14, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3047 (వాలమ్మొక్కటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"
(లేదా...)
"వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో సిద్దంకి బాబు గారు ఇచ్చిన ప్రసిద్ధ సమస్య)

37 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కాలం మారదు సీత గారికి కదా గాఢమ్మగున్ ప్రేమతో
    చాలీ చాలని వంట యింటినటనున్ జంజాటమున్ జేయగా
    గోలన్ జేయుచు కోయ బూనగనహా గోంగూర మోపుల్నయో
    వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

    వాలము = కత్తి

    రిప్లయితొలగించండి
  2. జాలము తెలియక రాముడు
    శాలిని కోరంగ జింక సంతస మనుచున్
    మేలగు రావణు పధకము
    వాలమ్మే తక్కువ కద వసుధా సుతకున్

    రిప్లయితొలగించండి
  3. బాలా!చిత్రము జీవిత
    కాలమ్మందెన్నడైనఁ గదలక యుండన్
    నేలన నిల్లాలుగ నా
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ లాలిత్య కళా శో
    భా లలనన్ సీతం జూచి వానరుల సతుల్
    మేలని మెచ్చుచుఁ బలికిరి
    "వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"

    *కందం**

    పాలకుడు కానల విడువ
    బేల తనము చూపక తన పిల్లల బెంచెన్
    పూలు జడ ధరించిన,కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్
    ......‌...‌.‌.............✍చక్రి

    రిప్లయితొలగించండి
  6. (కపటసన్న్యాసిగా వచ్చిన రావణుని వధించటానికి సీతమ్మ వద్ద ఒక్క పదునైన బాణం ఉంటే బాగుండేది కదా!)
    కాలమ్మెప్పుడు నొక్కటై గడవదే
    గణ్యాత్మకైనన్ సరే;
    శీలమ్మొక్కటి చేలమై పటకుటిన్
    సీతమ్మ శోభిల్లెనే;
    కాలాంతఃపురగామి-రావణు-మహా
    గర్వాంధు దున్మాడగా
    వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా!
    వామాక్షి సీతమ్మకున్.
    (గణ్యాత్మ-ప్రశంసింపదగినది;చేలము-వస్త్రము;వాలమ్ము-నిశితశరము)

    రిప్లయితొలగించండి


  7. ఆలయము కట్టి హా! కర
    వాలమ్మే తక్కువ కద వసుధా సుతకున్
    పేలవముగా కలదనుచు
    లీలాపరవశముతో భళీ జేర్చిరటన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. "ఓలమ్మో!" యను యాసన
    లాలనఁ గోరునట "తూర్పు రామాయణమన్"
    బోలగు నాటకమందున
    *"వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"*

    తూర్పురామాయణం - ఉత్తరాంధ్ర యాసలో సినిమా పాటల పేరడీలతో కూర్చిన సరదా నాటకము. ఇందులో రాముడి గుర్తుగా హనుమంతుడు సీతకు చూపినదేమిటో తెలుసా......
    'లంకపొగాకు చుట్ట' 😐😐😐

    ఇదిగో లింకు..

    https://youtu.be/uthTMYLekvw

    రిప్లయితొలగించండి
  9. మేలుగ నటి o తు ననుఁ చు ను
    బేల గ వేష మ్ము దాల్చి వికృత పు చేష్ట ల్
    గేలి గ గని పలికి ర పు డు
    వా ల మ్మే తక్కు వ కద వసుధా సుతకు న్

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. కాలంబం దునమార్పు లేదనుచునీ రాకాసి మూకల్ నిలన్
    జాలంబుల్ దునుమాడ గాసర సమౌ నాజాన కీమా తపై
    గోలన్ జే యుచు నిందమోప గనుయా కాకుల్వ లెన్ గావుతన్
    వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

    రిప్లయితొలగించండి
  12. శ్రీలక్ష్మియె మా జానకి
    కాలపు మహిమగ మసలెను గానల యందున్
    కూలార్చగ రక్కసు కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలున్నీ ప్రతిభా ప్రదర్శనము నీ సాంగత్యమే వద్దికన్
      మూలమ్మౌను జనాగ్రహమ్మునకు నీ మూర్ఖత్వమేమందునో
      స్త్రీలన్ జూడగ నీదు చిత్రములలో చిత్రాతిచిత్రమ్ములౌ
      వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

      తొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    మేలగు నింధన శకటము(PSLVRవంటివి,ఇది భూమినుండి పుట్టినది)
    చాలగ నాకాశ గామి సవ్వడి గనగన్
    లీలగ గాలి పటంబే?!
    వాలమ్మే తక్కువకద వసుధా సుతకున్!

    రిప్లయితొలగించండి
  14. మలినాత్ముడు రావణు నెడ
    వాలమ్మే!తక్కువగద వసుధాసుతకు
    న్నలిగెడు గుణమే!యోరిమి
    గల శీలమ్మే దొడవుగ కాముకు నెదిరెన్
    వాలము = బెబ్బులి

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    జాలమ్మే పరిప్రశ్న పృచ్ఛకునికిన్ సాధ్వీమణిన్ జేకొనన్
    వాలమ్మే తిరుగాడెనో కపివరున్ *బాబాయి*గా నెంచగన్(Man is the cousin of monkey)
    గోలన్ వేసిన మాడ్కి దర్భ పరకన్ గూల్చెన్ మహా పాపమున్(రాముడు బలహీనుడన)
    నేలన్ లంక న రావణాఖ్యు, ఖలునిన్ నిర్జింపగా గడ్డికౌ
    వాలమ్మొక్కటి తక్కువాయెనుగదా వామాక్షి సీతమ్మకున్!

    రిప్లయితొలగించండి
  16. శీలమ్మున్ వెనుదీయదాశరథియే శ్రీలక్ష్మిఁ శంకించుచున్
    జాలమ్మున్ బడినన్ విచారమెగదా! సాధింపు సమ్మానమౌ
    నే? లోకమ్ము క్షమించి యొప్పగలదే! నిందించు నెన్నాటికిన్
    వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్
    కాలమ్మే ! కలికాలమైన కసితో కంపించి ఖండించదే!!!!

    రిప్లయితొలగించండి
  17. తూలెడి ఖలుడౌ రావణు
    ప్రేలాపనలన్ని ద్రుంచి వేసెను గదరా !
    లీలగ మాటలతో ;కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    ఆంజనేయుని ద్వారా సీతామాతృగుణగణాలను వినిన వానరస్త్రీల మనోగతంగా భావించి పూరించిన పద్యం.

    వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్"

    లోలాక్షుల్ ధర సాధ్వులన్ గనిన మాలోనీమె యొక్కర్తెగాన్
    మేలౌనంచు దలంత్రు, సాజమిది , యామెన్ గాంచి తారా రుమల్
    లీలన్ భావన చేసి పల్కిరిటులుల్లేఖించి సాదృశ్యమున్
    వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. కొన్ని ముఖ్యమైన పనుల ఒత్తిడి వల్ల రెండు, మూడు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  20. బాలిశుడొకడిట్లనియెను
    వాలమ్మేతక్కువకదవసుధాసుతకున్
    కాలముచెల్లెనొ?యతనికి
    పేలాపనమంచికాదువేదవతిపయిన్

    రిప్లయితొలగించండి
  21. 🙏శ్రీ గురుభ్యోన్నమః!
    రావణుడు లంకలో నుంచి పొంద గోరినపుడు
    సీత పరిస్థితి -నా భావన

    వాలము* వలె గాండ్రించును
    వాలము** త్రుంచగ నసురుడు వాపోవంగన్
    హ్వాలము^ పాలగునని కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్

    *పులి; **వెంట్రుక; ^ఓటమి

    రిప్లయితొలగించండి
  22. హేలగ రణమున చేయగ
    వాలమ్మే తక్కువగద వసుధా సుతకున్
    కేలెత్తిన చాలును కర
    వాలమ్మ దియె నగునంచు పలికెను హరితా.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [ఏ స్త్రీకూడా భరించలేని భయంకర వనవాస నరకబాధ ననుభవించిన సీతమ్మ, ఆ నరకమునుండి విడుదలై, తన భర్త శ్రీరామచంద్రునితో పాటుగా సింహాసనాసీనయై, సకలాభరణభూషితయై పట్టాభిషేక మహోత్సవంలో భాసించుచుండగా, లీలగా గాలి కెగిరుచు ఊడిపోయిన ఆమె అందమైన తలవెండ్రుక ఒక స్త్రీపై పడగా, ఆమె ఏమనుకొన్నదో తెలుపు సందర్భము]

    కాలాభీలదురంతదుఃఖగతనక్తంచర్యకాంతారబా
    ధాలోకవ్యథఁ దేలి నేఁడు విమలోద్యద్భూషణోద్భూషయై
    లీలం గ్రాలుచునున్నసీత తలపైఁ బ్రేంఖచ్ఛిరోజమ్మటన్
    గాలిం దోఁగుచు నూడి యొక్క కొమపైఁ గైవ్రాలఁగా నిట్లనెన్

    "వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్!"

    [వాలము=తలవెండ్రుక]

    రిప్లయితొలగించండి
  24. కేలన్ తానొకగడ్డిపోచగొనియెన్ ఖేదంబు పెంపారగన్
    జ్వాలల్ పెల్లుగకన్నుదోయికురియన్ జ్వాజ్వల్యమానంబుఁగా
    బేలన్ గాననునట్లుగానరసెనాభీలంబుగారావణున్
    వాలమ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

    రిప్లయితొలగించండి
  25. ఆలము నక్కట రాముం
    డేలా సేయంగ లంక నెంచంగా యా
    భీలంపుఁ గంటి దృష్టికి
    వాలమ్మే తక్కువ కద వసుధా సుతకున్

    [వాలము = కత్తి]


    తేలెం బన్నుగ ధాతృ దారుణము పాతివ్రత్య సంపత్స్థితా
    కాలాంతర్గత దుఃఖ మగ్న సతి కక్కాంతామణిస్తంభ లం
    కాలోలాత్మ నిరుద్ధ భూమిజకు నా కాకుత్స్థవీరద్వయా
    వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

    [వీరద్వయ +ఆవాలము]

    రిప్లయితొలగించండి
  26. బాలలు భవంతి ముంగిట
    కోలాటమును చెలియలను గూడి సలుపగన్
    గోల గని జనకుడు తలచె
    "వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"

    రిప్లయితొలగించండి
  27. లాలనగా రమ్మనె "హృది
    పాలింపగ, నీవె రాణి" పౌలస్త్యుడిటుల్
    చాలించని చూచిన కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్ ౹౹

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బాలన్ గాంచిన వెంటనే బుడుగువై బంజార హిల్సందునన్
    గోలన్ దండిగ జేసి రెండు జడలన్ కొండాడి కయ్యెమ్మునన్
    వేళాకోళపు మాటలిట్టివనగా వెంటాడి కొట్టున్ నినున్:
    "వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్"

    రిప్లయితొలగించండి
  29. కాలమహిమ చే భూమిజ
    శీలవతిగ వెల్గు సీత చిక్కెన సురకున్
    ఆలముచేయ మనుపు కర
    వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్

    రిప్లయితొలగించండి
  30. మూలమ్మెరుగని వర్ణన
    కాలమునకు సరిబడదని కల్పితకథలో
    మేలగు పద్యపుభావన
    వాలమ్మే తక్కువగద!వసుధాసుతకున్!

    రిప్లయితొలగించండి
  31. ఆ లావణ్యము గాంచి రావణుడు మోహావేశమున్ బొంద, కం
    ఠాలమ్మందున రాముడే తునిమి వెంటన్ దెచ్చెనా జానకిన్ 
    లోలాక్షిన్ గనినట్టి వానరులె యాలోచించిరే యివ్విధిన్ 
    వాలమ్మొ క్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్

    రిప్లయితొలగించండి
  32. ప్రేలెడు రావణు పలుకుల
    చీలక గాదేమి నీదు జిహ్వే యనుచున్
    కీలగ దహియింపగ కర
    వాలమ్మే తక్కువగద వసుధా సుతకున్

    రిప్లయితొలగించండి