27, జూన్ 2019, గురువారం

సమస్య - 3060 (జీవా కాంక్షలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే"
(లేదా...)
"జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్"
ఈ సమస్యను పంపిన తోపుచర్ల రంగారావు గారికి ధన్యవాదాలు.

92 కామెంట్‌లు:

 1. భావాద్భుత సంసేవన
  మావిర్భావంబు చెంద నవిరళ గతులన్
  శ్రీవాణి మృదుపద రా
  జీవాకాంక్షలు పరమును జేకూర్చునులే.

  రిప్లయితొలగించండి
 2. కోవెల కేగుచు నిత్యము
  దేవుని దర్శించు కొనుచు దీనుల నిలలో
  సేవించు కోరికలె రా
  జీవా! కాంక్షలు పరమును జేకూర్చును

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  వేవేలన్ మరి కోరనేల ? హితుడా ! విశ్వాంతరాలస్థితున్
  దైవంబంచు వచించిరా మునులు నిర్ద్వంద్వమ్ముగా ! నిత్యమున్
  సేవన్ జేసి తరింపుమా ! తొలగు నీ చింతల్ , తదీయాంఘ్రిరా...
  జీవాకాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. నావన్ ద్రోసెడి వాడతండె , మునుగన్ రక్షింప దిక్కాతడే !
   దైవంబాతడె ! శక్తి యాతడె మహాధర్మమ్మునా నాతడే !
   శ్రీవైకుంఠనివాసియే తిరుమలన్ శ్రీవారు ! తత్పాదరా...
   జీవాకాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  3. తత్ పాద రాజీవ కాంక్షలు !

   వావ్

   జిలేబి

   తొలగించండి
 4. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చావుల్ తప్పవు రాజనీతిననెడిన్ సత్యమ్ము కోల్పోవుచున్
  లావొక్కింతయు లేక పోరుటకిటన్ రక్షింపమన్ కోరుచున్
  కావుమ్ మమ్మని గోల బెట్టి చనెడిన్ కాంగ్రేసు హీరోలవౌ
  జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి
 5. లావుగ యార్జన జేసియు
  చావును తప్పించలేరు జనులెవ్వరు-యా
  దేవుని దయ దెల్పెడు గుణ
  జీవాకాంక్షలు పరమును జేకూర్చునులే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లావుగ నార్జన... జను లెవ్వరు నా...' అనండి.

   తొలగించండి
 6. దేవా భక్తిని కొలువగ
  భావా వేశమ్ము నిచ్చి పరమ ప్రీతిన్
  నీవే రక్షణ జేసిన
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే

  రిప్లయితొలగించండి
 7. బ్రోవగ రాక్షస బాలుని
  కావగ నీలోకమందు కలవారంతన్
  నీవే సర్వమనుచు రా
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే

  రిప్లయితొలగించండి
 8. ఏవో కోర్కెల తగులకు
  కావేవీ ముక్తి కిలను కారకములు రా
  జీవాక్షుని దరి జేరెడి
  జీవా! కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే.

  రిప్లయితొలగించండి


 9. కోవా, జిలేబి, జాంగ్రీ,
  జీవా కాంక్షలు, పరమునుఁ జేకూర్చును, లే
  రావమ్మా భోజనమును
  గావింపంగ నిహపర సుఖమ్ముల పొందన్ !


  ఎప్పుడూ తిండి యావే ? :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిండి పరాన్ని కూడా ఇస్తుందా? కడుపే కైలాసం కదా! బాగుంది పూరణ. అభినందనలు.

   తొలగించండి
 10. మిత్రులందఱకు నమస్సులు!

  [ఒక భక్తుఁడు తన దైవమునకుఁ జేయునట్టి నివేదనము]

  దేవా! నీ పద సేవఁ జేయు నరుతో దీవ్యత్సఖిత్వంబునున్;
  నీవై చేసిన భూతజాలములపై నిర్వ్యాజ దాక్షిణ్యమున్;
  భావాతీతవిశిష్టభక్తియుతమై వర్తిల్లు త్వత్పాదరా

  జీవాకాంక్షలు, ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్!

  రిప్లయితొలగించండి
 11. రావా!యీశ్వర నీలకంధర శివా!రక్షింప నీవేగదా!
  దేవా!నీదగు సేవఁదప్ప కనరాదే త్రోవ శర్వా!భవా!
  పూవై చేరగకోరు నాదువినతుల్ పూజింప నీపాద రా
  జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి


 12. నీవా కొండని గుండు కొట్టు కొని పన్నీటన్ తటాకమ్ములో
  దేవా! కావుమటంచు వేడి మునుగన్, దేహమ్ము హాయిన్ గనన్
  కోవా జాంగ్రి జిలేబి లడ్డుల గొనన్ గోవిందు నామమ్ముతో
  జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్!


  ఏడుకొండల వాడా గోవిందా గో విందా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా సత్యనారాయణ
  (ఇటీవల సూర్య గ్రహం ధ్వనిని శాస్త్రజ్ఞులు రికార్డు చేసినారట.ఓమ్ అను ధ్వని వినిపించింది.దీనినాధారంగా మరెట్టి వింతను సృష్టిస్తారో!)
  కావా శాస్త్ర పరీక్షలు
  తేవా పెను వింత లిచట దింపగ దివినిన్
  దేవా! రవి యట*నోమ*నె
  జీవాకాంక్షలు పరమును జేకూర్చునులే!

  రిప్లయితొలగించండి
 14. దైవాధీనము బ్రతుకయ
  రావాలని వేడి నపుడు రయమున రాడా!
  భావాతీతుడుఁ నా రా
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భావాతీతుడు' తరువాత అరసున్న అవసరం లేదు. 'నా రాజీవా'?

   తొలగించండి
 15. (నారదమహర్షి బాలప్రహ్లాదునితో)
  రావోయీ!పసివాడ!దానవకులా
  రాధ్యుండ!ప్రహ్లాదుడా!
  నావాక్కుల్ మదినిల్పి సంతతము నా
  నారీతులన్ శ్రీహరిన్;
  జీవాధారు;జగద్గురున్;వికచరా
  జీవాక్షు;సంసేవనా
  జీవాకాంక్షలు ముక్తికారకములై
  జేజేల మెప్పొందెడిన్.
  (జీవాధారుడు -ప్రాణాధారుడు;సంసేవనాజీవాకాంక్షలు-బాగా ఆరాధిస్తూ బ్రతకాలనే కోరికలు;
  జేజేలు-దేవతలు)

  రిప్లయితొలగించండి
 16. డా.పిట్టా సత్యనారాయణ
  లేవా యోగము నాచరించి మనమున్ లిప్తన్ పరబ్రహ్మమున్
  భావాతీతుడవయ్యి చేరగలుగన్ భాసించు మోక్షమ్మునన్
  నీవే బొందిని గాలి లోన గలుపన్ నింపాదిగా లేపగా
  కావే శోధన లెన్నొ శాస్త్ర చయముల్ గైకొన్న వీవేళలన్
  జీవాకాంక్షలు ముక్తి కారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి


 17. జీవన తరంగముల, రా
  జీవా రఘురామ యంచు, శీఘ్రము దాటన్,
  నీవే శరణని వేడన్,
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. పావన నామస్మరణము
  నేవేళను మరువకుండ నెంతయు బ్రీతిన్
  సేవలకు గడగి వదలుము
  జీవా కాంక్షలు పరమును జేకూర్చునులే

  రిప్లయితొలగించండి


 19. రావణ! చెర విడు సీతను
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
  నీ వనుట తప్పు ! రాముం
  డావల సంద్రమ్ము దాటడా హత మార్చన్ ?


  జిలేబి

  రిప్లయితొలగించండి


 20. త్రోవయు లక్ష్యంబతడే
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
  నావల కలడతడు సుమా
  నీ విలలో గట్టి బతుకు నీడ్వ జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. ఆవారపారము కడచ
  నావ యొకటి వలయు నటులె నా బతుకునకై
  జీవము వరలంగ వలయు
  జీవా కాంక్షలు, పరమునుఁ జేకూర్చునులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 22. నీవే దిక్కిక రామా
  యీ వాహిని దాటగా నొకింత బలిమికై
  సేవా సదనమ్మున రా
  జీవా! కాంక్షలు, పరమునుఁ జేకూర్చునులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. దేవుని ధ్యానమున బ్రతుకు
  నావను నడుపుచు సుఖముల ననురతి లేకన్
  సేవా తత్పరతయు రా
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే

  రిప్లయితొలగించండి


 24. ఓ వరలెడు పరలోకపు
  నా వప్రుడ! ఓ దయాళు ! నాప్రాణము నీ
  వే! వరముగ హలెలూయా!
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


  ఆమెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. తే విరులను పైటేలకు
  ఆవసతి దొసగు లనుభవ మాలోకించన్
  బావా వివాహ బంధము
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!

  పైటేల=evening; ఆవసతి=midnight
  దొసగు = అనుబంధము.

  రిప్లయితొలగించండి


 26. జీవంబిచ్చిన వాడవు
  నీవే! ప్రభు! కోరికలకు నీవే వైనం
  బై వెలసినాడవు! కనుక
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 27. మావా! మనువాడుమురా!
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
  రా! వనితను నే వరుడవు
  నీవు ధ్రువమ్ములు కలువగ నిక్కము సుఖముల్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 28. నీ వాడగు కొండలపై
  కోవెల లో వెలసినట్టి కొంగుపసిడి యా
  శ్రీవారిని చూచుటకై
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 29. ఆవల కలడని చెప్పుదు
  రే, వాడు కలడని నమ్ము!; రేయింబవలున్
  కోవెల ముంగట నిలువకు!
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 30. శంకరాభరణము :)


  నీ వార్ధక్యపు పయనము
  లో విదురుల సభ జిలేబులొసగు బతుకులో
  లావాపొంగుల వలె నీ
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


  జిలేబి

  శతకము వ్రాయనా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

  గు రు భ్యో న మః

  Gmail లో వెళ్ళడం లేదు . దయచేసి నా సమస్య

  శంకరాభరణంలో ఇవ్వ మని ప్రార్థన

  -------------------------------------------------------------------------------

  స మ స్య By. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,  చేప గాలము వేయగా జిక్కె మొసలి

  లే దా

  చేప గాలము వేసినంతనె చిక్కి చచ్చెను గ్రాహమే

  రిప్లయితొలగించండి
 32. శార్దూలవిక్రీడితము
  కైవల్యంబును జేర భాగవతమన్ గావ్యమ్మునే గూర్చుచున్
  దైవంబున్ మదిఁదల్చి కాసులకునై తాపమ్మునిర్జించుచున్
  రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించ మంచెంచెడున్
  జీవాకాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి
 33. కావగ రమ్మని కోర్కెల
  రావామముబ్రోవనీవు రంజిలజేయన్!
  పావనమూర్తివి గద, రా
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!!

  రిప్లయితొలగించండి
 34. రిప్లయిలు
  1. ఆవల నెఱుఁగని భవ పా
   రావారము దాట నెంచు రమ్యముగ మహా
   దేవ పద ద్వయ సేవల
   జీవా! కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే


   భావాభావ పరంప రావృతము దంభవ్రాత సంజాతమే
   దావాగ్న్యాభ సుఘోర దుఃఖచయ సంస్థానంబ సంసారమే
   నీవే దిక్కని దేవదేవుని మదిన్నిత్యంపు వాసార్థమౌ
   జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి


 35. గోవిందా కృతిని జిలే
  బీ విభుడే సర్వమమ్మ భీతిల కమ్మా
  జీవితములో సమాశ్రయ
  జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 36. ఏవారుచెప్పిరిటులుగ
  జీవాకాంక్షలుపరమునుజేకూర్చునులే
  జీవాకాంక్షలుపరమును
  దావేరునుజేయుసుమ్ముదాపసికైనన్

  రిప్లయితొలగించండి
 37. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  హోం లోన్ మోక్షం:

  లావొక్కింతయు లేదు; పైకము విలోలంబయ్యె; బ్రాణంబులున్
  ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
  నీవేతప్ప నితఃపరం బెఱుఁగరా! నీచుండనన్ గావుమన్
  జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి
 38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 39. భావాతీత గుణాత్మకుండు హరినా వైకుంఠునే గొల్చుచున్
  భావాభావ విరక్తులై పరమునే భాగ్యంబుగా గోరుచున్
  సేవా భావ నిమగ్న మానసుల కాశీర్వాదమై యొప్పు రా
  జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

  రిప్లయితొలగించండి
 40. ఏవో నోములు గొప్పవౌ వ్రతము లింకే పూజలో మ్రొక్కులో
  కావే దారులు ముక్తి కాంత దరికిం గాంతా! జనన్ వింటివే
  రావే యీశ్వరి కావవే యన నహోరాత్రంబు లాధ్యాత్మికో
  జ్జీవాకాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు

   తొలగించండి

  2. చాన్నాళ్ళ తరువాయి మిస్సన్న గారి దర్శనము !
   కుశలమేనా ? ఆర్బీయై గవర్నర్ గారికి జీతాలూ అందుతున్నాయా :)   జిలేబి

   తొలగించండి
 41. కందం
  నీవే సీతను వెదకియు
  నీవే లక్ష్మణుని గాచు నేర్పరి వగుచున్
  సేవల రాముఁ గొలుచ సం
  జీవా! కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే

  రిప్లయితొలగించండి