13, జూన్ 2019, గురువారం

సమస్య - 3046 (మాధుర్యమ్మది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ"
(లేదా...)
"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో చేపూరి శ్రీరామారావు గారి సమస్య)

54 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    సాధింపన్ దగు కైపదమ్మునగు భల్ శార్దూల పాదమ్మునున్
    బాధల్ దీర్చుచు పద్యమల్లును గదా బంగారు శబ్దాలతో
    వేధింపన్ తగదయ్యనిట్టు లనుచున్ వెర్రోడ! ఎవ్విధిన్
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. ఇదేదో సరదా కోసం వ్రాసిన అల్లాటప్పా పద్యం ఎంతమాత్రం కాదు. అభినందనలు.
      మూడవ పాదం చివర గణదోషం. "వెర్రోడ! యే రీతిగన్" అనండి.

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    ఒక పెద్దాయన మద్దూరి వారితో ఇలా అంటున్నారు 👇

    బాధల్ హెచ్చెనొ ? లేక బాధ్యతలిలన్ బంధమ్ములై తోచెనో ?
    గాధల్ నేర్వని జాడ్యమో? పలుకులన్ కన్పింపవేలా ? లస...
    ద్రాధాకృష్ణుల ప్రేమ , ప్రాకృతికసౌందర్యమ్ము , లీరోజులన్
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి ! పద్యమ్ములన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. సాధన చేయుచు ముదముగ
    రాధా మాధవు కధలను రసరమ్య ముగా
    బాధను మరువగ యెడదను
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాధా మాధవుల కథలు రసరమ్యముగా... మరువగ నెడదను...' అనండి.

      తొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    సాధకు నెన్నరు శ్రోతలు
    బాధలబడి పృచ్ఛకుండు పరచు సమస్యా
    రాధన జేసిన బ్రతికృతి
    *మాధుర్యము తగ్గె నేమి మద్దూరి కవీ!*

    రిప్లయితొలగించండి
  5. సాధర్మ్యమ్మును లెస్సగా నిలుపు నా
    సర్వోన్నతాలంకృతుల్;
    మోదమ్మున్ సమకూర్చు శ్రోతలకు నా
    ముగ్ధత్వముద్రాసుధా
    మాధుర్యమ్మది;తగ్గిపోయెను గదా
    మద్దూరి పద్యమ్ములన్
    సాదాసీదపు శబ్దసంపుటులు ని
    ష్కర్షన్ విలోకించినన్.

    రిప్లయితొలగించండి
  6. బాధ ల నే సుడి గుండము
    మేధా వులనైన మార్చు మేదినిఁ యందు న్
    శోధన లో తడ బడి తి వ
    మాధుర్యము తగ్గేనేమి మద్దూరి కవీ ?

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    *నే ధుర్యుండను పత్రికా చయమునన్ నిక్కంబుగా నిల్పగా
    సాధింతున్ పలుగాథ(news coverage)లివ్వమని వేసారన్ విలేకాళి కౌ
    బాధ్యుల్ వే వచనాల గేయమములనే వాంఛింప బ్రోత్సాహముల్;
    మాధుర్యమ్మది తగ్గి పోయెను గదా మద్దూరి!పద్యమ్ములన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఆ ర్యా,ధన్యవాదాలు, బాధల్...గా సవరణ

      తొలగించండి
  8. .కందము
    రాధా క్రృష్ణుల రసమయ
    గాథల రచియించి కవుల కర్ణామృతమై
    మోదంబును గూర్చు నెటుల
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  9. శార్దూల విక్రీడితము

    మేధాశక్తిని పద్యకావ్యములలో మీదుండి యల్లారునే!
    బాధల్ దీరగ సాధనమ్ము విడెనా? భావంబు క్షీణించెనా?
    క్రోధా క్రాంతుడవన్ పదమ్ముల సుతుల్ గోరంత లోపించెనా?
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్!!

    రిప్లయితొలగించండి

  10. సవరణ:గూర్చు నెటుల- గూర్తువెటుల

    రిప్లయితొలగించండి
  11. క్రోధంబే టికిపూర్వ జన్మ ఫలమౌ గోపాలు లీలల్ గనన్
    మోదంబం దునగాన మాధురుల సమ్మోదం బుగా మైకమున్
    సాధించం గనుబాదలన్ మరచి యాశాపాశ ముల్వీ డినన్
    మాధుర్యమ్మది తగ్గిపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  12. ఆధునికమ్మని జెప్పుచు
    సాధన జేయగ ఫలితము చక్కగ లేదే
    రాధా కృష్ణుల కావ్యపు
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాధమ్యంబగు జీవితమ్మునను సంబంధమ్ములే బంధమౌ
      నాధారంబుగ నిల్చి సాధనము దా సాగింప లేకుండెనో
      మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్
      సాధించున్ దన పూర్వ వైభవములన్ సంభావ్యమౌ బూనికన్

      తొలగించండి
    2. హా ధన్యంబగు నాదు జన్మ యని నే యత్నంబుగా బూనికన్
      ప్రాధాన్యంబిడి యభ్యసించినను నా వల్లించు పద్యమ్ములన్
      మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా; మద్దూరి పద్యమ్ములన్
      మాధుర్యమ్మది యొల్కుచుండును సదా మాక్షీక సారమ్ముగా

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. అంధుండొక్కడు శుధ్ధ పౌర్ణిమన నేడయ్యో యమావాస్యనెన్
      శోధింపన్త్ గడుభారమైయొకడహో శూన్యంబనెన్ సర్వమున్
      వేధింపన్ సభలో ననున్ బధిరుడవ్విధమ్మె నాతోననెన్
      "మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"

      తొలగించండి
    2. మేధావులైరి కవులిల
      ప్రాధాన్యత తగ్గె శబ్ద రాశికి, నిపుడా
      రాధన కనరాదు "కవన
      మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ?"

      తొలగించండి
  14. 🙏శ్రీ గురుభ్యోన్నమః
    అజ్ఞులకు విజ్ఞుల విద్యల విలువ తెలియదు.

    వీధిబడుల జదివిన వి
    ద్యాధరు కవితా వధూటిఁ దా తోడుండన్!
    శోధన యెరుగని వాడన
    మాధుర్యము దగ్గెనేమి మద్దూరు కవీ?

    రిప్లయితొలగించండి
  15. వీధికి వీధికి నొకడై
    సాధువసాధువు లెరుగక సాగగ కవులై
    సాధనలేమిని కైతల
    మాధుర్యము తగ్గె,నేమి మద్దూరికవీ!!

    ఏమి = ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    [ఎప్పుడూ మాధుర్యాది గుణాలతో విలసిల్లే మద్దూరి వారి కృతులను పఠించి మురిసిపోయే పాఠకులు, వారి కరుణ రస ప్రధానమైన యొక కృతిని పఠించిన పిదప, తమలో తాము చర్చించుకొంటున్న సందర్భము]

    క్రోధాత్ముల్ వృజినుల్ నికృష్ట విగుణుల్ గ్రూరంపు దౌర్జన్యముల్
    క్రోధానన్ దగఁ జేయఁ, సర్వ జనులున్ గుందంగఁ, దాఁ జూచి, వే
    బాధాతప్తజనప్రవాహఝరిఁ గావ్యమ్మందు బంధింపఁగా,
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా, మద్దూరి పద్యమ్ములన్!

    రిప్లయితొలగించండి
  17. అవధానములు చేసి చేసి అలసిపోయి స్వగ్రామము నకు చేరిన కవిని గాంచి మీ మెదడు పై ప్రస్తుతము బరువు తగ్గినది(అవధానములు చేయునపుడు మెదడు తీవ్ర ఒత్తిడి కి లోను అగును గదా ) కొంతకాలము మీరు ధారణమునకు విశ్రాంతి ఇవ్వమని సతి కోరు సందర్భము
    ధుర్యము బరువు మోయుట


    మేధ తెలుపగన్ మా తర
    మా,ధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ,
    మీ ధారణమునకున్ ప్ర
    సాదించుము విరతిననుచు సతి యనె నపుడున్

    రిప్లయితొలగించండి
  18. బాధలపడితిరె?యార్యులు
    సాధనలోపించెనేమి?సత్కవివర్యా!
    గాధలరచనలయందున
    మాధుర్యముతగ్గెనేమిమద్దూరికవీ!

    రిప్లయితొలగించండి


  19. ఆధారు కార్డు లేకన్
    మాధుర్యము తగ్గెనేమి? మద్దూరి కవీ
    శా! ధన్యుడవీ వయ్యా
    రాధనమున్ జేర్చినావు రసికుల మదిలోన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. రాధామాధవ ప్రణయము
    కాదా మధురమ్ము కవులకావ్యమ్ములలో
    బాధాకరమదియేలనొ
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ!

    రిప్లయితొలగించండి
  21. బాధపడ నేల నీదగు
    గాధం బది యేమి నీదు గాత్రము నందున్,
    వేధించెనా జలమ్మిట,
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ


    రాధా లోలుని వేణు గానమున నౌరా నిల్చె జీవాళియే
    యీ ధీమంతుని ప్రాభవ మ్మరయ దీటే చుమ్మి యద్దానికిన్
    సాధించెం గవి నిల్పి వేయఁగ నిరుత్సాహంపు జాడ్యమ్మునన్
    మా ధుర్య మ్మది తగ్గి పోయెను గదా మద్దూరి పద్యమ్ములన్
    [మా ధుర్యము = మా యెద్దు ]

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బాధల్ పెట్టగ నెంచి గంధమునుభల్ పట్టించి దేహమ్మునన్
    రాధస్సున్ కడు మేసి వచ్చితివిరా రంగమ్మునన్ జేరుచున్
    మేధావుల్ గల వేదికందునను ఛీ! మెప్పొందగన్ పల్కితే:👇
    "మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"

    రిప్లయితొలగించండి


  23. ఆధారంబయె రాజశేఖరుడె! సన్మానంబు లన్ పొందకన్
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా! మద్దూరి పద్యమ్ములన్
    ప్రాధాన్యంబుగ చేసి మా జగనుడే ప్రాముఖ్యడంచున్ ధృతిన్
    మీ ధారాళపు శైలి తోడు పలుకన్ మించారు మా రెడ్డి యే :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. సాధువగు కైతలు చదువ
    గాధయు నుత్సాహమును గలిగించితిరే !
    శోధన జరుపగ నిప్పుడు
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ !

    రిప్లయితొలగించండి
  25. శోధించగ గనబడదే!
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరికవీ?
    ఆధారమెచటగలదో
    ప్రాధాన్యత నెచటలేదు పండితులారా?

    రిప్లయితొలగించండి
  26. *కవిగారి సలహాపై యనాధను పెండ్లాడిన భార్యాబాధితుడు కవితో తనబాధను చెప్పుకుంటున్నట్లుగా నూహించిన పద్యము....*


    ఆధారములేనిదని య
    నాధ యనుచుఁ బెండ్లియాడ, నారియె యిపుడున్
    వేధించుచుండె బ్రతుకున
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ.

    రిప్లయితొలగించండి
  27. బాధాతప్తపు గాథ, త్రాగి చనియెన్ బాల్రాజు హోటల్లు సో
    డా ధారల్ కడు శీతలమ్ములవి, కంఠంబంత పట్టెన్ కటా!
    యాదేయమ్మిదె! శ్రోతలెంచెదరిటుల్ యష్టావధానమ్మునన్
    మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్ ౹౹

    రిప్లయితొలగించండి
  28. ఆధారు కార్డు పైనొక
    మాధుర్యము గ్రోల పద్దెమలరగ జేయన్
    ప్రాధాన్యత గల కవితల
    "మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ!!

    రిప్లయితొలగించండి
  29. గాధల్ పెక్కుగ వ్రాసినాను మరి యాకావ్యాలలో గాంచగన్
    రాధామాధవ ప్రేమలీలను నే రమ్యంబుగా వ్రాసినన్
    మాధుర్యమ్మది తగ్గిపోయెను గదా మద్దూరి, పద్యమ్ములన్
    క్రోధంబించుక మాని దిద్దుమనుచున్ కోరంగ నే వచ్చితిన్.

    రిప్లయితొలగించండి
  30. సాధన చేయుచు ముదముగ
    రాధా మాధవుల కధలు రసరమ్య ముగా
    బాధను మరువగ నెడదను
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ

    రిప్లయితొలగించండి
  31. మాధుర్యముమాధవనుతి
    మాధుర్యమునామభజన మాధవుకథలన్
    మాధుర్యము నిహపుస్పృహ
    *"మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ"*

    రిప్లయితొలగించండి
  32. మాధుర్యమ్మిడు నక్షరావృతము మాధుర్యభావంబులున్
    మాధుర్యాపము లక్షణాభిదలు సొంపౌభూషలౌవ్యంగ్యముల్
    మాధుర్యంబన మాధవార్చనలు
    సమ్యగ్సాధనానందమే
    *"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"*

    రిప్లయితొలగించండి


  33. వేదాధ్యయనము చేయుచు
    మాధవు నహరహము గొలుచు మాన్యుడ వీవే
    వేదికపై మీ గళమున
    మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ.

    రిప్లయితొలగించండి