16, డిసెంబర్ 2019, సోమవారం

సమస్య - 3222 (తలకుఁ జెవులె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు"
(లేదా...)
"తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"

46 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కులుకుల్ మీరుచు వోట్లకై జనులపై గుప్పించి ద్రవ్యమ్ములన్
    వలపుల్ తీరగ మంత్రులై మురియుచున్ వర్ధిల్లి రాజ్యమ్మునన్...
    పలుకుల్ సుంతయు నెత్తి కెక్కనివియౌ బంగారు మాపల్లె నే
    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE

    %E0%B1%81_%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95_

    %E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%9A

    %E0%B1%86%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
    A-1)
    చక్షుశ్శ్రోత్రము :
    __________________________

    కాళ్ళు కరములు లేవదె - కళ్ళు గలవు
    తలయు తోకయు కదలించి - తరల గలగు
    నేల నానించి పొట్టతో - నిగుడు చుండు
    శివుని మెడలోన నుండును - స్థిరము గాను
    విష్ణు మూర్తికి శయ్య గా - వెలయు చుండు
    భూమి భారము నెన్నడున్ - మోయు చుండు
    పుట్ట పురుగది యెలుకల - బట్టి తినును
    తలకుఁ జెవులె యుండవు విచి - త్రంబు గాదు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విలువౌ డబ్బులు ధారవోయుచును భల్ వేగంబుగా నేర్చుచున్
    ఖలులే చెప్పెడు మంత్ర తంత్రములనున్ గర్వంబుగా చాటుచున్
    బలుపౌ రీతిని శాస్త్రముల్ చదువగా పండంటి మాయత్తవౌ
    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?

    రిప్లయితొలగించండి
  4. అధిక సంఖ్య తోడన పీఠ మందు కొనగ
    కన్ను మిన్నులేమియసలు కానకుండి
    యెందరెన్నిజెప్ప ప్రభుతనేలు వాని
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి


  5. ఇది కలియుగ మాయె! యెవరి యిచ్చ వారి
    దాయె! యేది నిత్యమగు సత్యమని తెలుపు
    మంచిని వినుటకు జిలేబి మనుజులకదె
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. నేటి రాజకీయమరయ నేతలంత
    తమకు పదవివచ్చు వరకు తాము దేశ
    సేవ జేతుమంద్రు, గెలువ చెప్పనేల
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు.

    రిప్లయితొలగించండి
  7. చెవిటి వారల కుండును చేట చెవులు
    వినగ రాదట మూర్ఖుల వింత గోల
    వంత పాడుచు బ్రతుకగ సంత సమున
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  8. (సునేత - కునేత )
    ప్రజల కష్టాలు తనవిగా పరిగణించు
    నేత నిలువెల్ల చెవులుగా నెగడుచుండు ;
    దూరి యాస్తుల గబళించు దుష్టనేత
    తలకు జెవులె యుండవు ; విచిత్రంబు గాదు .

    రిప్లయితొలగించండి
  9. గెలుపుకోసరమేమేమొతలకుమించి
    చేయువాగ్దానగిరులసచేతనమున
    గెలిచినేతలుశక్రులైగేలిసేయ
    తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  10. తగవులఁ బడుచు పరులతో ధరణిపైన
    భర్తలన్ లెక్కచేయక బరితెగించి
    పెత్తనమునుచేయు చపల చిత్తపు వని
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  11. బాధలను తీర్చు వారంచు వాసిగాను
    నమ్మి, దర్శింప దలచుచు నిమ్మహికిని
    రమ్ము రమ్మంచు పిలిచినన్ రారు, దేవ
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  12. వయసు మీరిన తరువాత వసుధ యందు
    పనులు జేయక నంగము ల్ బాధ పెట్టు
    వీనులుండి యుతాత లు వినగలేరు
    తలకు జెవులె యుండవు విచిత్రం బు గాదు

    రిప్లయితొలగించండి
  13. పిలిచిన విను వారెవ్వరు పెళ్ళి యింట
    గలగలమని మాటాడుచు కలకలముగ
    చిలవల పలవల కబుర్ల జిక్కిన ముది
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  14. నేటి శంకరా భరణము వారి సమస్య

    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"

    ఇచ్చిన సమస్య మత్తేభ పాదము నా పూరణము సీసము లో

    భారత యుధ్ధము అయిన తర్వాత దృతరాష్ట్రుని చూచి కృష్ణుడు పలుకు తున్నాడు అన్న భావన


    పరమ పవిత్ర,ద్రౌపదిని బట్టి సభలోన వలువ లూడ్చగ నాడు సాధ్వి
    రోదనల్ వినబడ లేదుగా? కపట జూదములోన నోడించి తమ్మునిసుతు
    లను భీకర వనములకు పంపు సమయానజనుల దు:ఖంబులు జానుగులను
    తాకగ లేదుగా? తనయని హర్షంబు కోరుచు ధృతరాష్ట్ర! కూడ నట్టి
    పనులకు నెప్పుడు పలుకుచు నూతమ్ము,మరచి పోతివి గద మంచి మాట
    లు, (తలకుం గర్ణము లుండ వంచన విచిత్రం బెట్టు లౌఁ, జెప్పు మా), బెడిదపు

    పోరు లోన నీదు సుతులు ఘోర మైన
    మరణమును పొంద, నాబాధ మదికి తాకి
    నీదు కర్ణముల్ పని జేసె నేడు ముదము
    గ ననుచు, పరి హాసములాడె కంబుధరుడు


    జానుగులు = చెవులు

    రిప్లయితొలగించండి
  15. 16, డిసెంబర్ 2019, సోమవారం
    సమస్య - 3222 (తలకుఁ జెవులె...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    "తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా"

    మత్తేభము

    వెలసెన్ వేదిక చిత్రలేఖకులప్రావీణ్యంబువీక్షింపగాన్
    విలసన్నేత్రవశీకరంబగుచుతద్విద్వత్పరీక్షార్థమై

    తెలుపన్ చిత్రవిలీనభావములగుర్తింపంగనిర్ణేతకున్
    *తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా*

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి


  16. బిజి బిజీ మన్ డే మార్నింగ్ లో హైస్పీడు నగరమ్ములో కవిసమ్మేళనమంటే చెవికోసుకునే వారెక్కడండి :)

    తెలవారెన్ కవివర్యులింక మహతిన్ తీర్చంగ సమ్మేళన
    మ్మిల శ్రీ వేంకట నాథుడి‌న్ పురములో మించారు సందోహమున్
    తిలకింపంగను వచ్చువారెవరకో? తిండాడుకాలమ్ములో
    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా


    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. నెలకున్ బట్టెడు ధాన్యమున్ సరుకులన్ నిండారుగాఁనింపగన్
    వలయున్ వానికిఁ బేటికల్ తగునవై, భద్రమ్ముగా నుంచగన్
    స్థలమున్ గావలెఁ,బట్టిలేపు జెవులున్ డబ్బాలకేనుండు, మూ
    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?

    రిప్లయితొలగించండి
  18. పాముజాతినిజూడగ బ్రముఖముగను
    దలకుచెవులెయుండవువిచిత్రంబుగాదె
    మాటవినబడితిరుగుచుమనలజూచు
    బ్రహ్మసృష్టియేచిత్రము,ప్రణతులిడుదు

    రిప్లయితొలగించండి
  19. విరించి..

    ఇలఁ బాలింపగ మంత్రులై వెలగగన్ హీనాత్ములౌ మానవుల్

    పలుమార్గమ్ములు ద్రొక్కి గెల్చినను విశ్వాసమ్ముతో జేరు లో

    కుల బాధల్ విననొప్పరోయి నిజమే కూళుండ్రెయౌ నేటి నే

    తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా

    రిప్లయితొలగించండి
  20. తూఱు నక్కట పాములు మీఱి చీమ
    లల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి
    నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    [లత = చీమ; చెవి = తాళపుఁ జెవి]


    అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే
    డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూ
    తలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రో
    తలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా

    రిప్లయితొలగించండి
  21. మత్తేభవిక్రీడితము
    బలముల్ చాలవు కావుమంచుఁ గరి తాఁ బ్రార్థించ వేంచేసెనే
    వలువల్ లాగెడు వేళ కృష్ణ పిలువన్ బాలించె సంరంభియై
    విలయమ్ముల్ తలపెట్టు వారి వినతుల్ వీనిచ్చగన్ జక్రికిన్
    దలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    దైవ దాక్షిణ్యము కరువై చేవఁ జచ్చి
    బ్రతుకు పోరాటమందున చితికి యుండి
    తట్టుకొనలేనటంచును తల్లడిల వె
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!

    రిప్లయితొలగించండి

  23. లైవ్ ఫ్రం మహతి కంది వారు అవధాససభలో వచ్చి ఆశీనులయ్యిరి :)

    ఫార్ మోర్ లైవ్ కవరేజ్ గెట్ ట్యూన్డ్ ఇన్ టు దిజ్ బ్లాగ్ :)


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. తాళి కట్టిన భర్తనిఁ తాను బెట్టు
    యదుపు యాజ్ఞలందుంచుట యవసరమని
    యడ్డు లేని నోరుగల గయ్యాళి భార్య
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు౹౹

    రిప్లయితొలగించండి

  25. చింతా వారు వేదిక పై యెక్కినారు ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. రాణి శర్నగారు ప్రారంభించారు సంచాలకులుగా

      తొలగించండి

    2. కుదురాట మొదలయ్యె :)
      ఎనుగురడుగగ కుదురాట :)

      తొలగించండి

    3. వర్ణన తరువాయి మహదేవ మణి గారి నిషిద్ధాక్షరి అనుష్టుప్ లో గణేశ స్తుతి

      తొలగించండి


    4. జనరల్ గా అప్రస్తుతులు ముందు పడుతుంటారు‌;) ఈ సభలో అవధానులే అప్రస్తుతులని అడిగి అడిగి మరీ వాయిస్తున్నారు ;)

      తొలగించండి


    5. దత్తపది

      సారి మాది జారి దారి

      With one set of దత్తపది
      త్రిగళా వధాన with different subjects

      For Sanskrit Ramayana based
      Telugu - bhagavata based
      Andhra - bhaarata based

      తొలగించండి

    6. కంది వారు సభా ప్రాంగమును వీడి బయలు దేరిరి

      తొలగించండి

    7. వేద విజ్ఞానము , అక్షర జ్ఞానము అన్న పుస్తకములను పంచిరి.

      రాంభట్ల వారి కాలండరు పంచిరి :)


      తొలగించండి
    8. *దత్తపది - సారి మారి జారి దారి

      తొలగించండి
  26. తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా
    తలకుంగర్ణములుండకుండిననుజిత్రంబందజూచున్గదా
    యిలలోనుండెడుపాములన్నియునుదావీక్షించునేత్రంబులన్
    లలనా!శ్రద్ధనుజక్కగావినునునాలాపంబులన్నింటినీ

    రిప్లయితొలగించండి
  27. కలతబెట్టిన మనసులు కలుకుమనును
    హింస నెదిరించు కాల్పులు హితము యగున
    జనుల మనసులుకలచుట జాతి హితమ??
    తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు
    ++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  28. మంచి చెప్పెడి మాటలు మహిని వినక
    తాను మనమున గట్టిగా తలచినదియె
    నుత్తమమని సతతమెంచు నుక్కివునకు
    తలకు చెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  29. నివురు గప్పిననిప్పులు నేటి యువత
    హింసనెదిరించు వారలు హితులెసుమ్ము
    తలలుపంకించి నేతలు తప్పు కొన్న
    తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు
    +++++++=+=====++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  30. తే.గీ.

    చెవులు వుండుడు ధర్మము జీవులెల్ల
    జంతు లక్షణ మదియేమొ చక్రధరము
    వింత రీతిని జగతిన విదిత మగును
    తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. చెరువు గట్టుపై నున్నట్టి చెట్టు క్రింద
    పుట్టలోనుండి వెలువడి భోగి యొకటి
    పడగ విప్పగ గాంచితి పడగ ధారి
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    రిప్లయితొలగించండి
  32. దీనజనరక్షణయెతమ ధ్యేయమనుచు
    వట్టిమాటలు పల్కుచు పదవినొంది
    నమ్మువారల మొరవిన నాయకులకు
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబుగాదు

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

    సందర్భము: స్వార్థం విడనాడితేనే ప్రేమతత్వం బలపడుతుంది. ప్రేమతత్వం బలపడితేనే ఐకమత్యంగా పరిణమిస్తుంది. ఐకమత్యమే సమాజానికి బలమౌతుంది. శాంతి భద్రతలు విరాజిల్లుతాయి. లేకుంటే ఈర్ష్యా ద్వేషాలు తాండవిస్తూ సమాజం అశాంతికి ఉగ్రవాదానికి ఆలవాల మౌతుంది.
    త్యాగధనుడైన రాముని రాజ్యంలో అలాంటివాటికి తావులేదు కదా!
    యథా రాజా తథా ప్రజా
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *రామరాజ్యం - ప్రేమరాజ్యం*

    రాముడు నృపాలుడై యుండ రాజ్యమందు

    ప్రేమ తత్వమే నిండారెలే! అసూయ

    యిం పనుచుఁ జెప్ప వినరు.. తా వీయరు కల

    తలకుఁ..జెవులె యుండవు.. విచిత్రంబు గాదు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి