10, జూన్ 2019, సోమవారం

సమస్య - 3043 (చింతన లోపించిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్"
(లేదా...)
"చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో పాతూరి రఘురామయ్య గారి సమస్య)

100 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    చెంతను నుండగా "అమితు" చెల్వము మీరగ యుద్ధమందునన్
    కొంతయు భీతినిన్ గనక కోతుల మూకల నోడగొట్టుటన్
    గంతులు వేయుచున్ కడకు కాంగ్రెసు డింపులు గెల్వబోవునన్
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      "గెల్వ బోవునన్" అన్న ప్రయోగం సాధువు కాదు. "గెల్చునట్టి యే । చింతన..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  2. వంచన చేయక తాపసి
    సంచిత పాపములు తొలగ సంతస మందున్
    సుంతగు భక్తిని కొలువగ
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుంత + అగు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. కొంతయు నిష్టగ తాపసి
      చెంతను నిండిన యఘములు చెఱుపగ నిఛ్ఛన్
      సుంతయు భక్తిని కొలువగ
      చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

      తొలగించండి
  3. చింతనచేసదాగతి వచింతురు వింతగ సంతులేలనో
    వింతయిదే పరాత్పరుని వేడుక జీవులచావుపుట్టుకల్
    వింతగు నేలనింగి తనువేయగు మిథ్య మరెట్లు సాధ్యమో
    *"చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్"?*

    రిప్లయితొలగించండి
  4. ఎంతో సాధనజేసిన
    సుంతయు పరమాత్ముచెంత చోటుగగనమే
    వింతగద సతీసుతులనె
    "చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
  5. వింతగు వేషము తో పర
    కాంతల పొందును సలపక కామము వీడన్
    సంతత మాహరి దలచిహ
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలచి + ఇహ' అన్నపుడు సంధి లేదు.యడాగమం వస్తుంది. "సంతతము హరిని దలచి యిహ" అనండి.

      తొలగించండి
    2. 🙏
      గణదోషము గ్రహించి సరిజేసితిని.

      తొలగించండి
  6. వింతగ పలికెద వేమిర
    కాంతా కనకాలపైన కాంక్షను విడి గో
    రంతైనను సంసారపు
    చింతన లోపించిన యతి సిద్ధిని బొందెన్.

    రిప్లయితొలగించండి
  7. వంతలదరిరానీయక
    సంతులసంగమముజేరి సత్యవ్రతుడై
    సంతతభక్తిన్ లౌకిక
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
  8. వింతగు వేషము తో పర
    కాంతల పొందున్ దలపకఁ గామము విడి నే
    కాంతమున హరిఁ దలపఁ నిహ
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
  9. కాంతలుపుత్రులందుకనకంబున మోహమునుజ్జగించి యే
    చింతలు వంతలున్ మదిని చిందరవందరనొందనీయకన్
    సంతతసాధువర్తనులసంగమమందునసంచరించి దు
    శ్చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి


  10. అంతయు నీశుడనుచు లే
    దెంతయు నిహలోకమున నుదియకొను కార్యం
    బెంతయునని, వేరుపడిన
    చింతన లోపించిన, యతి సిద్ధినిఁ బొందెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. అంతయు నీశుడంచు భువియంతయు నాతడి లీలయంచు లే
    దెంతయు వేరు కార్యములు దేహము పాటుపడంగ యంచు నా
    వంతుగ దేవదేవుని సపర్యలు చేసెద నంచు వేరుగా
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేవెంతయు...కార్యములు' అనండి. లేకుంటే వచన దోషం.

      తొలగించండి
  12. వింతగు జీవితమ్ము నను వేడుక మీరగ భోగలా లసల్
    సుంతయు భక్తిలేక మది శోషిల కోర్కెలు తీరకున్నచో
    పంతము మానిదై వమును భక్తిగ వేడిన మోక్షమీ యడే
    చింతన సుంతలేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి


  13. ఎంతయు కడతేరదు మేల్
    చెంతకు చేరెననుకొన వశీకృతమవదే
    వింతైనలోకము పయిన
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వాఇ పూరణ

    అంతము లేని దుఃఖమయమైన జగమ్మని , కోనసీమ స..
    త్ప్రాంతమునందు ముమ్మిడివరమ్మున బుట్టిన బాలయోగి తా
    స్వాంతమునందు నమ్మిన యశస్వి , వరిష్ఠుడు , లౌకికమ్ములన్
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. ఉ.కాంతల పొందుఁగోరుచున్ వికారపు జీవన మెంచి సాగగా
    నంతిమ కాలమున్ జివుక నాప్తుల సేవయుఁ పొందగల్గెనా
    చింతన సుంత లేని యతి? సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్
    శాంతికి చిహ్నమౌ షిరిడి శాయి విభండు వినమ్ర దాసుడై !

    రిప్లయితొలగించండి
  16. (మన వేమన వేసిన బాట;చూపిన కోట)
    "గంతుల యాటరా బ్రతుకు;
    గంతవు నీవెటు బోవుచుంటివో?
    కంతుల దేహ మియ్యదియె;
    కాంచుము బ్రహ్మము యోగసాధనన్;
    వంతల వీడి వేమనవి
    వాక్కుల నమ్ము "మటంచు సౌఖ్యపుం
    జింతన సుంత లేని యతి
    సిద్ధిని బొందె జనుల్ నుతింపగన్.
    (గంతుల-మిడిసిపాటుల;గంతవు-వెళ్లేవాడివి;కంతుల-కణుతుల;వంతల-బాధల)

    రిప్లయితొలగించండి
  17. అంతట హరి నే గాంచు చు
    సంతత మానవుల సేవ చక్కని దను చున్
    వంత లు గల యిహ లోకపు
    చింత న లోపించిన యతి సిద్ది ని బొందున్

    రిప్లయితొలగించండి
  18. చింతల వంతల పాలై
    చింతిలుటేనా బ్రదుకని చిరు ప్రాయమునే
    నంతయు వీడగ నిహ పర
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
  19. చెంతను పొంతన యుండక
    నంతట చింతించు స్వాంతమందున దృతమై
    సంతత చింతలు బెంచెడు
    చింతన లోపించిన యతి సిద్ధిని బొందెన్.
    స్వాంతము=మనస్సు

    రిప్లయితొలగించండి
  20. కాంతయె సర్వమంచు కడు కాముకుడై చరియించు వేళ నో
    యింతియె మార్చెనాతనినదెంతటి చిత్రమొ భోగియైన నా
    కాంతవిలోలుడే తుదకు కారణ జన్ముడయెన్ గద వేమనార్యుడే
    చింతన సుంతయు లేనియతి, సిద్ధిని బొందె జనుల్ నుతింపగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేళ నా యింతియె...' అనండి. 'కాంతా విలోలుడు' అన్నది సాధుసమాసం. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  21. సంతత భగవచ్ఛింతన
    యంతఃకరణపు విశుద్ధి యష్టాంగములన్
    సంతుష్టుండై లౌకిక
    చింతన లోపించిన యతి సిద్ధినిబొందున్

    రిప్లయితొలగించండి
  22. కందము
    సంతత మాధ్యాత్మిక సి
    ద్ధాంతంబుల వీడ బోక తత్వము నెరుగన్
    స్వాంతమున క్రోధ మద దు
    శ్చింతన లోపించిన యతి సిద్ధిని పొందున్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  23. కాంతల సంగమున్మదిని కామము క్రోధము వీడగా, జరా
    క్రాంతము గాకముంపె బెయి కాలుని వేటుల నొందకుండగా
    వింతలు మేని బారకనె, వేడగ విష్ణుని దప్ప వేరగున్
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  24. కం.కాంతల మోజున క్రుళ్లెన్
    చింతన లోపించిన యతి ,సిద్ధినిఁ బొందెన్
    శాంతముఁ బరమేశుండఁ ని
    రంతరమున్ శాయిగొన విరాగత్వముతో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరమేశుండ' తరువాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  25. సుంతయుబనిజేనేరడు
    చింతనలోపించిన,యతిసిధ్ధినిబొందెన్
    గంతునిదరిజేరకమన
    సంతయుదాగృష్ణు నిలిపిసాకారుండై

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    శాంతహృదంతరుండును, ప్రశస్తతపస్వి, జితారిషట్కసం
    భ్రాంతమనోజ్ఞచిత్తుఁడు, విరాగియునౌ నిరహంకృతాకృతా
    శ్రాంతవిచింతితాంతరుఁడు, ప్రాక్తనసంసృతిబంధలగ్నకృ

    చ్చింతన సుంత లేని యతి, సిద్ధినిఁ బొందె, జనుల్ నుతింపఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      పద్యంలో 'అంతరుడు' ద్విరుక్తమయింది.

      తొలగించండి
    2. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

      చిన్న సవరణతో...
      శాంతహృదంతరుండును, ప్రశస్తతపస్వి, జితారిషట్కసం
      భ్రాంతమనోజ్ఞచిత్తుఁడు, విరాగియునౌ నిరహంకృతాకృతా
      శ్రాంతవిచింతితా్త్మకుఁడు, ప్రాక్తనసంసృతిబంధలగ్నకృ
      చ్చింతన సుంత లేని యతి, సిద్ధినిఁ బొందె, జనుల్ నుతింపఁగన్!

      తొలగించండి
  27. సంతత మధ్యాత్మిక స్ర
    వంతి శివానందమూర్తి పంచెను సుధలన్!
    వింతగ సన్యాసముపై
    చింతన లోపించిన యతి సిద్దిని బొందెన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏 ఇవాళ పూజ్యులు సద్గురు శివానందమూర్తి గారి వర్ధంతి 🙏

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మొదటి పాదంలో గణదోషం "సంతత మధ్యాత్మికపు స్ర" అనండి

      తొలగించండి
  28. అంతట నిండె నా హరి యనంతుడ నంచు దపమ్ము జేయుచున్
    చింతలు వీడి యచ్యుతుని జేరి తరించుటె గోరునెన్నడున్
    సంతత శాంత చిత్తుడగు సజ్జను డాతడు రాగ ద్వేషముల్
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  29. బొంతలు దబ్బలు దుంపలు
    గొంతున మెసవి తొడిగి చిఱు గోచి యెఱఁగుచుం
    బంతమున వేల్పునకు మెయి
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్


    కంత మెలంగు పుర్వుఁ గయిఁ గట్టిన జేజెను బూది దేవరం
    జెంతన గుండుచూలిఁ దమిఁ జేర్చిన వాని నెదం దలంచుచున్
    వంత గముల్ వెనంగు చిట వారక కల్గెడు పుట్టు తుట్టెలం
    జింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అచ్చ తెలుగు పూరణలు రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    చింతన భస్మము గానిదె
    వంతగు పరమాత్ము వంక వంచినదైనన్
    కొంతయు బ్రహ్మము నెరుగడు
    చింతన లోపించిన యతి సిద్ధిని బొందెన.
    (సిద్ధి మోక్షము గాదు,మహిమలు జూపఘ స్థితి.*ఆశలుడిగిన బ్రహ్మంబు బట్ట బయలు*ఆధ్యాత్మిక సూత్రము)

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చెంతను లేక బంధువులు చెన్నుగ జేరుచు నాశ్రమమ్మునన్
    వింతగు రీతినిన్ కొలిచి వేడుక మీరగ నాంధ్రపద్యమున్
    సంతస మొందుచున్ సతము సంధి సమాసము తక్క దుష్టపుం
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  32. డా.పిట్టా సత్యనారాయణ
    వింతయెయెప్పుడాయె యతి వీడని సిద్ధిని బట్టి పోరగన్
    గంతలు గట్టె పృచ్ఛకుడ!జ్ఞానిగ భాసితుడై రవంతయున్
    దంతములొత్తిబట్టుకొని ధ్యానము జేసిన సిద్ధి బొందుటౌ
    వంతల సిద్ధులీ ప్రజల వంచన జేయ నుపాయముల్,పురే!
    చింతన సుంతలేని *యతి* సిద్ధిని బొందె జనుల్ నుతింపగన్?
    (యతి స్థాయి సిద్ధుని కంటె గొప్పది.)

    రిప్లయితొలగించండి
  33. సద్గురు రమణ మహర్షులకు అంజలి ఘటించి

    సంతత ధ్యానయోగముల సత్యముగాంచిన మౌనసాధువే
    యంతయు వ్యాప్తమైనదగు నాత్మను నేనను తత్వమంచు దా
    వంతను జెంతజేర్చకనె వ్యాధినెదుర్చుచు స్ధూలదేహపుం
    జింతన సుంతలేని యతి సిద్ధినిబొందె జనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని భావంతో మంచి పూరణ. అభినందనలు
      సంతత ధ్యాన .. అన్నపుడు త గురువై గణదోషం సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా, యోగసాధనల అంటే సరిపోతుందేమో!సమస్సులు!!

      తొలగించండి
  34. గురువుగారి సూచనతో సవరించిన పద్యం

    కాంతయె సర్వమంచు కడు కాముకుడై చరియించు వేళ నో
    యింతియె మార్చెనాతనినదెంతటి చిత్రమొ వేమనార్యుడా
    కాంతకు దాసుడైన యతగాడె కదా యిహ వాంఛలందునన్
    జింతన సుంతయు లేనియతి, సిద్ధిని బొందె జనుల్ నుతింపగన్.

    రిప్లయితొలగించండి
  35. కంతునిబారినిన్బడునుగామముతోడనుగూడియుండుచో
    చింతనసుంతలేనియతి,సిధ్ధినిబొందెనుజనుల్ నుతింపగన్
    వంతలబారిజేయకనువైష్ణవిమాతనునమ్ముకుంటచే
    పంతమురాజశేఖరుడుమాంత్రీకుడైననుభక్తియుక్తుడై

    రిప్లయితొలగించండి
  36. అంతట శివమయమని తన
    ఆంతర్యము దెలియజేయ!"నత్యాశలనే
    పొంతన చేతను వాడెడి
    చింతన" లోపించిన యతి సిద్దినిబొందున్!

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంతత మా హర నామమె
    పంతముగా పల్కుచుండి పరవశ్యుండై
    సుంతయు సతి సంతులదౌ
    చింతన లోపించిన యతి సిద్థిని బొందెన్.

    రిప్లయితొలగించండి
  38. స్వాంతమున హరిని తలచుచు
    సంతతము బడుగు జనముల సంరక్షణలో
    సంతసము గొనుచు, స్వార్థపు
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

    రిప్లయితొలగించండి
  39. సుంతయు నాలోచింపక
    నంతయు శ్రీహరి దయయని యనవరతంబున్
    చింతన చేయుచు నైహిక
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్


    సంతతమా రమాధవుని చక్కగ కొల్చుచు నెల్లవేళలన్
    చెంతకు చేర్చుకొమ్మనుచు సేవలు పూజలు చేయుచున్ వనిన్
    చింతల నెల్ల వీడుచును సాంత్వము నందున లౌకికమ్మునౌ
    *"చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్"*



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాంతము సుఖదుఃఖములం
      దంతరమును జీవితమున నణచుటలో నా
      యంతటి వారలు లేరను
      చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్

      తొలగించండి
  40. ఎంతటి వారైనాసరి
    కొంతైనా చెదిరిపోవు కోరిక కలగన్
    చెంతన సకలంబుండిన
    చింతన లోపించిన యతి సిద్ధిని బొందెన్.

    రిప్లయితొలగించండి
  41. శాంతము కొరవడి కోర్కెలు
    సుంతయు బొందక ప్రశాంత సుమభావములన్
    పంతముబూనియు,కామపు
    చింతన లోపించిన, యతి సిద్ధినిఁ బొందెన్!!

    రిప్లయితొలగించండి