(అభిమన్యుని మరణానికి చింతిస్తున్న అర్జునుని ఓదారుస్తున్న శ్రీకృష్ణుడు ) వీరు;డేకాకి నినుజేసి వెడలినాడు; సంతసించిన దాదివ్యసంఘమెల్ల; ఏడుపాపి సైంధవు తల నెగురగొట్టు ; ఘనుడ!బావా!విజయ!కీర్తి గనుము మనుము.
కాదండి. ఇక్కడ కాఁక వెలుఁగు ( అంటే సూర్యుఁడు) కర్త. వెలుగును కాదు. అందుచేత ద్రుత సంధి రాదు. గసడద వాదేశ సంధి బహుళము కావున కాఁక వెలుఁగు పాపి / కాఁక వెలుఁగు వాపి రెండును సాధువులండి. ధన్యవాదములు, నమస్సులు.
74 కామెంట్‌లు:
శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళడానికి ముందు భీమునితో / రాయబార ఘట్టంలో దుర్యోధనునితో.....
ధర్మజున'కా కి'నుక? గుణధాముఁ డతఁడు,
భీష్మ ద్రుప'దాది' గురులన్న వినయ ముంచు
నతని నిందించు తలఁ'పాపి' యనుసరింప
వలెను, బా'వా! వి'నుము నా వాక్కు నిపుడు.
(అభిమన్యుని మరణానికి చింతిస్తున్న అర్జునుని
ఓదారుస్తున్న శ్రీకృష్ణుడు )
వీరు;డేకాకి నినుజేసి వెడలినాడు;
సంతసించిన దాదివ్యసంఘమెల్ల;
ఏడుపాపి సైంధవు తల నెగురగొట్టు ;
ఘనుడ!బావా!విజయ!కీర్తి గనుము మనుము.
స్వర్గంలో ఊర్వశి పొందుకై అర్జునునితో..
కందం
ఏకాకివి స్వర్గమ్మున
తాకినదాదిగ బిరబిరఁ దప్పుకొనంగన్
చేకురునె నృపా! పిదపన్
నాకవనిత పొందు! లేని నలువా విజయా!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'నలువా' అని సంబోధించడంలో మీ ఆంతర్యం?
మైలవరపు వారి పూరణ
కీచకుడు...
అనుపమ మోహనాంగి! చిలుకా ! కినుకా! బదులీయవేల? నే...
నన రుచిలేదొ? చేరవలదా! దిగిరావె రవంత మెట్టు! కి...
మ్మనవిది చెప్పలేని వలపా! పిలువన్ వెఱపా ! మరింక ర...
మ్మని ముదమార బ్రేమననవా! వినవా మొరనైన! మాలినీ!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂దత్తపది🤷♀....................
"కాకి - దాది - పాపి- వావి"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
సందర్భము: మార్కండేయ దేవర్షి ధర్మ విగ్రహుడైన రామునిగురించి ధర్మరాజుకు చెబుతూ..
చూ. మహాభారతం అరణ్య (వన) పర్వం
6 వ ఆశ్వాసం 267-411
7 వ ఆశ్వాసం 1-169
చూ.23-10-19, 30-10-19 నాటి
నా పూరణములు కూడ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ధర్మ విగ్రహుడు*
"ఇలను నేకాకిగా ఖరాదుల దునిమెను,
మది మదాది దుర్గుణముల మ్రందజేసె,
తనదు శూన్యపు చూపాపి దైత్యుఁ జంపె,
రాము వినవా విచక్షణతా మహుండు.."
ననుచు దేవర్షి యా ధర్మజునకు వినిచె..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.02.20
-----------------------------------------------------------
గురుదేవులకు ధన్యవాదములు. లేని నలువా?
అంటే సామర్థ్యము కొరవడిందా? అనే భావంతో వ్రాశాను. ఆ తలపే ఊర్వశికి అర్జునుని బృహన్నల గా శపించేలా చేసింది.
శ్రీకృష్ణ ఉవాచ -
బావా! విధిరాతగ లె
మ్మా వేదాదిని స్మరించుమధిపా! పిహితం
బై విజయము కలదయ్యా
నీవేకాకివనుకొనకు! నివ్వటిలు గనన్!
జిలేబి
నలువా తర్వాత ప్రశ్నార్థక చిహ్నం మరచాను. సవరించిన పూరణ :
స్వర్గంలో ఊర్వశి పొందుకై అర్జునునితో..
కందం
ఏకాకివి స్వర్గమ్మున
తాకినదాదిగ బిరబిరఁ దప్పుకొనంగన్
చేకురునె నృపా! పిదపన్
నాకవనిత పొందు! లేని నలువా? విజయా!
మైలవరపు వారి పూరణ అత్యద్భుతంగా ఉన్నది. ఈ రాత్రికి మిగిలిన వారి పూరణలు చూసిన పిదప 'అత్యుత్తమం' అంటానేమో?
భారతార్థంలో రామాయణాన్ని చొప్పించిన మీ ప్రజ్ఞ ప్రశంసనీయం. పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధృతరాష్ట్రుడు విదురిని తో --
తే॥గీ॥
కేవలము నెయ్యము కొర'కా కి'నుక నొందె ?
ప్రబలె ద్రుప'దాది' రాజులు పాండు సుతుల
పంచన కలసి యధి'పా పి'పాసితులయి
రా ? , పలుకులుంటి'వా ? వి'వరణము నిమ్ము
మైలవరపు వారు పూర్వం విరటుని కొల్వులో కవీశ్వరులై వుండి వుంటారు :)
కీచకునిపై వీరు రాసినవన్నీ సూపరు డూపరు హిట్టుల్స్ :)
అద్భుతః
జిలేబి
కీచకుడు ద్రౌపదితో
సఖియ!నాపైన నలుకా?కిసలయహస్త!
నీసమ వియదాది జగత్తు నెంచ గనను
కులసతిననెడు వెరపాపి కూడరావె!
తాపమడపవా?విరిబోణి!తాళలేనె!
బావా! విధియనుకూ లించె
సావితృడు నిలచు దాది సైంధవు ద్రుంచన్
నీవేకా కివికాదు విజయుడ
కావగ లేరెవ్వరు సైంధవు పాపి యటంచున్
కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో :
కందం
నీకా కినుకల్ మోహముఁ
దాకిన దాదిగ జనించెఁ దనయునిఁ దలపున్
జేకొని వగపాపినచో
సాకారమగు వినవా! విజయమది గీతన్
నమస్కారమమ్మా.. 🙏🙏
ద్రౌపది, కీచకునితో -
నాతి నేకాకి యనుకొని భీతిలేక
దాది యని చులకన నీకు తగదు, పాపి!
సిగ్గు మరచితివా ? విను! శీఘ్రమెనిను
నాపతులు వధింతురు వేగ నమ్ము నిజము |
సమరము న కా కిరీటి వెస వెడలంగ
గనియె దా దిగులు గ బంధు గణము లచట
తా ననియె ను బావా వితతంపు టార్తి
కలిగెను కృపా పిపాసి కీ కయ్య మేల
నా తొలి ప్రయత్నం 🙏🙏
కీచకుడి మాటలు ద్రౌపది తో
*కం||*
చిలు *కా! కి* మ్మనకిక రా
తెలిపెద *దా ది* క్కెవరిక, దెలుపుము, విరు *పా*?
*పి* లిచిన పలుకవ నాతో
చెలి *వా! వి* పరీతమిదియె, చెరిచెద నిన్నే!!
ఏకాకిగనై కుంతి ప్ర
భాకాంతునిఁ దా దినకరు వావిరి తలచం
గాఁకవెలుఁగు పాపి తరుణి
యా కలఁత నడరి యొసంగె నాత్మజు నంతన్
[కన్యాత్వము పోవు నవమానము కలుగు నన్న కలఁత]
పాండవుల వనవాస సమయములో ఒంటరిగా నున్న తనను వాంఛించిన సైంధవునకు ద్రౌపది చెప్పిన హితవు:
ఏకాకిఁజేసియిటులవి
వేకపు పనిఁజేతువావివేచనహీనా
నేకాదాదివ్యచరిత
నీకామంపుతలపాపినిలువుముతులువా
చేరవలదా
ఈ చరణంలో యతి సరి చేస్తారా....
సత్యభామ తో కృష్ణుడన్నట్టుగా
అలు'కా,కి'నుకో యెరుగను
చెలియా మహ'దాది'మహిమ చేతము నందున్
కలిగియు'పాపి'ట కరములు
నిలిపితి రా'వా వి'నుమిక నినువదలనులే
మూడవ పాదంలో గణాలు?
నాల వ పాదం లో యతి, ప్రాస?
*కీచకుడు మదోన్మత్తుడై ద్రౌపదితో పలికిన మాటలుగా నూహించి*
సొగసరి యెందుకా కినుక చూడుడు నాదెస ప్రేమమీరగా
వగచుట మానవా? విరుల పానుపు సిద్ధము చేసితిన్ సఖీ
మగువకు కూడదాదిగులు మాన్యుల మేమిట చెంతనుండగా
తగదిక యేడుపాపి నను ధన్యుని సేయగ వేగరమ్మిటన్.
వేణుగోపాలాచార్య గారు
అచ్చు ఆధారంగా సంధియుత యతి మైత్రి గుర్తింపు కలదు .
జిలేబి
శంకరా భరణము నేటి సమస్య
కాకి - దాది - పాపి- వావి"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో సీసములొ పద్యము
కీచ(కా కి)ణ్వపు నీచపు పనులను
మానుము రయముగ ,మానసమ్ము
సర్వ(దా ది)వ్యమౌ సంకల్పమును గూడి
మనుగడ సాగించ ఘనత గలుగు,
యిది గెలు(పా? పి)ఱికి దనముతో నీవు
యేకాకి నబలను యిచ్చ వచ్చి
నటుల కించ పరచ న్యాయమా? తులు(వా వి)
నుము, నేనబలను గాను, గల రైదు
గురు వెనుకన గంధర్వులు, పరుగు లిడుచు
వచ్చి కాచును పిలిచిన ,వదర వలదు,
విడవగ వలయు దారిని వేగిరముగ,
ననుచు ద్రౌపది పలికెను చెనటి తోడ
కిణ్వపు = పాపపు
చెనటి = దుర్మార్గుడు
దత్తపది - 165
"అభిమన్యునితో రథ సారధి -ఘటోత్కజుని ఎదురించు సందర్భం
అగడుకాకివి యభిమన్యు డంజలింతు
దాది నేలుచు నుండు నీ దైత్యలెల్ల
వానితో పోరుసలుపంగ కానివావి
పాపి వంటి యాయుధమును బట్టె నతడు!
అగడు కాకి =తుంటరి, దాది =ధాత్రి, కానివావి = తగని పని, పాపి = తిరుగలి దిమ్మ
మరో పూరణ
శ్రీకృష్ణదౌత్యం🙏
నీ వలనౌనె గెల్చుట యనిన్., గన పోరునకా కిరీటితో
బోవుట బోవుటే యముని ప్రోలునకింక., తదాది నష్టముల్
బావ వరించు ! మేలు తలపా?! పిశితాశనమిచ్చగింతువా!
పావనసంధి కోరుకొనవా ! విపులార్థమెరుంగలేవొకో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆర్యా! నమస్సుమాంజలి.🙏🙏🙏🙏🙏🙏
సందేహ నివృత్తి కై ప్రార్థన
'గాఁకవెలుఁగుఁ బాపి తరుణి'
కాదా? 🙏🙏🙏🙏🙏🙏🙏
నన్నునేకాకిగదలచి నాదరికిటు
వచ్చితివపాపి! వావియువరుసలేద?
నిన్నుచూచినదాదిగ గన్నులురిమె
యనుచుబలికెను ద్రౌపదిదనుజుతోడ
దనుజుడనగా
కీచకుడు
కాదండి. ఇక్కడ కాఁక వెలుఁగు ( అంటే సూర్యుఁడు) కర్త. వెలుగును కాదు. అందుచేత ద్రుత సంధి రాదు. గసడద వాదేశ సంధి బహుళము కావున కాఁక వెలుఁగు పాపి / కాఁక వెలుఁగు వాపి రెండును సాధువులండి. ధన్యవాదములు, నమస్సులు.
తరుణి యా కలఁతను = తరుణి యొక్క యా కలఁతను.
మిత్రులందఱకు నమస్సులు!
[కురుక్షేత్ర సంగ్రామమున హ్రదమునుండి వెలికి వచ్చిన దుర్యోధనుఁడు భీమునితోఁ బలికిన సందర్భము]
"నన్ను నేకాకినిం జేసి, బన్నము నిడఁ,
బిలుచు పిలుపాపి, మగఁటిమి వెలిఁగిపోవ,
బైసి ననికి రప్పింపలేవా విమూఢ!
శౌర్యమే గదా దివికంపు సత్పథమ్ము?"
వే'దాది' వాఙ్మయ వినుతుఁడు తత్త్వ వి
చారముఁ దెల్పుచు నారణస్థ
లిని హరి చూపె కిరీటికి, తన యనం
తప్రభా'వావి'ష్కృత మహదనఘ
విశ్వరూపమును, సమాశ్వాసనమిడుచు
"వ్యగ్రుడ 'కాకి'టు లస్త్రమెడలి!
యోపార్థ! వగ'పాపి' నీపని యుద్ధము
సేయుటే యని తలపోయు మయ్య!
అందరును చచ్చిరింతకు ముందె నాదు
భావ సంకల్పమున! నీదు పాత్ర యొక ని
మిత్తమాత్రము సుమి! ధను వెత్తుమింక!
నీ ప్రతాపము జృంభించనిమ్ము దొమ్మి!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
మొదటి మూడు పాదాలలో గణభంగం. 'సవితృడు' అనడం సాధువు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సీసం నాల్గవ పాదంలో గణభంగం. సవరించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దాది, పాపి' పదాలను స్వార్థంలోనే ప్రయోగించారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్రౌపది కన్య కాదు కదా? 'జప పిపాసి' అన్న సమాసం సరియైనది.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది !
మీ పూరణ యద్భుతమ్ము ! మించారెనుగా
మీ పూరణయు! ప్రశస్తము
గా పూరించిరి విరివిగ కవివరులారా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"..గలుగు నిది.." అనండి. 'నీవు+ఏకాకి=నీవేకాకి' అవుతుంది. యడాగమం రాదు. "... నబలను నిచ్చ... వచ్చి కాతురు.." అనండి.
'మాయాబజార్' సినిమా ఘట్టమా? మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆహవమధ్యంబు 'కాకి'రీటి యరదం
బుగొనిపోవ హరికి బూని జెప్ప
జగ'దాది 'పురుషుండు శౌరియు నిరుసైన్య
ముల బరికించగా ముందు నిలిపి
విద్విష కౌర'వావి'ష్కృత వాహినిన్
చక్కగ జూచి విషణ్ణుడయిన
పాండవమధ్యమున్పరికించి పరంత'పా
పి'రికితనమునీకు పరువునిడదు
తే.గీ
చావు పుట్టుకల్దప్పవు జీవికెపుడు
కర్మ సేయుటె నీవంతు కాన లెమ్ము
అనుచుకేశవుడెరిగించి యర్జునునకు
విశ్వరూపమ్ము జూపించె విష్ణువగుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాపి, వావి' పదాలను స్వార్థంలో ప్రయోగించారు. "...గన్నులురిమె ననుచు..." అని ఉండాలి.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
🛐🛐🛐
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ధన్యవాదములు గురువుగారూ!
శ్రీకృష్ణుడు సత్యభామతో
ఎందుకా కినుక తెలుపు మిందురొదన
పోయి దెత్తుము దివికేగి పుష్ప మిపుడు
నింక రా! సత్య నావెంటఁ నేడుపాపి
బేల రమ్మందు నాథవా విశ్వగోప్తు
విశ్వగోప్తుడు-ఇంద్రుడు
...కృష్ణుడు, ధుర్యోధనునితో...
అనిని నేకాకిగాజేసి దునిమి నిన్ను
సత్యసంధపాపిట నీదు స్వజము జల్లి
పంచభూతాది వేల్పులు ప్రస్తుతించ
ప్రతిన చెల్లించు కొనును బావా వినుమిది!!!
కీచకుడ నేను నెలతు'కా కి'నుకదేల
అస్మ'దాది'జనుల కీవభ్రలతిక
సుందరీ పిలుపా పిక సుస్వనమ్మ
చేర రా'వా వి'రహమేల శీఘ్ర గతిని
లోపము సవరించినాను.
గురువు గారు కృతజ్ఞతలు.🙏
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి