ప్రాతః కాలపు సరదా పూరణ: పలుకుట రాక నాంధ్రమున పండుగ జేయుచు హైద్రబాదునన్బలుపుగ శంకరాభరణ ప్రాంగణమందున శాస్త్రివర్యుడేవిలవిల తన్నుకొంచునిట వేలను జేసియు పూరణమ్ములన్ కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
ప్రభాకర శాస్త్రి గారూ,మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.వేల పూరణలు చేసిన మీకు కలతయా?
నిజానికి మూడు పాదాలే వ్రాయగలను...నాల్గవది మీరిస్తే..
అలుకయె తనకందమ్మగు చిలిపి పలుకుల నెలతుక వచించుచు పొగడండి! లిఖించండని యిచ్చిన కలముం గని కవివరుండు కలవరమందెన్!జిలేబి
జిలేబీ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అలిగిన ప్రియురాలె కరమున లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్, వలపు తెలుప తక్కువయిన కలముంగని కవివరుండు కలవరమందెన్ !జిలేబి
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వ్రాయను' అనడం సాధువు. అలా అంటే యతి తప్పుతుంది మరి!
కులముల కోరల జిక్కియుకలతల కాపురముల గని కవితల గూర్చన్నెలతల అభిమతముల కలకలముం గని కవివరుండు కలవరమందెన్!!
గంగాప్రసాద్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తలపున విషసంస్కారముచెలరేగగ రాక్షసంపు చేష్టలతోడన్సలిపెడు పలుహింసల కలకలమున్గనికవివరుండు కలవర మందెన్
రాజేశ్వర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణఅల కాళేశ్వర సాగరుతెలగాణపు సాగు మీద తెగ వ్రాయుడనన్తెలియని స్తవములదౌ కలకలముంగని కవి వరుండు కలవర మందెన్
డా. పిట్టా వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జలజాంతస్తిత వాణిన్ దలపులలో నిలిపికొలుచు తరుణము నందున్ చెలరేగిన లలనల కలకలముం గని కవివరుండు కలవర మందెన్
విరించి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జలజాంతఃస్థిత' టైపాటు.
డా.పిట్టా సత్యనారాయణజలజల జారు జాన్తెనుగు జాడలె లేని సమాసపుంజపున్*ఝలకు*ల రువ్వగా జదువ జాలరు నేటి తెలుంగు పాఠకుల్కులుకులు లేక నచ్చముగ గూర్చగ జాలగలండు; ప్రౌఢపుంకలమును గాంచినంత గలగంబడె సత్కవి వర్యు డయ్యయో!
చంపక మాలకలమును చేతబట్ట చిరుగాలులు వీచెడు సంధ్య వేళలోజలజల రాలు కావ్యరస సారము చల్లగ వాణి తోడునన్దలచిన యవ్వనుండడవి దారిని బట్టగ చెట్లనీడ నేకలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో(ఏకలము= అడవిపంది)
అదుర్సు....
శంకర ప్రసాద్ గారూ,మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కలకూజితసన్నిభమౌగళమును సవరించి మధురకవితలుచదువన్ చెలఁగినయభిమానుల కలకలముంగని కవివరుండు కలవరమొందెన్సలలితముగనవకవితలఁనలవోకగ వ్రాయనెంచి యద్భుత రీతిన్ చెలువముచెడి విరిగిన తనకలముంగని కవివరుండు కలవరమొందెన్కలమునుకాగితమునుగొనిచెలువఁపు కవితారచనము చేబట్టుతరిన్ కలఁతబడె మనసు పగిలినకలముంగని, కవివరుండు కలవరమొందెన్.
ఫణీంద్ర గారూ,మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అలుకయె లేక పద్యముల హాయిగ వ్రాయుచు పొద్దుపుచ్చె! పద్మలతను పెండ్లియాడె! వనితామణి లౌకికురాలు! చేతి గజ్జలను చలాకిగా దులిపి జబ్బల బల్మిని చూపి ఘాటు చెంపలకొక ముద్దు లివ్వగ గభాల్మని తేలుచు మత్తులోనరేకలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!జిలేబి
జిలేబి గారూ,మనోహరమైన పూరణ. అభినందనలు.'గజ్జలను/గజ్జెలను'?
గజ్జలని తెలంగాణలో అంటారని ఆంధ్ర భారతి ఉవాచ :)జిలేబి
తెలుగును మలినము సేసెడికలబోతల పలుకులిపుడు కనగా పెరిగెన్దలచుచు విలపించి నిలచుకలముంగని కవివరుండు కలవరమందెన్
ద్వారకానాథ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులమును జూడక గుణములవలనం బ్రఖ్యాతిఁ బొందవలెనను గురువై,కులము కులము యను శిష్యుని"కలముం గని కవివరుండు కలవరమందెన్"
విట్టుబాబు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కులము + అను' అన్నపుడు యడాగమం రాదు. "కులంబను శిష్యుని" అనండి.
మత్తున చిత్తైతినయ్య మన్నింపుడయా!ధన్యవాదాలు గురువుగారూ..🙏🏻🙏🏻
శనివారం పొద్దుటే మత్తు? ఓహో!రాత్రి పుచ్చుకున్నదా? ( శత మర్కటంతో సరదాకు )
మైలవరపు వారి పూరణ బలపములంతరించె , చరవాణినిబోలెడి నోటుబుక్కులేపలకలునయ్యె , నందమగు వ్రాత నశించెను , హస్తభూషలీకలియుగమందు జూడ కొఱగానివిగా గనిపించుచుండగాకలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో" !!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
same pinch !!
మైలవరపు వారి పూరణ మహత్తరంగా ఉన్నది. అభినందనలు.
బలమును జూపంగ జనులు కులములు, మతములనుచు కడు క్రోధము తోడన్ కలహించగ బుట్టిన కల కలమున్ గని కవివరుండు కలవర మొందెన్!
శ్రీధర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
లలిత కళా తోరణమందలి కవిసమ్మేళనమున దండిగఁ బద్యమ్ములఁ జదువఁ బ్రేక్షకుల కలకలముం గని కవివరుండు కలవరమందెన్.
కలకలము .. చాలా బాగుంది 🙏
చాలా బాగుంది గురువుగారు! ఆకాశవాణిలో ఈనాడు ప్రసారమైన పద్యం ఇదే కదా!
సూలభమ్ముగ వ్రాయ కవితసెలుఫోనున నభ్యసించి చేతిని కలమున్ నెలకొన మరచిన వేళన్ కలముంగని కవివరుండు కలవరమందెన్
సులభమ్ముగ*
సీతాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములీ గురుదేవా,నమస్సులు!
*లు
మిత్రులందఱకు నమస్సులు![కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను సెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]కలరవకూజితాంచితసుగంధయుతామ్రకిసాలఖాదనన్బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁబలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యేకలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!(ఏకలము=అడవిపంది)
మధుసూదన్ గారూ,మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
అలకలబాన్పునుజేరిననలివేలునుముదముజేయహారముకొఱకైవిలువనునడుగగ,వణిజునికలముంగనికవివరుండుకలవరమందెన్
సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుల మత జాతుల మరచుచుకలిసెదరని కన్న కలలు కల్లలు కాగాకుల వైషమ్యమ్ముల కలకలముం గని కవివరుండు కలవరమందెన్
సూర్య గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(పత్నీవియోగవిహ్వలహృదయుడైన మహాకవి సి.నా.రె)సలలితరీతులన్ దనదు సాహితి నెంతయు బెంపుజేయుచున్నలువురు ముద్దుకూతులను నమ్రత నిచ్చిన ధర్మపత్నియేకలగ సినారె జీవితపు కాంతుల సౌధము వీడిపోవగా కలమును గాంచినంత గల గంబడె సత్కవివర్యు డయ్యయో!
హృద్యమైన పూరణార్యా!నమస్సులు!
నమస్సులమ్మా!ధన్యవాదాలు.
జంధ్యాల వారూ,మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మలయజ మందమారుతపు మ్రానుల కానన సీమ చేరి యాస్థలి మధురోహలన్ విరులతావుల కమ్మని కావ్యరాజమున్వెలయగ వ్రాయఁజూడగను వ్రేటుగ నత్తరి రేగినట్టి పాకలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
రాకుమార గారూ,మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యవాదాలు!
బాగుందండీ!పాకలమనే కొత్తపదం తెలిసింది!ధన్యవాదములు!
కలము నదుపునందుంచకకలకంఠుల బీరము పయి కవితలు జేయన్లలనలు సలుపెడి యా కలకలముం గని కవివరుండు కలవరమందెన్
సీతారామయ్య గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలుకగ నొక కవి సభలో,పలికిన పలుకుల నసభ్య పదములు దొరలన్చెలరేగిన భీకర కలకలముం గని కవివరుండు కలవరమందెన్
జనార్దన రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలుపగలరు : సమస్య పై వారమున కేమిటి ?జిలేబి
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.... "మోసముఁ జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్" మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా padyamairhyd@gmail.comకు మెయిల్ చేయండి.
G P Sastry (gps1943@yahoo.com)జులై 01, 2018 8:51 PMదోసమెలేదు నీదిటను దోసెల పిండిదె దోసమంచునున్ వాసన లేకపోయినను వన్నెగనున్నవి పూలటంచునున్ వీసపు టెత్తుబంగరము వీసెడు కాంతియె నీకుగూర్చటన్ మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
https://kandishankaraiah.blogspot.com/2015/07/1745.html
కలతలుమానిపద్యములుగట్టిగవ్రాయుదలంపుగల్గెనా?కలమునుగాంచినంత,గలగంబడెసత్కవివర్యుడయ్యయోయలుసుగజూడనాతనినినందఱిముందటసిగ్గునొందుచున్ గలతలుగల్గజేయుటదిగాదుగమంచిదియేరికైననున్
అల యియ్యవధానమ్మును వలదందుర యందఱు నని భయ మేపారం జెలఁగ నధికమ్ముగాఁ గలకలముం గని కవివరుండు కలవరమందెన్ అల యొక యింత సేపు, మది హర్షము నబ్బురముల్ సెలంగినన్ జలజల రాలు శుష్క దళ సంచయపున్ గతిఁ జేరుచుండగన్వలయ విరాజమాన పుర పామర పండిత రాజ వర్గ పుష్కలమును గాంచినంతఁ, గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) తలపుకు వచ్చినంతటనె తాడును పేడును లేని పద్యముల్పిలచిన భామనున్ వినక పిచ్చిగ పర్విడి వ్రాయబూనుచున్బలుపుగ స్మార్టు ఫోనునను భారిగ నొక్కుచు వ్రేళ్ళతోడుతన్ కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విలువగు పద్యకావ్యముల పెన్నిధి యాంధ్ర కవిత్వమంజరిన్ తులువలు ఙ్ఞానశూన్యతను దూషణసేయగ పాతవంచు నా పలుకుల నాలకించి మది భారముగాగను దిక్కుదోపకేకలమును గాంచినంత గలగంబడె సత్కవివర్యు డయ్యయో!కవిత్వం వ్రాయాలా వద్దా అని కలతబడ్డాడని భావన!
లక్కాకుల వెంకటరాజారావు గారి పూరణ:ఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు, ఆకలి పులి పిల్లలన్ దినెడు, కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా,పలుకదు లచ్చి, శారదకు భద్రమె, యట్టి తరిన్, భలేగ, రూకల, మును గాంచి, నంత, గలగంబడె, సత్కవి వర్యు డయ్యయో!
చక్కని పూరణ!అభినందనలు!
క్రొవ్విడి వెంకట రాజారావు: పొలుపగు కావ్యం బనుచునుబులియుచు నిచ్చెడి బహుమతి పొందెడు నపుడున్ చలమరులైన కవుల కల కలముంగని కవివరుండు కలవర మందెన్.
కలిమిన్ గూర్చు ననుచుఁ గూళలకున్ గావ్యమ్ము పోతరాజమ్మనెడున్ దలపుల వాణి ముఖమున వి కలముం గని కవివరుండు కలవరమందెన్
జలవనరులుఅడుగంటగకలహమ్ములుగలిగెనిచటకలికారణమై,కలిలో కలహమ్ముల కలకలమున్ గనికవివరుండుకలవరమందెన్కొరుప్రోలు రాధా కృష్ణా రావు, మీర్ పేట్,రంగారెడ్డి
విలువలు మానిన వార్తలుదలపోసెడి యాశదోష తత్వములెన్నోసలుపునధర్మము గల"కాకలముంగని కవివరుండు కలవరమందెన్!
కలికిని వెంటబెట్టుకుని కౌముదు లీనెడు రాత్రివేళలో జలనిధి పైవిహారమును సల్పుచు నుండగ బెజ్జమేర్పడన్ జలమది నావలోకి కడి సవ్వడి సేయుచు జేరినంత నా కలమును గాంచినంత గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో.
దాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదాకాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్జిలేబి
లలనలు కొళాయి చెంతనసలిలము కొరకై సతతము జగడము లాడన్ కలముఁ గదిలించు తరి కలకలముంగని కవివరుండు కలవర మందెన్.
డా.పిట్టా సత్యనారాయణవీసము చేత లేక తనువెల్ల గృశించగ పొట్ట దైవమైగ్రాసము విత్తమై జెలగ గౌరవ మిచ్చిన వారలేరి?జిజ్ఞాసయె నీతిగా మెలగ జన్నము జేయని దీను కన్న బల్మోసము జేయువారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిపలుకుట రాక నాంధ్రమున పండుగ జేయుచు హైద్రబాదునన్
బలుపుగ శంకరాభరణ ప్రాంగణమందున శాస్త్రివర్యుడే
విలవిల తన్నుకొంచునిట వేలను జేసియు పూరణమ్ములన్
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
వేల పూరణలు చేసిన మీకు కలతయా?
నిజానికి మూడు పాదాలే వ్రాయగలను...నాల్గవది మీరిస్తే..
తొలగించండి
రిప్లయితొలగించండిఅలుకయె తనకందమ్మగు
చిలిపి పలుకుల నెలతుక వచించుచు పొగడం
డి! లిఖించండని యిచ్చిన
కలముం గని కవివరుండు కలవరమందెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅలిగిన ప్రియురాలె కరము
న లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్,
వలపు తెలుప తక్కువయిన
కలముంగని కవివరుండు కలవరమందెన్ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్రాయను' అనడం సాధువు. అలా అంటే యతి తప్పుతుంది మరి!
కులముల కోరల జిక్కియు
రిప్లయితొలగించండికలతల కాపురముల గని కవితల గూర్చన్
నెలతల అభిమతముల కల
కలముం గని కవివరుండు కలవరమందెన్!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తలపున విషసంస్కారము
రిప్లయితొలగించండిచెలరేగగ రాక్షసంపు చేష్టలతోడన్
సలిపెడు పలుహింసల కల
కలమున్గనికవివరుండు కలవర మందెన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅల కాళేశ్వర సాగరు
తెలగాణపు సాగు మీద తెగ వ్రాయుడనన్
తెలియని స్తవములదౌ కల
కలముంగని కవి వరుండు కలవర మందెన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జలజాంతస్తిత వాణిన్
రిప్లయితొలగించండిదలపులలో నిలిపికొలుచు తరుణము నందున్
చెలరేగిన లలనల కల
కలముం గని కవివరుండు కలవర మందెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జలజాంతఃస్థిత' టైపాటు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిజలజల జారు జాన్తెనుగు జాడలె లేని సమాసపుంజపున్
*ఝలకు*ల రువ్వగా జదువ జాలరు నేటి తెలుంగు పాఠకుల్
కులుకులు లేక నచ్చముగ గూర్చగ జాలగలండు; ప్రౌఢపుం
కలమును గాంచినంత గలగంబడె సత్కవి వర్యు డయ్యయో!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపక మాల
రిప్లయితొలగించండికలమును చేతబట్ట చిరుగాలులు వీచెడు సంధ్య వేళలో
జలజల రాలు కావ్యరస సారము చల్లగ వాణి తోడునన్
దలచిన యవ్వనుండడవి దారిని బట్టగ చెట్లనీడ నే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో
(ఏకలము= అడవిపంది)
అదుర్సు....
తొలగించండిశంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కలకూజితసన్నిభమౌ
రిప్లయితొలగించండిగళమును సవరించి మధురకవితలుచదువన్
చెలఁగినయభిమానుల కల
కలముంగని కవివరుండు కలవరమొందెన్
సలలితముగనవకవితలఁ
నలవోకగ వ్రాయనెంచి యద్భుత రీతిన్
చెలువముచెడి విరిగిన తన
కలముంగని కవివరుండు కలవరమొందెన్
కలమునుకాగితమునుగొని
చెలువఁపు కవితారచనము చేబట్టుతరిన్
కలఁతబడె మనసు పగిలిన
కలముంగని, కవివరుండు కలవరమొందెన్.
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిఅలుకయె లేక పద్యముల హాయిగ వ్రాయుచు పొద్దుపుచ్చె! ప
ద్మలతను పెండ్లియాడె! వనితామణి లౌకికురాలు! చేతి గ
జ్జలను చలాకిగా దులిపి జబ్బల బల్మిని చూపి ఘాటు చెం
పలకొక ముద్దు లివ్వగ గభాల్మని తేలుచు మత్తులోనరే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
'గజ్జలను/గజ్జెలను'?
తొలగించండిగజ్జలని తెలంగాణలో అంటారని ఆంధ్ర భారతి ఉవాచ :)
జిలేబి
తెలుగును మలినము సేసెడి
రిప్లయితొలగించండికలబోతల పలుకులిపుడు కనగా పెరిగెన్
దలచుచు విలపించి నిలచు
కలముంగని కవివరుండు కలవరమందెన్
ద్వారకానాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులమును జూడక గుణముల
రిప్లయితొలగించండివలనం బ్రఖ్యాతిఁ బొందవలెనను గురువై,
కులము కులము యను శిష్యుని
"కలముం గని కవివరుండు కలవరమందెన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కులము + అను' అన్నపుడు యడాగమం రాదు. "కులంబను శిష్యుని" అనండి.
మత్తున చిత్తైతినయ్య మన్నింపుడయా!
తొలగించండిధన్యవాదాలు గురువుగారూ..
🙏🏻🙏🏻
శనివారం పొద్దుటే మత్తు? ఓహో!రాత్రి పుచ్చుకున్నదా? ( శత మర్కటంతో సరదాకు )
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిబలపములంతరించె , చరవాణినిబోలెడి నోటుబుక్కులే
పలకలునయ్యె , నందమగు వ్రాత నశించెను , హస్తభూషలీ
కలియుగమందు జూడ కొఱగానివిగా గనిపించుచుండగా
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
same pinch !!
తొలగించండిమైలవరపు వారి పూరణ మహత్తరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబలమును జూపంగ జనులు
రిప్లయితొలగించండికులములు, మతములనుచు కడు క్రోధము తోడన్
కలహించగ బుట్టిన కల
కలమున్ గని కవివరుండు కలవర మొందెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిలలిత కళా తోరణమం
దలి కవిసమ్మేళనమున దండిగఁ బద్య
మ్ములఁ జదువఁ బ్రేక్షకుల కల
కలముం గని కవివరుండు కలవరమందెన్.
కలకలము .. చాలా బాగుంది 🙏
తొలగించండిచాలా బాగుంది గురువుగారు! ఆకాశవాణిలో ఈనాడు ప్రసారమైన పద్యం ఇదే కదా!
తొలగించండిసూలభమ్ముగ వ్రాయ కవిత
రిప్లయితొలగించండిసెలుఫోనున నభ్యసించి చేతిని కలమున్
నెలకొన మరచిన వేళన్
కలముంగని కవివరుండు కలవరమందెన్
సులభమ్ముగ*
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములీ గురుదేవా,నమస్సులు!
తొలగించండి*లు
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను సెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]
కలరవకూజితాంచితసుగంధయుతామ్రకిసాలఖాదనన్
బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁ
బలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
(ఏకలము=అడవిపంది)
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఅలకలబాన్పునుజేరిన
రిప్లయితొలగించండినలివేలునుముదముజేయహారముకొఱకై
విలువనునడుగగ,వణిజుని
కలముంగనికవివరుండుకలవరమందెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుల మత జాతుల మరచుచు
రిప్లయితొలగించండికలిసెదరని కన్న కలలు కల్లలు కాగా
కుల వైషమ్యమ్ముల కల
కలముం గని కవివరుండు కలవరమందెన్
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(పత్నీవియోగవిహ్వలహృదయుడైన మహాకవి సి.నా.రె)
రిప్లయితొలగించండిసలలితరీతులన్ దనదు
సాహితి నెంతయు బెంపుజేయుచున్
నలువురు ముద్దుకూతులను
నమ్రత నిచ్చిన ధర్మపత్నియే
కలగ సినారె జీవితపు
కాంతుల సౌధము వీడిపోవగా
కలమును గాంచినంత గల
గంబడె సత్కవివర్యు డయ్యయో!
హృద్యమైన పూరణార్యా!నమస్సులు!
తొలగించండినమస్సులమ్మా!ధన్యవాదాలు.
తొలగించండిజంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మలయజ మందమారుతపు మ్రానుల కానన సీమ చేరి యా
రిప్లయితొలగించండిస్థలి మధురోహలన్ విరులతావుల కమ్మని కావ్యరాజమున్
వెలయగ వ్రాయఁజూడగను వ్రేటుగ నత్తరి రేగినట్టి పా
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యవాదాలు!
తొలగించండిబాగుందండీ!పాకలమనే కొత్తపదం తెలిసింది!ధన్యవాదములు!
తొలగించండికలము నదుపునందుంచక
రిప్లయితొలగించండికలకంఠుల బీరము పయి కవితలు జేయన్
లలనలు సలుపెడి యా కల
కలముం గని కవివరుండు కలవరమందెన్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలుకగ నొక కవి సభలో,
రిప్లయితొలగించండిపలికిన పలుకుల నసభ్య పదములు దొరలన్
చెలరేగిన భీకర కల
కలముం గని కవివరుండు కలవరమందెన్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలుపగలరు : సమస్య పై వారమున కేమిటి ?
జిలేబి
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
తొలగించండి"మోసముఁ జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్"
మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా padyamairhyd@gmail.comకు మెయిల్ చేయండి.
G P Sastry (gps1943@yahoo.com)జులై 01, 2018 8:51 PM
తొలగించండిదోసమెలేదు నీదిటను దోసెల పిండిదె దోసమంచునున్
వాసన లేకపోయినను వన్నెగనున్నవి పూలటంచునున్
వీసపు టెత్తుబంగరము వీసెడు కాంతియె నీకుగూర్చటన్
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
https://kandishankaraiah.blogspot.com/2015/07/1745.html
తొలగించండికలతలుమానిపద్యములుగట్టిగవ్రాయుదలంపుగల్గెనా?
రిప్లయితొలగించండికలమునుగాంచినంత,గలగంబడెసత్కవివర్యుడయ్యయో
యలుసుగజూడనాతనినినందఱిముందటసిగ్గునొందుచున్
గలతలుగల్గజేయుటదిగాదుగమంచిదియేరికైననున్
అల యియ్యవధానమ్మును
రిప్లయితొలగించండివలదందుర యందఱు నని భయ మేపారం
జెలఁగ నధికమ్ముగాఁ గల
కలముం గని కవివరుండు కలవరమందెన్
అల యొక యింత సేపు, మది హర్షము నబ్బురముల్ సెలంగినన్
జలజల రాలు శుష్క దళ సంచయపున్ గతిఁ జేరుచుండగన్
వలయ విరాజమాన పుర పామర పండిత రాజ వర్గ పు
ష్కలమును గాంచినంతఁ, గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
తలపుకు వచ్చినంతటనె తాడును పేడును లేని పద్యముల్
పిలచిన భామనున్ వినక పిచ్చిగ పర్విడి వ్రాయబూనుచున్
బలుపుగ స్మార్టు ఫోనునను భారిగ నొక్కుచు వ్రేళ్ళతోడుతన్
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిలువగు పద్యకావ్యముల పెన్నిధి యాంధ్ర కవిత్వమంజరిన్
రిప్లయితొలగించండితులువలు ఙ్ఞానశూన్యతను దూషణసేయగ పాతవంచు నా
పలుకుల నాలకించి మది భారముగాగను దిక్కుదోపకే
కలమును గాంచినంత గలగంబడె సత్కవివర్యు డయ్యయో!
కవిత్వం వ్రాయాలా వద్దా అని కలతబడ్డాడని భావన!
లక్కాకుల వెంకటరాజారావు గారి పూరణ:
రిప్లయితొలగించండిఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు, ఆ
కలి పులి పిల్లలన్ దినెడు, కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా,
పలుకదు లచ్చి, శారదకు భద్రమె, యట్టి తరిన్, భలేగ, రూ
కల, మును గాంచి, నంత, గలగంబడె, సత్కవి వర్యు డయ్యయో!
చక్కని పూరణ!అభినందనలు!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపొలుపగు కావ్యం బనుచును
బులియుచు నిచ్చెడి బహుమతి పొందెడు నపుడున్
చలమరులైన కవుల కల
కలముంగని కవివరుండు కలవర మందెన్.
కలిమిన్ గూర్చు ననుచుఁ గూ
రిప్లయితొలగించండిళలకున్ గావ్యమ్ము పోతరాజమ్మనెడున్
దలపుల వాణి ముఖమున వి
కలముం గని కవివరుండు కలవరమందెన్
జలవనరులుఅడుగంటగ
రిప్లయితొలగించండికలహమ్ములుగలిగెనిచటకలికారణమై,
కలిలో కలహమ్ముల కల
కలమున్ గనికవివరుండుకలవరమందెన్
కొరుప్రోలు రాధా కృష్ణా రావు, మీర్ పేట్,రంగారెడ్డి
విలువలు మానిన వార్తలు
రిప్లయితొలగించండిదలపోసెడి యాశదోష తత్వములెన్నో
సలుపునధర్మము గల"కా
కలముంగని కవివరుండు కలవరమందెన్!
కలికిని వెంటబెట్టుకుని కౌముదు లీనెడు రాత్రివేళలో
రిప్లయితొలగించండిజలనిధి పైవిహారమును సల్పుచు నుండగ బెజ్జమేర్పడన్
జలమది నావలోకి కడి సవ్వడి సేయుచు జేరినంత నా
కలమును గాంచినంత గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో.
రిప్లయితొలగించండిదాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్
మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదా
కాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్
జిలేబి
లలనలు కొళాయి చెంతన
రిప్లయితొలగించండిసలిలము కొరకై సతతము జగడము లాడన్
కలముఁ గదిలించు తరి కల
కలముంగని కవివరుండు కలవర మందెన్.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివీసము చేత లేక తనువెల్ల గృశించగ పొట్ట దైవమై
గ్రాసము విత్తమై జెలగ గౌరవ మిచ్చిన వారలేరి?జి
జ్ఞాసయె నీతిగా మెలగ జన్నము జేయని దీను కన్న బల్
మోసము జేయువారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్