31, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3267 (పగవానికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"
(లేదా...)
"పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

112 కామెంట్‌లు:

  1. గగనానికి నిచ్చెనలు వేసి
    పగవానికి దాసుఁడగుటె, పౌరుషము గదా
    భగవంతుని కైమోడ్చగ
    నిగమంబు లుచదివి నంత నేర్పరి యౌగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణలో కొంత అన్వయదోషం ఉంది. భావంలోను స్పష్టత లేదు. మొదటి పాదంలో గణభంగం. "గగనానికి నిచ్చెన లిడి" అనవచ్చు.

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    హా! శివసేనా!

    సొగసుల్ మీరగ ముద్దులన్ కురుపుచున్ శోకమ్మునన్ ముంచగా
    తగవుల్ జేయుచు భాజపాను గొనుచున్ తాడించుచున్ వీపునన్
    పగలున్ రేతిరి కాంగ్రెసున్ కొలుచుచున్ ప్రారబ్ధకర్మంబునన్
    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి అంశాన్ని ఎన్నుకున్నారు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'కురుపుచున్'? 'వర్షించు' అనే అర్థం ఉందనుకోండి. మీరు అదే అర్థంలో ప్రయోగించారా?

      తొలగించండి
  3. అందరికీ నమస్సులు 🙏🙏

    పూరణ

    *కం||*

    భగ భగ మని రగులుచు నిల
    తగువులు బెట్టుచు పదుగురు దాడినిజేయన్
    తగదిది యని తెలుపుచు, నా
    *"పగవానికి, దాసుఁడగుటె, పౌరుషము గదా"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏

      పూరణ

      *కం||*

      నగుమోమున చిరు నవ్వులు
      అగుపించక బాధలు పడ నభయము లిడుచున్
      ధగ ధగ మని నవ్వులు జూ
      *"పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    2. అందరికీ నమస్సులు 🙏🙏

      నా మరో పూరణ 🌹🌹🌹

      *కం||*

      నగలును నట్రయు ననుచున్
      పగలున్ రాతిరి సతినిట భరియింపగ నేన్
      దిగులున్ త్వరితగతిన నా
      *"పగ, వానికి, దాసుఁడగుటె పౌరుషము గదా"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    3. అందరికీ నమస్సులు 🙏🙏

      నా మరో పూరణ 🌹🌹🌹🌹

      *కం||*

      పగలును పంతము వలదని
      యుగమునకొక్కడు యనబడు యుగపురుషుడు, కో
      రగ స్నేహ హస్తమున్ చా
      *"పగ, వానికి, దాసుఁడగుటె పౌరుషము గదా"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    4. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'నవ్వులు+అగుపించక' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "నవ్వులె యగుపించక" అనండి.
      మూడవ పూరణలో 'త్వరితగతిని' అనండి.
      నాల్గవ పూరణలో 'ఒక్కడు+అనబడు' అన్నపుడు యడాగమం రాదు. "యుగమున కొక్కం డనబడు" అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    హా! ఇమ్రాన్ ఖానూ!

    సగమై పోవగ దేశమే వగచుచున్ శాపమ్ములన్ బెట్టుచున్
    తగవుల్ జేయుచు కాశ్మిరమ్ము గొనుచున్ దంభమ్మునన్ పోరెడిన్
    జగడంబందున నోడిపోయి చనుచున్ జన్యమ్మునన్ మోడికిన్
    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా!

    రిప్లయితొలగించండి


  5. జగడముల వేయ వలసిన
    తగువిధముగ వేసి మీదు తగని తలములన్
    తగవుల సున్నితముగ నా
    పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. (ఫణీంద్రుడు ఆదిశేషుడు - ఖగేంద్రుడు
    గరుత్మంతుడు మహావిష్ణువు సంసేవలో )
    సెగలన్ జిమ్మెడి వేయినాలుకల యా
    శేషుండు తల్పంబుగా
    భగవంతుండగు విష్ణుదేవుని మహా
    భక్తుండు సేవింపగా ;
    ఖగరాట్టౌ గరుడుండు పక్షముల సి
    గ్గారంగ గైమోడ్చెడిన్ ;
    బగవానిం గని దాసుడై మనుటె శుం
    భత్పౌరుషంబౌ గదా !!

    రిప్లయితొలగించండి
  7. నగరము బాలించు మనగ
    దగా పనులజేయుచు దొరతనమును జూపన్
    తగదంచు జెప్పి దాని నా
    పగ , వానికి దాసుఁడగుటె పౌరుషము గదా

    పౌరుషము = పురుష ప్రయత్నము

    రిప్లయితొలగించండి
  8. సమస్య :-
    "పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"

    *కందం**

    తగిన విధమైన కోళ్ళను
    జగడము సంక్రాంతి నాడు సలుపుట కొరకై
    నిగనిగ లాడునటుల మే
    పగ,వానికి దాసుఁడగుటె పౌరుషము గదా!
    ......................✍చక్రి

    రిప్లయితొలగించండి
  9. సమస్య :-
    "పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"

    *కందం**

    తగవులు మాన్పించు కొరకు
    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా!
    రగిలెడు మిర్చీ సినిమా
    సొగసు లొలుకునట్టి కనులు జూడగ నిజమౌ
    ......................✍చక్రి

    రిప్లయితొలగించండి

  10. విభీషణుడి మాటగా

    మగపంతమ్మును మీరి యోచనగనన్ మాన్యుండు శ్రీరాముడా
    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా
    తగదీకార్యము! పల్కెదన్ విడువుమా దాక్షిణ్యమున్ చూపుమా
    జగదానందము జానకీరమణుడిన్ సంత్రాణమౌ రావణా!

    జిలేబి
    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. తగవులు కూడదు ముష్కరు
    లగాంచి చేయదగు నయ సలాముల కాంగ్రె
    స్సు గరిష్ఠుఁల తీపిపలుకు
    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. తగదిదిరా మానరయన
    మొగమాటములేక పంతమూన యతనికిన్ 
    వెగటుగ మాటాడక యా 
    పగ వానికి దాసుడగుటె పౌరుషము గదా

    రిప్లయితొలగించండి
  13. తగు సమయమ్మున సాయము
    పగలను మరచియును జేసి వాత్సల్యముతో
    నెగడుచు వగలను దా బా
    పగ వానికి దాసు డగుటె పౌరుషము గదా !

    రిప్లయితొలగించండి
  14. జగడము లాడను కృష్ణా
    పగవారల జంపుటదియె పాపమటంచున్
    వగచెడుతరి మార్గము జూ
    పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వగవక యిచ్చిన..." అనండి.

      తొలగించండి
    2. వగవక యిచ్చినమాటకు
      మొగిగొని నిలుపుటె నరునకు ముఖ్యంబిలలో
      సిగను వటువు పదమిడ బలి
      పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"
      మొగి : పూనిక

      తొలగించండి
  16. ఖగరాడ్వాహనశంకరాది దివిషత్కారుణ్యముం గాంచి నె
    వ్వగలం దాటుట యుక్తమౌ ననుచు సద్భక్తిప్రభావంబు నా
    నిగమోక్తంబగు రీతి దెల్పి హితుడై నిత్యప్రమోదంబు చూ
    పగ వానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా.

    రిప్లయితొలగించండి

  17. శంకరాభరణం..
    31/01/2020...శుక్రవారం

    సమస్య

    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా"

    నా పూరణ మత్తేభము
    *** *** ***

    (ఆంజనేయుడు రావణాసురునితో పలుకు పలుకులు....)


    తగదున్ నీకిది దానవేంద్ర పరకాంతన్ గోరగన్ పాపమౌ!

    సెగలున్ గ్రక్కుచు విర్రవీగకు గడున్ చేటౌ గదా రావణా!

    జగమందెవ్వరు సమ్మతించరిది రాజా!సంధి గాంక్షించుచున్

    పగవానిం గని దాసుడై మనుటె శుంభత్పౌరుషంబౌ గదా"


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తగదున్' అనడం సాధువు కాదు. "తగ దీరీతిని దానవేంద్ర..." అనండి.

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ


    నగమున్ దీకొను మేకపోతులవలెన్ వర్తించిరా దానవుల్
    పగతో స్వీయబలమ్మునెంచకయె! సాఫల్యమ్ము సిద్ధించెనే?!
    బిగువున్ వీడి విభీషణుండు గనడే విఖ్యాతి?! నొక్కొక్కచో
    పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🙏

      రగిలెన్ కోపము రాముడా శివధనుర్భంగమ్ము గావింపగా
      భృగురామాఖ్యునకాతడుగ్రతనెదిర్చెన్., గాని శాంతస్థితిన్
      నగుమోమున్ గల రామునిన్ గని వెసన్ దాసోహమంచెంచడే?!
      పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి
  19. వగబెంచెడు నారురిపుల
    దెగవేయగ ధీరుడౌచు దేవునివేడన్
    సుగమంబగు మార్గము జూ
    పగ వానికి దాసుడగుట పౌరుషముగదా!

    ధీరుడు = ఙ్ఞాని, పౌరుషము = పురుషుని (జీవుని) విధి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా!గత మూడేళ్ళ పూరణలలో అధ్భుతమనే ప్రశంస నాకు అరుదుగానే లభించినదని భావిస్తున్నాను!ప్రశస్తాలు చాలానే ఉన్నాయి కాని అధ్భుతమని చూడగానే ఆనందం దాచుకోలేకపోయాను!నమస్సులు!

      తొలగించండి

    3. 👏👏👏

      ఆ తరువాయి "మనోహరము"...

      "సా కాష్ఠా సా పరాగతిః"

      తొలగించండి
  20. కం.
    భగుఁడిని గొలచుచు, విరజుడె
    తగువును దీర్చగ ఘనుడని దక్షతతోడన్ !
    వగచుచు హిరణ్యకశిపుడు
    పగవానికి దాసుడగుటె పౌరుషము గదా !!

    రిప్లయితొలగించండి
  21. ఈ నాటి శంకరాభరణమువారి సమస్య

    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    బలిచక్రవర్తి పురమునకు కాపలాగా శ్రీహరి వైకుంఠము వదలపెట్టి ఉంటాడు. హరి జాడ తెలియక వైకుంఠము నుంచి లక్ష్మి దేవి వస్తుంది. వాకిట్లో కాపలా కాస్తూ ఉన్న భర్తను చూచి “అర్యాబలి శతృవుగదా అతని పురమునకు నీవు కాపలా ఉండుట పౌరుషమా మికు సిగ్గుగా బాధగా లేదా అని హరిని ప్రశ్నిస్తుంది. అప్పుడు హరి అంటాడు నెను బలి బంధనుడను. భక్తులు తమ హృదయములో నన్ను బంధించుతూ ఉంటారు. కాబట్టి పగవాడు అయినా అతనికి సేవ చేయటము నా పౌరుషమునకు భంగము కలుగదు. నీవు కూడా వచ్చి బలికి సేవ చేయమని చెబుతాడు. ఆప్పుడు లక్శ్మి కూడా బ్రాహ్మణ స్త్రీ గా మారి బలి పురములో అతనికి సేవ చేస్తు శ్రావణపున్నమి రోజున బలికి రక్షాబంధనము కట్టి అతని దగ్గరవరము పొంది తన భర్తను విడిపించుకుంటుంది ఈ పద్యము హరి తన భార్య తో పలుకు సందర్భము




    (భ)క్తుని మదిలోన (వ)నమాలి శాశ్వత(ము)గ నివసించును (ము)దము తోడ
    (తెలు)సు కొనుము పైడి(నెల)త, వామనుడనై (పా)తాళమునకు నీ (బ)లిని పంపి
    (నా)డ, చంపితినని (న)లకువను బడక (న)మ్ముచు నన్ను త(న)హృద యమున
    (వ)దలక నిలుపగ, (వా)నికి దాసుఁడ(గు)టె పౌరు షము గదా (కో)మ లాంగి ,

    (మా)రు తలచగ వలదు సు(మ్మా)! రయముగ
    (నీ) విచటకు రావలయును ,(ని)క్కముగను
    (బ)లికి దాస్యము చేయుము (భం)గ పడక
    (న)నుచు సతితోడ బలికెను (న)ల్లవేల్పు


    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"

    సందర్భము: రామభద్రుడు గుణాతీతుడు. ఇంద్రియములను జయించినవాడు. అజాత శత్రువు. అత డెవరికీ పగవాడు కాడు. కోపంతో రగిలిపోయే వాళ్ళకు మాత్రం పగవానిలా కనిపిస్తాడు. అతడు సంకల్పించనే సంకల్పించడు. అవతలి వాని సంకల్పాలను మాత్రమే ఫలవంతా లయేటట్టు చేస్తాడు.
    విభీషణుడు హితవు చెప్పితే రజోగుణ సంపన్నుడైన రావణునికి చెవి కెక్కలేదు. అతని మాటలను తృణీకరించి అవమానించినాడు.
    "ఈ విచట నుండ హితుడవు గా వెచ్చటికైన జనుము.." అంటూ రావణుడు "కోపంబున దిగ్గున నిజాసనంబు దిగ్గ నుఱికి వజ్రసమ స్పర్శంబైన పాదంబున విభీషణుని యురంబు దన్నిన నతండు డొల్లంబోయి యాసనంబున నుండి పుడమిం బడియె.."
    (గోపీనాథ రామాయణం యు.కాం. 314)
    విభీషణుడు.."మాతృ మందిరంబునకుం జని... పుణ్యకథలు వినుచున్న తల్లిం గని నమస్కరించి.." విషయం విన్నవించుకొన్నాడు. (పూరణ పద్యంలో చెప్పిన విధంగా)
    ఆమెయు చేసేది లేక..
    "శరణాగత రక్షణ దీక్షితుండైన రాముని పాలికిం జని యమ్మహాత్ముని చరణంబులు శరణంబు నొంది తత్ప్రసాదంబు వడసి సుఖివై జీవింపు మని దీవించి యనిచిన.."320
    విభీషణుడు రాముని శరణు జొచ్చినాడు. అంతకు ముందు భార్యతో తన ఆంతర్యాన్ని తెలుపుతూ ఇలా అంటున్నాడు.
    నిర్మలమైన భక్తితో (ప్రస్తుతం మనకు పగవానిలా కనిపించే) రామునికి (ఎవరైనా) దాసుడైపోవడమే (నిజమైన) పౌరుషం అంటే పురుషుడు చేయదగిన ప్రయత్నం.
    (అతనికి దాసుడైతే అతనివలెనే గుణాతీతుడు కావచ్చు. ఇంద్రియాలను జయించవచ్చు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *విభీషణుని ఆంతర్యము*

    త్రిగుణముల నింద్రియములను

    వగ లేకయె గెలిచె రామభద్రుడు.. విమలం

    బగు భక్తితోడ నిపు డా

    పగవానికి దాసుఁ డగుటె పౌరుషము గదా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    31.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. *నా సరదా పూరణ* 🙏😊

    తగువులు తప్పదు నింకయు
    పగతో సాధించు ననుచు పతితో నన తా
    మొగమున చిరు నవ్వులు చూ
    *"పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా"*

    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి ..
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  24. మగతనములేకయుండుట
    పగవానికిదాసుడగుటె,పౌరుషముగదా
    పగవానిగర్వమణచగ
    విగతుడునౌవరకుపోరిపీడించంగాన్

    రిప్లయితొలగించండి
  25. శ్రీమద్రామాయణ సుందరకాండ నేపథ్యంలో..



    ఋష్యమూక పర్వతంవైపు వస్తున్న రామలక్ష్మణుల గురించి తెలియగోరిన హనుమంతుల వారితో లక్ష్మణ స్వామి....

    కందం
    అగణిత రాముని గుణములఁ
    దగఁ దృప్తినిపొంది నట్టి తమ్ముడను విశే
    షగుణమ్ములు ముదమొందిం
    పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా!

    రిప్లయితొలగించండి
  26. జగముల జగడములన్నియు
    నగవుల నయముగను నణచు నగధరు వేడన్
    వగపును జింతల దొలగిం
    పగ వానికి దాసుఁడగుటె పౌరుషము గదా

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. మగడేగొప్పని భార్యతక్కువని దుర్మానంబులన్ జేయుచున్
      తెగబాధింపగప్రేమజూపగల
      పత్నిన్ పౌరుషంబెట్లగున్
      తగజూపించుచుప్రేమఁగొప్పగఁ
      బ్రశస్తంబౌవిధిన్ స్త్రీయుజూ

      పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా"

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
  28. "పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా"

    జగదేకసుందరికిఁదా
    న్మగడైబ్రతుకఁదలపనహమందక తగుప్రే
    మగమెలగవలెతిరిగి జూ
    పగవానికి దాసుడగుటె పౌరుషముకదా

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  29. జగ జెట్టి పోరునందుఁ బి
    డుగు సుమ్మీ యేల నీ గడుసు దన మిఁక నీ
    కు గురు వతఁడు మది నెంచక
    పగ వానికి దాసుఁడగుటె పౌరుషము గదా


    గగ నాకారులు నీ ఖరాదు లట సంగ్రామంబునం జచ్చిరే
    వగలాడిన్ విని మంచి చెడ్డల నిటన్ భావింప కింతైననుం
    దగునే నీకు హరించ రామసతి సీతన్ సోఁకుపెన్మూఁకకుం
    బగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా

    రిప్లయితొలగించండి
  30. పగతులపీచమడంచగ
    నెగబడు బలశాలియైన నెక్కటిజోదున్
    తగనోడించక నపుఁ డ
    ప్పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా

    రిప్లయితొలగించండి
  31. చూపఁగ (= చూపంగ) , తొలఁగింపఁగ, ఒందింపఁగ, చాఁపఁగ, మేపఁగ నిత్యాదులు పూరణ నియమోల్లంఘనములే కాఁ గలవు!
    ఇది నా యభిప్రాయము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే... కాని కొన్ని చూసి చూడనట్లు వదిలేద్దాం... ఔత్సిహులు కదా!

      తొలగించండి
  32. పగ దీర్చుకొనగ తానా
    పగవానికి దాసుఁడగుటె పౌరుషముగ, దా
    పగ నైజము శకుని నశిం
    పగ కౌరవులను నెరవుగ పాచిక లాటన్౹౹

    రిప్లయితొలగించండి
  33. విభీషణు ని ఆలోచనా సరళి...

    మ:

    భగవానుండగు రామునిన్ దెలిసి భావావేశమున్ బొందగా
    తగదన్నా యని వేడ భూమిసుత సీతాదేవినిన్ దెచ్చుటన్
    పగగోలన్ విననట్టి రావణుడు కోపంబెత్తి దూషించగన్
    పగవానింగని దాసుడై మనుటె శుంభత్పౌరు శంబౌ గదా

    రిప్లయితొలగించండి
  34. విగతంబౌమనుజుండుతోసమమునెవ్విధంబుచింతించినన్
    పగవానింగనిదాసుడైమనుటె,శుంభత్పౌరుషంబౌగదా
    జగతిన్ బీదలయాశలన్ మదినిసుసంభావించిచేదోడుగా
    సుగమంజేయుచునుండునోనెచటయచ్చోటన్ శుభంబేయగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "... నుండునో యెచట నచ్చోటన్..." అనండి.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    [ద్రోణుని పర్యవేక్షణలో యుద్ధవిద్య లభ్యసించుచున్న తఱిఁ, గౌరవాగ్రజుఁడైన సుయోధనుఁ, డర్జునుని కన్న విలువిద్యలో నధికుఁడైన యేకలవ్యునిఁ గని, యాతనికి దాసునిగ మాఱియైనను నెయ్య మేర్పఱచుకొనవలెనని తలంచు సందర్భము]

    "వగవం బోకయె, యేకలవ్యు కుటి కేఁ బ్రార్థింపఁగాఁ జేరియున్,
    భగవంతుం బలెఁ గేల్మొగిడ్చియును, మద్బంధుం బొనర్తున్ వెసన్!
    మగఁడే యర్జునుఁ డిట్టి ప్రౌఢిమమునన్? వైళమ్మె యా క్రీడికిం

    బగవానిం గని, దాసుఁడై మనుటె, శుంభత్పౌరుషంబౌఁ గదా!"

    రిప్లయితొలగించండి
  36. జగముల బాధలనే బా
    పగ,ధాత్రిని జన్మమొంది పగతుర శిక్షిం
    పగ,శ్రీపతి ప్రేమంజూ
    పగ,వానికి దాసుడగుటె పౌరు‌షము గదా.

    రిప్లయితొలగించండి
  37. వీభీషణు మనోగతం..

    మత్తేభవిక్రీడితము
    వగపున్ జెందెడు రామచంద్రునకు సంభాలింపు సీతమ్మయే
    తగ జేర్చన్ శుభమన్న రావణుఁడు కోదండున్ విలోకించడే
    సుగుణోద్ధండుఁడు నాశమెంచు మునుపే శోకమ్ము వారించి బా
    పగ, వానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా

    రిప్లయితొలగించండి
  38. *గౌ: శ్రీ కంది శంకరార్యులకు శత సహస్ర వినమ్ర ప్రణామములతో* ..🙏🙇‍♂🙏🙇‍♂🙏

    నేను వారి ముందు ఉంచిన సమస్యలని పద్యరచనలకు అనుగుణంగా మరింత మెరుగులు దిద్ది గత *18 రోజులలో 7 సమస్యలు* నేను ఇచ్చినవి ఇవ్వడం నాకు చెప్పనలవి కాని ఆనందాన్ని ఇస్తోంది.. **అందుకు మన విశ్వ గురువులకు నేను సదా కృతజ్ఞుణ్ణి..‍*🙏🙇‍♂🙇‍♂🙇‍♂🙏

    నాకు ఎంతో గొప్పదైన ఈ సమూహాన్ని, బ్లాగ్ ని పరిచయం చేసిన *ఆర్యులు శ్రీ పూసపాటి* వారికి సదా కృతజ్ఞుణ్ణి..

    బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్న కవివర్యులందరికీ పేరు పేరున వినమ్ర నమస్సులతో 🙏🙏🙇‍♂

    కళ్యాణ్ చక్రవర్తి..😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారి శ్రమలో పాలుపంచుకొను చున్నందులకు మాకును సంతోషము కల్గు చున్న దండి.

      తొలగించండి

    2. 👌

      "సమస్యా పృచ్ఛక చక్రవర్తి (Jr)" గారికి

      🙏

      తొలగించండి
    3. కవివర్యులు పోచిరాజు గారికి ధన్యవాదములు 🙏🙏

      కవివర్యులు జి పి శాస్త్రి గారికి శతాధిక వందన నమస్సులు 🙏🙏

      మీరు ఈ బ్లాగ్ కి, మాకు ఎప్పుడూ ఓపెనింగ్ బ్యాట్స్మన్...🙏🙏🙏😀

      తొలగించండి
  39. జగతిన్ ధర్మము నిల్పనెంచి ఖలులన్ సంహారమే జేయుటే

    యుగధర్మమ్మనిచెప్పి యర్జునుని తానుద్యుక్తునిన్ జేయగన్

    గగనమ్మే యగు విశ్వ రూపముసు సంగ్రామమ్ము లో తాను చూ

    పగ, వానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా

    రిప్లయితొలగించండి
  40. ద్విగుణమ్మైనవెలుంగుతోడ ననిలో తేజస్వియై నిల్చెనే
    జగడమ్మందున నంబరీషు పగిదిన్ శౌర్యమ్ముచూపించు నా
    పగ సూనున్ కనుమా! ఎదుర్చ తరమా పార్థా! కనన్ మార్గమా
    పగ, వానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా

    రిప్లయితొలగించండి
  41. సిగలో చంద్రుడు మేన భు
    జగములు గళమున విషమ్ము సగ మంగన ము
    జ్జగపతి శీర్షమున సురా
    పగ వానికి దాసుఁడగుటె పౌరుషము గదా.

    రిప్లయితొలగించండి

  42. కంద సమస్య పాద గర్భిత తేటగీతి :)

    పోకడ చూస్తావుంటే పూసపాటి వారిలా జిలేబీ ఇచ్చిన ఛందము తప్ప వేరు దాని లోనే పూరించెద నంటూ తయారు :)

    ధరణిలో పగవానికి దాసుఁడగుటె
    పౌరుషముగ దాల్చు తలని వర్ధిలంగ
    సూవె వంగిన చెట్టదె సురకరువలి
    దాటి మీరి నిలుచును కదా జిలేబి!


    జిలేబీయము
    జిలేబి

    రిప్లయితొలగించండి


  43. నిగమంబులు దోచిన యా
    మగమీనంబును దునుముచు మానుగ ధరణిన్
    నెగడిన హరికిన్ , దైత్యుల
    పగవానికి దాసుడగుట పౌరుషము గదా.

    రిప్లయితొలగించండి
  44. భగభగ మండుచు నుండెను
    గగనమణిపగిది స్థిరమ్ముగ కనుడు, తరమా
    జగడము, నాపగసుతు, నా
    పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా
    అసనారె

    రిప్లయితొలగించండి
  45. క్రొవ్విడి వేంకట రాజారావు:

    తగవులు లేని గుణమ్ములు,
    నిగరముగా పఱగునట్టి నెమ్మితనమ్ముల్
    పగిదిని పరమాత్మయె జూ
    పగ వానికి దాసుడగుట పౌరుషము గదా!

    రిప్లయితొలగించండి
  46. క్రొవ్విడి వేంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. దయతో నిన్నటి పూరణను పరిశీలించ గలరు.

    దుగ్ధము లాడక భక్తిని
    వాగ్దేవిని గొల్చువాడు పండితుడగు; నా
    వాగ్దేవిని నిరసించిన
    వాగ్ధాటియె రూపుమాసి బాలసమబ్బున్.

    రిప్లయితొలగించండి
  47. తగదు నధర్మంబన
    పగవానికి నచ్చదాయె! ప్రాపంచమునన్
    తగువిధ యాశాదోషమె
    పగవానికి దాసుడగుటె పౌరుషముగదా!

    రిప్లయితొలగించండి
  48. గగనం బంటిన యశమున
    నిగమం బులు చదివి నంత నేర్పరి యౌగా
    భగవంతుని కైమోడ్చిన
    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా

    రిప్లయితొలగించండి
  49. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"

    సందర్భము: రావణుడు దేవేంద్రునిపై దండెత్తడానికి వెళుతూ కైలాసగిరికి చేరాడు. ఆహ్లాదకరమైన వాతావరణం. కామం చెలరేగింది. సర్వాలంకార భూషితయై రంభ సైన్యం నడుమనుంచి పోతూ కంటబడింది. చేయి పట్టుకున్నాడు.
    "ఈ గతి రంభ! నీ వెవ్వని కడకు
    భోగింప జనియెదు పుణ్యు డెవ్వాడు?
    కలికి కన్నులు నల్ల కల్వల నవ్వు
    పొలతి పున్నమ చంద్రు బోలు నీ మోము"
    అన్నాడు. (రంగనాథ రామాయణం)..
    "నాకు మామవు నీవు నక్తంచరేంద్ర!
    నీకుఁ గోడల ముట్ట నీతియె తలప" "నీ కిది తగదు. నేను మీ అన్నయైన కుబేరుని కొడుకు నలకూబరుని వద్దకు వెళుతున్నాను, పోని" మ్మన్నది రంభ. అతడు వినిపించుకోలేదు.
    ఏకాంతానికి కొనిపోయి తన కోరిక తీర్చుకున్నాడు. "పులి బారిఁ బడి విడివడిన హరిణి చందంబున" అస్తవ్యస్తమైన పరిస్థితిలో నలకూబరుని వద్దకు వెళ్ళి యథార్థం చెప్పుకొని భోరున విలపించింది. అతడు కోపంతో..
    "ఇది మొదలుగ బల్మి నెవ్వతెనైనఁ
    గదిసి యిట్లుపహతిఁ గావించెనేనిఁ
    బది శిరంబులు నూరు వ్రయ్యలై దర్ప
    మదరంగఁ జెడు గాత మని శపించుటయు.."
    "ఇలా ఇష్టం లేకుండా ఏ వనితనైనా చేరా లనుకుంటే వాని శిరస్సు నూరు ముక్కలైపోవుగాక" అని రావణుని శపించాడు.
    రంభను చూచి మనసు పారవేసుకున్న రావణుని స్వగతం పద్యంలో వుంది.
    "ఈ అందగత్తె రంభను, దీని నవ్వును చూశాడా! ఎవడైనా సరే మన్మథునికి దాసుడైపోతాడు." అని.. భావం.
    నెలతాలుపు పగవాడు = శివునికి శత్రువు..
    మన్మథుడు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రంభ*

    సొగసునఁ బే రెన్నికఁ గ

    న్న గరిత యీ రంభ.. దీని
    నగవును దిలకిం

    పగ నెవడే న్నెలతాలుపు

    పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    31.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి