12, జనవరి 2020, ఆదివారం

సమస్య - 3249 (సుఖ సంపత్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్"
(లేదా...)
"సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్"
('సుఖము'తో మొదలయ్యే సమస్య ఇంతవరకు రాలేదన్న జి. ప్రభాకర శాస్త్రి గారి ప్రేరణతో...)

87 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:
    (విపరీతమైన విరుపుతో)

    సుఖ సంపత్తులు లభ్యమయ్యెననుచున్;..........
    సుఖమున్ పొందగ చేర్చుచున్ గృహమునన్ సోఫాల నేసీలనున్
    ముఖమున్ జూచుచు ముగ్ధుడై ముదితనున్ మోహించి పెండ్లాడగా
    నఖముల్ పెంచెడి చుప్పనాతి వలె తా నౌరాయనన్ మారగా;..........
    శోకింప నొప్పున్ దగన్ 😊


    విజ్ఞప్తి:

    అన్యదేశ్యాలను, మాండలికములను, అఖండ యతినీ మన్నించవలెను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ విపరీతమైన విరుపుతో పని లేదు. సాధారణమైన విరుపైనా సరిపోతున్నది.

      తొలగించండి

    2. సరదాకి...అన్వయం బాగుంటుందని.

      🙏

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సుఖముల్ పొందెడు గాంధి వంశమునతా షోగ్గాడుగా పుట్టుచున్
    మఖమల్ దుస్తులనూని గ్రోలుచునుతా మద్యమ్ము మాంసమ్ములన్
    సుఖ సంపత్తులు లభ్యమయ్యెననుచున్;.....
    సఖినిన్ గానక మోడినిన్ కఱచుచున్ శాంతమ్ము కోల్పోవగా;....
    శోకింప నొప్పున్ దగన్!

    రిప్లయితొలగించండి

  3. 'సుఖము'తో మొదలయ్యే సమస్య ఇంతవరకు రాలేదన్న జి. ప్రభాకర శాస్త్రి గారి ప్రేరణతో...

    సార్! ఇది నా అంచనా మాత్రమే. జ్ఞాపక శక్తి తగ్గుతోంది కదా.

    ఇది సరియో కాదో శ్రీ పోచిరాజు కామేశ్వర రావు తెలుపగలరని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరాభరణం యూనివర్సిటీ నుండి ఎప్పుడో డాక్టరేట్ పొందినవారు మీరు. మీకు సందేహమా?

      తొలగించండి
    2. 'సుఖ' శబ్దంతో ప్రారంభమయ్యే సమస్యను గతంలో ఇవ్వలేదు. కాకుంటే 28-5-2018, 17-3-2019, 3-3-2019, 22-2-2018, 1-11-2017, 30-4-2017 తేదీలలో 'సుఖ' శబ్దమున్న సమస్యలున్నాయి.

      తొలగించండి

    3. నేటికి 1330 కి చేరుకున్న మన "శంకరాభరణం వృత్త సమస్యల జాతా" ను ఇప్పుడే పరిశీలించాను. కనబడ లేదు.

      శంకరాభరణం యూనివర్సిటీలో డాక్టరేటు పొందుటకు చాలా ఖుషీగా ఉన్నది. త్వరలోనే పార్టీ ఇచ్చెదను.

      🙏

      తొలగించండి


  4. ఏడుపుగొట్టులకెప్పుడునూ శోకమే :)


    సుఖమున్న దాని వెనుక ప్ర
    ముఖమ్ము గా దుఃఖము తరుముకొనుచు వచ్చున్
    సుఖము సుఖము కాదోయీ
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శభాష్!

      ఇదేదో దేవదాసు సినిమాలో

      "జగమే మాయా బ్రతుకే మాయా"

      లా ఉన్నది.

      తొలగించండి


    2. చేతిలో గలాసూ అందులో గంధవతి :)



      సుఖమెక్కడనోయీ భ్రాం
      తి! ఖలు మనకు వేదన సుదతీ! చెప్పెద నే
      ను ఖవాలీని జిలేబీ
      సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


      జిలేబి

      తొలగించండి


  5. అబ్బే We see only negative :)


    ముఖవాద్యమ్మును చూడు గుంతలె సుమీ ముద్దేమిరా యందులో!
    సుఖమేమున్నది దుఃఖమే వెనుబడున్ జుమ్మంచు వెన్వెంట నా
    యఖమై పోటగునే జనాళికి సమాయత్తమ్ముగా‌ సోదరా!
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. సుఖము సుఖముకాదోయి! వి
    ముఖతని చూపంగదగును! మూర్కొన కోయీ
    సుఖమనెడు యెండమావిని
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!

    శతకానికి సైయందామా :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      చివరి పూరణలో "విముఖతను...సుఖమనెడు నెండమావిని..." అనండి.

      తొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    మఖముల్ జేయ విరక్తి పెంచునిల!
    ధీమాంద్యమ్ము చేకూర్చెడిన్!
    నఖముల్ ద్రుంచుకొనంగలేని తనుమాంద్యమ్మున్ ప్రసాదించెడున్!
    ముఖమున్ క్రిందకు వంచనీక మదమున్ మోహమ్ము గల్గించునీ
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి


  8. సుఖమగు రాముని సన్నిధి
    సుఖమనునది వేరు లేదు సుద్దుల వినవే
    సుఖమసుఖమగు తతిమ్మా!
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జేబి

    రిప్లయితొలగించండి
  9. ముఖమే స్రుక్కుచు సోలుచున్ భువిన,, తామోహంపుయావేశమున్
    దఖలున్ జేయుచు యందచందములు నాదారుఢ్యముల్ ప్రశ్నగా
    నఖరాల్ బోవుచు నాణ్యహీనమయి , యే నాదాలు శోభిల్లగా
    సుఖసంపత్తులు లభ్యమయ్యెననుచున్ శోకింప నొప్పుందగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భువిని తా మోహంపు టావేశమున్... జేయుచు నందచందములు..." అనండి.

      తొలగించండి
    2. ముఖమే స్రుక్కుచు సోలుచున్ భువిన, తామోహంపుటా వేశమున్
      దఖలున్ జేయుచు నందచందములు నాదారుఢ్యముల్ ప్రశ్నగా
      నఖరాల్ బోవుచు నాణ్యహీనమయి , యే నాదాలు శోభిల్లగా
      సుఖసంపత్తులు లభ్యమయ్యెననుచున్ శోకింప నొప్పుందగన్.

      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి


  10. యా అల్లా లఖవాహ్!


    సఖి! వెతుకుచు తిరిగి తి నే
    సుఖమెక్కడ యని! లభింప సుఖమే వచ్చెన్
    ముఖపక్షవాతమదియే
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ముఖముఁవిరిసె నానందము
    సుఖ సంపద లందె నంచు, శోకింపఁ దగున్
    సుఖులా సంపద గాంచి వి
    ముఖులై చరియించునట్టి మూర్ఖులె యైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ముఖము తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
  12. ముఖమున వెలుగు పొసగవలె
    సుఖ సంపద లందె నంచు ; శోకింపఁ దగున్"
    సఖులందరు తమ నెచ్చెలి
    మఖమున పెండ్లి వెనువెంట మరణము నొందన్

    రిప్లయితొలగించండి


  13. ఇంద్రుని పదవి ! యెప్పడూడుతుందో తెలియదు !

    సుఖమనెడా నులి వెచ్చని
    మఖమలు పరదాయె సత్యమనుకొన కోయీ
    మఖవంతుని పదవి వలెన్
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. శిఖరములకుబోబోకుమ
    సుఖసంపదలందెనంచు,శోకింపదగున్
    సుఖములుగలుగుటలేదని
    శిఖరేశుడునిచ్చుగాతసిరిసంపదలన్

    రిప్లయితొలగించండి
  15. మఖములు చేసిన ఫలముగ
    సఖియై చిక్కెను తరింప సంసారము నా
    సఖి గతియించగ, మితముగ
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్

    రిప్లయితొలగించండి


  16. మఖవంతజాలమహిమా
    దిఖలుసువర్ణమిళితబృహదితిగణితమహా
    ర్నిఖిలద్యోతకమయినన్
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. సుఖములు పొందు ట కొఱకై
    సుఖములు విడనాడి విడిచి సోమరి తనమున్
    సుఖము ల వ o దక మిథ్యా
    సుఖసంపద లందె నంచు శోకింప దగున్

    రిప్లయితొలగించండి
  18. అఖిలాండేశ్వరి సత్కృపార్థమును తానర్థించి పొందంగనే
    ముఖపద్మమ్మున కాంతిరేఖ విరిసెన్ మోదమ్ముతో గాంచరా
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్, శోకింప నొప్పున్ దగన్
    సఖులాసంపద మ్రుచ్ఛలింప దలపన్ సంతాపమున్ బొందుచున్.

    రిప్లయితొలగించండి
  19. సుఖమెక్కడ పురుషులలో
    సుఖమెక్కడగానరాము సుదతులయందున్
    ముఖమునుచాటేసినయా
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్"

    రిప్లయితొలగించండి
  20. అఖిలేశుని నమ్ముమెపుడు
    సఖుడా యుల్కాముఖులిల సర్వము దోచీ,
    ముఖమును చాటేయ దలచు
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్

    సందర్భము: వాలి వధ జరిగింది. కామోపభోగాల్లో మునిగి సుగ్రీవుడు సీతాన్వేషణకై జాగు చేసినాడు. రాముడు కోపించినాడు. లక్ష్మణునికీ కోప మాగలేదు.
    న ధారయే కోప ముదీర్ణ వేగం
    నిహన్మి సుగ్రీవ మసత్య మద్య
    కి.కాం. 31-4
    నే నింక నా కోపాన్ని పట్టలేకున్నాను. అసత్యం పలికిన సుగ్రీవుని హతమారుస్తాను... అన్నాడు.
    రాముడు మళ్ళీ శాంతించి లక్ష్మణుని కూడా చల్లబరచి అది మిత్రధర్మం కా దని పలికి విషయం కనుక్కుర మ్మని పంపినాడు.
    ఐనా లక్ష్మణుడు కిష్కింధ కేగినాడు రౌద్రమూర్తియై. సుగ్రీవుడు భయపడ్డాడు.
    లక్ష్మణుని సమాధాన పరచడానికి తారను పంపుతూ.. వచనైః సాంత్వయుక్తైశ్చ ప్రసాదయితు మర్హసి (కి.కాం 33-35)
    అన్నాడు.
    తార వెళ్ళబోతూ సుగ్రీవునితో ఇలా అన్నది..
    "సుఖం మనిషిని ధర్మం (తన కర్తవ్యం) నుంచి విముఖుణ్ణి చేస్తుంది. (అహంకారినీ, సోమరినీ చేస్తుంది.) ధర్మ విముఖుడైనప్పుడే దైవం నుంచి దూరమౌతాడు. (రెండూ ఒకటే కాబట్టి.)
    శోకం మరేదో కాదు. దైవ విస్మృతియే! (మరచిపోవడమే!) సుఖ సంపదలు ప్రాప్తించా యని శ్రీ రాముని మరుస్తావా! (నేను లక్ష్మణునికి నచ్చజెప్పుతాను. నీవు నిశ్చింతగా వుండు.)"
    అని తార బయలుదేరింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "సుఖమే హేతువు ధర్మ వి
    ముఖతకు, విస్మృతికి.. శోక
    ము నదె!..మరతువే
    నఖ రాయుధ! శ్రీ రాముని..
    సుఖ సంపద లందె నంచు.. శోకింపఁ దగున్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    12.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. ఈ నాటి శంకరాభరణమువారి సమస్య
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్
    ఇచ్చిన సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో

    త్యాగరాజు, రాజుగారు పంపిన కట్నకాను కలను తిరస్కరించిన సమయములో సొదరుడు వదినలు అతనిని దూషిస్తారు. ఆ సమయములో కించిత్ కంట నీరు పెట్టుకున్న భార్యను ఓదార్స్తు పల్కిన పలుకులు

    నిధి సతము సుఖము నివ్వబోదు జనుల కీ భువిలోన సఖీ, జగమును
    పాలించు రాముని పాద సన్నిధి నిడు చుండును ఘనమగు సుఖము మనకు,
    కోదండ రాముడు కూర్చెను గద ,నీవు నందము పొందుము నళిన లోచ
    న సుఖసంపద లందెనంచు, శోకింపఁ దగు నెపుడు నీవు వైకుంఠ వాసు



    ని కరుణా కటాక్షంబులు నిక్కువముగ
    మన కుటుంబమునకు లభ్య మవని యెడల
    ననుచు, ముదముగ నోదార్చె తన గృహిణిని
    తలను నిమురుచు ఘనుడగు త్యాగరాజు

    రిప్లయితొలగించండి
  23. ముఖమున విరిసినను నగవు
    సుఖ సంపద లందె నంచు; శోకింపఁ దగున్
    సఖులకు సాయము జేయగ
    ముఖమును జూపక దిరిగెడి మూర్ఖత గనుటన్

    రిప్లయితొలగించండి
  24. (నరసింగరాజు తలను ఖండించిన బాలచంద్రుని నిందించి తిరిగి రణభూమికి పంపి అతనిని కోల్పోయిన బ్రహ్మనాయడు)
    ముఖమందున్ జిరునవ్వు లేవి సుతుడా!
    మూర్ఖత్వ మేపారగా
    నిఖిలమ్మున్ మలిదేవరాజని , నినున్
    నిందించి పంపించి దు
    ర్ముఖుడన్ ; హంతను బాలచంద్ర! యిపుడే
    మోదంబు సంతృప్తియున్
    సుఖసంపత్తులు లభ్యమయ్యె ననుచున్ ?
    శోకింప నొప్పున్ దగన్ .
    ( హంత - చంపినవాడు ; దుర్ముఖుడు -పాపపు ముఖమువాడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సుఖములు వో దుఃఖమె యా
      సుఖములనిత్యము, తిరమగు సుఖము పరంబే
      సుఖమఘములొనర్చు గనుక
      సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్

      తొలగించండి
  25. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. *దుఃఖమె యా...* అనండి.

      తొలగించండి
  26. మఖములు చేసిన నైహిక
    సుఖసంపదలందెనంచు శోకింప దగున్
    సుఖములు వలదిక మోక్షపు
    సుఖమేవలయునని చేయ సులువుగ దొరుకున్

    "*సుఖసంతోషములందిన
    ముఖమది విప్పారుచుండు భూరిగ నెపుడున్
    మఖమది చేసిన యంతనె సుఖసంపదలందెననుచు శోకింప దగున్.

    రిప్లయితొలగించండి
  27. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్"

    యిచ్చిన పాదము మత్తేభ విక్రీడితము నేను పూరించినది సీసములో

    కుంతికి ముందుగా సంతానముకలిగినదిఅను కోపంతో గాంధారి పొట్టను తట్టుకొనగా గర్భ స్రావము జరుగుతుంది అప్పుదు వేద వ్యాసుడు వచ్చి ఆ పిండమును నూట ఒక్క భాగములు చేసి కుండలలొ భద్ర పరిపించి గాంధారితో పలుకు పలుకులు



    కలిగెను తోడి కోడలుకు మొదటి సంతు ననుచు కోపమున తాడనము జేసె
    గాంధారి రయముగ కడుపు పై సంతాన సంపత్తు లేదని , సంయమి గని
    “సంతసమును పొంది కుంతితో ప్రేమగ పొగడి పలుక వలెను గద కోడ
    ల సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్, శోకింప నొప్పున్ దగన్ కినుకను

    కూడిన మది సతము నొసగు పరిణామ
    ములను తలచుచు" నని తెల్పి, యిలిక పైన
    బడిన పిండపు ముద్దను పాలు వెట్టి
    భద్ర పరిపించె వ్యాసుడు పాత్ర లందు




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం నాల్గవ పాదం ఉత్తరార్ధంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  28. నిఖిల జగత్కంటకుఁడు వి
    ముఖుఁడు సదుపదేశములకుఁ బుత్తడియశనున్
    మఖవిధ్వంసునిఁ గాంచఁగ
    సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్


    మఖ కార్యానిశ మగ్న చిత్త వర సన్మౌనీంద్ర శాపాహ తో
    న్ముఖ దుష్టాలికి ధాత్రి సౌఖ్యతతికిన్ నోచంగ నెట్లౌనయా
    యఖిలైశ్వర్య మదాంధ కాయమున కాహా నేడు ధ్వస్తావలీ
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      'పుత్తడి యశనున్'.... 'పుత్తడి దిండిన్' అయితే?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      పుత్తడికిఁ దావి యబ్బింది. మహదానందముగా స్వీకరించు చున్నాను.


      నిఖిల జగత్కంటకుఁడు వి
      ముఖుఁడు సదుపదేశములకుఁ బుత్తడి దిండిన్
      మఖవిధ్వంసునిఁ గాంచఁగ
      సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్

      తొలగించండి
  29. ముఖమందున్ చిరునవ్వుకన్పడదు మోమోటంబుకైనన్, సదా
    సుఖమున్బొందునుపాయమున్ వెదకుచున్ సొక్కున్, వెతన్ సోలుచున్
    నఖరంబుల్ మునిపంటగిల్లుకొను నానాయాతనల్బొందగా
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

    రిప్లయితొలగించండి
  30. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

    సుఖములు కలిగిన మంచిది
    సుఖములు జేయును బతుకును శుభకరములుగన్
    సుఖముల నెవ్వరు గలిగిన
    *"సుఖసంపద లందెనంచు శోకింపఁ దగున్"*

    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  31. అఖిలమ్మాతని మాయగా దెలిసి మోహావేశమున్ బెంచెడిన్
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్
    సుఖ సంపత్తులసత్యమంచు పరమేశుండే నిధానమ్ముగా
    మఖముల్ జేయుట సార్ధకంబు నదె బ్రహ్మానందమందించునే

    రిప్లయితొలగించండి
  32. మత్తేభవిక్రీడితము
    సుఖతీరంబును జేర్చ బిడ్డలకునై సుష్కించ మాతాపితల్
    సఖులై జూడక వీలుగాని శ్రమలన్ సంతానమే మున్గి దు
    ర్ముఖులై యాశ్రమమందు జేర్చు గతులన్ పుత్రుల్ విలోకించగన్
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      శుష్కించ... టైపాటు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను.

      తొలగించండి
    3. టైపాటు సవరణతో :

      మత్తేభవిక్రీడితము
      సుఖతీరంబును జేర్చ బిడ్డలకునై శుష్కించ మాతాపితల్
      సఖులై జూడక వీలుగాని శ్రమలన్ సంతానమే మున్గి దు
      ర్ముఖులై యాశ్రమమందు జేర్చు గతులన్ పుత్రుల్ విలోకించగన్
      సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

      తొలగించండి
  33. క్రొవ్విడి వేంకట రాజారావు:

    ముఖమున హృషి జూపె నతడు
    సుఖసంపద లందెనంచు; శోకింప దగున్
    సుఖమిడు విభవము నతడే
    సఖునకు కలిగింపలేని సమయమునందున్.

    రిప్లయితొలగించండి
  34. కం.

    ముఖమున రంగులు పులుమన
    శిఖరపు టంచున నిలుచన సినిమా జగతిన్
    లిఖితము వంచన నొందగ
    సుఖ సంపద లందె నంచు శోకింప దగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. కందం
    సుఖియింతురు బిడ్డలనుచు
    దఖలుపరచ శక్తిఁ గలిమిఁ దలిదండ్రుల దు
    ర్ముఖులై యాశ్రమములనిడ
    సుఖసంపద లందె నంచు శోకింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  36. సఖియై చిక్కెను చక్కనౌ వనిత వంశమ్మున్ ప్రతిష్ఠింపగన్
    మఖముల్ జేయ జనించిరారుగురు దుర్మార్గుల్ కళత్రమ్ముకున్
    దఖలయ్యెన్ పలుకష్టముల్ సుతుల దుస్తంత్రమ్ముతో చెచ్చెరన్
    సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

    రిప్లయితొలగించండి