30, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3063 (కలువల చెలికాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్*"
(లేదా...)
"కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై"
(అచ్చతెనుఁగులో పూరిస్తే సంతోషం!)
(*పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అమెరికాలో చేసిన 
అచ్చతెనుఁగు అవధానంలో అడగడానికి నేను పంపిన సమస్య)

34 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కలువలు వాడిపోవగను గారబు దీదికి వంగభూమినిన్
  కిలకిలలాడు భామలను కెవ్వున నవ్వుచు దిల్లినంప నా
  చెలియలు పార్లమెంటునను శీతల మిచ్చుచు వెల్గుచుండగా
  కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అహ్మద్ సజ్దా, మిమి చక్రవర్తి, లాకెట్ ఛటర్జీ, దేవశ్రీ చౌదురి,
   కాకోలి దస్తిదార్, మహువా మైత్రా, అపరూప పొద్దర్, శతాబ్ది రాయి, మాలా రాయి, నుస్రట్ జహాన్, ప్రతిమా మండల్,

   తొలగించండి
 2. పులిగా పేరును గాంచిన
  దళపతి మనువాడి భార్య దాసుండవగా
  తలిదండ్రులె పలికి రిటుల
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి
 3. వలపుల మోజున చంద్రుడు
  కలవర పడిమోద మందు గారవ మొప్పన్
  చెలువము కోరుచు తొరపడి
  కలువల చెలికాఁడు మ్రింగె కాక వెలుంగున్

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  తలపుల నిండియుండెనిదె తల్పులు తీసితి ! వాడు రాడు ! లో...
  పలకరుదెంచు గాలి సడి పాముబుసన్ తలపించె , మల్లెపూ...
  వులు గన నగ్గిరవ్వ , లటుపోయిన నిప్పులకుప్ప దోచెనీ
  కలువల సంగడీడెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ గురుభ్యో నమః 🙏🙏

   వలపుల ఱేడ ! వచ్చితి విభావరినంచు ముదమ్మునంది రా...
   గిలి ప్రమదమ్మునందునెడ ,
   గ్రీష్మనిశల్ కురుచయ్యెనంచు , జా...
   బిలి గని యుత్పలమ్ము విలపింపగ , నెర్రని కన్నుదమ్ములన్
   కలువల సంగడీడెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

 6. అచ్చా! తెలుగేనా యిది :)

  అల తూరుపున పొడిచె నా
  కలువల చెలికాఁడు, మ్రింగె కాకవెలుంగున్
  పలుమారులున్ జిలేబీ
  వలె దోచుచు పుడమిపైన వరలుచు నెపుడున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. (దుష్యంతవిరహిణి శకుంతల అనసూయాప్రియంవదలతో)
  చెలువల నెందు కీతడిక
  చెన్నుగ జాలిని చూపకుండ ని
  ట్టుల నెడదన్ గలంచుచును
  డొల్లగ జేయుచు వంత నింపెడిన్?
  వలపుల జంటలన్ గనుచు
  వంకరచేతల వెక్కిరింపగా
  కలువల సంగడీ డెసగి
  కాకవెలుంగును మ్రింగె నల్కమై.
  (కలువల సంగడీడు-చంద్రుడు;కాకవెలుంగు-వెచ్చనికాంతి;చెన్నుగ-చక్కగ)

  రిప్లయితొలగించండి
 8. చెలివలపునుమరువకమది
  కలవరమాయెనుకులుకులకలికినిజూడన్
  చెలువముచెడి యెడయికతో
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి


 9. అలమలమాయటంచడిగి నావల తూరుపు దిక్కు దోచి సై
  వలపుల తేరు నెక్కి తల వాల్చని ముద్దు జిలేబులన్ తలం
  చి లివయు గాంచి సత్తువల సేవల గోరుచు నాకసమ్ములో
  కలువల సంగడీడెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కలగని బెమలకు లోనయి
  పలికితివా నీవు లేక పరగడుపుననే
  కలు దాగితివా ? యెక్కడ
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్ ?

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా సత్యనారాయణ
  బలిమికి నష్టమ చంద్రుని
  కలగన నిమ్మన్న రవియె కడకానంగన్
  ఇల నిట నిశి యనుకొని యా
  కలువల చెలికాడు మ్రింగె కాక వెలుంగున్

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా సత్యనారాయణ
  *నలువవు,పెద్ద బాధ్యతయె నాకిది సంబురమయ్య యో జగన్
  మలుపున నాంధ్ర నేలు నసమానుని వంచితి వీవు భేష*నన్
  జలముల జాకరూకతన చంద్రుడునౌ తెలంగాణ నేత యా
  కలువల సంగడీ డెసగి కాక వెలుంగును మ్రింగె నల్కమై

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  [సముద్రమును దాఁటి లంకఁ బ్రవేశించి, యా రావణుఁ జంపెద ననెడి యుత్సాహమున నెదుటఁ గాంచఁగా, నా సముద్ర మువ్వెత్తున నెగసి పడుచుండెను. దానినిఁ గనిన శ్రీరాముఁ డమితోగ్రుఁ డయ్యెను! అప్పు డా రామచంద్రునిఁ జూడఁగాఁ జల్లనివాఁడైన చంద్రుఁడు కోపమున వేవెలుఁగైన సూర్యుని మ్రింగినాఁడా యనునట్లుండెను...అనుట]

  చెలఁగియు నీటికుప్ప నిఁకఁ జెంగున దాఁటి, బిరాన బంతిమో
  ములదొరఁ జంపె దంౘుఁ దన మోమున సంతసమొల్కఁ గాంౘ, నా
  తలికె యదొక్కమా ఱొదరి దబ్బున లేవఁగ, వేగ దానిపైఁ
  ౙలమునుఁ బూనె నత్తఱిని ౙన్నపుఁగాపరి! యెంచి ౘూడఁ, నా

  కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై!!

  రిప్లయితొలగించండి
 14. ,వలపులబెంచు నెవండొకొ
  అలయక నాగ్రహపు కేతు వాకసమునతా
  చెలరేగి నేమి చేసెను
  కలువల చెలికాడు .మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గురుభ్యోన్నమః🙏

  వెలుగులదొర నిక్కాకల
  జెలగెను శరదృతువు నందు జేజే బువ్వన్
  చలువలను శీతభానుడు,
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్.

  వెలుగులదొర-సూర్యుడు; నిక్కాక-మిక్కిలివేడి
  చెలగెను-ఖండించెను;
  జేజేబువ్వ-చంద్రుడు,శీతభానుడు

  రిప్లయితొలగించండి
 16. కలగంటిరె యిట్లంటిరి
  కలువలచెలికాడుమ్రింగెకాకవెలుంగున్
  గలువలఱేడగుచంద్రుడు
  నలమ్రింగెనె?గాకవెలుగునబ్బురమొందన్ !

  రిప్లయితొలగించండి
 17. అలరుచు మింటను జుక్క గ
  ముల యొడయుఁడు వెన్నెల దొర ముద్దు లొలుకెడిం
  జలువడి పఱచఁగ నెల్లం
  గలువల చెలికాఁడు మ్రింగె కాఁక వెలుంగున్

  [కాఁక వెలుఁగు = ఎండ]


  చలువ వెలుంగు నీఁ దలఁచి చల్లని జాబిలి రేయి యేలికే
  కలవర మందె ముజ్జగము కాఁక వెలుం గెకిమీఁడ చాలికం
  దలఁగు మటంచు నా యివము దాయను వైళమ ప్రొద్దు గ్రుంకగం
  గలువల సంగడీఁ డెసఁగి కాఁక వెలుంగును మ్రింగె నల్కమై

  [కాఁక వెలుఁగు = ఎండ]

  రిప్లయితొలగించండి
 18. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తలుపుల చాటు దాగుచును తాండవ మాడుచు పేరు చెప్పకే
  పలుకుల రాణి మెచ్చగను పాడుచు నాడుచు నవ్వులొల్కుచున్
  కులికి జిలేబి శంకరుని కొల్వున చేయగ పూరణమ్ములన్
  కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై!

  రిప్లయితొలగించండి
 19. అలసిన జనులకు రాత్రికి
  వలసిన విశ్రాంతినిచ్చు బాధ్యతతోడన్
  చలువపు కౌముదిని బరచి
  కలువల చెలికాడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి
 20. అలిగిన చెలిరోహిణినే
  పలుకులతో బుజ్జగించి పాట్లుబడంగన్
  అలకను దీర్చగ ప్రేమతొ
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్!!

  రిప్లయితొలగించండి
 21. కలనునగానిపించెనటకాటమరాయనిరామశాస్త్రికిన్
  గలువలసంగడీడెసగికాకవెలుంగునుమ్రింగెనల్కమై
  కలవరమందియాక్షణముకల్వలసామినిజూడనాతురన్
  దెలిసెనుదానుచూచినదిదీటుగరాదనిమ్రింగరశ్మినిన్

  రిప్లయితొలగించండి
 22. పొలుపగు శారద సంజను
  పొలయుచు వెన్నెల చెలువపు పున్నమి రేయిన్
  జిలిబిలి వెలుగుల దొర యా
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి
 23. [2]

  (శివపార్వతులను సతీపతులఁ జేయుటకై సుమబాణములఁ బ్రయోగించిన మన్మథుని శివుఁడు భస్మ మొనర్చిన సమయానఁ బార్వతికి శివుఁ డెట్టులఁ గనిపించెనో తండ్రి హిమవంతునకుఁ దెలుపు సందర్భము)

  "వలిమలచూలి నన్ బడరుఁ బన్నుగ నాలుమగండ్రఁ జేయఁగాఁ
  దలఁపులచూలు వేయ నటఁ దా ననతూఁపులఁ, గోడెరౌతు తా
  నలుకను నగ్గికంటఁ గనె! నత్తఱి నా కనిపించెఁ దండ్రి! యా
  కలువల సంగడీఁ డెసఁగి, కాఁకవెలుంగును మ్రింగె నల్కమై!!"

  [వలిమలచూలు=పార్వతి; బడరుఁడు=శివుఁడు; తలఁపులచూలు=మన్మథుఁడు; ననతూఁపులు=పుష్పబాణములు; కోడెరౌతు=శివుఁడు; కలువల సంగడీఁడు=చంద్రుఁడు; కాఁకవెలుంగు=సూర్యుఁడు; అల్కమై=కోపముతో]

  రిప్లయితొలగించండి
 24. కలువలకుంట్ల రాయడదె కమ్మని కారపు నచ్చతెన్గునన్ బలువురు మెచ్చుకైవడిన బల్కుల సొంపగు పల్లెమాటలున్
  గలగల పారజూసి తెలగాణను వేర్పడజేసె జూడగా
  కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై

  రిప్లయితొలగించండి
 25. చంపకమాల
  వలపులు రేగి నా యెదఁ జివాలున పైబడ కోరికయ్యెరా!
  పిలువగ నూర్వశిన్పలుక బెట్టును జూపెద వేల పాండవా?
  కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై
  తలపుల కాదుకూడదను దాపరికమ్ము మగాడి కేలరా?

  రిప్లయితొలగించండి


 26. ఇలమురిసెతార రాగా
  కలువల చెలికాడు. మ్రింగె కాక వెలుంగున్!
  కులుకుచు వచ్చిన మేఘము
  చలియును మొదలయ్యెనపుడె జవమున గనుమా

  రిప్లయితొలగించండి
 27. కలికికి విరహము పెరుగగ
  వలువలె బరువయ్యె, పెరిగె వక్షోజమ్ముల్
  నెలవెలుగే వేడెక్కెను
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి
 28. పిలిచిన నేమి రాననుచు ప్రేయసి కోర్కె తిరస్కరింపగా
  లలనయె తాపమందగ ప్రలంబములే బిగుసెక్కుచుండగా
  వలువలు భారమయ్యె తను వంతయు ఘర్మజలమ్ము పొంగెనే
  కలువల సంగడీ డెసఁగి కాకవెలుంగును మ్రింగె నల్కమై

  రిప్లయితొలగించండి
 29. కందం
  తొలకరి మొదలై మేఘులు
  ఖలులై ఎడబాటు పంచ గాసిలి తపనల్
  చెలియలికట్టను దాటఁగ
  కలువల చెలికాఁడు మ్రింగె కాకవెలుంగున్

  రిప్లయితొలగించండి