28, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3061 (ఈప్సితముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్"
(లేదా...)
"ఈప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్"

62 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    అప్సుజ భాజపా విడిచి హైరన నొందకు మోరి మిత్రమా!
    అప్సర లెందరో గలరు హాయిని గూర్చగ పార్లమెంటులో!
    అప్సరు లందరున్ కలిసి హాయిని జెందుచు నిల్లుకూల్తురే!
    ఈప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!

    అప్సుజము = కమలము
    అప్సరులు = ఆఫీసరులు

    (ఆంధ్రభారతి నిఘంటువు)

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ సరదా పూరణతో చక్కగా బోణీ కొట్టారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అప్సర సలువలపు విసరి
    నీప్సి తార్ధంబు లీడేర్చ నింద్ర సభన్
    అప్సర లేమలు ముదముగ
    ఈప్సితములఁ దీర్చు వార లేకద చోరుల్

    రిప్లయితొలగించండి
  4. వానలో తడిసిన తెల్లని దుస్తులతో,కారు చీకటిలో,దారి తెలియక,తలనొప్పితో బాధపడుతూ,తన మిత్రునితో....

    'మాప్సు'ను 'గూగుల్'చూపదె!
    అప్సితములు దుస్తులయ్యె నౌరా!రారా!
    'కాప్సూలు'నిచ్చి కావుము--
    ఈప్సితములఁదీర్చువారలేకద చోరుల్

    బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా


    అప్+సితములు=తడిసిన,తెల్లనైన

    రిప్లయితొలగించండి


  5. పెప్సీ కోలా స్ప్రయిటుల
    తాప్సీ యధరామృతముగ స్థాపించి భళా
    లిప్సువులుగ మది తొరలిచి
    యీప్సితములఁ దీర్చు వారలే కద చోరుల్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    ఈ ప్సుడొ(pseudo)(సుడొ (p_silentనుతెలుగుఒప్పదు)అండ కొండ యన నెప్పటి నుండియొ నిల్వు దోపిడుల్
    కాప్సిక మంత మిర్చి యయి కాల్చడె నాల్కల, మ్రొక్కి రాగనే
    హోప్(hope) సితమాయె(తెల్లబోయె)నేలనొకొ హోరుగ దర్శనమంచు నేగరే
    ఈప్సిత దాతలై హితము నెంతయు కూర్తురు చోరు లెప్పుడున్!
    *ఏడు కొండల వాడా, గో..విందా!*

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    సాప్సుల(sops)నిత్తురు నేతలు
    మేప్సు(మేపులు)త మాదే యటంచు(మేపుకూడా )మిగులుల నూర్వన్
    మాప్సుత(mop,శుద్ధికట్ట కూడా)బిత్తర బోవున్
    ఈప్సితముల దీర్చు వారలే కద చోరుల్
    (ఈ నాడు ఆంగ్ల పదాలు తెలుగైన వైనములో పూరణకై మన్నించ ప్రార్థన)

    రిప్లయితొలగించండి
  8. అప్సరసాంపతిం గడచునట్టి ధనాఢ్యునిఁ బెండ్లియాడు నా
    లిప్సయె తీరెలే తుదకు లేమలు దొంగల భార్యలైరి, యా
    యప్సరలం గ్రమించు సతు లందరికిన్ ముదమందఁ జేయఁగా
    నీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    లిప్స జయించి , ద్రుంచి యవలీల మదమ్మును , చిత్తశుద్ధి గాం...
    గాప్సమమై రహింప, హృదయమ్మున భక్తిని గల్గియుండగా,
    నీప్సితచౌర్యమున్ విడిచి యిద్ధర మంచిగ మారి , యస్మదీ...
    యేప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. ఈప్సితములనీడేర్చగ
    అప్సరుల ప్రాపకమున నార్ద్రతబొందన్
    తప్సీలుగపేరొందిరి
    ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్!!

    --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

    *** రెండవ పాదం లో 'ల ' ను గురువు గా వేసితిని.సరిచూసి తెలుపగలరని కోరుతూ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈప్సితములనీడేర్చగ
      అప్సరసల ప్రాపకమున నార్ద్రతబొందన్
      తప్సీలుగపేరొందిరి
      ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్!!

      --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

      *** శంకరార్యుల సూచన తో సవరణ..!

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. గురుభ్యోన్నమః🙏

    లిప్సన వీప్సా ప్రేప్స జు
    గుప్సా హేతుఁ వుపలప్స గుర్తెరుగుముఁ నా
    లిప్సుడు విష్టు విరప్సీ
    ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్!

    లిప్స -నిముషం,కోరిక; వీప్స-ఒకటి వెంట నొకటి;
    జుగుప్స- రోత; ఉపలప్స -పొందు కోరిక;
    ఆలిప్స×లిప్స;
    విరప్సీ - వైవిధ్యమైన రమణీయ ప్రతిపాదక వాక్యాలు కలిగినది;
    చోర -గంధ ద్రవ్య విశేషణం,బాలుడు.

    (నాకిక వషట్కారాలేనా?) 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ భావం పూర్తిగా అవగాహన కాలేదనుకోండి. హేతువులో అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  13. డా. పిట్టా సత్యనారాయణ
    ఈప్సిత మేకలవ్యునకు నింపగు దోపకమాయె ద్రోణుచే
    నీప్సితమాయె శంకరుని నీడ్వగ మంటల రక్ష-భక్తుచే
    నీప్సితమాయె నా బలిని నెత్తిన దన్నగ వామనాఖ్యుచే
    ఈప్సిత దాతలై హితము నెంతయు కూర్తురు చోరు(హరు)లెప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. చిప్సుల కఱకఱ కొఱకుచు
    పెప్సీఁ ద్రావుచు తదుపరి పీడల పాలై
    లప్సీఁ బాల్పడ వ్యర్థులు
    ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్

    లప్సీ-ముసలితనం

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    ఈప్సిత మీడేరంగ న
    నీప్సిత గతి జెలగ వలయు నెరి నిల యోగం
    బీప్సిత హరణమె మోక్షము
    ఈప్సితముల దీర్చు వారలేగద చోరు(హరు)ల్

    రిప్లయితొలగించండి
  16. అప్సూ సేమున్న దిచట
    యప్సరస లవంటి చెలుల నక్రమ పరులౌ
    యప్సరుల చెంత కంపిన
    నీప్సితములఁ దీర్చువారలే కద, చోరుల్ .

    రిప్లయితొలగించండి


  17. అప్సరసల్ జిలేబులు విహారము చేయుచు ప్రేమ మీరగా
    తాప్సి తమన్న మాళవిక తాగిన డ్రింకని జోరు జోరుగా
    లిప్సువు లై ముదమ్ము జనులీ దినమే కొన గోరు రీతిగా
    యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. అప్సరస వంటి లలన న
    భీప్సితమంచు నొగలింప భీతిలు గాదే
    లిప్స యనంచు జుగుప్స న
    నీప్సితములఁ దీర్చువారలే కద చోరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్సుజ నేత్రుని పదముల
      భీప్సితమని జెప్పుచు ముని వేషములందున్
      అప్సరసల నాలిప్సుల
      కీప్సితములఁ దీర్చువారలే కద చోరుల్

      తొలగించండి
    2. అప్సుజ నేత్రు భక్తులగునా మునులందరి మేలు గోరుచున్
      ఈప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు; చోరు లెప్పుడున్
      అప్సర కాంత చిత్రముల నాశగ జూపుచు మోజు పెంచి యా
      లిప్సుల జేసి మోసముల రిక్తుల జేతురు ద్రోహ చింతనన్

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [చోరులు పరుల విషయమున దుష్టులైనప్పటికిని, స్వీయాభివృద్ధి విషయమున హితైషులై యుందురనుట]

    ప్రేప్సలఁ దేలుచున్, బ్రజకు వెక్కసమైన దురంతదుఃఖముల్
    వీప్సనుఁ గూర్చుచున్, మదికిఁ బ్రేరణ నిచ్చెడి దుష్టకృత్య ప్రా
    రిప్సకులై, సతమ్మమిత రేఫపుఁ జౌర్యపు వృత్తిఁ బూని, యా

    త్మేప్సిత దాతలై, హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!

    (ప్రేప్స=ఊహ; వీప్స=ఒకటి వెనుక నొకటి వ్యాపింప నిచ్ఛ; ఆరిప్స=ఆరంభింపవలెననెడి కోరిక; రేఫము=హేయము)

    రిప్లయితొలగించండి
  20. లిప్సుకు ర.చి నందించ.చు
    పెప్సీ ధరపెంచి జనుల విత్తము దోచన్
    తాప్సీ చిత్రము కనబడ
    నీప్సితము దీర్చు వారలె లేకద చోరుల్

    రిప్లయితొలగించండి
  21. లప్సీయందున గొమరులె
    యీప్సితములదీర్చువారలెకద,చోరుల్
    లిప్సంజొరబడియింటిని
    ప్రేప్సకులేనంతసరుకువేలుగదోచెన్

    రిప్లయితొలగించండి
  22. ద్రప్సము లలరెడు కలువల
    లిప్సుఁడు శశి మాన చిత్త లీలా హరుఁడే
    యప్సర లందఱు చోరులె
    యీప్సితములఁ దీర్చువారలే కద చోరుల్


    వీప్స చెలంగఁ గోరికలు వేడుచు నుండ నిరంతరమ్ము వి
    శ్వప్సుఁడు కోరు రీతిని నభస్పద సంతతి నెమ్మి మానినీ
    లిప్సులు హర్షదాయకులు లీలఁ జరించుచుఁ జిత్తహారులే
    యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్

    [వీప్స = ఒకటి వెనుకనొకటి వ్యాపింపనిచ్ఛ; విశ్వప్సుఁడు = చంద్రుఁడు; లిప్సుఁడు = ఇచ్ఛగలవాఁడు]

    రిప్లయితొలగించండి
  23. ప్రేప్సనుజేయగాదెలిసెబ్రీతినినుండుచునెల్లవారికిన్
    నీప్సితదాతలెహితమునెంతయొకూర్తురు,చోరులెప్పుడున్
    లిప్సనుదాజొరంబడుచులిప్తపుకాలమునందుపూర్తిగా
    నీప్సితవస్తువుల్ సదిరియెంతయొనెమ్మదిబారిపోదురే

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    టిప్సును నిచ్చెదన్ వినుము ఢీకొని గెల్వగ శత్రులెల్లరిన్:👇
    లిప్సును మూయుచున్ చనుము లెక్కను బెట్టక లేమవాక్కులన్...
    చిప్సును మెక్కుటన్ విడుము జిహ్వను చంపుము హిప్సు పెంపకోయ్...
    ఈప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్....

    etc...

    రిప్లయితొలగించండి
  25. ఈప్సిత దాత బాలకున కిందిర మానసచోరు డెంచగా
    నీప్సిత దాత బాలకున కీశ్వరి మానసచోరు డారయ
    న్నీప్సిత దాత కోతికిని నీ కుజ మానసచోరు డో సఖా!
    యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  26. ఈప్సితమవ్వగ నధిక జు
    గుప్సితమైన మదురువును గుడుచుట మాన్పన్
    తప్సీలు జరుపగ తెలిసె
    ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్

    రిప్లయితొలగించండి
  27. ఈప్సిత కార్యమయ్యదియె యక్రమ మైనను పొందగోరుచున్
    నప్సరసాళి వంటి వెలయాలుల సిద్ధము సేయువారికిన్
    నప్సరు లడ్గి నట్టి ధనమందగ జేసెడు వారికిన్ సదా
    యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు, చోరులెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  28. అప్సుజహస్తులు భక్తుల
    ఈప్సితములఁ దీర్చువారలే కద, చోరుల్
    ఈప్సువులైననువారల
    ఈప్సితములనెల్లదీర్తురేవిధినైనన్

    రిప్లయితొలగించండి


  29. ఈ సమస్య యిచ్చిన వారెవరు వారి పూరణ తెలియ చేయగలరు :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. సవరించిన పూరణ
    ------------------
    అప్సర సలువలపు విసరి
    నీప్సి తములనీ డేర్చనింద్ర సభన్
    అప్సర లేమలు ముదముగ
    ఈప్సితములఁ దీర్చు వార లేకద చోరుల్

    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల
    అప్సర యా వరూధినియె యాశపడన్ ప్రవరాఖ్యుడందడన్
    బ్రేప్సను దివ్యగాయనుడు వెంటనె యప్ప్రవ రాఖ్యురూపమున్
    లిప్సగ నంది దోచి తన ప్రేయసి, మన్వునొసంగె! వ్రాతతో
    నీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్

    రిప్లయితొలగించండి
  32. ద్రప్సల వంటి వయిన యా
    యప్సరసల పొందు కోర నవివేకముతో
    లిప్సను తీర్చగ నెంచుచు
    నీప్సితములు తీర్చు వారలే గద చోరుల్


    మరొకపూరణ
    చెంత చేరుచు సతతము సేవ చేసి
    తమకు మేలు కలుగు మదినీప్సితములు తీర్చు
    వారలే గద చోరుల్ వివాదమేల
    కూడదట్టి వారి చెలిమి కువలయాన

    రిప్లయితొలగించండి