్
   ఘోరము వీని పద్యములు గూర్చొనలేమిటనంచు వెంటనే
   పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

   తొలగించండి
  3. సూర్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. డా. పిట్టా సత్యనారాయణ
  తోరణ మల్లె సాంస్కృతిక తూర్యములన్ గను పోతనాఖ్యుకౌ
  పేరున నున్న పీఠమది, ప్రేరణ నిచ్చును కైత సేతకున్
  ఊరికి దూరమైన బహు వేసవి నెంచక పద్య ప్రీతిమై
  బారులు దీరి వే మసక బారు వధానము నెత్తి చూపగన్
  బారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలె'ను 'అల్లె' అనడం గ్రామ్యం.

   తొలగించండి
 21. వారలు సాహితీప్రియులు వాణినినెప్పుడు గొల్చువారలున్
  మేరలు లేనిదై విభవమేర్పడ దెల్గున పద్యవిద్యదౌ
  సారము నందజేయు బుధసంగతి వేడ్కగనందగోరి యిం
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధానమన్నచో

  రిప్లయితొలగించండి
 22. మొదటి పాదమున వాణిని నిత్యము గొల్చువారలున్ గా చదువ ప్రార్ధన

  రిప్లయితొలగించండి
 23. 🙏గురుభ్యోన్నమః
  ప్రతాప రుద్రుడి తర్వాత ఖిల్జీ సేన కాకతీయ సామ్రాజ్యమును(1303) లో కొల్లగొట్టగా వెలమ రాజులతో కలిసి ముసునూరి కాపయ(1332 - 1367) తెలంగాణకు దాస్యవిముక్తి జేసెను.
  ఆ సందర్భ మూహించి చివరి పాదములో నిచ్చిన సమస్య పూరించాను.

  కాకతి నరులు కాకలు కలిగినట్టి
  వెలమ యోధుల గూడిమా తెలుగు నేల
  తుర్క పాలన నెదిరించు తోపు లవగ
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  2 వ పాదమున ప్రాసయతి ప్రయోగించా.

  రిప్లయితొలగించండి
 24. ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి"

  శంకరార్య మున్ముందుగ,సరస గతిని

  గండ పెండేరమును మీదు కాళ్ళ తొడిగి

  పిదప మొదలిడ మనిరట ముదము తోడ

  రిప్లయితొలగించండి
 25. ఆకుల శాంతి భూషణ్శుక్రవారం, జూన్ 07, 2019 8:32:00 AM

  శంకరాభరణం 07/06/2019

  సమస్య

  "పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  నా పూరణ. ఉ.మా.
  ***** **** ***
  కోరికతో వధాన సభకున్ వడి జేరి కుతూహలంబుచే

  ధారుణి వాసులున్ గనుచు తన్మయము నొందరె సంతసమ్మునన్?

  బారులు దీరి మక్కువగ పద్య రసాలను గ్రోలుచుండి యిం

  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  �� ఆకుల శాంతి భూషణ ��
  �� వనపర్తి��

  రిప్లయితొలగించండి
 26. కవన కాణాచి యీవూరు కానినేడు
  కర్షకులు కార్మికులు చాల కష్టపడుచు
  సంపదనుపెంచ లక్ష్యంబు సాకు చూపి
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
 27. తేటగీతి
  శంకరాభరణఁపు బ్లాగు చక్రవర్తి
  పద్య విద్యను నేర్పెడు వేద్యుఁడతఁడు
  పాల్గొనఁగలేని పసలేని వరుస నుండ
  నోరుగల్ వాసులవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
 28. ఉత్పలమాల
  తీరిచి శంకరాభరణ తీయని బ్లాగును, దిగ్గజమ్ములున్
  గూరిమి పాలుపంచుకొన గుర్వుగఁ బద్యపు విద్యనేర్పెడున్
  గౌరవ శంకరార్యులట కాదన పృచ్ఛక పాత్ర చేగొనన్
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో!

  రిప్లయితొలగించండి
 29. మిత్రులందఱకు నమస్సులు!

  [వరంగల్లు నగరవాసులు నృత్యకళాప్రదర్శనములన్నచో బుద్ధితీరా చూడడానికి వెళతారు. పద్యకవిసమ్మేళనములున్నచో అక్కడికి చేరి కని విని తరించిపోతారు. కోరిక తీరునట్లు సంతోషాన్ననుభవించే ప్రక్రియ యేదైనా వున్నదా అంటే, అది అవధానమే అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆనందసాగరంలో మునిగితేలుతారు...అనుట]

  ధీరతఁ గాంచఁ బూనెదరు దృగ్విమలాంచిత నృత్యకృత్యముల్;
  సేరి తరింత్రు పద్యపరిసేవిత సత్కవి మేళనమ్ములన్;
  గోరిక మీఱ సంతసముఁ గూర్చెడు ప్రక్రియ యిద్దె యంచు నిం
  పారెద రోరుగల్ నగరవాసు లయో, యవధాన మన్నచో!

  రిప్లయితొలగించండి
 30. నగర పాలన మందు ననయము నిజ మ
  నోరథమ్ముల విడనాడ నేర మంచు
  నన్య పుర వాసు లొనరించు నలఘు వైన
  నోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  [అవధానము = హెచ్చరిక]


  దూఱుదు రెల్ల వేళలను దుష్ట పదాన్విత కావ్యసృష్టినిన్
  మీఱుదు రెల్ల శాస్త్రముల నేర్పు వహించి ధరాతలమ్మునం
  గాఱియ పెట్టు వ్యాపకమ కాలవృథాగతి కారణమ్మునం
  బాఱెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చేరుచు కొల్వుకూటమున చెప్పగ గొప్పలు పండితోత్తముల్
  చీరలు పట్టుపంచెలను చెన్నుగ కట్టుచు గోలగోలగా
  బోరును కొట్టుచున్నదని బొబ్బలు పెట్టుచు జోరుజోరుగా
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో :)

  రిప్లయితొలగించండి
 32. ఘనుడు మద్దూరి రామ్మూర్తి కడుముదమున
  చేయగ శతావధానము చెన్నుమీర
  ప్రీతిగా చని కనుగొని వేడుకచట
  నోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి
  ఒప్పము: అందము, చక్కదనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 33. [2]
  వంద లేండ్లుగ మహనీయ పండితకవి
  బృంద మవధాన కళలందు వఱలి, యొప్పి,
  సాహితీజ్ఞాన సమ్మోద సరళిఁ దేల్చ,
  నోరుగల్ వాసు లవధాన మొప్ప, మనిరి!
  [అవధానములు ఒప్పునట్లుగా, మనిరి...అని విశేషార్థము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 34. కవులు పండితు కేల వాగ్వాదమనుచు
  వినుట కింపైన పద్దెముల్ విందు జేయ
  యెదను మీటెడు వ్యాఖ్యలే హృద్యమవగ
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గంగాప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పండితుల కేల' అనడం సాధువు. "కవి వతంసుల కేల..." అందామా? "...జేయ నెదను..." అనండి.

   తొలగించండి
 35. నగరపాలకు లీమాటు నగరమందు
  బాటను విశాలముగజేయ వాసనముల
  గుమిని యేకాగ్రతనుజూపి కూల్చుచుండ
  నోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాసనముల'?

   తొలగించండి
  2. 🙏🏽 ధన్యవాదములు
   సవరణ తో

   నగరపాలకు లీమాటు నగరమందు
   మార్గమువిశాలముగజేయ మందిరముల
   గుమిని యేకాగ్రతనుజూపి కూల్చుచుండ
   నోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

   తొలగించండి
 36. పేరు మోసినయవధాని గారటంచు
  పలుకువారల శఫతాలువాడ?"రామ
  మూర్తియు శతావధానిగ ముఖ్యుడవగ!
  ఓరుగల్ వాసులవధాన మొప్పమనిరి (అందలోఈర్ష్యపరులు)

  రిప్లయితొలగించండి
 37. శంకర గురువర్యుల యింట సలిపినయెడ
  శంకరాభరణము నందు సల్లపనము
  గుంటు పడునని యెరింగి గుమిగగూడి
  యోరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "పడుననుచు నెఱింగి" అనండి.

   తొలగించండి
 38. గురువు గారికి నమస్సులు
  తెలుగు పలుకులు పలుకగ తేనె యనిరి
  ఓరుగల్లు వాసు,లవధాన మొప్ప మనిరి
  నాధునిక జనాoధ్రులనేకులు హాస్య మాడ
  పద్య భారతి కర్పింతు ప్రణతు కోటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనిరి + ఓరుగల్లు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు."తేనె యందు । రోరుగల్లు..." ఆనండి. అలాగే "... మనిరి యాధునిక..." అనండి.

   తొలగించండి
 39. ధారణజేసి కావ్యములు దక్షతతో జనులెల్లమెచ్చగా
  పూరణతో 'రణంబు'పరిపుష్టిఁనొనర్చెడి పండితోత్తమున్
  వారలుకోరుకొందురనివార్యముగాఁ,నటుజేయకున్నచో
  పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

  రిప్లయితొలగించండి
 40. సరస సాహిత్య సంగీత సభయనంగ
  పద్యము రచించి చక్కగ పాడలేక
  పదము దొరకక తడబడి పారజూడ
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
 41. సవరించిన పూరణ
  కాక తీయుల పాలన గాంచ లేదు
  రాణి రుద్రమ దేవియె రాజ్య మేలె
  తెలుగు పండిత బాషల వెలుగు లీను
  ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
 42. [6/7, 1:23 PM] +91 9
  ప్రశ్న లనువేసి తికమక పరచు చున్న
  పృచ్ఛకులను రసజ్నులౌ ప్రేక్షకులు ను
  తడబడుచు బదులిడు నవధానియున్న
  నోరుగల్ వాసులవధాన మొప్ప మనిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రజజ్ఞులౌ' టైపాటు.

   తొలగించండి