సందర్భము: భారతం వ్రాసి చిన్నబోయి కూర్చున్న వ్యాసుని వద్దకు నారదు డేతెంచి భాగవతం వ్రాయమని చెబుతూ ఇలా అంటున్నాడు. "అంచితమైన ధర్మచయ మంతయు జెప్పితి వందులోన నించించుక గాని విష్ణుకథ లేర్పడ జెప్పవు.." అనే పద్యం ప్రసిద్ధం. నీతు లప్పుడపుడు మాత్రమే చెప్పాలి. కథ లెప్పుడూ చెప్పవచ్చు అని భావం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ వర కథ లెల్ల వేళలను వాసిగఁ జెప్పుట మేలు గాని యీ నరులకు.. నీతు లప్డపుడు నాటినఁ జాలు మనంబులందు.. శ్రీ హరి మహిమావతార కథ లయ్యవి చెప్పవె! వ్యాస సన్మునీ! నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 17.6.19 -----------------------------------------------------------
గోతులు త్రవ్వుచు ప్రియముగ
రిప్లయితొలగించండినేతలు పల్కెదరు మాయ నేరుపు తోడన్
చేతలు మరువగ జనులకు
నీతులఁ జెప్పంగ రాదు నిరవధికముగన్
👌🏻👏🏻🙏🏻
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిఅమిత్ షా ఉవాచ:
సరకులు దోచె మోడియని చాకలి పద్దులు లెక్కజూచుచున్
మొరుగుచు వాడవాడలను మోయగ కాంగ్రెసు మట్టి బెడ్డలన్
పరువులు పోవు రాహులుడ! ప్రక్కన నుండ ప్రియంక వద్రయున్
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
🤣🤣
తొలగించండిభలే!!
👌🏻👏🏻🙏🏻💐
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండికోతులకు, బ్రహ్మ చారులు,
కోతల రాయలకు తెలుప కోయి జిలేబీ
నీ తీపిదనమ్ముల; మేల్
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్ :)
నారదా!
జిలేబి
కోతులకు, బ్రహ్మచారులు... ఈ రెండు పదాలూ వేకే వేరే విభక్తులలో ఉన్నాయి కదా ?
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండినేను బరహమచారిని...😭😭
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కోతులకు, బ్రహ్మచారికి' అనండి.
తొలగించండిహమ్మయ్య కందివారు కూడా వత్తాసిచ్చేసారు :)
ఏమండీ విట్టుబాబు గారు వింటున్నారా :)
జిలేబి
:))
తొలగించండిరేతిరి యేకాంతమ్మును
రిప్లయితొలగించండిప్రీతిగ ప్రియురాలె నిన్ను పిలిచిన వేళన్
నాతిని జేరుచునచ్చట
నీతులు జెప్పంగరాదు నిరవధికముగన్.
sebhaash virimchi gaaru
తొలగించండిభలే!
తొలగించండి👌🏻👏🏻😀
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేతలు మేమే యనుచును
రిప్లయితొలగించండికేతనము నెగుర వేసి కిమ్మన కుండా
కోతలు కోయుచు మెండుగ
నీతులఁ జెప్పంగ రాదు నిరవధి కముగన్
👌🏻👌🏻
తొలగించండికుండా వ్యవహారికమేమో కదా!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కిమ్మనకుండన్' అనండి.
నేతలు మేమే యనుచును
తొలగించండికేతనము నెగుర వేసి కిమ్మన కుండన్
కోతలు కోయుచు మెండుగ
నీతులఁ జెప్పంగ రాదు నిరవధి కముగన్
రిప్లయితొలగించండిపరపతి నాకు కద్దనుచు పద్ధతి లేకయు వారు కోరకన్
సరసి!జిలేబి! పద్మముఖి! సాచివిలోకిత మైన దృష్టితో
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
కొరవడు నీదు గౌరవము కొంచెము కూడ జనాళి మారరే
జిలేబి
సూపర్!!
తొలగించండి👌🏻👏🏻💐🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండితాతలు నేతిని జుర్రిరి
మూతుల వాసనఁ గనమని మొరుగుట యేలా?
కోతలు మానుచు మసలుము
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోతలు కోసెడు వారికి,
రిప్లయితొలగించండిభూతదయన్ తెలియనట్టి పుణ్యాత్ములకున్,
నేతలమను చెడువారికి,
నీతులు చెఫ్పంగరాదు నిరవధికముగన్.
బొగ్గరం ప్రసాదరావు,డల్లాస్ అమెరికా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండికందము
నీతులు జెప్పెడి వారలు
చేతలలో గానరారు చెప్పెడి వరకే
గోతులు దీసెడి వ్యర్థపు
వీతుల జెప్పంగరాదు నిరవధి కముగన్.
ఆకుల శివరాజలింగం వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెరిగెడు తీవ యల్లుకొన ప్రేమన పందిరి నిల్చినట్లుగా
రిప్లయితొలగించండిదరులవి రెండు నీటిని దారినఁ బెట్టగ వీడనట్లుగా
స్థిరతన నిల్చియుండవలె క్షేమముఁ గోరుచుఁ, గాని దెప్పుచున్
నిరవధికంబుగాఁ, జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
చేతలఁ మేలును తలవక
తొలగించండిగోతులఁదవ్వంగ రాదు కోరియెవరికిన్!
చేతులఁ వెనుకన్ గట్టుకు
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రీతి గ బలు కు చు వెనుకన్
రిప్లయితొలగించండిగోతులుత్రవ్వంగనెంచుకుటిలమనస్కుల
ఛేతలలోజూపింపక
నీతుల. చెప్పంగరాదు నిరవధికముగన్
రెండవ పాదం లోచివర ల్అనిఉండాలి
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితస్మై శ్రీ గురవేనమః 🙏
గురుతరబాధ్యతాయుతుడు కోవిదుడౌ గురువైనవాడు తా...
నరసి వినూత్న వేషముల నట్టిటు దువ్విన పిచ్చిజుత్తులన్
చిరిగిన దుస్తులన్ గలుగు శిష్యుల మార్చగ నేటిరోజులన్
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండికా , "లేజీ " ఎక్స్ పీరియన్సు సత్యమును పల్కుచున్నది :)
జిలేబి
పూత మెరుంగుల మాటలు
రిప్లయితొలగించండినేతల కలవాటు గదుర నేడిటు జూడన్
చేతల నుపయోగించక
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
నిరతము తామె గొప్పనుచు నింకెవ రైనను లెక్క సేయకన్
తొలగించండిపరులను బాధ పెట్టుచును పాపపు కర్మల నాచరించెడిన్
దురితులు దుర్మదాంధులను దూరము నుంచుట నెంతొ మేలగున్
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
ఘాతుక మొనర్చు వారికి
రిప్లయితొలగించండిబూతులుగను దోచుచుండు బోధలుసేయన్
సీతను రావణు డొదిలెనె?
నీతులు జెప్పంగరాదు నిరవధికముగన్
ఈతరపు నేతలు వివిధ
రిప్లయితొలగించండిరీతుల తోడ మనదేశ రీతికి సతమున్
గోతులను తవ్వుచుండగ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికర మనురాగయుక్తముగఁ గానక, కర్కశ మానసుండునై
నిరతము బాధపెట్టుచును, నిర్దయుఁడై, పిసినారియయ్యు, సు
స్థిరమగు మాట నిల్కడయుఁ, జేఁతలు నుండని ప్రేలుగొండియే
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్!
నీతులు చెప్పుటకొరకే
రిప్లయితొలగించండినేతలు పాటించరెపుడు నేర్పరితనమున్
చేతలు కూతలమించగ
నీతులు చెప్పంగరాదు నిరవధికముగన్
కోతలఁ గోయుటయే పని
రిప్లయితొలగించండిపాతకములఁ జేయునట్టి పాలకుడగుటం
గూతలఁ గూయుచుఁ బరులకు
*"నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్"*
రిప్లయితొలగించండిమా శ్రీమాన్ విట్టుబాబు గారు :)
తాతల నాటి తెలుంగును
నాతడు పునరుద్ధరింప నడుము బిగించెన్
ఖాతరు చేయడెవారిని
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!
నారదా!
జిలేబి
😁😷😷
తొలగించండి🙏🏻
రిప్లయితొలగించండినా తల రాతను మార్చగ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
బ్రోతలు హవుసైనను తా
తా! తరముగ నడుపు చుంటి తమ్ముల కొరకై !
జిలేబి
రిప్లయితొలగించండిమీ తరము గాదు మార్చన్
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!
మూతులు త్రిప్పెద రతివలు
ఖాతరు లే కన్నవారి కనికరములు సూ !
జిలేబి
రిప్లయితొలగించండిసైతానులకు జిలేబీ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
చేతల చువ్వన బుల్లెటు
తో తల కాయలను లేపి తొడ గొట్టవలెన్!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచేతలనుపకృతిలేకను
రిప్లయితొలగించండియాతనలేదీర్తుమనుచునడుగుచునోట్లన్
బూతులయొద్దనునేతలు
నీతులుజెప్పంగరాదునిరవధికముగన్
చంపకమాల
రిప్లయితొలగించండిపెరిగిన గారమే తమను పెంకిగ మార్చిన కారణంబదో
దరికొని తప్పు మీదనిన దాడులఁ జేయుచు చంపనేర్తురే
ధరణిని కోరువారలకె తప్పక జెప్పుచుఁ గోరనెంచకే
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
రిప్లయితొలగించండిప్రీతిని జూపుచు లోలో
గోతులు త్రవ్వు తలపున్న కుత్సితు లవనిన్
చేతలతో చూపని యా
నీతులు చెప్పంగరాదు నిరవధికముగన్
కందం
రిప్లయితొలగించండినీతులఁ జెప్పఁగఁ జూచిన
ఘాతుకములకెగబడంగ గర్వమధాందుల్
జాతి హితంబునకనుచున్
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
నీతులుచెప్పగఁనేటికి
రిప్లయితొలగించండిచేతలలోవాటినమలుచేయనియెడలన్
నేతలుశుష్కములౌపలు
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిజాతులనేకంబైనవి
ప్రాతది యైనట్టి విద్య పాటిని దప్పె
న్నూతలు సాంకేతికములె(life long skills,communication,creativity,&logical thinking)
నీతులు జెప్పంగరాదు నిరవధికముగన్
డా.పి సత్యనారాయణ
రిప్లయితొలగించండిపరులకుజెప్పగా వలయు భైరవనీతులు *నాకు గాద*నన్
మరుగులు,నీ రహస్యముల మాటున దాగిన చేష్టలన్నియున్
సరి యన వచ్చునే యువత సంస్కృతి మారెను, ప్రశ్నవేయునే
నిరవధికంబుగా జెలగి నీతుల జెప్పగ రాదెవారికిన్
రిప్లయితొలగించండిచేతలకు పనికి రాని స
నాతన పద్ధతులు మేలు నమ్ముమటంచున్
దాతృత్వపు మాటలతో
నీతులు జెప్పంగ రాదు నిరవధికముగన్!
జిలేబి
పాతకముల నొనరించుచు
రిప్లయితొలగించండిభూతము లకట చదువు విధముగ వేదమ్ముల్
గోతులు ద్రవ్వుచు వెనుకను
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
గురువులు నెమ్మి శిష్యులకుఁ గోరి శుభమ్ములు సెప్పఁగాఁ దగుం
బరమ పదమ్ముఁ జేరు డని పన్నుగ సంయమి సెప్పగా దగుం
బరుల నిదేశ మేఁగిన నపాయము గల్గును నీది కాని దే
నిర వధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
[కానిదేన్ +ఇరవు; ఇరవు =స్థానము]
చక్కనిపూరణార్యా!అభినందనలు,నమస్సులు!
తొలగించండిధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
తొలగించండిఇక్కడ రాదె వారికిన్ ( గురువులకు, సంయమికి కూడా) అని భావము.
భలే!
తొలగించండికామేశ్వరరావుగారూ! అద్భుతంగా ఉన్నాయి. చంపకము మెరిసింది.
👌🏻👏🏻🙏🏻💐
ధన్యవాదములండి విట్టుబాబు గారు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
నిరతము చెల్లు మాటయిది నిక్కపు సత్యము రాజనీతినిన్
మురియుచు ముద్దు ముద్దుగను ముచ్చట గొల్పెడి నీతి పల్కితే
సరిసరి విట్టుబాబు! భళి సంకట మెయ్యది కైపదమ్మునన్:
"నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్"?
😁👌🏻👏🏻🙏🏻
తొలగించండి"సీతనుc గోరకు మన్నా (రావణ)
రిప్లయితొలగించండిరీతిగ మసలుము జగతిని ప్రీతిన్ బొగడన్!"
కూతలు మాను విభీషణ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగా!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిప్రీతిగ చెప్పిన వాక్కులు
చేతలలో శూన్యమయ్యె జియ్యల చెంతన్;
రీతిగ నడరించనపుడు
నీతులు జెప్పంగ రాదు నిరవధికముగన్.
అరయగరాజకీయముననగ్రజువోలెనునోట్లకోసమై
రిప్లయితొలగించండినిరవధికంబుగాజెలగినీతులుజెప్పగరాదెవారికిన్
పరువుగనుండువాడెపుడుబావరుమాదిరినుండకుండగా
నిరతమునీతిమార్గమునునేర్పునుగశిష్టజనాళికిన్
నిరతముసాధువర్తనమునిర్మలచిత్తముసత్యసంధతన్
రిప్లయితొలగించండికరుణనుఁగల్గి యార్తులనుఁగాచెడువాడెగ నాయకుండనన్
అరయగఁ శుష్కమౌవిషయ మగ్గలికంబుగనుచ్ఛరించుచున్
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
నిరసనజూపుచున్ హితులనెన్నడు జేరడు ధార్తరాష్ట్రుడే
రిప్లయితొలగించండిపెరిగిన కామమోహముల బెట్టడు లక్ష్యము రావణుండహో
మరగిన రాజభోగముల మత్తునదూగుచు ధర్మదూరులౌ
నిరవధికంబుగా చెలగి,నీతులు జెప్పరాదెవారికిన్ !
నీతులు జెప్పరాదె,వారికిన్
తొలగించండిరాతిరి చెప్పిరి శ్రీహరి
రిప్లయితొలగించండినీతులు,జెప్పంగరాదు నిరవధికముగా
కోతలు,కూళులకు నెపుదు
కూతలు సహజమగు నింద్ర !కుట్రల మయమై
గురువు గారికి నమస్సులు.
తొలగించండినెపుడు గా చదువ మనవి
ఖాతరు జేయని వారికి
రిప్లయితొలగించండిపాతకములు జేయునట్టి పాపాత్ములకున్
గోతులు దీసెడు వారికి
నీతులు జెప్పంగ వలదు నిరవధికముగన్!!!
కోతలుకోయుచు సతతము
రిప్లయితొలగించండిబూతులు మాట్లాడుచున్న ముష్కరు లిలలో
భీతిని గొల్పుచుజనులకు
నీతులు చెప్పంగ రాదు నిరవధికముగన్
ప్రీతిని జూపుచు లోలో
రిప్లయితొలగించండిగోతులు త్రవ్వు తలపున్న కుత్సితు లవనిన్
చేతలతో చూపని యా
నీతులు చెప్పంగరాదు నిరవధికముగన్
సరసము లాడ రమ్మనుచు జవ్వని పిల్చినఁ మోదమందుచున్
రిప్లయితొలగించండిబిరబిర పర్గు దీయుచును పెండ్లము పిల్లల నెల్ల మర్చి యా
సరసిజ నేత్రలన్ మరుగు జాణవు నీవిక మానుమంటినే
నిరవధికంబుగాఁ జెలగి నీతులఁ జెప్పఁగ రాదెవారికిన్.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ
రా దెవారికిన్
సందర్భము: భారతం వ్రాసి చిన్నబోయి కూర్చున్న వ్యాసుని వద్దకు నారదు డేతెంచి భాగవతం వ్రాయమని చెబుతూ ఇలా అంటున్నాడు.
"అంచితమైన ధర్మచయ మంతయు జెప్పితి వందులోన నించించుక గాని విష్ణుకథ లేర్పడ జెప్పవు.." అనే పద్యం ప్రసిద్ధం.
నీతు లప్పుడపుడు మాత్రమే చెప్పాలి. కథ లెప్పుడూ చెప్పవచ్చు అని భావం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
వర కథ లెల్ల వేళలను
వాసిగఁ జెప్పుట మేలు గాని యీ
నరులకు.. నీతు లప్డపుడు
నాటినఁ జాలు మనంబులందు.. శ్రీ
హరి మహిమావతార కథ
లయ్యవి చెప్పవె! వ్యాస సన్మునీ!
నిరవధికంబుగాఁ జెలఁగి
నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.6.19
-----------------------------------------------------------
మీతల రాతల మార్చెడి
రిప్లయితొలగించండినేతనె యుద్ధారకుండ నేనే యనుచున్
కోతలు గోయుచు నూరక
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్