. *శ్రీ గురుభ్యో నమః* శంకరాభరణం - సమస్యాపూరణం సమస్య :: చెడువాఁ డీతఁడటంచుఁ బల్కెద రయో శ్రీ రామమూర్తిన్ గవుల్. విరుద్ధార్థం :: ధర్మమూర్తి యైన శ్రీరామమూర్తిని చెడ్డవాడు అని ఈ కవులు అంటున్నారు అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం. సందర్భం :: సుగుణాభిరాముడైన శ్రీరామమూర్తిని వర్ణిస్తూ స్వామి యొక్క సచ్చరిత్రను కవులు సజ్జనులు అనేకవిధాలుగా కీర్తిస్తూ ఉండగా సీతామాతను అపహరించిన రావణాసురుడు శ్రీరామమూర్తి స్తుతిని వినడం ఇష్టం లేక బాధపడ్డాడు. అజ్ఞానంతో ఆ కవులందఱిని మూర్ఖులుగా భావించి “అయ్యో ఈ కవులు శ్రీరామమూర్తిని మోక్షమిచ్చెడు వాడు అని అంటున్నారే అని నిజమైన మూర్ఖుడు అగు రావణుడు విచారించే సందర్భం. పూరణ :: చెడువా డంచు గురుండు బల్కగ వధించెంగా సుబాహున్, రమిం చెడువా డీతడు యోగిమానసములన్, శ్రీరూప లక్ష్మిన్ వరిం చెడువా డీతడు, ధర్మవర్తన మిలన్ క్షీణింపగా నుద్ధరిం చెడువా డీతడు, దుష్టరాక్షసతతిన్ శిక్షింప మూర్తిన్ ధరిం చెడువా డీతడు, భక్తపాలనకళాశ్రీమంతుడై వారి బ్రో చెడువా డీతడు, సజ్జనావళి సదా సేవింపగా వారి గా చెడువా డీతడు ప్రాణికోటికి తుదన్ శ్రీధామమౌ ముక్తి ని చ్చెడు వాడంచు నుతింప; రావణుడనెన్ ఛీ మూర్ఖులై మోక్ష మి చ్చెడువాఁ డీతఁడటంచుఁ బల్కెద రయో శ్రీ రామమూర్తిన్ గవుల్. కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరుజిల్లా 8-6-2019
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
గు రు భ్యో న మః నిన్నటి పూరణ స్వీకరించ మనవి
{ ఓరుగల్ వాసులు అవధానమును ఒప్పుకొనే విధంగా =
రామమూర్తిగారు పద్యకవితానందమును రహింపజేశారు }
రామమూర్తి పద్యకవిత రహిదలిర్చె --->
నోరుగల్ వాసు లవధాన మొప్ప || మనిరి
వార లెల్లరు సాహితీ స్వర్గసీమ --
యందు , పోతనామాత్యు డాహ్లాద మొంద
( మను = జీవించు , సంచరించు , మసలుకొను )
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
గురుమూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పడిలే చెడికెర టమువలె
రిప్లయితొలగించుకడుమో దముగూర్చు నంట కందర్పు డిలన్
సడిజేయ కవలపు విసరెడి
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
అక్కయ్యా,
తొలగించుపద్యం బాగుంది. కాని పూరణ భావం అర్థం కాలేదు. 'కవలపు విసరెడి'?
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించుచెడు మార్గమ్ములు బట్టి పాపములనున్ శీఘ్రమ్ముగా జేయుచున్
కడు కష్టమ్ముల నోర్చలేకనిక భల్ కంపించి ప్రార్థించగా
కడకున్ భక్తుల సంకటమ్ములనహో గారమ్ముతో ప్రీతి దీ
ర్చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుదైవపరంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించుకడు భక్తితోడ నిత్యము
రిప్లయితొలగించుగుడికేగు నతం డనుచును కుసుమమ్ములతో
విడువక రాముని పూజిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుఅడుగడుగున కలుపుచు తన
యడుగుల నరె విడువక నభయమును జనుల యొ
త్తిడి నెడపు ప్రభువు, తలకా
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడిగిన నుడివెదడీతడు
రిప్లయితొలగించువడిగా శతపూరణముల వడ్డించునుగా!
గడబిడలేలను? బూరిం
"చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"
విట్టుబాబు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అడిగిన నీతడు నుడువును' అనండి.
సరదా కోసం
రిప్లయితొలగించుగడగడ పద్యము జెప్పుచు
దడదడ లాడించి సభను దక్షత తోడన్
పడతుల హృదయాలను దో
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈయన మా పక్కింట్లో రామమూర్తి..
రిప్లయితొలగించుగడసరి యాతని పడతియె
వడియములన్ విసరిగొట్టు వాదనలందున్!
గొడవేలని తల పంకిం
"చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"
😄
విట్టుబాబు గారూ,
తొలగించుమీ విట్టీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుమడకన్ త్రవ్వగ పుట్టినట్టి వనితన్ మారాజుగాపెండ్లియా
డె! డుబాయించెడు రాక్షసాధముల నోడించెన్ సునాయాసమై
విడువంగన్ వల దయ్య, రాఘవుని మోవిన్బిల్వ,రక్షించి కా
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తడయక తాపస,మౌనుల,
రిప్లయితొలగించుసడలని సద్భక్తి నుండు సాధు జనాళిన్,
వడివడి ధీరతతో గా
చెడు వాడని రామమూర్తి జెప్పెదరు కవుల్.
ప్రసాద రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Thank you sir namaste
తొలగించు(సీతాపరిత్యాగపరితప్తహృదయుడు శ్రీరామచంద్రుడు)
రిప్లయితొలగించుఉడుతన్ బ్రేమగ వీపుపై నిమిరెనే!
యుల్లాస ముప్పొంగగా;
కడలిన్ గాంచుచు రక్షణం బొసగెనే!
కారుణ్యనేత్రాలతో;
సడలన్నేరని రాజధర్మవశుడై
సాధ్విన్ వనంబంపగా
చెడువా డీత డటంచు బల్కెదరయో!
శ్రీరామమూర్తిన్ గవుల్.
జంధ్యాల వారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించుమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుచెడు పల్కుల్ దరిఁజేరనీడు కవితాసేద్యమ్మునన్ , మెండు పూ..
చెడు పూలన్ గన చంపకోత్పలములౌ చిత్రమ్ము , గంధమ్ము బం...
చెడు వాటిన్ గనగా రసాన్వితములౌ , శ్రీ వాణి సద్భక్తిఁ గొ..
ల్చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఅడిగిన తక్షణము సమ
స్య డిగనురికిన క్షణమే పసందుగ పూరిం
చెడు కవి జనాళి మది దో
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెడువాడైనను శరణన
రిప్లయితొలగించుకడుకరుణను జేరదీసి కాచెడివాడే
విడనాడక ధర్మము నడ
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించుమత్తేభ విక్రీడితము
రిప్లయితొలగించువిడునే చేతిని రామభద్రుడుమదిన్ విశ్వాసమున్ నమ్మగా
నడువన్నాతని రీతిలో సుమతిఁ సన్మార్గమ్ము నాశించుచున్
చెడువారెవ్వరిఁ జూతుమే! నికరమై, సేవించి ప్రార్ధించి బ్రో
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సేవించి ప్రార్థింప బ్రోచెడువా...' అంటే బాగుంటుందేమో?
బడలిన యొడలిని దలచక
రిప్లయితొలగించుసడలని భక్తిని గొలిచెడి శబరిని జూడన్
నడచుచు నడవిని కరుణిం
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
యజ్ఞమూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పడిలే చెడికెర టమువలె
రిప్లయితొలగించుకడుమో దముగూర్చు నంట కందర్పు డిలన్
విడువక సతినే మురిపిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
అక్కయ్యా,
తొలగించుసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు[1]
"విడువంబోఁడయ పద్యవిద్య నెపుడున్ బెంపైన భావంపు సొం
పిడుచున్ బద్దెము లెన్నియేని సతమున్ హేత్వర్థసంపృక్తిచే
నడరన్ శబ్దము లేర్చి కూర్చి మదులన్ హర్షాంబుధిన్ ముంచి తే
ల్చెడువాఁ డీతఁ" డటంచుఁ బల్కెదరయా శ్రీ రామమూర్తిన్ గవుల్!!
[2]
"చెడువాఁ డీతఁడు కాఁడు! సంతతము సుశ్రీదంపుఁ బద్యాలఁ గూ
ర్చెడువాఁ డీతఁడు! రమ్యశబ్దతతులం జిప్పిల్లఁగాఁ జేయఁ జూ
చెడువాఁ డీతఁడు! యుక్తభావములు రంజిల్లంగఁ బద్యానఁ బూ
న్చెడువాఁ డీతఁ!" డటంచుఁ బల్కెదరయా శ్రీ రామమూర్తిన్ గవుల్!
మధుసూదన్ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించుమధురకవిగారూ,అద్భుతమైన పూరణలండీ! అభినందనలు!నమస్సులు!
తొలగించుధన్యవాదాలండీ సీతాదేవిగారూ!
తొలగించు
రిప్లయితొలగించుఅడగన్ తా తడబాటు లేకను సమస్యల్ పూరణల్ జేయుచున్
కడు రమ్యంబగు పద్య పుష్పముల విఖ్యాతమ్ము పూయించడే?
సడిలేకన్ ఘన పాండితీ ప్రతిభచే చక్కంగ డెందంబు దో
చెడువా డీత డటంచు బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
🌱 ఆకుల శాంతి భూషణ్🌱
🌷 వనపర్తి🌷
శాంతి భూషణ్ గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వడిగా నడచుచు నడవుల
రిప్లయితొలగించుదడిగా దండించి దుష్ట దానవులెల్లన్
విడనాడక ధర రక్షిం
చెడు వాడని రామమూర్తి జెప్పెదరు కవుల్.
వామన కుమార్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడిగిన తోడ నె పూరణ
రిప్లయితొలగించుత డ య క నొ న రించి మంచి ధారణ పరు డై
వడి వడి గా మెప్పు వ రిం
చెడు వాడని రామ మూర్తి జెప్పు దురు కవుల్
రాజేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం. దృఢమున నమ్మిని వారకు
రిప్లయితొలగించుకడదేర్చనుకష్టములను కరుణా మయుడై
విడువుకుమా ! వానిన్ బ్రో
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమొదటి పాదంలో టైపాట్లా?
కడలిని వారధి గట్టగ
రిప్లయితొలగించువడివడి శిలలను బరచెడి వారల దోడున్
నుడుతయు నడువగ దీవిం
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచెడు రాకాసుల దునిమెను
రిప్లయితొలగించుకడు ప్రేమను తా స్వజనులఁ గాపాడెననీ
అడుగుల భజనలఁ గీర్తిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"...గాపాడెనటం । చడుగుల..." అనండి.
.కందము
రిప్లయితొలగించువిడువక నవధానంబులు
వడిగొని నెరవేర్చు బుధుల పాలిటి వరమై
కడు మోదము గూర్చు నెటుల?
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్.
ఆకుల శివరాజలింగం వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"గూర్చ నెటుల..." అనండి.
అడిగినలేదనకుండను
రిప్లయితొలగించుబడుగులకందించెబుడుగువాడైనానా
డేడగడయైగడననొం
*"చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"*
అడుగో పుణ్యుడు ఱేడు లేడతని శౌర్యాధిక్యమున్ మించెడున్
రిప్లయితొలగించుబొడుగౌమిండడు మూడుమూఢులకు శంభుండాడు విల్విర్చియున్
బడతిన్ బొందగలాడు వెన్నెల నెలన్బండించు మోముండు గా
*"చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్"*
చెడుమాటాడని శెట్టి, చెట్టలకు సూచించున్సదామేలు, గుం
రిప్లయితొలగించుచెడు బత్తిం దరుమూషికంబు నకిడెన్ జిన్నారి రేఖల్, దలం
చెడు వారందరి తోడునీడ, గుహుడున్ జెంచున్నహల్యాళి గా
*"చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్"*
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుకడునేర్పున నవధానము
రిప్లయితొలగించువడివడిగా పూర్తిజేయ?వహ్వాయనగా!
తడబాటెరుగక పూరిం
చెడు వాడనిరామమూర్తి జెప్పెదరుకవుల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపుడమిన్ ధర్మము నిల్పగా భువిభరంబున్ దీర్చి రక్షించగా
రిప్లయితొలగించుకడిమిన్ శిష్టజనంబులన్ కరుణచే కాపాడగా ధాత్రియన్
గుడిలో మానవ రూపుడై అసురులన్ గూల్చంగ పెన్ జివ్వ గెల్
చెడువాడీతడటంచు బల్కెదరయో శ్రీరామ మూర్తిన్ గవుల్
అరాశ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునడుచును ధర్మము దప్పక
రిప్లయితొలగించువిడువక దన దండ్రి యాజ్ఞ విధిగా నెరపున్
అడుగకనే వరములు పం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
విడిచెన్ రాజ్యము భోగ భాగ్యములనా వీరుండు పిత్రాజ్ఞకై
తొలగించునడిచెన్ ధర్మము దప్పకుండ ధరణీ నాధుండు దానెప్పుడున్
చెడు మార్గమ్ముల జేరనీక దయ రక్షించున్ సదా మమ్ము గా
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయా శ్రీరామమూర్తిన్ గవుల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుసమస్యా :-
రిప్లయితొలగించు"చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"
*కందం*
చెడు నడతన పోబోకని
నృప తనయకు కథలచేత నీతిని జెప్పెన్
కడునేర్పుతోడ బోధిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
.......................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"నడతను" అనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించువడిగల పద్యము వలదని
పడిపడి నా వామ పక్ష వాసిని బెంచన్
కడకా లబ్ద ప్రతిష్టుల్
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"పడిపడి యా..." అనండి.
పుడమిని బుట్టిన పడతియు
రిప్లయితొలగించునడుగున యడుగై నడచెడి ననుజునితోడన్
కడు ముదము భద్రగిరి నిల
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"..నడుగున నడుగై నడచెడి యనుజుని... నిలిచెడువాడని..." అనండి.
నుడికారపుటందము మరి
రిప్లయితొలగించుచెడనీయక పూరణములు చేయుచు కవితా
పడఁతికి మెరుగులు దిద్దెం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"దిద్ధించెడు" టైపాటు.
తడవ తడవకు మనస్సును
రిప్లయితొలగించుసడలించక తననుకొలుచు జనులందరినిన్
విడువక దయచూపుచు గా
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునుడువుల పడతుక దయతో
రిప్లయితొలగించుకడుముదమున పూరణముల కావించుచు తా
వడిగా పృచ్ఛకుల జయిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఎడతెగనిమాయలంబడి
రిప్లయితొలగించునడయాడెడుహేతువాది నారాయణునే
విడుమనగా మనలన్ బ్రో
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుజడివాన కవితలఁ బదం
రిప్లయితొలగించుపడి వ్యాకరణ సహితమ్ము పండిత సభలన్
వడి విద్వాంసుల నలరిం
చెడు వాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
వడఁకం డెన్నఁడు రామ కావ్యము రచింపన్ సత్య దూరమ్ము దా
నుడుగుం జెప్ప యథార్థ వర్ణనలఁ దా నొక్కింత భేదమ్ముఁ జూ
పఁడు బ్రహ్మజ్ఞుఁడు పుట్ట పుట్టువు వచింపం దాపసశ్రేణిఁ గా
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయా శ్రీరామమూర్తిం గవుల్
ఆస్ఫోటయామాస చుచుమ్బ పుచ్ఛం
తొలగించుననన్ద చిక్రీడ జగౌ జగామ.
స్తమ్భానరోహన్నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్৷৷5.10.54৷৷
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
కీమాయణం (ముప్పాళమ్మ):
భడవండీతడు తాటకమ్మను వడిన్ బాణాలతో కొట్టెనే
సడి లేకుండను దాగి చంపెనుగదా జంబమ్ముతో వాలినిన్
కడకున్ జానకి మాతనున్ విడిచెగా గంభీరమౌ కానలన్
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఈ వారపు ఆకాశ బాణి వివిశేషములేమిటి ? సమస్య యేమిటి ? తెలియ చేయగలరు
ఈరోజు రెండవ పూరణ మీదే. 'జిలేబి, పలమనేరు అని.
తొలగించువచ్చే వారానికి సమస్య...
"పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుడున్"
వెడదౌకన్నులు మందహాసమమరన్ వెల్గొందునెమ్మోముతో
రిప్లయితొలగించుపొడవై జానువులంటెడిన్ గరములున్ పొంకంపుకాయమ్ముతో
మడమన్ ద్రిప్పనిశౌర్యమున్ మునులనే మంత్రించి మోహంబు ముం
చెడివాడీతడటంచు బల్కెదరయో శ్రీరామమూర్తిన్ కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"మోహాన ముంచెడు" అంటే ఇంకా బాగుంటుందేమో?
అవును గురువుగారూ,సవరిస్తాను!ధన్యవాదములు!
తొలగించుకడుధర్మాత్ముడురాముడు
రిప్లయితొలగించువిడువడు సద్ధర్మ నిరతి, విలువలనెపుడున్
తడబడడిడుమలనెదిరిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకడు ధర్మాత్ముడు రఘురా
రిప్లయితొలగించుముడు నిలబడు నీతికొరకు ముమ్మాటికి, తా
చెడును దునిమి మంచినికా
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించుపుడమిన కవితను మురిపిం
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
నడిగిన తడబడక శృతిని
నుడియును యదనిo డవుండు నుడికారముతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచివరి రెండు పాదాల భావం బోధపడలేదు.
ఎడతెగని భక్తి తోడను
రిప్లయితొలగించుకడవరకు తన చరణముల కాచిన వారిన్
ఇడుముల బడనీయక కా
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యోస్మి.
తొలగించుకడు మోదంబును గారవమ్ము పితకున్ కౌసల్యకున్ చాల తె
రిప్లయితొలగించుచ్చెడువా, డన్నగ వత్సలమ్ము, మహరాజేంద్రుండుగా ధర్మ కై
వడినిన్ పాలనఁ, భర్తగా నిలను విశ్వాసమ్ము స్నేహంబు పం
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్ ౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమహరాజు... ధర్మకైవడి... ప్రయోగాలు సాధువులు కావు.
అడిగెడు ప్రశ్నల కెల్లన్
రిప్లయితొలగించుతడబాటేమియును పడక తాబదులిడగన్
కడు ముదమునెల్లరకుపం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"*
తడవేమాత్రము చేయక
వడివడిగా జనులు కెల్ల పంచుచు ముదమున్
యెడనెడ యువతను దీవిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు"పంచి ముదము తా నెడనెడ..' అనండి.
పడతిన్ బంధిని సేసినట్టి దనుజున్ బాపాత్ముడిన్ గూల్చగన్
రిప్లయితొలగించుకడలిన్ దాటుచు లంకజేరి యట సంగ్రామమ్ములో రావణున్
కడు వీరత్వము జూపుచున్ దునిమె ప్రఖ్యాతుండు లోకమ్ముఁ బ్రో
చెడు వాఁడీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
చెడువాఁ డెన్నడుఁ గాడు రాముడుఁ పరస్త్రీ నెన్నడున్ బొంద నెం
రిప్లయితొలగించుచెడువాఁ డెన్నడుఁ గాడు,దానెపుడుఁ సచ్చీలుండుగాఁ విస్ఫురిం
చెడువాఁడే,భువి రాక్షసాళియును నిశ్శేషమ్మవన్ వారికిన్
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో! శ్రీరామమూర్తిన్ గవుల్
చెడుగుడు లాడి నటుల గెలి
తొలగించుచెడువాడ వధాన మందు చిత్తమ్ముల దో
చెడు పద్య పరిమళము వీ
చెడువాడని రామమూర్తి జెప్పెదరు కవుల్
జడలో చంద్రుని యర్ధకాయమున నాచండీశ్వరిన్ బ్రేమతో
రిప్లయితొలగించుమెడలో సర్పము కంఠమందు విషమున్ మిన్నేటినే నెత్తిపై
విడువంజాలక దాల్చినట్టి ప్రభువౌ పింగాక్షుఁ నిత్యమ్ము కొ
ల్చెడు వాఁడీతఁ డటంచు బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
🙏
తొలగించు. *శ్రీ గురుభ్యో నమః*
రిప్లయితొలగించుశంకరాభరణం - సమస్యాపూరణం
సమస్య :: చెడువాఁ డీతఁడటంచుఁ బల్కెద రయో శ్రీ రామమూర్తిన్ గవుల్.
విరుద్ధార్థం :: ధర్మమూర్తి యైన శ్రీరామమూర్తిని చెడ్డవాడు అని ఈ కవులు అంటున్నారు అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
సందర్భం :: సుగుణాభిరాముడైన శ్రీరామమూర్తిని వర్ణిస్తూ స్వామి యొక్క సచ్చరిత్రను కవులు సజ్జనులు అనేకవిధాలుగా కీర్తిస్తూ ఉండగా సీతామాతను అపహరించిన రావణాసురుడు శ్రీరామమూర్తి స్తుతిని వినడం ఇష్టం లేక బాధపడ్డాడు. అజ్ఞానంతో ఆ కవులందఱిని మూర్ఖులుగా భావించి “అయ్యో ఈ కవులు శ్రీరామమూర్తిని మోక్షమిచ్చెడు వాడు అని అంటున్నారే అని నిజమైన మూర్ఖుడు అగు రావణుడు విచారించే సందర్భం.
పూరణ ::
చెడువా డంచు గురుండు బల్కగ వధించెంగా సుబాహున్, రమిం
చెడువా డీతడు యోగిమానసములన్, శ్రీరూప లక్ష్మిన్ వరిం
చెడువా డీతడు, ధర్మవర్తన మిలన్ క్షీణింపగా నుద్ధరిం
చెడువా డీతడు, దుష్టరాక్షసతతిన్ శిక్షింప మూర్తిన్ ధరిం
చెడువా డీతడు, భక్తపాలనకళాశ్రీమంతుడై వారి బ్రో
చెడువా డీతడు, సజ్జనావళి సదా సేవింపగా వారి గా
చెడువా డీతడు ప్రాణికోటికి తుదన్ శ్రీధామమౌ ముక్తి ని
చ్చెడు వాడంచు నుతింప; రావణుడనెన్ ఛీ మూర్ఖులై మోక్ష మి
చ్చెడువాఁ డీతఁడటంచుఁ బల్కెద రయో శ్రీ రామమూర్తిన్ గవుల్.
కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరుజిల్లా 8-6-2019
కందం
రిప్లయితొలగించుతడబడ పద్యము నల్లగ
ముడివీడగ వ్రాసి భక్త పోతనఁ దాల్చన్
గడకు కవిత్వముఁ గరుణిం
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించుతడబాటవ్వగ పోతనాఙ్యునకు పద్యమ్మందునన్ ధారకున్
ముడివీడంగను రామచంద్రుడటఁ దా పూరించి కావంగనే
కడకున్ కావ్యము వ్రాయగా కవులకున్ గారమ్ముగా సాయమి
చ్చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయా శ్రీరామమూర్తిన్ గవుల్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించువడిగా *నిట్లసుత*న్1 రచించె నొకడా వాసిన్ దగ న్నాయకీ2.
సుడిజుట్టెన్ *విష వృక్షకమ్ము*3నొకటన్ శూరుండె రాముం?డనన్
సడియున్ లేని స*కాలరేఖల*4 కునౌ సాహిత్య సాఫల్యముల్5
మడి గట్టన్నితిహాసమేల పొగడన్ మాకిత్తురే భూషలన్
చెడువాడీతడటంచు బల్కెదరయో శ్రీరామ మూర్తిన్ గవుల్!
(1ఇట్లసుత :వరికొండ కాంతారావు,2.ముప్పాళ రంగనాయకమ్మ,3.రామాయణ విషవృక్షము,4.కాలరేఖలు (నవల):అంపశయఅంపశయ్య నవీన్ 5.కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారము)
బుడి బుడి యడుగుల తో బా
రిప్లయితొలగించులుడి రూపము దాల్చి నట్టి లోకరక్షకుడా
తడని మనలనిలలోగా
చెడువాడని రామమూర్తి చెప్పుదురు కవుల్
Ee poorana chadivi Peddalu tagu suuchanalu cheya prardhana