23, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3056 (ఫుల్ల సరోజ నేత్రలకు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె"
(లేదా...)
"ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"

85 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చల్లగ చెల్లెలమ్మనట చారెడు మోమున రాజనీతినిన్
  మెల్లగ దించగా సుతుడు మీరిన స్వప్నములన్ని కాశినిన్
  కల్లలుకాగ కాంగ్రెసుకు కన్నుల నిండుగ నీళ్ళు కారగా
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   మోదీ దెబ్బకు కళ్ళు చీకట్లు కమ్మిన వారు తల్లీ కూతుళ్ళే కాదు. మరో ఇద్దరు ఫుల్ల సరోజ నేత్రలున్నారు. అందులో ఒకరు మీ బెంగాలీ దీదీ.

   తొలగించండి
 2. భూరిగ ధనసంపాదనఁ గోరి యువకు
  లంత దారాసుతులవీడి యంబుధులను
  దాటి దేశాంతరమ్మేగ తాళ లేని
  యింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె.

  రిప్లయితొలగించండి
 3. "చల్లని పున్నమన్ వనిని
  జక్కగ రాసమొనర్తు;బిమ్మటన్
  బిల్లనగోవి నూదెదను;
  బెల్లుగ రం"డని నందనందనుం
  డెల్లరు గొల్లభామలకు
  నింపుగ జెప్పియు రాకపోయినన్
  ఫుల్లసరోజనేత్రలకు
  పూర్తిగ జీకటులయ్యె వెన్నెలల్.

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. మొల్లలునల్లబారి, యల ముగ్ధమనోజ్ఞపరీమళమ్ములన్
   జల్లెడు మల్లెతావులునసహ్యములై, యనిలమ్ములమ్ములై,
   యల్లన దోచె, గోపికలకయ్యెడ జేరని కృష్ణుఁ దల్చు సం
   ఫుల్లసరోజనేత్రలకు పూర్తిగఁ జీకటులయ్యె వెన్నెలల్

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించండి
  2. రామాచార్య గారూ,
   మీ పూరణ మనోజ్ఞమై, ప్రశస్తమై ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 5. ఇంత కూటి కొరకు పరు వెత్తి దేశ
  ములను ఖండము లను దాటి మూస బతుకు
  నీడ్వ పతులె బోవంగను నింటి కాడ
  ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె


  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. అల్లము పచ్చి మిర్చి బతుకంతయు నీడ్వగ చాలదాయె! నే
  నల్లన జీవితమ్మునకు నాల్గన కాసుల వేసుకొచ్చెదన్
  పిల్లల చూసుకొమ్మనుచు వేడి విదేశము లేగ పెన్మిటుల్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  చల్లని పిల్లతెమ్మెరల సైకతసీమల సంచరించుచున్
  పిల్లనగ్రోవి సద్దు వినిపింపగ గోపకులాంగనల్ రహిన్
  నల్లనివానికై వెదికినారటఁ గృష్ణుని జాడ లేమిచే
  ఫుల్లసరోజనేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరొక పూరణ.. (ఈ రోజు ఆదివారం కదా.. కాస్త తీరిక..)

   కల్లలు వల్కి యేవొ పదికాసులనాసగఁజూపి , యింతులన్
   మెల్లగ దింపి రొంపి , ధనమే పరమావధిగా దలంచు
   కో..
   కొల్లల బారినంబడిన కోమలులెందరొ ! వేశ్యలైన యా
   ఫుల్లసరోజనేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 8. శంకరాభరణం....23/06/2019

  సమస్య


  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"

  నా పూరణ. .
  **** *** **

  ఎల్లరు రండి రండనుచు నెల్మిని సుందర గోపకాంతలన్

  పిల్చెను రాస లీలలకు వేణువు నూదుచు చిన్ని కృష్ణుడే

  మల్లెలు దాల్చి వేచినను మాయల కృష్ణుని జాడలేమిచే

  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"


  🌱 ఆకుల శాంతి భూషణ్🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 9. ఉ. అల్లెను తీగెమల్లెపొదలాకశ మెత్తుకు చెట్లనానుచున్
  చెల్లెలు పూలుకోసితన చెంగున నింపగ తెల్లవారకన్
  అల్లరి మూక హోళియని యాడుచు జిమ్మగ రంగు నీరమున్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"

  రిప్లయితొలగించండి
 10. పురుషుల గుమి శబరిమల పుణ్యస్థలికి
  పయనమవ్వగ నొంటరిభామినులకు
  తమనుదలియేగిన పతులతలపు రాగ
  నింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుణ్యస్థలి' అన్నపుడు 'ణ్య' గురువై గణదోషం. "పుణ్యవనికి" అందామా? అలాగే "తమను విడి యేగిన" అనండి.

   తొలగించండి
 11. వేణు నాదము చేయుచు ప్రీతి మీర
  నిత్యమున్ వారల మదుల నిలచియున్న
  వెన్నదొంగట కనిపించ కున్న వేళ
  నింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె

  రిప్లయితొలగించండి
 12. శత్రు మూకల చెండాడి సమర మందు
  వీర మరణము పాలైన విభుల దలచి
  యింత.లకుజీకటులుగ రేయెండ లయ్యె
  నకట యనుచును పనవిరి యవని జనులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..యింతులకు' టైపాటు.

   తొలగించండి
 13. పిల్లల వందమందిఁగని పెంచకఁ గద్రువ సౌబలేయి వా
  రెల్లరిఁ జెడ్డదారులకుఁ నీగగఁజేసిరి టెక్కునొక్కరున్
  పెల్లుగ మూయు గంతలన వేరొక రీవిధి యంధులైన యా
  ఫుల్లసరోజనేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్ !!

  రిప్లయితొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  [శ్రీకృష్ణు నక్రూరుఁడు మధురానగరికిఁ గొంపోవునప్పుడు, గోపిక లడ్డుపడఁగా, శ్రీకృష్ణుఁడు వారికి నచ్చఁజెప్పి, వెడలఁగాఁ, గృష్ణుఁడు లేని యా గోపికల మనఃస్థితి యెటులున్నదో తెలుపు సందర్భము]

  ఉల్లముఁ బ్రాణముం దనువు నుత్తమ పూరుషునందుఁ జేర్చి, తా
  మల్లనఁ బోవు స్వీయ హృదయస్థిత కృష్ణుఁ జనంగనీక, తా
  మెల్లరు వాని నడ్డఁ, బచరింపుల మాటలఁ జెప్పి పోవు నా
  నల్లనివాఁడు లేని వదనమ్ములు నల్లనయయ్యె! నట్లె, యా

  ఫుల్ల సరోజ నేత్రలకుఁ బూర్తిగఁ జీఁకటు లయ్యె వెన్నెలల్!!

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గురుభ్యోన్నమః🙏
  రాజా రామ్మోహన్ రాయ్,కందుకూరి వీరేశలింగం,
  జోతిబాపూలే మొ. వారు పునర్వివాహ చట్టం తేవడానికి కారణం అయి స్త్రీలకు రక్షణ కల్పించారు. ఈ కోణంలో నా పూరణము.

  భర్త మరణింపఁ నతివల బాల్య మందు
  ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె;
  నాటి దురవస్థఁ గనినట్టి నాయకులును
  చట్టములు దేగ మగువలు చల్లగుండ్రి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అతివల, ఇంతులకు అని పునరుక్తి. "భర్త మరణించినంతట బాల్యమందె" అనండి.

   తొలగించండి
  2. 🙏ధన్యవాదములు.
   సరి జేసికొందును.

   తొలగించండి
 16. డా.పిట్టా సత్యనారాయణ
  కొంత గడన నా మహిళలు గూడు సంఘ
  మందె పో చేరు రాయితీల్ మద్యముకయె
  వంతలే తప్పవీ నడుమంత్రపుసిరి
  ఇంతులకు జీకటులుగ రే యెండలయ్యె

  రిప్లయితొలగించండి


 17. అల్లన సింగపూరమెరికా! అబు దాబి! కువైటు కానడా !
  జల్లన పిల్చు డాలరులు చక్కగ దండిగ డబ్బులమ్మణీ
  వెళ్ళెద చట్టటంచు పెన వేయుచు చెప్పగ ప్రాణనాథులున్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. నా ప్రయత్నం :

  తేటగీతి
  అక్కురుక్షేత్ర సంగ్రామ మంతరించ
  గెలుపు నోటముల్ దల్చక కృంగి పోవ
  పతులు బలియౌచు మేటి సౌభాగ్యము విడ
  నింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె

  కురుక్షేత్రయుద్ధ భూమిలో గాంధారి శ్రీకృష్ణ భగవానునితో.....

  ఉత్పలమాల
  చెల్లునె యన్నదమ్ములకు చేటొనరించగ నీకు సారధీ!
  తల్లులు పిల్లలున్ వగచ దారుణ మారణ హోమమందు కో
  డళ్లను వీడగన్ నుదుటి రక్తము తల్లడ మంటదే నినున్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
 19. నలుపు వర్ణపు కన్నుల చలువజోళ్ళు
  మండుటెండల మార్చె రేయెండలుగను!
  మరువఁ దీయగ వానిని మాపులందు
  నింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాకుమార గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. చల్లని వీవెనౌ యమున చండపు గాలుల వీచెనత్తరిన్
   మల్లెల సౌరభోత్కరపు మాధురి చేదుగ మారె నావనిన్
   నల్లనివాడు రాక తమ నమ్మిక వీగిన గొల్లభామలా
   ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

   తొలగించండి
 20. అల్లన నల్లనయ్య హరి నచ్చట జేరి గభిల్లునంత నా
  విల్లువలెన్ శరీరమును వీఁకన వంచెను రాధకన్నులన్
  మెల్లగ మూయగానదియె మేనుగగుర్పొడుచెన్ లతాంగికిన్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హరి యచ్చట జేరి' అనండి.

   తొలగించండి
 21. కాంతుడీవేళనేలనోకానరాడు
  గోపబాలుడు మరచెనా గోపికలను
  కలలుచెదరగకుందిరి కలవరమున
  ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె"

  రిప్లయితొలగించండి
 22. డా.పిట్టా సత్యనారాయణ
  పిల్లలు నౌ వయస్సునకు పేరుకు గోర్సు(course)ల టెక్కులెక్కువై
  మల్లును ముప్పదేళ్ళు నట మానిని సంతుకు దార్ఢ్యమబ్బదే
  కల్ల లుపాధికౌ గడన కానిన జీవిక లెల్ల వింత లీ
  ఫుల్ల సరోజనేత్రలకు పూర్తిగ జీకటులయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పిల్లలు నౌ వయస్సునకు'?

   తొలగించండి
  2. డా.పిట్టా నుండి
   పిల్లల గన్ వయస్సు..అనుకున్నాను కాని పిల్లలు పుట్టే వయస్సన్న అర్థం కొరకు అలా చేసాను.దాంతో వారే పిల్లలయే అనే ఛాయ కలదు కాని *మీరిన వయస్సనే *భావన పద్యముది.
   ఆర్యా, ధన్యవాదాలు

   తొలగించండి
 23. లేరు భర్తలు బిడ్డలు లేరు మోస
  పోయి నరక కూపమ్మునఁ బొర్లుచుండ
  జీవితము శూన్యమాయెను భావియు వెల
  యింతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె!


  చల్లగఁ జెప్పి తిమ్మినుకు చారుత రాయత నేత్ర భాసితా!
  కల్లయె యిట్లనంగ మఱి కందుము వేరును నేత్ర మన్నచోఁ
  బెల్లుగ నీట బుట్టునవి పెంపున దామర లున్న వాటికిన్
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  [ఫుల్ల సరోజ నేత్రలు = వికసించిన పద్మములును, వేళ్ళును గలిగిన తామర మొక్కలు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   'చెప్పి తిమ్మినుకు'?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   చెప్పితి (వి) + ఇమ్మినుకు; మినుకు = వాక్కు

   తొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మధురా నగరిలో పున్నమి నాడు:

  చల్లలనమ్మ గోరుచును చక్కని చుక్కలు కుండలెత్తుచున్
  మెల్లగ వేకువన్ తలల మెండుగ దాల్చుచు కుల్కుచుండగా
  నల్లరి కృష్ణుడంతటను హైరన జేయుచు తూట్లు కొట్టగా
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్ :)

  రిప్లయితొలగించండి
 25. అల్లన నల్లనయ్యతన యల్లరిచే మురిపింపగోపికల్
  ఝల్లనయుల్లముల్ మరునిజాలమునంబడియుండునంతలో
  చల్లగ నల్లపిల్లివలె జారుకొనంగహతాశులైరి యా
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణీంద్ర గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   'ఝల్లన నుల్లముల్' అనండి.

   తొలగించండి
 26. కాంతుడేచెంతనుండ సంక్రాంతి యగును
  *"ఇంతులకుఁ; జీకటులుగ రేయెండ లయ్యె"*
  మొగుడుమెచ్చనికాపురమును, వరించి
  వచ్చువనితకు ప్రేమవివాహములును

  రిప్లయితొలగించండి
 27. నల్లని పిల్లివోలె నలినాక్షుల యుల్లము లుల్లసిల్ల మే
  నెల్లను ఝల్లుఝల్లుమన నెల్లర నల్లరి బెట్టువాడు రే
  పల్లెను వీడి ఢిల్లిజను ఫల్గుణ సారథియన్ దలంపుచే
  *"ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"*

  రిప్లయితొలగించండి
 28. అల్లదె గొల్లభామ లనె యాత్మల రంజిల జేయ యాదవో
  త్ఫుల్ల సరోజనాభుడు యదూత్తము డల్లదె వేణువూది రం
  జిల్లగ జేయు నేడనుచు జేడియలెల్లరు జేర జేరమిన్
  *"ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'గొల్లభామ లని రాత్మల...' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 29. రెండవ పూరణ

  అల్ల విరాటు గొల్వు వలలాహ్వయభీముడు పాచకుండునై
  వెల్లడి గాగ, మల్లుడగు వీరుడొకం డెదిరించె, వారి పా
  దోల్లసితంపు ధూళి కదనోత్తితమై భ్రమఁ గొల్పుచుండ నా
  పుల్లసరోజనేత్రలకు పూర్తిగఁ జీకటులయ్యె వెన్నెలల్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కదనోత్థితమై' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 30. పిల్లన గ్రోవి పిల్పు విని ప్రేమగ భీరువు లెల్ల జేరగా
  నల్లని వాడులేక యమునా నది తీరమె యందహీనమై
  చల్లని కాంతులీను తరి చక్కని చంద్రుడు చిన్నబోవగా
  ఫుల్లసరోజ నేత్రలకు పూర్తిగ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
 31. కంతుబారినిబడినట్టికాంతలెపుడు
  మోహసంద్రానమునుగుచుముదములేమి
  భర్తరాకనుజూచుటవాస్తవమిది
  యింతులకుచీకటులుగరేయెండలయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మోహ సంద్రము' దుష్ట సమాసం. "మోహ వార్ధిని మునుగుచు" అనండి.

   తొలగించండి


 32. అల్లరి చేయువాడు తనువంతయు నూగిసలాడ దోచువా
  డుల్లము జల్లు జల్లనగ డోలిక లో మెల మెల్ల తూగువా
  డల్లన మీరజాలగలడా యను కొన్న మురారి జాడ లే!
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాకెంతో ఇష్టమైన "మీరజాలగలడా నా యానతి" పాటను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు!

   తొలగించండి


 33. స్వల్ప అడ్జస్ట్ మాడి :)

  పంతము వీడడు! రాడే
  నెంతయు దరిని యవనారి! నెమ్మది లేదే
  సుంతయు గోపికలకు , ఆ
  యింతులకిక జీకటులుగ రేయెండ లయెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. అల్లదెమోడిపాలనకుహారతినీయనిముఖ్యమంత్రులా
  ఫుల్లసరోజనేత్రలకుపూర్తిగచీకటిలయ్యెవెన్నెలల్
  చల్లగరాజ్యమున్బరగజాలినశక్తినిగూడగట్టుచు
  న్నుల్లముసంతసించగనునోర్పునుగల్గెడురాజ్యమేదగున్

  రిప్లయితొలగించండి
 35. పల్లెలు పట్టణమ్ములను వ్యత్యయ మేమియు లేక వాసిగా
  నెల్లలు దాటగా యువత నేత్రుని వీడిన గేస్తురాలకున్
  మల్లెల సౌరభమ్ములవి మారుని బాణము లైనవేళలో
  ఫుల్లసరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటులయ్యె వెన్నెలల్.

  రిప్లయితొలగించండి
 36. ఉల్లము లందు పుష్పశరు డూష్మము పెంచుచు నుండె చెచ్చెరన్
  నల్లని వాడు సంతతము నాట్యము చేయ మనస్సు లందునన్
  చల్లని వేళలోన కడు చక్కని యూహల తేలుచుండగా
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

  రిప్లయితొలగించండి
 37. పిల్లనగ్రోవి పాటలు వినక నచట
  ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె
  విరహమోపగ లేకనా వెలదు లెల్ల
  వేచి యుండిరి శౌరిని వెదికి కొనుచు

  రిప్లయితొలగించండి
 38. నల్లని మేనివాడెపుడు నవ్వుల పువ్వుల పూయునట్లుగా
  నుల్లము నెల్లవేళలను నొప్పుగ రంజిల చేయువాడిలన్
  చల్లగ జారుకొన్న తరి సంతసమెల్లయు జారి పోవగా
  ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"*


  రిప్లయితొలగించండి