19, జూన్ 2019, బుధవారం

సమస్య - 3052 (అధర మెటుల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అధరము  మధురం బెటులగు నంబుజ వదనా"
(లేదా...)
"అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

103 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:
  (స్వగతం)

  బధిరుడ నేను వృద్ధుడను పండుగ పూటను నిన్నుజేరగా
  విధురుడ నంచు పొమ్మనకు విద్యలు నేర్చితి కామసూత్రమున్
  వెధవలు కన్ను గొట్టుచును వెంట బడంగను నన్ను నేడిటుల్...
  అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "పెద్దలు యువకు లౌవుతున్నారోచ""

   ...అవధాని బండకాడి అంజయ్య గారు

   తొలగించండి
  2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   "...బడంగ నిటుల్ నన్ను నీ । వధర మెటుల్...' అంటే బాగుంటుందేమో? 'ఇటుల్ అధర'మని విసంధిగా చెప్పకుండా...

   తొలగించండి
  3. "...బడంగను నన్ను నేడు నీ । వధర..." అనండి. ముందు చెప్పిన సవరణలో గణదోషం. సవరణకు సవరణ :-)

   తొలగించండి
 2. విధి వక్రించగ రోడ్డున
  అధరములే ఫగిలె- పడితి వయ్యో!కుట్లే!
  నిధనము నీ కయ్యెనుగా!
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా?
  బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా/గుంటూరు

  రిప్లయితొలగించండి
 3. సుధలూరు వలపు టలలకు
  నధరము మధురం బెటులగు నంబుజ వదనా
  విధురము కలిగిన తదుపరి
  మధుమా సపుకోయి లల్లె మంత్రించి నటుల్

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  బధిరములయ్యె నా చెవులు బావ మృదూక్తి వినంగలేక , నా
  రుధిరము చల్లనయ్యె నవరోధము గల్గగ కౌగిలింతకున్ !
  మధువచనమ్ములాడుటకు మాటలురావతగాడు లేనిచో !
  నధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే ?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 5. సుధలొల్కుచున్ సుమా నీ
  యధరము మధురం బెటులగు నంబుజ వదనా
  బుధవారము పొద్దుట హ
  వ్వ! ధూమ్రపత్రపు భుగభుగ ప్రభలొల్కెనుగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. నిన్నటి పూరణ,

  ప్రాణులు స్థావరాదులిల పర్వులు వెట్టునె జీవముండియున్?
  ప్రాణములుండి పర్విడినె వాహన,విద్యుదుదాహృతాదులున్?
  ప్రాణము కాదు కారణము పర్విడ, శక్తులు ప్రేరితమ్ములై
  ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి, చిత్రమే సుమీ.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 7. విధములు వ్రాయ లేదు, మన వేదము లందున కానరాదుగా
  నిధులకు లోటు లేని పలు నెచ్చలి కత్తెల స్నేహముండగా
  రుధిరము చిమ్మి నంత ఘన రోగము ప్రాకుట ఖాయమందురే
  అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే"

  రిప్లయితొలగించండి
 8. (రావణుడు మండోదరితో)
  రదనపు కాంతులు చిమ్మగ;
  పదముల రాగము లొలుకగ పాడవె రమణీ!
  మధువిది క్రోలుము;క్రోలక
  నధరము మధురం బెటులగు?నంబుజవదనా!
  (రదనపు కాంతులు-పంటి కాంతులు,రాగములు-ప్రేమలు;సంగీతరాగాలు)

  రిప్లయితొలగించండి
 9. సుధలొలికెడి నా రెంటికి
  విధిగా పూయంగ మీరు వింతగు రంగుల్
  మెదిలెను సందేహమొకటి
  "యధరము  మధురం బెటులగు నంబుజ వదనా"

  రిప్లయితొలగించండి
 10. సుధలను గ.రిపించు పలుకు
  నిధ.లను మళ్ళించు నట్టి నీచుండగు నా
  వెధవను పరిశీలింపగ
  అధరము మధురంబెటులగు నంబుజ వదనా

  రిప్లయితొలగించండి


 11. విధివికటింప నన్ విడిచి వీరిని వారిని చేరి జీవిత
  మ్ము ధవనిలోన కాలగ సమూహము తా వెలి వేయగానరే
  ప్రధమ వివాహ మైన పతి వద్దకు వచ్చితి వీవు! స్వైరిణీ!
  యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  [కురంగమును వేఁటాడుటకై కణ్వమహర్షి యాశ్రమ ప్రదేశమునకు వచ్చి, తననుఁ గాంచి, ప్రేమమెయి, గాంధర్వవివాహమాడి, తనను తులలేని సుఖములలోఁ దేల్చి, తిరిగి వచ్చి రాచ మర్యాదలతోఁ గొంపోదునని చెప్పి వెడలి, మఱల నెంతకాలము గడచినను తిరిగి రాని "దుష్యంతుని" కోసమై తపించుచుఁ దన చెలులతోఁ బలుకుచున్న "శకుంతల" వచనములు]

  "మధువనమందుఁ జొచ్చు వనమాలి వలెన్ ననుఁ గాంచి మెచ్చి నన్
  వధువుగఁ జేసి వేగమె వివాహమయెన్! సుమ బాణు కేళిలో
  మధురిమ లందఁజేసి, చనె! మానిని! రాఁడయె నింక స్వామి! నా

  యధర మెటుల్ సుధామధురమౌను? సరోజముఖీ, వచింపవే!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మనోహరంగా, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
   'వివాహమయెన్, రాఁడయె' అని రెండు చోట్ల ప్రయోగించిన 'అయె' సాధువు కాదని పెద్దలన్నారు.

   తొలగించండి
  2. అవునండీ శంకరయ్యగారూ! నేను పూరణ రాసే తొందరలో గమనించకుండానే...మళ్ళీ వెనుదిరిగి చూసుకోకుండానే ప్రకటించాను. ఇప్పుడు మీరు చెప్పింతర్వాత గమనించాను. తెలిపినందులకు ధన్యవాదాలు. ఇప్పుడే సవరిస్తాను. రెండో పాదంలో ...వివాహము కాన్... అనియు, మూడో పాదంలో...రాఁ డిట కింక...అనియు సవరించి, మఱల ప్రకటించుచుంటిని. పరిశీలించగలరు.

   "మధువనమందుఁ జొచ్చు వనమాలి వలెన్ ననుఁ గాంచి మెచ్చి నన్
   వధువుగఁ జేసి వేగమె వివాహము కాన్, సుమ బాణు కేళిలో
   మధురిమ లందఁజేసి, చనె! మానిని! రాఁ డిట కింక స్వామి! నా
   యధర మెటుల్ సుధామధురమౌను? సరోజముఖీ, వచింపవే!"

   తొలగించండి
 13. సుధలను పంచెడి పలుకుల
  మధురముగా మాటలాడు మానిని యైనన్
  వ్యధలను మునిగిన వానికి
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అధర సుధా రసానుభవ సారమెరింగి రసజ్ఞుడైన నా
   విధురు వియోగ తప్త పరివేదన పూరిత మానసున్ మనో
   వ్యధలను మున్గి యుండ వలపంచును లేమయె చెంత జేరినన్
   అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తం మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  3. __/\__

   సవరణతో

   అధర సుధా రసానుభవమంత యెరింగి రసజ్ఞుడైన నా
   విధురు వియోగ తప్త పరివేదన పూరిత మానసున్ మనో
   వ్యధలను మున్గి యుండ వలపంచును లేమయె చెంత జేరినన్
   అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

   తొలగించండి
 14. కం.సుధనైనను గొని వచ్చెద
  విధాత వరమిడగ దెచ్చి ప్రేయసి కోరన్
  ప్రధనము చేయ దొరుకునా?
  అధరము  మధురం బెటులగు నంబుజ వదనా"

  కం.మధువును గ్రోలగ నంతగ
  నధరము  మధురం బెటులగు నంబుజ వదనా
  సుధ కోరగ నీ పెదవుల
  నిధి నాతో పంచుకొనుము నిశ్చల ప్రేమన్!

  రిప్లయితొలగించండి
 15. కందము
  మధువును మించిన,మానిని
  యధరామృత మెంతొ మధురమౌ నరయంగన్
  వెధవలు గ్రోలని వారలు
  అధరము మధురం బెటులగు నంబుజవదనా.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 16. డా. పిట్టా సత్యనారాయణ
  బధిరులు!సాంకేతిక మని
  వధ జేసిరి లలిత కళల వాసియు గన,నే
  సుధలను గ్రోలను సఖి!నీ
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా

  రిప్లయితొలగించండి
 17. డా.పిట్టా సత్యనారాయణ
  చట్ట సభలలో ఛలోక్తులు మృగ్యమైన వైనమును భర్త, భార్యతో ముచ్చటించుట...
  అధమపు కూటనీతి గొనె హాయిగ పార్టిని బ్రోవ నీ సభన్
  బధిరగ జేయుటాయె నిక భాగ్యమదేమి విపక్ష వర్గపుం
  బుధులె సభన్ జలాకి గొన బూనరు నుక్తుల హాస్య వల్లరీ
  అధర మెటుల్ సుధా మధురమౌను సరోజముఖీ, వచింపవే

  రిప్లయితొలగించండి
 18. సుధలను జిలికెడి పెదవులు
  మధురమ్మై యొప్పుగాని మహిని గనంగా
  నధికము పొగాకు నమిలెడి
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా?

  రిప్లయితొలగించండి
 19. విధిగ సతము నీయధరపు
  మధువును సేవించు ఖుసిని మరువగ లేనే !
  పెదవిపయి పూత యుండగ
  నధరము  మధురం బెటులగు నంబుజ వదనా!

  రిప్లయితొలగించండి
 20. సుధలను జిలికెడి పెదవుల
  రుధిరపు రంగులనుపూసి రుద్దగ నెపుడున్
  మధువులు కురియగ నేరవు
  అధరము మధురం బెటులగు నంబుజవదనా

  రిప్లయితొలగించండి


 21. విధవిధముల చేసితి ప్ర
  ప్రధమపు శిష్యునిగ సేవ ప్రాణసఖి ప్రియా
  సుధలొల్కుముద్దుల వినా
  నధరము మధురం బెటులగు నంబుజవదనా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. కీచకుడు సైరంధ్రితో
  మధువనమున మోహినివై
  మధురోహల దేల్చితీవు మానిని యికనీ
  యధరపు సుధలూనక మా
  యధరము మధురంబెటులగు నంబుజవదనా?

  రిప్లయితొలగించండి
 24. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  అధరము  మధురం బెటులగు
  నంబుజ వదనా

  సందర్భము: ఏ లడ్డైనా రుచి చూస్తేనే మధురంగా వుందని చెప్పగలం.. అట్లే ముద్దు గొన్నపుడే అధరం మధుర మని చెప్పగలం. లేకపోతే ఎలా చెప్పగలం.. అంటున్నా డొక ప్రియుడు తన ప్రేయసితో...
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  మధురము రుచి చూచిన య
  ప్డు ధరణి నే లడ్డయినను;
  ముద్దు గొనినచో
  మధురం బగు.. ముద్దు గొనక
  యధరము  మధురం బెటులగు
  నంబుజ వదనా!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.6.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి


 25. సుధలొల్కంగ జిలేబీ
  యధరము మధురంబెటులగు నంబుజవదనా?
  సదనమ్మునతెలుపుమికన్
  వధానులున్ ముచ్చటపడి పరిశీలింపన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. అధరమె కాదు కాదు సకలాంగవిలాససుధాప్రసారమై
  మధురసవాహినీప్రణయమగ్నశరీరమె మత్తుగొల్పు, నా
  విధము నెఱింగవేలనొ? వివేచనఁ జేసి ప్రబుద్ధబుద్ధివై
  అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే?

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'ఎఱుంగవేలనొ' టైపాటు.

   తొలగించండి
 27. శ్రీ గురుభ్యోన్నమః🙏

  అధమము గాదయ గ్రోలగ
  సుధ లొలికించు సతి మోవి సుముఖత బెంచున్
  వ్యధలకు మూలము జారిణి
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా!

  రిప్లయితొలగించండి
 28. ప్రవరుని నిరాదరణకు వగచెడు వరూధిని చెలికత్తెలతో..

  చంపకమాల

  అధిక ప్రసంగి యా ప్రవరుడార్తినెరుంగని నిర్దయుండు నే
  మధువు నొసంగ జూచినను మన్నన జేయక మోవి తాకడే
  కథల పరాశరున్, హరిని, కౌశికు నెంచిన కూడదన్న నా
  యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

  రిప్లయితొలగించండి
 29. అధికపు ప్రేమ నన్నిటుల నాతని చెంతకుఁ బోవ నెట్టగా
  కుధరము రీతి నడ్డుకొనఁ గూడిరి పెద్దలు వంశమంచు,నే
  పృధువునఁ గాలుచుంటినిక ప్రేలకఁనుండగనాకు సాధ్యమే?
  యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

  రిప్లయితొలగించండి
 30. అధికరసాయనమ్ముల పదార్థములెన్నియొ యుండువీనిలో
  మధురధరస్మితా! వలదు మానుము! పూసిన లిప్స్టికుల్, సదా
  సుధలను చిమ్ముచుండి సహజమ్మగు తీయదనమ్ముగల్గు నీ
  "అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే"

  రిప్లయితొలగించండి
 31. నిధనము గూర్చును సతము వ
  సుధఁ గర్కశ వచనము లనఁ జోద్యమె లేమా
  యధురపు వాక్కుల నీ దగు
  నధరము మధురం బెటు లగు నంబుజ వదనా


  విధికృత మంచు నాశలను వీడక చేకొనఁ గర్షణమ్ము త
  ద్విధమును సస్య సంపద లభించుట యెట్టులు సంచలత్తరం
  గ ధర విలీన భార నత గాఢత రాంచిత సార గంధ వ
  త్యధర మెటుల్ సుధా మధుర మౌను సరోజ ముఖీ వచింపవే

  [గంధవతీ + అధరము = గంధవత్యధరము; అధరము = క్రింది భాగము కలది

  రిప్లయితొలగించండి
 32. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. 'సంచలత్తరంగ....గంధవ్యధరము' సమాసం మనోహరం.

  రిప్లయితొలగించండి
 33. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
  ఈ సారవంతమైన భూ వర్ణనము నేడు సద్యఃఫలము నొసంగినదండి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా,నమస్కారము!మీవృత్త పూరణ భావము సంపూర్ణముగ బోధపడలేదు.వివరించ ప్రార్ధన!

   తొలగించండి
  2. డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
   మొదటి రెండు పాదములు సుస్పష్టమ్ములే.
   సంచలత్ తరంగ ధర భార నత : కదలెడు తరంగములు ధరించునది, సముద్రము , దాని భారమున వంగి నటువంటి ( భూమి ఒక వైపునకు వంగి యుండును కదా);
   గాఢతర అంచిత సార గంధవతీ అధరము:
   అధికమగు మంచి చేవ గల భూమి క్రింది భాగమును మధురముగా (అంటే ఫలవంతముగా) చేయుట యెట్లని అడుగు సందర్భము.
   సమంజసమని భావించెదను.

   తొలగించండి
  3. ధన్యవాదములార్యా!గాఢతరాంచిత సారగంధవతీ అన్నారుగదా,మరల దానిని సుధామధురము జేయుట యెటుల అనే భావము కొంచెము సందేహాస్పదమైనదిగా నాకు తోచినది.తప్పైన క్షమించగలరు!

   తొలగించండి
  4. అదే కదండి అందులో నామెను పద్యములో అడుగు చున్నది.
   సారము భూమిలో నిక్షిప్తమై యున్నది దానిని యుపయుక్తముగా చేసుకొన వలెను కదా వ్యవసాయమునకు. నీరు పెట్టాలి, తగిన సమయములో దున్నాలి, విత్తనములు వేయాలి, పంట కాయాలి, కోయాలి. అప్పుడు చేతి కందిన పంట మధురాతి మధురముగా నుండును కదా.
   ఈ విషయములు మొదటి రెండు పాదములలో సూచింప బడినవి.

   తొలగించండి
  5. సుకవి మిత్రులు పోచిరాజువారూ! అద్భుతంగా వున్నదండీ మీ పూరణ! అలాగే...మీ వివరణ కూడానూ... శుభాభినందనలు!

   తొలగించండి
  6. కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములండి.

   తొలగించండి
 34. మధురపు మాటలు లేవే
  సుధలొలికించెడు సరళపు సుద్దులు రావే
  వృధయగు పలుకులు పలికెడి
  యధరము మధురం బెటులగు నంబుజ వదనా"

  రిప్లయితొలగించండి
 35. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గిరీశం:

  కుదురుగ నుండ లేకనిను కూరిమి తోడను చూచుచుండగా
  వెధవడు వెంకటేశ్వరుడు వేడుక మీరగ నవ్వుచుండగా
  మధురపు చుట్ట కాల్చగను మండగ బుగ్గలు మైకమందునీ
  యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

  రిప్లయితొలగించండి
 36. సాధనయధరముమధురమె
  యధరముమధురంబెటులగునంబుజవదనా!
  యధరమునధరముకలిసిన
  మధువునునేబోలునండ్రుపండితవర్యుల్

  రిప్లయితొలగించండి
 37. బుధజన బోధనల్ వినుచు భోగములన్ విడి మోక్షగామినై
  పథమును దేవులాడ భవ బంధము లన్నను రోసినాడ, నె
  వ్విధమునఁ గోరుకుందునిక భీరువు పొందు, విరక్తుడన్ గదా
  యధరమెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే.

  రిప్లయితొలగించండి
 38. ముదముగొని నావకాయను
  పెదవులతో చప్పరించి పెరపెరలాడన్
  పెదవులపై ముద్దునడుగ
  నధరము మధురం బెటులగు నంబుజ వదనా౹౹

  రిప్లయితొలగించండి
 39. మరల కీచకుడే
  అధిక ప్రయాసయేలనె సుహాసిని సుందరి మన్మధాంగి నీ
  మధువులజిందు ముగ్ధముఖమాధురులన్ జవిచూడనార్తుడన్
  వ్యధలను ద్రోచివైచి తనివారగ ముద్దులముంచకుండ నా
  యధరమెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే?

  రిప్లయితొలగించండి
 40. సుధ,సుధాకరుడంటిన
  అధరము మధురంబెటులగు నంబుజవదనా?
  నిధులను బంచినరాదది
  విధిగా గదిలోగలసియు విజ్ఞతగూడన్!

  రిప్లయితొలగించండి
 41. అధరమెటుల్ సుధామధురమౌనుసరోజమఖీవచింపవే
  యధరపువంచలొక్కటిగనానుచుముద్దులుసేయగానగున్
  మధురసుధారసంబులుగమారుచుమత్తునునిచ్చునత్తఱిన్
  బుధజనులందరిచ్చటనపూర్వపులౌల్యముజెందురేగదా

  రిప్లయితొలగించండి
 42. మధురముగా మాటాడక
  నధరములను బిగియ బెట్టి ననవరతంబున్
  వెధవా యని తిట్టెడి నీ
  అధరము మధురం బెటులగు అంబుజ వదనా

  రిప్లయితొలగించండి
 43. సుధలూరు మోవి కేలను
  మధువుల గలుషమ్మొనర్చు మైనపు రంగుల్
  వ్యధ నా కది వినవా మరి
  యధరము మధురం బెటులగు నంబుజ వదనా?

  రిప్లయితొలగించండి
 44. స్వర్గంలో అర్జునుడు యూర్వశితో...
  కందం
  మధువొలకబోయు కన్నులఁ
  గథలన్నియు నూర్వశీ! వగలొలుకఁ గంటిన్
  బుధజను లొప్పని వరుసల
  నధరము మధురం బెటులగు నంబుజ వదనా!

  రిప్లయితొలగించండి
 45. Get General Health Checkup Package @ 1200/- only. For more details, visit: http://simhapurihospitals.com/health-packages/

  రిప్లయితొలగించండి
 46. ముధువును గ్రోలుచు పెనిమిటి
  నధునాతన మద్యశాలలందు, సతతమున్
  వధువును చేరక తిరుగ
  న్నధరము మధురం బెటులగు నంబుజ వదనా

  రిప్లయితొలగించండి
 47. మధువును గ్రోలి గ్రామమున మాన్యుల దూరుచు నిత్యమన్యులౌ
  వధువులతో చెరించుచును భార్యను దూరము చేయ భర్త తాన్
  మధురిపు పూజ చేయుచును మానిని వర్తిలు చుండె, నాసఖీ
  యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే

  రిప్లయితొలగించండి
 48. బుధజనులసమాగమమును
  మధుమాసపు సోయగములు మంజులభాషల్
  మదవతులకనాదరమగు
  *"నధరము మధురం బెటులగు నంబుజ వదనా"*

  రిప్లయితొలగించండి
 49. మధురము సాధుసేవనము మాధవు కీర్తనలాటపాటలున్
  పదవులు సౌధ లాత్మజులు వైభవ మాయువు నాలు బిడ్డలున్
  మధురము మంజు భాషణము మానిని బెన్మిటి యాదరించకన్
  *అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే"*

  రిప్లయితొలగించండి
 50. విధమది చిత్రముఁ జూడగ
  సుధయే యిచ్చిన వడసిన 'చుంబన'మన్నన్!
  వ్యధితమ్మని తలచినచో
  నధరము మధురం బెటులగు నంబుజ వదనా?

  రిప్లయితొలగించండి
 51. సుధలనుచిలికెడుపలుకులు
  అధరములకుఁనందమొసగుఁనందరుమెచ్చన్
  వృధగావాదనలకుదిగు
  అధరము మధురం బెటులగు నంబుజ వదనా

  రిప్లయితొలగించండి