9, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3100 (లలనలు సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్"
(లేదా...)
"స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్"

68 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    రాలన్ రువ్వుచు నత్తగారి పయినన్ రమ్యమ్ముగా నవ్వుచున్
    పాలింపంగను నాడబిడ్డలనుతా బ్రహ్మాండమౌ తీరుగా
    నాలస్యమ్ముగ నిద్రలేచి వరునిన్ హైరాన గావించెడిన్
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    రిప్లయితొలగించండి
  2. కొలిచిన సిరులే కురియును
    నెలతలు భక్తిని మురియుచు నీమము తోడన్
    కలతల కక్షలు కలుషపు
    లలనలు సేయఁ దగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'వరునిన్' బదులు 'పతినే' అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  4. భూలోకంబున నొక్క నాస్తికుడు తా బూర్వంబునన్ రాజుగా
    నేలాగైనను గాదలంచి పలికెన్ హీనాత్ముడై "స్వామినై
    యేలం జేసెద చట్ట మేను వినుమోయీ! మిత్రమా యిచ్చటన్
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్"

    రిప్లయితొలగించండి
  5. పలువురు పెద్దలు చెప్పిరి
    చెలువలు సౌభాగ్యమునకు చేసెడి సనియౌ
    యిలలో పతినెడ బాసిన
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  6. కలనైనను మెట్టినవా
    రల పేరయినను దలవక రక్కెసలట్టుల్
    మెలగెడి యీర్ష్యాసూయల
    లలనలు సేయదగదు వరలక్ష్మీవ్రతమున్ .
    (రక్కెసలు - రాక్షసస్త్రీలు)

    రిప్లయితొలగించండి
  7. కందం
    ఇలు స్వర్గమ్ముగ జేయఁగ
    తళుకారెడు దీపమనఁగ ధారుణి నియతిన్
    మెలగక పతి బాధించెడు
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  8. నెలతలు పతినెడ బాసిన|
    వలదని పెద్దలు చెబుదురు వంకలు యేమో |
    కలతను చెందక వినదగు|
    "లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుసుమ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంకలు + ఏమో' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "వంక లవేమో" అనండి.

      తొలగించండి

  9. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జాలంబందున మంత్రి వర్గమును తా జల్తారుతో పట్టుచున్
    పాలించుండెడి నేత లెల్లరిని వే ప్రార్థించి ప్రాజెక్టులన్
    కాలంబందున పూర్తి చేయకయె భల్ కంగారు పుట్టించు మే
    స్త్రీలెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    వే = వేగముగ (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాలించుచుండెడి' అనడం సాధువు. అక్కడ "పాలించం జను నేత..." అందామా?

      తొలగించండి
  10. వలచిన వారి శుభముకై
    సలుపెద రెప్పుడు బతముల శర్వరు లెన్నో
    వెలియగు దినంబు లందున
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి


  11. అలుకలు కౌతుకములతో
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్;
    వలయును సద్భక్తియు కా
    వలయు నిబద్ధతయు లక్ష్మి వరల గృహమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. కాలంబంతయుపోవదొక్కవిధమున్ కష్టంబులన్ జేర్చు క
    ల్లోలంబైన విరక్తవేళలగుటన్ రుగ్మంబులాసన్నమౌ
    జ్వాలోపేతముహూర్తమున్ యనగ మాసంబందు ముప్పొద్దులన్
    స్త్రీలెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరాదెన్నడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రోహిత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోవదు' అనడం సాధువు కాదు. "కాలంబంతయు సాగదొక్క..." అనండి. 'ముహూర్తమున్ + అనగ' అన్నపుడు యడాగమం రాదు. "ముహూర్తమో/మే యనగ..." అనండి.

      తొలగించండి
    2. కాలంబంతయు సాగదొక్కవిధమున్ కష్టంబులన్ జేర్చు క
      ల్లోలంబైన విరక్తవేళలగుటన్ రుగ్మంబులాసన్నమౌ
      జ్వాలోపేతముహూర్తమేయనగ మాసంబందు ముప్పొద్దులన్
      స్త్రీలెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరాదెన్నడున్

      ఆచార్యులకు ప్రణామము
      సవరణలు సూచించినందుకు
      ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻

      తొలగించండి
  13. విలువయె నీయక పెద్దల
    పలుచన జేయుచు ముదుసలి పద్ధతులనుచున్
    చులకన సేయుచు నుండెడి
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విలువల నీయక/ విలువయె యీయక' అనండి.

      తొలగించండి
  14. చెలువల పేరంటములను
    కలుములరాణిని నిలిపెడి కలశపు పూజల్
    విలువలు దెలియక వలదను
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  15. నిలుపక శ్రద్ధయు భక్తియు
    కలుషంబగు మాటలనుచు గడబిడ పడుచున్
    నిలకడలేని మనమ్మున
    లలనలు సేయ దగదు వరలక్ష్మీ వ్రతమున్!!!

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    అందరికీ వరలక్ష్మీవ్రతపర్వదినశుభాకాంక్షలు.

    హరి పట్టపురాణిని., సిరి.,
    కరుణామృతవర్షిణి హితకారిణి జననిన్
    స్మరియించుచు శ్రావణశుభ..
    వరలక్ష్మీవ్రతము జేయ భాగ్యములబ్బున్ !!
    🚩🕉💐🙏

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్".!

    మా లచ్చిన్ గొలువంగరాదనుచు సంభావించుటే దోసమౌ !
    మేలౌ న్యస్తనిషిద్ధవర్ణములనన్ మేమూహ జేయంగ నే...
    డేలా యిట్టిసమస్యనిచ్చితిరి స్వామీ ! యిట్లనన్ జెల్లునే ?!
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధిక్షేపాత్మకమైన మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి

    2. ఇట్లా అధిక్షేపాత్మకపు పూరణా కౌశల్యము సుబ్బారావు గారి కాపీ రైటు :) మైలవరపు వారూ మీరిలా దాన్ని లాక్కోవటము బావోలేదు :) ఇంకో పూరణ చేయుడీ :)



      జిలేబి

      తొలగించండి


  17. మూలంబెద్దియొ దాని కెల్లపుడు నామోదంబు దక్కున్ భువిన్
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వ, రా దెన్నఁడున్
    బాలా వ్యర్థపు కష్టనష్టములు; సౌభాగ్యమ్ములున్ శోభలున్
    బాలారాజము గాను వెల్గు నెపుడున్ కంజారమే స్వర్గమౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. ఎవరైనా ఆకాశవాణికి పూరణ పంపని వారుంటే ఈరోజు ఉదయం 10 గం.లోగా పంపండి.
    "కలిమి దొలంగినప్పుడే సుఖంబు లభించును మానవాళికిన్"
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి

  19. ... శంకరాభరణం... . 09/08/19 ..శుక్రవారం....

    సమస్య::

    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    నా పూరణ. శార్ధూలము
    ***** **** ***

    జాలిన్ జూపక నెప్పుడున్ మిగుల ద్వేషాభావముల్ కోపముల్

    మాలిన్యంబగు డెందమున్ గలిగి సమ్మానంబు లేకెప్పుడున్

    వేళాకోళము లాడి నన్యుల సదా వేధించి జీవించె డా

    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ద్వేషభావము' సాధువు. ద్వేషాభావము అంటే ద్వేష అభావం కదా? "ద్వేషత్వ ప్రకోపమ్ములన్... జీవించు నా..." అనండి.

      తొలగించండి
  20. శ్రీ గురుభ్యోన్నమః🙏
    🌺వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు🌺

    ఇలను ద్రివిధ నాస్తికులగు
    లలనలు సేయఁదగదు; వరలక్ష్మీ వ్రతమున్
    కలనైన మరవరమ్మా
    కులకాంతలు గూడి సేయ గోత్రము వెలుగున్

    త్రివిధనాస్తికులు=క్రియాదుష్టులు,మనోదుష్టులు,
    వాగ్దుష్టులు: గోత్రం=వంశం,భూమి

    రిప్లయితొలగించండి
  21. కలవర పరచెడు వర్తన
    విలయము సృష్టించు తలపు విపరీతము గా
    చెలగెడు దురిత చరితలౌ
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  22. వలవలయేడ్చుచు నుండెడి
    తులువల మనసుంచునట్టి తొందరచేతన్
    నిలకడ,భక్తియు లేకను
    లలనలు సేయదగదు వరలక్ష్మి వ్రతమున్!

    రిప్లయితొలగించండి
  23. చులకన భావన తోడను
    మెలగుచు నావటమె లేని మిడిమేలముతో
    జలధిజ నెంచగ బోయెడు
    లలనలు సేయదగదు వరలక్ష్మీవ్రతమున్.

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చులకన భావన తోడను
    మెలగుచు నావటమె లేని మిడిమేలముతో
    జలధిజ నెంచగ బోయెడు
    లలనలు సేయదగదు వరలక్ష్మీవ్రతమున్.

    రిప్లయితొలగించండి
  25. కలతల నిద్రను నిట్లనె
    లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్
    మెలకువరాబలికెనిటుల
    లలనలుసేయంగవలయు లక్ష్శీ పూజన్

    రిప్లయితొలగించండి
  26. విలువలుఁదెలియని వారలు,
    కలిలో రుగ్మతల చేత కలతలు నిండన్
    పలు బాధలందు వారలు,
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

    సందర్భము: ఇల్లెంతగా శుభ్రపరచు కొన్నప్పటికీ ఒళ్ళు శుభ్రపరచుకొన్నప్పటికీ డాంబికంకోసం (అందరూ మెచ్చుకోవా లని గొప్పలకోసం) నెలసరి (ముట్టు) గలిగిన రోజులలో మహిళలు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించరాదు.
    అసంకల్పితంగా సంభవించిన ప్రాకృతిక మైన అవరోధం కాబట్టి వైయక్తికమైనది కాదు కాబట్టి తమ చేతిలో లేదులే అని మానివేయవలెను.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఇలు శుభ్రపరచుకొనిన.. నొ
    డలు శుభ్రము చేసికొనిన..
    డాంబికమునకున్
    నెలసరి గలిగిన దినముల..
    లలనలు సేయఁదగదు
    వరలక్ష్మీ వ్రతమున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    9.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  28. పొలతీ! హడలన్ గొట్టుచు
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్
    వలయు నెలమి ప్రేమ జిలే
    బులకు పతులు క్షేమముగ విభునిగా బతుకన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. కలుషాత్ములు దురహంకా
      రులు పాపోన్ముఖులు గురు విరుద్ధుల కిల ని
      ష్ఫల మౌను దదుక్త గుణో
      ల్లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్


      బాలా యేలఁ దలంకు చిత్తమునఁ గొల్వం జాలరే ధాత్రిఁ గ
      న్యాలావణ్యలు పూరుషోత్తములు పుణ్యస్త్రీలు వైధవ్యలుం
      జాలుం జాలును గట్టిపెట్టు మిఁక వాచాలత్వ మీ మాటనన్
      స్త్రీ లెవ్వారలు? భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

      తొలగించండి
  30. నలువురు రండిటు పూజను
    సలుపగ, మీ జుట్టు దువ్వి జడలుగ, కేశ
    మ్ముల విరబోసుక వినుడో
    లలనలు! సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్.

    రిప్లయితొలగించండి
  31. Malli siripuram
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి .
    కం.
    మలినాలను దొలగించక l
    తలపున, హృదిలో, వివాద ధ్యాసల జేతన్ l
    కులమత పేచీ బెట్టెడు l
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ ll

    రిప్లయితొలగించండి
  32. శ్రీలన్ వాసిగ నిచ్చు తల్లి యనుచున్ శ్రీలక్ష్మిఁ బూజించుటన్
    చాలింపంగను మేలటంచనెడు పాశ్చాత్యంపు భావాలతో
    మాలిన్యమ్మును బొందినట్టి సతులున్, మాంగళ్యమే లేనిచో
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    రిప్లయితొలగించండి
  33. చాలాకాలము భారతావనిని భాషావేషముల్ సంస్కృతిన్
    కాలాతీతము జేయకుండ సుజనుల్ కాపాడ బాశ్చాత్య భా
    వాలన్ స్వీకృతిజేసి హైందవ మతద్వేషమ్ముతో నున్న యా
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరాదెన్నడున్!

    రిప్లయితొలగించండి
  34. Malli siripuram
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
    కం.
    నిలవని మనమ్ముజేతన్ l
    నెలసరి ఋతు క్రమమునందు నెలతల బుద్ధిన్ l
    మలినపు వస్త్రంబులతో l
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ ll

    రిప్లయితొలగించండి
  35. రిప్లయిలు
    1. వేళన్ దప్పక పూజకేర్పరచి నైవేద్యంబు, పుష్పాదులన్
      మాలల్ దీరిచి నింపుసొంపమర సంభావించి నీమంబునన్
      మేలుంగోరుచు నింటివారలకు లక్ష్మీనాథు నేమాఱుచున్
      స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

      తొలగించండి
  36. కం.
    అలుగకు, మౌఢ్యమి వచ్చెన్ l
    కలలన్నియు కల్లలాయె కావున మీరున్ l
    తొలుతగ వ్రతమును బట్టెడి l
    లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ ll

    రిప్లయితొలగించండి
  37. చిలకలకొలికికి వలపుల
    చెలికానికి జత కుదిరెను చెదిరెను మనసే
    కలలవిహరణము సలుపుచు
    లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్"

    రిప్లయితొలగించండి
  38. స్త్రీలెవ్వారలు భక్తితోడవరలక్ష్శిన్ గోల్వరాదెన్నడున్
    షీలా!యేమిదివైపరీత్యమయొకో శ్రేయంబయౌనేనికన్
    స్త్రీలేపూజకునర్హులౌటనుభువిన్ శ్రీకారమున్జుట్టుమా
    మేలంబాడుటనీకుధర్మమె?యయో!!మేధావియౌనీకిటన్

    రిప్లయితొలగించండి
  39. శార్దూలవిక్రీడితము
    కాలంమ్మెంతయొ వ్యర్థమాయెనుకదా! కాశ్మీరదేశమ్మునన్
    వాలమ్మొక్కటి త్రుంచి భారతమునన్ భాగమ్ముగా జెప్పగన్
    శ్రీలున్ సేమము వారికందు వరముల్ చిత్తమ్మునన్లేకయున్
    స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

    రిప్లయితొలగించండి
  40. సమస్యా పూరణం:
    *లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్*

    కం.
    విలసద్విభవము కల్గును/
    కలిమి యధిష్ఠాత్రి పూజ గరపన్ భక్తిన్!
    కలనైనను నిర్లక్ష్యము/
    లలనలు సేయఁదగదు, వరలక్ష్మీ వ్రతమున్!!

    - రాధేశ్యామ్ రుద్రావఝల, విశాఖపట్నం
    94408 78308

    రిప్లయితొలగించండి