ప్రభాకర శాస్త్రి గారూ, బొంబాయి ప్రేలుళ్ళ నిందితుడికి జైలులో అందిన రాజభోగాల గురించి పేపర్లలో చదివి ఉన్నాము. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'జిహాదు లెల్ల రిచటన్' అనండి.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఒక ఖైదీ మరొక ఖైదీతో మాట్లాడుతున్నాడు: "ఏరా!నేటికి చేరినారము గదా!ఈ తావుకున్,నేటి పై తారాపీడన,బంధుబాధ,వెతలున్,తాపంబులున్ లేవుగా! పారావారము బోలు రక్షకభటుల్,ప్రాకారముల్ జూడగా, కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబున్నదేయొండెడన్!"
వారక నిరంతరము సం చారమ్మును జేయ నేల చపలా స్వపరీ వార గణ నిజ జనక ధి క్కారా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్
ధారా వాహిని గంగ భాసిలఁగ మూర్ధం బందు నానార్థ లీ లా రావమ్ములు పర్వ నుండ గిరిఁ గైలాసస్థిరావాసి క ట్టా రే రాజు వెలుంగుచో మునులు వీడం జాలు వారే భువిం గా రాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
[1. కారు +ఆగారము; ఆగారము = ఇల్లు; 2. కారాగారము = మంచు కొండ యిల్లు; కార = మంచు కొండ]
భారము బ్రతుకుట నేడిల
రిప్లయితొలగించండిసారము లేనట్టి విద్య సరసపు ధరకై
కోరిన హాయిగ నుండుట
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం అన్వయం కుదరనట్టుంది.
భారము బ్రతుకుట నేడిల
తొలగించండిసారము లేనట్టి భుక్తి సరసపు ధరకై
కోరిన హాయిగ నుండుట
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిSreenagar Central Jail:
పోరాటమ్మున సైని కోత్తములతో పొంకమ్మునన్ జేరుచున్
ధారాళంపు జిహాదు లెల్లరిటనున్ ధైర్యంబుగా కూడగా
"వీరాగ్రేసరు" లెల్ల చేరి విధిగా బిర్యాని మెక్కంగ నీ
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
https://www.thequint.com/amp/story/news%2Findia%2Fradicalisation-of-youth-mobile-phone-use-in-central-jail-srinagar
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబొంబాయి ప్రేలుళ్ళ నిందితుడికి జైలులో అందిన రాజభోగాల గురించి పేపర్లలో చదివి ఉన్నాము. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'జిహాదు లెల్ల రిచటన్' అనండి.
🙏
తొలగించండి*ఒక ఖైది తనలో తాననుకునే మాట....*
తొలగించండిదారా సుత పోషణ కొర
కారాటమె యుండదిచట యాహారముకై
పోరాటముండ దయ్యెను
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆహారమునకై' అనడం సాధువు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిదారాపుత్రుల వినిమయ
సారమ్మును దరచి చూడ సరసుడవైనన్
పోరే రచనల ప్రచురణ
కారాగృహ సుఖము దప్ప కలదే బయటన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపోరే గొప్పది దేశమాతకయి నా భూమీశులన్ గాదనన్
రారే జైళ్ళను నింప నొంటరులునై రాజిల్లరే నేతలై
పారే బల్లుల ప్రేమ లీల గనెనా పండిట్జవాహర్ భళా!(*నైనిటాల్ జైలులో..Discovery of India...Nehru*)
కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబున్నదే యొండెడన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరారా! సరసకు రారా!
ధారాళమ్ముగ మదియు నిదానము గనురా
ఈ రాత్రికి నే నంగర
కా, రా, గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
ఇవ్వాళ యేమగునో ;)
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నే నంగరకా'?
తొలగించండిజీపీయెస్ వారే నే నంగరకా ని విడగొట్ట సమర్థులు :)
జిలేబి
???
తొలగించండిఅంగరకా : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
హిం. వి.
పైన ధరించు చొక్కాయి.
లేరీలోకమునందున
రిప్లయితొలగించండిదారాసుతబంధువితతి, దయతోచూడన్
రారెవ్వరునాకొరకై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిధారాళమ్ముగ తేలెదమ్మధర సంధానమ్ము లేకైపుగా
రారా! రా మగడా! విలాసమిది హేరాళమ్ముగా వేచెరా
పోరాటమ్ములవేల నాథ! దరి రా! పొన్నంగితోచేరగా
కారాగారమునందు, లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తేలెదము + అధర = తేలెద మధర...' అవుతుంది. "తేలగా నధర..." అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారాగృహ సుఖశాంతులు
రిప్లయితొలగించండిజేరియు శశికళను నడుగ?జెప్పగ వినగా
నౌరా!"సంసారములో
కారాగృహసుఖముదక్కు"!గలదేబయటన్?
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సార విహీనంబాయెను
రిప్లయితొలగించండినారాయణ నాదు జీవనంబు, తొలగు నా
ఘోరాపదలు వెడ మధుర
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపోరుల చేసెదము ప్రభుత
తో! రువ్వెదమోయి రాళ్ల తోటి జనుల పై
నేరమునకు పట్టుబడగ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేరి నిగమశర్మను గని
రిప్లయితొలగించండియౌరా యని యన్న దక్క యమ్మను నాన్నన్
దారను గను నీ వారలు
కారా గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
మిస్సన్న గారూ,
తొలగించండిఅద్భుతమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండి
రిప్లయితొలగించండిసోరణి దివ్వెల కాంతిని
పారాణియు కాళ్ళ కద్ది పడుచుతనముతో
నీ రాణియె వేచెను నీ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరాటము లేని దగుచు
రిప్లయితొలగించండిదారా సుత పోషణ మనుతగులము లేకన్
పోరాములకు లభించెడు
కారాగార సుఖమ. దక్క గలదే బయటన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(గోల్కొండ చెరసాలలో నుండి గోపన్న భార్య కమలకు వ్రాసిన లేఖలో ...)
రిప్లయితొలగించండిశ్రీరామాంచితపాదపద్మయుగళ
శ్రీపద్మమై యుండెదన్;
నారామా!కమలా!విచార మికనై
నన్ మానుమా!నా కిటన్
నోరారన్ విభుకీర్తనల్,శతకమున్
నూత్నమ్ముగా వ్రాయగన్
కారాగారమునందు లభ్యమగు సౌ
ఖ్యం బున్నదే యొండెడన్?
(నారామా-నాకాంతా;శతకము-దాశరథీశతకము)
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండినారాయణమంత్ర జపము
పారాయణములను చేయ భగవద్గీతా
చేరితి బందీగా ! ఈ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భగవద్గీతన్' అనండి.
రిప్లయితొలగించండిహేరాళము సతినే నా
ధారమ్ముగ నొడయురాలు తను బంధింపన్
ప్రేరణ తోడై యుండెడు
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారమగు చుండెనిక నా
రిప్లయితొలగించండిహారము దొరకదు వసించ నావా సము చే
కూరదరయంగ తోచున్
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🏼జైశ్రీమన్నారాయణ
రిప్లయితొలగించండిఆర్యులకుశుభోదయమ్
శంకరాభరణ సమస్య.
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబున్నదే యొండెడన్?
నా పూరణ.
శ్రీరామామృత పాన మత్త మహితున్ శ్రీ రామదాసున్ బృహత్
కారాగారమునందునుంచిరయినన్ గాంక్షన్ హరిన్ గొల్చుచున్
శ్రీరామాక్షయ దీప్తిఁ గాంచి తనిసెన్. జీవాత్మ బ్రహ్మైక్యతన్
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబున్నదే యొండెడన్?
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపేరున్ బెట్టితి తండ్రిగారిదెపుడేన్ బిల్వంగ నీవెంచితో
నోరారన్ పని యొత్తిడింబడుచు ? నిన్ ముద్దాడ వాడెంచువా
డౌరా ! బాలల బిల్చి యాడ మురిపెంబానందసద్ధేతువుల్
కారా ?! *గారము* నందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్ ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండినే రమ్మంటిని పొందు పొందుటకిదే నేరమ్మొకో ! వేదధీ...
తొలగించండిసారా ! సారసనేత్ర ధాత్రి సుఖకాసారమ్మురా ! రమ్మురా !
వారింపందగునా ! వరూధినినిరా ! వామా
పరీరంభమన్
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబున్నదే యొండెడన్ ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమారణహోమము చేతుము
కారణమేమియు వలదు ఫికరికన్ లేదోయ్
పారేరక్తము తోడై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హోమ మొనర్తుము' అనండి. 'చేతుము' అన్నది సాధు ప్రయోగం కాదని పెద్దలన్నారు.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఒక ఖైదీ మరొక ఖైదీతో మాట్లాడుతున్నాడు:
రిప్లయితొలగించండి"ఏరా!నేటికి చేరినారము గదా!ఈ తావుకున్,నేటి పై
తారాపీడన,బంధుబాధ,వెతలున్,తాపంబులున్ లేవుగా!
పారావారము బోలు రక్షకభటుల్,ప్రాకారముల్ జూడగా,
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబున్నదేయొండెడన్!"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తావునకున్' అన్నది సాధురూపం. అక్కడ "తావునన్" అనండి.
అంత నాధునికాంగ్లతెలుంగునౌపోసన బట్టిన నొక తుంటరి వాఁడిట్లనియె..
రిప్లయితొలగించండిసారీ యెందుకు రా! యీ
మేరేజీ మట్టిగడ్డ మేలెట్లగురా!
నేరాలను జేసి పదర!
"కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేరము జేసిన వారికి
రిప్లయితొలగించండికారాగృహ సుఖము దక్క, గలదే బయటన్
వేరగు ఫల మేదైనను
వారలకా పాప భయము వదలదు సుమ్మా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[మధురానగరానికి వెడలి, తిరిగిరాని శ్రీకృష్ణునికై వేచి వేచి యొక గోపిక విరహంతో పలవరించు సందర్భము]
"రారా నా మొర నాలకించి! యిఁక నన్ రక్షించి, నీ కౌఁగిలిన్
జేరం జేసియు, సౌఖ్యమిమ్ము హరి! నా జీవమ్ము నీవే కదా!
మారా, నా పరమాత్మ వీవె, సుర సమ్మాన్యా! ప్రియాశ్లేష మన్
గారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?"
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండివేరొక్క మాట వలదోయ్
ఈ రేయి జిలేబి నీ కయిని బందీగా
నే రవుతు నయ్యెద నెలతు
కా! రా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభార్యా పిల్లలతో విసిగిన ఓ జైలర్ ఉవాచ..
రిప్లయితొలగించండిచేరంగానిలు భార్య కోరునకటా చీరల్ నగల్ చిత్రముల్
పోరంబోకులు పిల్లలైరిగద హా!పోగాల మాసన్నమై
నేరస్థుల్ కడు బుద్ధిమంతులిల మన్నించేరు నామాటలన్
*కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ రామాంకితమంచు హారములతో సేవించ భద్రాద్రిలో
రిప్లయితొలగించండినేరంబంచును త్రోసినారు నిను తానీషాదులే జైలులో
పూరింపంబడె రామనామ సుధలే భోగ్యమ్ము గోపన్నరో
*కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినేరక పోతిని మనువా
డా! రాక్షసి గడ గడా పెడపెడాల్మనుచున్
పోరాడుచు దరి రాద
క్కా! "రాగృహ" సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనువాడా' అన్నది సాధురూపం కాదు.
ధీరోదాత్తత కృష్ణుడు
రిప్లయితొలగించండికారుణ్యము లేని మామ కంసుని యాజ్ఞన్
తోరముగా వహియించెను
కారాగృహ సుఖము;దక్కగలదే బయటన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిశ్రీగురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండికౌరవ సేనను దలపుచు
క్రూరులు దేశమున దూరి ఘోరము సలపన్
భారత రాజ్యాంగమ్మున
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
నీరవ్ మోదీ తన బం
గారవ్యాపారమునకుc గారణ మనుచున్
భారత ఖండము ముంచగ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
ఘోరము కాదట లల్లుకు
భారత రాజ్యాంగమందు భరణము బుక్కన్,
తీరి తిని గూర్చునుటకును
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
భరణము - గడ్డి
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'బంగార వ్యాపారము' దుష్ట సమాసం. "భృంగార వ్యాపారము" అనండి.
🙏 సరి జేసికొందును.
తొలగించండిధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ రేతిరి బందీనవు
తా! రాణీ రావె సరసి తామసమేలా!
పోరాడను! పెమిమిటి కై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
రిప్లయితొలగించండిఏరా! మగడా! మోజే?
కోరెద వా ప్రణయమున్ ప్రకోపమ్ములతో?
ప్రేరణకై యీ టాటా
కారా? గృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఏరా! మళ్ళీ వచ్చితి
రిప్లయితొలగించండివేరా! యనగన్ దొరకవు యేరీతిగనన్
పోరుట తప్పదు మాకిక
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!!
*** మళ్ళీ మళ్ళీ వచ్చే దొంగకు జైలరుకు మధ్య సంవాదం..!
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిఓర గనుల బులిపించుచు
రిప్లయితొలగించండిపేరిణి జార్చుచుఁ బిలిచెడి పెక్కుస్త్రీలన్
గోరకు రోగా ల్పాలును
కారా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పెక్కగు స్త్రీలన్" అనండి.
🙏 సరి జేసికొందును. ధన్యవాదములు.
తొలగించండిచీరను ధరించి చక్కగ
రిప్లయితొలగించండిచేరిదరికి ప్రీతితోడ చెన్నగు యిక్కన్
పోరిబిగి కౌగిలియొసఁగు
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిఆరాటబడుటయుండదు
రిప్లయితొలగించండితీరికగాజీవనమ్ముదీరునునెపుడున్
నోరాజానుడువుమయీ
కారాగృహసుఖముదక్కగలదేబయతన్
బయటగాచదువప్రార్ధితుడను
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"దీరును నిరతం । బో రాజా..." అనండి.
రిప్లయితొలగించండిఓ రత్తాలూ! యేమే
ఆ రాంబాబు మనవారు గారా ? యేలన్
పేరెత్తవు సుమ్మీ ? తా
కారా? గృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
రిప్లయితొలగించండి....కందము
దారా సుత సంరక్షణ
భారమె యీనాడం ధరల ప్రొబల్యము నం
దారయ చింతల వలయమె
కారా గృహ సుఖము దక్క గలదే బయటన్
.ఆకుల శివరాజలింగం వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...యీనాడు' టైపాటు.
వారక నిరంతరము సం
రిప్లయితొలగించండిచారమ్మును జేయ నేల చపలా స్వపరీ
వార గణ నిజ జనక ధి
క్కారా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్
ధారా వాహిని గంగ భాసిలఁగ మూర్ధం బందు నానార్థ లీ
లా రావమ్ములు పర్వ నుండ గిరిఁ గైలాసస్థిరావాసి క
ట్టా రే రాజు వెలుంగుచో మునులు వీడం జాలు వారే భువిం
గా రాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
[1. కారు +ఆగారము; ఆగారము = ఇల్లు;
2. కారాగారము = మంచు కొండ యిల్లు; కార = మంచు కొండ]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణలు:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
వేరే వ్యాపక మెద్దిలేక నొకచో వీసంపు కందమ్ముతో
చేరంగానిట శంకరాభరణమున్ చేతమ్ము రంజిల్లుచున్
పోరున్ జేసియు వీడ జాలనిదియౌ పొన్నారి పింజ్రీని బోల్
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
పింజ్రీ = పంజరము
***************************
GP Sastry (21) @
IIT Kharagpur 1965:👇
లేరే బాంధవులీ యరణ్యముననున్ లెక్కింపగా నొక్కడున్
తీరుల్ తెన్నులు లేని తిండ్లిచటఛీ! తియ్యందనాలన్నిటన్...
పోరాటమ్మవ వేన వేల ఘనమౌ పొత్తంపు దొంతర్లతో
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
**************************
Nehru in Naini Central Prison:
పోరాటమ్మున బానిసత్వ ముడుగన్ పోలీసులే నెట్టగా
శూరత్వమ్మున చిన్న కూతుకిట నే చొక్కంపు గ్రంథమ్ములన్
పారావారము మీఱు సంబరముతో వ్రాయంగ సంప్రీతినిన్
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్
తొలగించండిలేరే ఖర్గపురమ్మున
కారప్పూసలు, జిలేబి, కందపు బజ్జీల్
ప్రేరణ గా బంధువులు! శ
కారా ! గృహ సుఖము దక్కగలదే బయటన్?
జిలేబి
😊
తొలగించండిప్రభాకర శాస్త్రి గారి సరదా పూరణలు, జిలేబీ గారి కౌంటర్ పూరణ బాగున్నవి. ఇద్దరికీ అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహనీమూనుకు రానంటూ హఠం వేసుకున్న రాణీరాయ్ తో పెన్మిటి :)
పోరి! హనీమూనుకు రా!
కారప్పూసలు, జిలేబి, కందపు బజ్జీల్
ప్రేరణ గావింప నెలతు
కా! రా ! గృహ సుఖము దక్కగలదే, బయటన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృష్ణుడు రాధతో...
రిప్లయితొలగించండిఈ రాజ్యంబులు రాజులుం గలహ కేళీ తంత్రము ల్దౌత్యముల్
పోరాటంబులు బంధు మిత్ర గురు సంపూజ్యాది సంహారముల్
హే రాధా మననీయ కుండె నను శాంతి న్నీ సమాశ్లేషపుం
గారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్.
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారూ.
తొలగించండి౧.
రిప్లయితొలగించండిచీరను ధరించి చక్కగ
చేరిదరికి ప్రీతితోడ చెన్నగు యిక్కన్
పోరిబిగి కౌగిలియొసగు
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీరుల్గొందరు గన్ను బట్టిరి వృధా బీరమ్ములేలంచు స
రిప్లయితొలగించండిద్ధీరుల్గొందరు పెన్ను బట్టిరి కదా దేశాభిమానంబుతో
పోరాటంబునుసల్పిరప్డు సుజనుల్ బొక్కన్నిడెన్నాడెటుల్
*"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్"*
కారుల్గూసెడువారికి
రిప్లయితొలగించండికారలునాశ్రయమునగునె కన్నెలజెరచన్
కారలబెట్టిరి వీరికి
*"కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్*
ఆరాటంబిది జారచోరులకు నాహారంబు లభ్యంబగున్
రిప్లయితొలగించండిపోరాటంబదియుగ్రమూకలకు దివ్యోద్యానమౌకారలే
పోరాదెన్నడుసూరి సజ్జనులునమ్మో నేరమౌగూళకున్
*"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్"*
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిశ్రీరాముని కొలుచుచు తా
రిప్లయితొలగించండిచేరెను మదిలో వగవక శిక్షను పొంద
న్నారామదాసు తలచెను
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారిద్ర్యముతో బ్రతుకుచు
రిప్లయితొలగించండిసారము లేనట్టి కూర చారుల తోడన్
నీరస పడ కూడ దనిన
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
ఈ రమ్యంబగు శీత శైలములలో నేకాంతమే చిక్కెరా
రిప్లయితొలగించండిరారా మానవ సుందరాంగి పిలువన్ రాద్దాంతమున్ సేయకా
నీ రూపమ్మును బంధి సేసితిగదా నీకింక నాకౌగిలే
కారాగారము, నందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్.
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
దూరెద వేలర పబ్బుల
గారాముగ వలపుపంచు కాంతను గానా?
కూరిమి పంచుదు మదనా
కారా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
శార్దూలవిక్రీడితము
నీరాకన్ స్మరియించి ద్వారమున నేనిల్చుండ సాయంత్రమున్
మారామెంతయొ జేసి స్నేహితులతో మాటాడ గా బోదువే!
రారా దారను జేర కూరిమిని నిన్రంజింతురా! మోహనా
కారా! గారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?