సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆటవెలది వ్రాయండి.
నాలుగు పాదాల యతిస్థానంలో వరుసగా 'స-ర-స్వ-తీ' అనే అక్షరాలుండాలి.
(లేదా...)
సరస్వతీ దేవిని స్తుతిస్తూ చంపకమాల వ్రాయండి.
న్యస్తాక్షరములు.....
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 6వ అక్షరం 'ర'
3వ పాదం 15వ అక్షరం 'స్వ'
4వ పాదం 21వ అక్షరం 'తీ'
జగతి నేలు తల్లి సరిలేరు నీకంట
రిప్లయితొలగించండిలక్ష్య బెట్టి మమ్ము రక్ష జేసి
చదువు నేర్పి మాకు స్వశక్తి నీయగ
తెలివి గలిగి బ్రతుక తీరు మలచు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వశక్తి' అన్నచోట గణదోషం. "చదువు నేర్పి తెలివి స్వచ్ఛత నీయగ" అందామా?
శరణు గోరుచుండ్రి సకలజనులు నిన్ను
రిప్లయితొలగించండిఅక్షరమ్ము నిచ్చి రక్ష జేయు
ఆస్తికులను బ్రోచి స్వస్తత జేకూర్చ
ధరణి నేలుమమ్మ తిరము గాను.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వస్థత' అన్నది సాధురూపం.దానివల్ల ప్రాసయతి తప్పుతుంది. చివరి న్యస్తాక్షరం 'తీ'. మీరు హ్రస్వంగా ప్రయోగించారు.
రిప్లయితొలగించండిచదువుల జవరాల! సముచితముగ నహ
రహము వలయు నమ్మ రహియు తల్లి!
వాణి! కరుణ జూపు స్వనితపు మెరుపుల
తెఱగు పల్కు లమర తీరు గాన
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆటవెలది వ్రాయండి.
నాలుగు పాదాల యతిస్థానంలో వరుసగా 'స-ర-స్వ-తీ' అనే అక్షరాలుండాలి.
సకలవేదసారసరసిజాసనవీవె !
రమ్యవర్ణభావరసశుభాంగి !
వాణి ! యజుని రాణి ! స్వరసుధావర్షిణి !
దేవి ! గొను సరస్వతీ ! ప్రణతులు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసరస్వతీ దేవిని స్తుతిస్తూ చంపకమాల వ్రాయండి.
తొలగించండిన్యస్తాక్షరములు.....
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 6వ అక్షరం 'ర'
3వ పాదం 15వ అక్షరం 'స్వ'
4వ పాదం 21వ అక్షరం 'తీ'
సతతము నీ పదాంబురుహసన్నిధి నా మది నిల్చినంత , వి...
శ్రుతమగు సారవాఙ్మయము శోభిలు నా రసనాగ్రసీమ ! భా...
రతి ! కరుణాపయోనిధి ! సరస్వతి ! సుస్వరదివ్యదీధితీ !
స్థితమతి గోరుచున్ దలచితిన్ కరుణింపవె ! మంగళాకృతీ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
సరసత జిల్క నుంచి,కడు
రిప్లయితొలగించండిచక్కని గ్రంథము చేత దాల్చుచున్,
మురిపెము దీర వీణియను
మ్రోగగజేయుచు,బద్మహస్తవై,
మెరసెడి యక్షమాల గొని,
మేదురభాస్వరనేత్రదృష్టితో,
జిరముగ మమ్ము గాంచగదె!
చిన్మయి!ధాతృనిరాణి!భారతీ!
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
రిప్లయితొలగించండిచదువు లి చ్చి మాకు సరస భావము లిచ్చి
రిప్లయితొలగించండిరక్ష జేయు మమ్మ రహి ని తల్లి
వరములిచ్చి నీవు స్వర వీణ పాణి వై
తి ర ము గాను కోర్కె తీర్చు మమ్మ
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని మొదటి, మూడవ పాదాలు తేటగీతి, రెండవ, నాల్గవ పాదాలు ఆటవెలది అయ్యాయి. సవరించండి.
సకల విద్యలసతి సరసిజు ముఖవాసి
తొలగించండిరమ్యమైన వాక్కు రసనయందు
వరలజేయగ మృదు స్వనంబుదోడుత
దేవి నిన్నుగొల్తు తీరుగాను
సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మృదు స్వనము' అన్నచోట 'దు' గురువై గణదోషం. "వరలగన్ మృదువగు స్వనంబు..." అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!
తొలగించండిసకల విద్యలసతి సరసిజ ముఖవాసి
రమ్యమైనవాక్కు రసనయందు
వరలగన్ మృదువగు స్వనంబు దోడుత
దేవి నిన్నుగొల్తు తీరుగాను!
రిప్లయితొలగించండిఆటవెలది
చదువులమ్మ నెపుడు సద్భక్తి సేవింప
లాల నీయ శీలి రక్ష సేయు
జ్ఞానియై వరలిల స్వస్తి చేకూరును
ధీజ నాళి చే ప్రతిష్ఠ నొందు
ఆకుల శివరాజలింగం వనపర్తి
శివరాజలింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్తాక్షరం 'తీ'. మీరు హ్రస్వంగా ప్రయోగించారు.
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండివా.చ.స్ప. తీ స్వరూపులకు వందనములు.
మిమ్ము యతులతో బంధించే ప్రయత్నము చేసితిని.. తప్పైయిన మన్నించ ప్రార్థన!
వయసు మీద బడిన వాగ్మయమ్మీడని
శంకరార్యు మనకు చదలుకెంపు*
పట్టి ప్రాస యతుల స్పష్ట బఱచి యెప్డు
తెనుగుభాష నున్న తీపి దెలిపె
చదువు మొదలు బెట్ట సరసవాఙ్మయమునుఁ
రాగయుక్త మౌచు రయము బెంచి
సర్వ జనులు మెచ్చి స్వజనులు గొలువగా
తెలుగు భాష కింత తీపి గూర్చె
*చదలుకెంపు-సూర్యుడు
ధన్యవాదాలు!
తొలగించండి'వాఙ్మయమ్ము విడవి" అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[స]తతము నిన్నుఁ గొల్తు ఘన సంస్తుతిఁ; బ్రేమను నిత్తు నెప్డు హా
రతి; కవితల్ [ర]చింపఁ బిసరంతయు సేగి హుళక్కిగా సర
స్వతి యిడి, కావుమమ్మ! సరసస్థిర స[స్వ]ర శాంతిఁ గూర్చు గీ
తి తిరముగా వెలుంగ, వినుతించెదఁ బద్దెములందు భార[తీ]!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ. (స)రళమె విద్యలెల్ల మన సారగ మ్రొక్కగ నిన్ను శారదా!
రిప్లయితొలగించండివరములు కో(ర)నెన్నడును ప్రార్ధన చేసెద నమ్మకమ్ముతో
నిరతము పూజలొడ్డెదను , నెందున హ్ర(స్వ)ము చూడ బోకు! నా
కరమును వీడ వద్దు ! కనికారము జూపుము తల్లి భార(తీ)!!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కనికరము'ను 'కనికారము' అన్నారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి[స]కల కళా విభూషిత ప్రశస్త కవిత్వ విరాజమాన ధీ
తొలగించండిర కర ఝరీ [ర]సోజ్జ్వలిత రమ్య సుకీర్తిత కావ్య రాజమున్
స్వకర విభాసమానముగ వ్రాయఁగ స[స్వ]ర గాత్ర మానసాం
తికమున నీవు వెల్గుచు విధేయుని నన్ గనుమమ్మ భార[తీ]!
మధుసూదన్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
🙏ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్య వాక్కు గరిమ సతతము నాయొక్క
రిప్లయితొలగించండిరసన పైన నిలిపి రక్ష జేసి,
సత్కవితలనిచ్చి స్వరభావ జగతిలోఁ
దిప్పి నాదు కోర్కె తీర్చవమ్మ..��
రామ్ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ఆ. వె. చదువు లమ్మ గాదె! సకల కళల రాణి
రిప్లయితొలగించండిరాగ మొలికి విద్య రమ్య మవగ
సర్వ కళల నేలు స్వర రాణిఁ నమ్మెద
తేట నిచ్చి నుదట తిలక మద్దు!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్తాక్షరాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
శాబ్ది గొల్చు వాడె సర్వతో ముఖుడౌను
రిప్లయితొలగించండిరాగ మోహములను రగుల నీక
శాంత మెపుడు మదిని స్వస్థత జేకుర
దేవి! వాణి! భారతీని గొలువు
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భారతిని' అనడం సాధువు. అక్కడ "భారతీ నమామి" అనండి.
చదువులమ్మ నిన్ను 'స' న్నుతించెదమమ్మ
రిప్లయితొలగించండిరక్తి గట్టెడి పద ''ర' త్నములను
సముచితముగ నీవె 'స్వ' యముగ నందించ
తెలుగు భాష యింక 'తీ' పినొందు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల కళలయందు సమదృష్టి సారించి
రిప్లయితొలగించండిరక్తి గొలుపు నటుల రసధుని నిడ
చక్కనైనయట్టి స్వరముల సృష్టించి
తీవె వాణి భగవతీ నమోస్తు !
కృష్ణారావు గారూ,
తొలగించండిమంచి పూరణ. అభినందనలు.
సరస చతుర సాధు సంభాషణా యుక్తి
రిప్లయితొలగించండిరమ్య భవ్య కావ్య రచన శక్తి
స్వజన సుజన మైత్రి సద్బుద్ధి సద్భక్తి
తీరు నొసగి వాణి తీర్చి దిద్దు 🙏
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం యతిస్థానంలో 'స్వ' రాలేదు.
సమసిబోవ జన్మ సన్నుతి చేసెద
రిప్లయితొలగించండిరావె నొసగుమది, పరమపదమును
శాశ్వతముగ జేర అస్వతంత్రుడు, కోరె
తిమిర నాశ విద్య తీవ్రముగను
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతిదోషం.సవరించండి.
చదువులజవరాలు-సరసభాషణమును
రిప్లయితొలగించండిరాగసుధలనొసగ-రమ్యగతుల
వరముకోరుకొందు-స్వజనము మెచ్చగ
తీయతేనెలొలుక-తిరముగాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"తేనెలూరపలుకుతీయగాను"గా చివరిపాదంచదువప్రార్ధన
తొలగించండిఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జగతి నేలు రాజు "స"రసుడౌ స్వార్ధాన
రిప్లయితొలగించండిలక్ష్మి మూట గట్ట "ర"క్ష మరచు
చదువు లేక తాను "స్వచ్ఛత వీడుచు
తెలివి వదలు భార"తీ" నమోస్తు
కృష్ణమోహన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సదమలాత్మ నలిన సల్లలిత మృదు క
రిప్లయితొలగించండిర నలినజ హృదంతర నిజ దార
స్వర వరాధి నేత్రి స్వంగ విలాసవ
తీ దయా సరస్వతీ ప్రణతులు
సరసిజ పుస్త కాక్ష సర చారు శుకస్థిత హస్త రాజితా
వర సిత శార దాంశునిభ వక్త్ర విభూషణ దీప్త విగ్రహా
సురుచిర పాండ రాంబర విశుద్ధ ససుస్వర భావ నాక సం
చర చతురానన ప్రణయ జాయ నతుల్ గొనుమా సరస్వతీ
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
31/10/2017 నాటి పద్యము:
తొలగించండి(స)(ర)స మృదు సు(స్వ)రము ల(తి)శయముగఁ దన
(ర)గను గించిదప(స్వ)ర సంగమ మ(తి)
(స్వ)యముగ స(తి) మాన్పంగను వరము నిమ్ము
(తి)విరి కృపఁ జూడుమ (సరస్వతీ) సతతము
కామేశ్వర రావు గారూ,
తొలగించండిశబ్దాలతో ఆటాడుకున్నారు కదా! అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిసమసిబోవ జన్మ సన్నుతి చేసెద
రిప్లయితొలగించండిరావె నొసగుమది, పరమపదముల
సవరదనము జూడ, స్వస్తిముఖుఁడు వేడె
తిమిర నాశ విద్య తీవ్రముగను
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రావె యొసగు' అనండి.
జన్మసార్ధకతకు సలలిత భావాలు
రిప్లయితొలగించండిరక్ష గూర్చునట్టి రచనలొసగి
జాతి మెచ్చునట్టి స్వజనుల మేలెంచు
దివ్యమైనచదువు తిప్పు దశకు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్త్రాక్షరాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
సకల విద్య లొసగు సత్యమ్ముగా దాను
రిప్లయితొలగించండిరసన యందు నిలిచి రహిని గూర్చు
స్వనములన్ని దాను స్వర రాజ్ఞియే దాను
తీరు నొసగు దాను తీపి పలుకు
(స)రస రసజ్ఞ సంచరిత శారద నా మది గొల్వు దీరుమా
తొలగించండిసురసములూ(ర) నా పలుకు శోభను గూర్చు వరంబు లీయుమా
వర శుభ రాగ మాలికల భక్తిగ సు(స్వ)ర హారతిత్తునే
నిరతము నీదు పూజలను నీమము దప్పక జేతు భార(తీ)
సూర్య గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏
తొలగించండిసరసిజాసనుసతి సకలవిద్యాదాయి
రిప్లయితొలగించండిరమ్యమైన మతిని రయము నిమ్ము
వాక్కునకధి దేవి స్వరరాణి వీవమ్మ
తిరము గనిను భారతీ కొలుతును.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరసిజురాణి శారద విశాలవిలోచని విశ్వసాక్షిణీ
రిప్లయితొలగించండివరశృతిసారరూపిణి శుభాంగిని మంజుల వాగ్విలాసినీ
విరివిగ మాకునీయవె వివేకము,సుస్వరగాత్రమాధురుల్
తరగని పెన్నిధీ!నిను సతమ్ము మనమ్మునగొల్తు భారతీ!
సీతాదేవి గారూ,
తొలగించండిచక్కని పూరణ. బాగున్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!
తొలగించండి
రిప్లయితొలగించండిసరసిజభవు రాణి సద్విద్య లొసగుచు
నహరహమ్ము మనకు రహిని కూర్చు
చక్కని గళమొసగి స్వరమెత్తి పాడెడి
తీరు నేర్పి సన్మతీయ వమ్మ
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువులమ్మ నిన్ను *స*ద్భక్తి మ్రొక్కెద
రిప్లయితొలగించండిరమ్ము నన్ను బ్రోవ *ర*యముగాను
సతము నీవు నిలువ *స్వ*యముగ మది వ్రాసి
తెలుగు పదముల కుతి *తీ*ర్చు కొందు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలది
రిప్లయితొలగించండిపతికి మోము నందు సతిగ నీవొదుగగా
శ్రుతుల వేల్పు ననవరతము మెరసె
పలుకు లమ్మ నాదు స్వరమందు కొలువైన
వ్రాయఁ బాడి కవిత తీయనగును
మరొక పూరణ
రిప్లయితొలగించండిచదువు సంధ్య లొసగు సరసిజ భవురాణి
రాగమలర మనకు రయము గాను
సర్వకళల రాణి స్వరమెత్తి పాడెడు
తీరు నేర్పవమ్మ తిరము గాను
చదువులమ్మ!యిడవె సహృదయ భావన
రిప్లయితొలగించండిరమ్య కవన ధార రసన నిలువ
వాగ్విలాస గరిమ స్వరనిధాన మహిమ
స్థిరమగుమతి సుస్థితియు ప్రతీతి
శాబ్ది,బాణ,బ్రహ్మ( స)తి, చదువుల జవ
రిప్లయితొలగించండిరాలు,బాస,అంచ (ర)వుతు భార్య
స్వంజు గృహిణి, శుక్ల, (స్వ)చ్ఛమాత,పలుకు
దేవి,దయను జూపు (తీ)గ బోడి
సన్నుతింతు నిన్ను సరసిజ భవురాణి
రిప్లయితొలగించండిఅక్షరమ్మునిచ్చి రక్ష జేయు
భక్త జనుల కీవు స్వస్తిని గూర్చుచున్
బ్రోవరావె ధరణి తీవ బోడి.
సరసిజ నేత్రివంచు నిను సత్కృప గోరి భజించువాడనై
రిప్లయితొలగించండిధరణిని జేరరమ్మనుచు తల్లిని గోరెద, హంసవాహినిన్
గరములు మీటఁ వీణియయె క్వాణన సుస్వర నాదమీనగన్
భరమని యెంచబోకుమిక భక్తులఁ బ్రోవగ తల్లి భారతీ
డా
రిప్లయితొలగించండిపిట్టా సత్యనారాయణ
సన్న నన్నము పులుపు రసమ్ము కొరకు
రాత పూత నొనర నీదు రచన నెరు గ
వరుస నా చా ర్య వరు ని నిస్వనము నివ్వ
తిండి ,గుడ్డ, గూడుల నస తీరే వాణి!