పిట్టా వారూ, మీ పద్యం బాగుంది. 'నాడె యెన్నుమనె' టైపాట్లు. కాని సమస్య పరిష్కారమైనట్లు తోచడం లేదు. మీ భావంలో స్పష్టత లోపించినట్లుంది. 'రంగంబందున వేశముల్'?
ఆర్యా, ఫోన్ నుండి చేయడానికి నా శక్తి సరిపడలేదు.ఆలసిస్తే ఆశాభంగం. భాగ్యమతిని కుతుబ్షా ప్రేమించి తెలుగునకు వెలుగు ప్రసాదించినాడు.మల్కిభరాము సేవ ,సులతాను పోషణ లేకపోతే ఉర్దూ రాజ్యమేలేది.నమాజుకై వంగడం మత సహనానికి గుర్తు.మనతెలుగు భాగ్మతి యెడల కృతజ్ఞతతో రంగాచారి అలా చేయడం సహజం.(ఇపుడు నా ట్యాబ్ కు జీవం వచ్చింది spelling mistakes ఇక ఉండవు.)
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించుబంగాలందున దీది రాజ్యమునతా బ్రహ్మాండమౌ తీరునన్
కంగారేమియు లేక ముస్లిములపై గంధమ్ము చల్లించుచున్
భంగున్ త్రాగుచు బుద్ధి వీడగనుభల్ వంగంగ మావీధినిన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
ఏ సమస్యకైనా మీరు వంగదేశాన్నివదిలేట్టు లేరే!
🙏😊
తొలగించు
తొలగించు:)
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించురంగాచారి రహీములిర్వురును మిత్రత్వమ్ముతో మెల్గుచున్
రంగూన్ జేరిరి , గాలి మార్పునకటన్ రంగయ్య రోగమ్ముతో
క్రుంగన్ , గాంచి రహీము తల్లడిలి *ఆరోగ్యప్రపూర్ణుండుగాన్*
*రంగాచారి* నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుసింగారిం చుకుసంత సంబున వడిన్ చేరంగ ప్రార్ధించు టన్
రిప్లయితొలగించుబంగారం బునలం కరించు కొనిసౌ భాగ్యమ్ము గాపొంగు చున్
రంగేళీ యువలాగ మోహ మునతా రాచెంత కున్ తేలుచున్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రంగేళీ యువకుండు' అనండి.
సింగారిం చుకుసంత సంబున వడిన్ చేరంగ ప్రార్ధించు టన్
తొలగించుబంగారం బునలం కరించు కొనిసౌ భాగ్యమ్ము గాపొంగుచున్
రంగేళీ యువకుండు మోహ మునతా రాచెంత నేతేలుచున్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
శాబ్ది,బాణ,బ్రహ్మ( స)తి, చదువుల జవ
రిప్లయితొలగించురాలు,బాస,అంచ (ర)వుతు భార్య
స్వంజు గృహిణి, శుక్ల, (స్వ)చ్ఛమాత,పలుకు
దేవి,దయను జూపు (తీ)గ బోడి
గురువుగారు నమస్కారము నిన్నటి సమస్య
పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శార్దూల విక్రీడితము
రిప్లయితొలగించుగంగా స్నానమొనర్చిసూర్యజపముల్ గావించఁ భోంచేయడే
రంగాచారి ! నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
దంగాసేసెననంగ!నమ్మగలరే! తాపత్రయమ్మెందుకో
ముంగేరీల సుతుల్ యుసూరు మనగన్ మూలమ్ము తేలున్ గదా!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించువిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రంగున్ రోజొక రీతి వేషముల తీరా చెప్పగా చిత్రమౌ
రిప్లయితొలగించుక్రుంగెన్ జూడగ రాజకీయ విలువల్ కుర్చీల కొట్లాటలో
తుంగన్ దొక్కిరి సంప్రదాయముల నందొక్కండుగా వోట్లకై
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
రాకుమార గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తీరా' అనడం వ్యావహారికం.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు[ఒక మహమ్మదీయుడు రంజాన్ నా డేమి చేసెనో, రంగాచారి అనే తన స్నేహితునికి ఒకడు చెప్పుచున్న సందర్భము]
సింగారమ్ముల మహ్మదీయుఁ డొకఁడున్ జిత్రమ్ముగాఁ దాల్చియున్
రంగారన్ దన బంధు మిత్రతతి దర్గాకున్ దగన్ జేర్చియున్
బొంగన్ డెందము దైవభక్తి యెసఁగన్ బోయెన్ మసీద్ లోని, కో
రంగాచారి! నమాజు చేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్!
మధుసూదన్ గారూ,
తొలగించుసంబోధనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించుపొంగుల్ వారె డు భక్తి తత్వ ము ల తో పూజిం చె నారాయణు న్
రిప్లయితొలగించురంగా చారి ;; నమాజు చే సె న తు డై రంజాను పర్వం బు నన్
సింగా రించు మసీదు లో నిసు మ యి ల్ చె ల్వార శ్రద్ధా ళువై
కంగా రొంద క నమ్రతన్ జనులు సౌఖ్యం బై విరాజి ల్లగన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించువిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుసింగారమ్మ సుపుత్రుడవ్వ భళిరా సీయెమ్ముగా పక్క రా
ష్ట్రం గోపాలు, గవర్న రయ్య మువురున్ సౌభ్రాత్రతన్ చూపగా,
రంగాయింపుల విందు నిఫ్తరున సెక్రట్రీగ పన్జేయు మా
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాష్ట్రం' అనడం వ్యావహారికం.
గంగా స్నానము నాచరించి శుచియై గావించు సంధ్యా విధుల్
రిప్లయితొలగించురంగాచారి; నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
చెంగీజ్ ఖాను నిజాత్మ శుద్ధి వ్రతుడౌ; జింతింపగా నిర్వురున్
భంగంబేమియు గాక భక్తి వ్రతముల్ పాటింతురే శ్రద్ధగా
సూర్య గారూ,
తొలగించువిరుపుతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
'శుచియై కావించు' అనండి. అక్కడ గసడదవ, సరళాదేశాలు రావు.
🙏
తొలగించుగంగాస్నానముఁ జేయ పుణ్యమనుచున్ గాశీ పురమ్మేగుచున్
రిప్లయితొలగించురంగాయంచును ప్రార్థనల్ సలిపె శ్రీరంగమ్ములో భక్తితో
రంగాచారి, నమాజుఁ జేసె నతుడై రంజాను పర్వమ్మునన్
గంగూలీ యభిమాని మిత్రుడగు మీర్ ఖాసిమ్మనే వృద్ధుడే.
విరించి గారూ,
తొలగించువిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
లుంగీలమ్మెడి పీరుసాబు సఖునినన్ లోకజ్ఞుడై ప్రేమతో
రిప్లయితొలగించుబంగారానికి దీటువచ్చు మదితో పర్వమ్మునన్ విందుకై
మంగంపేటకు పిల్చినంత , వడిగా మన్నింప నాహ్వానమే
రంగాచారి ; నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్"
జనార్దన రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(హైందవ -మహమ్మదీయ సమ్మేళనాసమర్థుడు సాయిబాబా.ఆయన శిష్యులు రంగాచారి-అబ్దుల్లా చేసిన పని)
రిప్లయితొలగించుఅంగారోపమసాయిశిష్యు లిరువుర్
హాసాస్యు లేతెంచిరే!
పొంగుల్వారెడి భక్తి దాశరథి న
బ్డుల్లా సమర్చింపగా;
రంగాచారి నమాజుచేసె నతుడై
రంజాను పర్వమ్మునన్
కంగారన్నది లేక నాహరితశం
కన్ ద్వారకామాయిలో.
(అంగారోపమ-నిప్పువంటి;ఆహరితశంకన్-సందేహం లేకుండా)
జంధ్యాల వారూ,
తొలగించుఅద్భుతమైన పూరణ. అభినందనలు.
డా పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుభం గం బందిన నాడే ఎన్ను మనే నాపైబడ్డ దాంగ్లంపు స
త్సంగం బందున కట్టు బొట్టు నటులే సా గించ నాయెంగ దా
రంగం బందు న వేశముల్ గ లు గ వే రంజింప నా భాగ్ మతిన్
రంగా చారి న మా జు జేసె నతుడై రం జాను పర్వం బు నన్
పిట్టా వారూ,
తొలగించుమీ పద్యం బాగుంది. 'నాడె యెన్నుమనె' టైపాట్లు. కాని సమస్య పరిష్కారమైనట్లు తోచడం లేదు. మీ భావంలో స్పష్టత లోపించినట్లుంది. 'రంగంబందున వేశముల్'?
ఆర్యా,
తొలగించుఫోన్ నుండి చేయడానికి నా శక్తి సరిపడలేదు.ఆలసిస్తే ఆశాభంగం.
భాగ్యమతిని కుతుబ్షా ప్రేమించి తెలుగునకు వెలుగు ప్రసాదించినాడు.మల్కిభరాము సేవ ,సులతాను పోషణ లేకపోతే ఉర్దూ రాజ్యమేలేది.నమాజుకై వంగడం మత సహనానికి గుర్తు.మనతెలుగు భాగ్మతి యెడల కృతజ్ఞతతో రంగాచారి అలా చేయడం సహజం.(ఇపుడు నా ట్యాబ్ కు జీవం వచ్చింది spelling mistakes ఇక ఉండవు.)
నారుమంచి అనంతకృష్ణ గారి పూరణ.....
రిప్లయితొలగించుబంగారమ్మది రాజకీయమనుచున్ పాలించుటే లక్ష్యమై
చొంగన్ కార్చుచు మెచ్చుకోలు కొరకై షోకైన ఫోటోలకై
కంగారించుక లేకయే నటనగా కాల్సేతులన్ ద్రిప్పి మా
రంగాచారి! నమాజు చేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్!
అనంతకృష్ణ గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
లుంగీచుట్టెను టోపి పెట్టె గన బాలుండంత నీబుత్రుడున్
రిప్లయితొలగించురంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
కంగారే పడెనంత తండ్రినిక దుఃఖంబొంద బెండ్లామనెన్
సింగారించెను నాటకంబునతడున్ సంతోషబెట్టెన్ వినో
బాలకృష్ణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తండ్రి యిక' అని ఉండాలనుకుంటాను. 'వినో'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించురంగాయంచునుపూజ జేసి గుడిలో లక్ష్మిపతిన్ నిష్టతో
రిప్లయితొలగించురంగాచారి నమాజుఁ జేసె ,నతుఁడై రంజాను పర్వమ్మునన్"*
సింగారమ్మొనరించు కొంచు నరుదెంచెన్ గౌసు మోదంబుతో
పొంగంగా హృదయంబు మ్రొక్కుచును తా భూస్పర్శ చేసెన్ గదా!
ఉమాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూజ జేసె' అని రంగాచారి తరువాత కామా పెట్టండి. లేకుంటే అన్వయం దెబ్బతింటుంది.
'నిష్ఠతో' టైపాటు!
తొలగించుశార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించుపొంగుల్వారగ సంతసమ్మదియె సంపూర్ణంపు నాధిక్యతన్
బంగారయ్యను మించి పొంద సఖుడౌ బాషా యసెంబ్లీకి నీ
కంగారాపుము సంధ్య వేళయని దర్గా జేర్చఁ గారందునన్
రంగాచారి, నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంపూర్ణంపు టాధిక్యతన్ అనడం సాధువు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించుశార్దూలవిక్రీడితము
పొంగుల్వారగ సంతసమ్మదియె సంపూర్ణంపు టాధిక్యతన్
బంగారయ్యను మించి పొంద సఖుడౌ బాషా యసెంబ్లీకి నీ
కంగారాపుము సంధ్య వేళయని దర్గా జేర్చఁ గారందునన్
రంగాచారి, నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
అంగీకారముతోడ వేడ్కను వివాహమ్మందు జేపట్ట దా
రిప్లయితొలగించుబేగం షీలను భార్యగాను,సతికిన్ బెంపొంద సమ్మోదమున్
రంగాచారి నమాజుజేసె నతుడై రంజాను పర్వంబునన్
సింగంబైనను చిన్నదౌనుగద తాసింగారి భార్యంగనన్
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించురంగత్తుంగ తరంగ భంగిమలతో రాజిల్లుచున్నట్టి దౌ
రిప్లయితొలగించుగంగన్ మున్గి నమస్సుమాంజలు లిడెన్ గంగాపతిన్ దల్చుచున్
రంగాచారి ; నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
భంగున్ , కల్లు , పొగాకు వీడి పలుకన్ పల్మారు అల్లా యనన్
కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రంగాచారియురహ్మతుల్లననువారల్ హైదరాబాదులో
రిప్లయితొలగించుఅంగారమ్ము ప్రభంజనమ్ములనగానామిత్రులుండెన్ సదా
రంగుల్చల్లుచు' హోలి' యందుసరదా' రహ్మత్తు' చూపించగా
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
ఫణీంద్ర గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మిత్రులు... ఉండెన్' వచనదోషం.
మిత్రులుండన్
తొలగించురంగా రంగ కృపాంతరంగ వర సారం గాంగ శృంగార శ్రీ
రిప్లయితొలగించురం గోత్తుంగ వరాలయాధిపతి భారం బెల్ల నీ దంచుఁ దా,
భంగం బెట్లగుఁ, జేయఁ బ్రార్థనను దద్భావ్యంపు మాసమ్మునన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ వృత్త్యనుప్రాసతో మనోహరంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
బంగారమ్మును స్మగ్లుజేయుచును తా పార్టీకి దానమ్మిడన్
సంగారెడ్డిని సీటు పొందగను భల్ సంతోషముప్పొంగగా
సంగమ్మౌచును హిందు ముస్లిములతో జంద్యమ్ము టోపీలతో
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుబంగారంపుశరీర చాయ యడరన్ ప్రద్యుమ్ను బాణమ్ముగా
రిప్లయితొలగించుసింగారించి లతాంగి ముస్లిము కడున్ చెన్నౌస్వరూపమ్ముతో
చెంగావంచు సుచేలకమ్మునను రాజిల్లంగ, పెండ్లాడి శ్రీ
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
అన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రంగంబందున పేరుగాంచెగద!సారాంశంబులౌక్యంబుగన్
రిప్లయితొలగించులుంగీగట్టియు గడ్డమున్ నిడగ?యేలోపంబు గన్పించకన్
సింగారంబున గానుపించె!"నటనా శ్రేష్టుండుయిస్మాయిలై
రంగాచారి"నమాజుజేసె నతుడై రంజానుపర్వమ్మునన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గడ్డమే యిడగ నే లోపంబు గన్పించకే" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసంగాతంబున దెల్సె నిద్దరికి
రిప్లయితొలగించునీశానుండొకండే యనన్
కంగారొందుచు నాదినంబు గాసంబు లేకుండ నౌ
రంగాజేబు శివాలయంబునకు చేరంబోయె నేకాదశిన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
సీతారామయ్య గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
🙏🏽 ఈ సమయంలో కూడా సమీక్షించి నందుకు ధన్యవాదములు
తొలగించుసవరణతో
సంగాతంబున దెల్సె నిద్దరికి
నీశానుండొకండే యనన్
కంగారొందుచు నా దినంబు నపుడేగాసంబు లేకుండ నౌ
రంగాజేబు శివాలయంబునకు చేరంబోయె నేకాదశిన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
రిప్లయితొలగించుకంద సమస్య స్వల్ప అడ్జస్ట్ మాడి :)
రంగడు చేసెను నమాజు రంజాను వడిన్!
క్రుంగగ రవి, వందనమిడె
రంగడు, చేసెను నమాజు రంజాను వడిన్
చెంగట బషీరు చేరుచు,
తింగరి బుచ్చి మన భూమి తీరిదె గనుమా
జిలేబి
__/\__
తొలగించు