23, మార్చి 2020, సోమవారం

దత్తపది - 166 (కత్తి-బాకు-డాలు-విల్లు)

కవిమిత్రులారా,
కత్తి, బాకు, డాలు, విల్లు
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

56 కామెంట్‌లు:

కవితా ప్రసాద్ చెప్పారు...

అందకత్తియ ద్రోవది నందు కోరి
కుద్భవిల్లగ మది విజయుండు తాను
జూపులెగబాకకుండగ చోద్యముగను
చేపతిరుగలి ఛేదించి చేయిపట్ట
నేలుకొనిరైదుగురు జగడాలు వడక!
అన్నదమ్ములు దలదాల్చి అమ్మ యాన!

కవితా ప్రసాద్ చెప్పారు...

హౌసుతోడ పరిఢవిల్లు నందకత్తి
య ద్రుపదాత్మజ పైఁబాకు నాశ రేచఁ
బెక్కు దండాలు పెట్టి గోవిందునకెద
ఫల్గునుడు మత్స్యయంత్రము పడనుగొట్టె!

బోరెల్లి హర్ష చెప్పారు...

సుభద్ర ద్వారక నుండి హిడింబ ఇంటికి చేరు సందర్భం...
తేటగీతి:-
పుట్టినింటభరింపలేనట్టిబాధ
ఆమెకత్తింటఁబోయెడిఆనలేక
యాహిడింబాకుటీరానయడుగుమోప
వింతసుమధురపుష్పతావిల్లునిండ
తల్లిదండాలుమీకనితరలెజనులు..
......✍బోరెల్లి హర్ష.
కర్నూలు

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(మేనకావిశ్వామిత్రము)
సొగసుకత్తియ మేనక వగలనగల
కలియబాకుచు గాధేయు గన్నులంత
టక్కుటెక్కుల డాలుకు జిక్కువడుచు
బలుకలేనంత మోహాన బరిఢవిల్లు.
(వగలనగలు-విలాసములనే ఆభరణాలు;గాధేయుడు-విశ్వామిత్రుడు
డాలు-కాంతి;పరిడవిల్లు-అతిశయించు)

Zilebi చెప్పారు...



కీచకుని మాట గా ( మైలవరపు వారికి ముందే :)


అందకత్తియ! యెగబాకుటంబరంపు
వీధి ననుచేరి యావిర్భవిల్లు విరహ
మున మునక లేల? నీ మగండ్లు ని‌ను వీడి
రాయె; రా! డాలుకొను నన్ను రావె రమణి!



జిలేబి

Zilebi చెప్పారు...



నేటి భారతం
(జీపీయెస్ వారి తరపున :))


అరెవో సాంబా! కుపితుడ!
పెరిగెనురా పరిఢవిల్లు పెనుభూతముగా
మరిమయె చైనాకత్తియ
కరో‌న గురిగా దడాలు కరణమ్మెదియో?


జిలేబి




కంది శంకరయ్య చెప్పారు...

సైరంధ్రి కీచకునితో....

చెలి'కత్తి'య యని యిట్టులఁ
బలుకఁగ సబ'బా? కు'మతివి, పతు లేవురు, వా
రలతో గం'డా లు'సురుకుఁ
గలవిక నీ'విల్లుఁ' జేరఁ గలవే? తులువా!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...కుద్భవిల్లుడు...లెగబాకుచుండగ..." అనండి. అయినా 'ఎగబ్రాకు' అన్నది సాధువు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ప్రయత్నం ప్రశసింపదగినదే.
'పుష్పతావి' దుష్టసమాసం. 'కుటీరాన నడుగు మోప.. వింతయైనట్టి పూలతా విల్లు నిండ... తలరి రెల్ల' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎగబ్రాకు' అనడం సాధువు. (బూదరాజు వారి తెలుగు భాషాస్వరూపంలో ఉన్నా ఎగబాకు అన్నది అసాధువు)

కంది శంకరయ్య చెప్పారు...

__/\__

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వైరి కత్తి మి రశరము వంత గూర్ప
విజయు డంబా కులము గాచి విజయ మొసగు
మనుచు దండాలు పెట్టియు నాల మందు
కెర లె పరిఢ విల్లు చు తన కీర్తి వెలుగ

Akula shanthi bhushan చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Akula shanthi bhushan చెప్పారు...


నా పూరణ :: తేటగీతి
**** ***** ***** ***** ***** ***

చాలు చాలు చాలిక జగడాలు బావ!

చేరు కడ కత్తిమిరము నీ జీవితమున

రణమిడదు శుభంబా కుఠిలత్వమేల??

సంధి గోర పరిఢవిల్లు జగతినందు

నీదు కీర్తి సుయోధన !నిక్కమిదియె!


🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

స్వర్గంలో అర్జునునితో ఊర్వశి....

కందం
సరసాని కత్తిపత్తివె?
విరుపులు సబబా? కురువర! విరివిల్తుడు నీ
కరదండాలు బిగించెనె?
మురిపాలకు పల్లవిల్లు మోజులు కరువే?


G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

*శ్రీకృష్ణదౌత్యం*

మతి నీకత్తిమిరమ్మునార హితమౌ మా మాట ! కర్ణాదిసై
న్యతతిన్ గెల్చును క్రీడి! యెంచుమశుభంబా కుత్సితత్త్వమ్ము ! సం
స్థితచిత్తమ్మున జూడనంతమగునీ తేడాలు! రారాజ! పొ...
ర్లుత శాంత్యాపగ! సంధిచే పరిఢవిల్లున్ సౌఖ్యసందోహముల్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

జి పి యస్ వారికి ఈ రోజు "తోక ముడుపు"

Zilebi చెప్పారు...


మైలవరపు వారు ట్రాకు మార్చే సారు :) కీచకునిపై రాస్తా రనుకున్నానే !


జిలేబి

Sitharamayya Solasa చెప్పారు...

విరటు గొల్వున 'బాకు'కు వేషధారి
యైన భీమకు కీచకు నాగ'డాలు'
పరిఢ'విల్లు'ట గూర్చి ద్రౌపది తెలుపగ
'కత్తి'గట్టిన యాతడు గాసెదననె

పాకుకుడు = వంటవాడు
పరిఢవిల్లు = వెల్లివిరియు
కత్తిగట్టు = విరోధము ప్రకటించు

seethadevi gurram చెప్పారు...

కీచకునితో సైరంధ్రి

రాణి చెలికత్తియను నేను రాజునీవు
నీకిది సబబా? కుజనుడ నిగ్రహించు!
నీచుడా!లుప్తమయ్యెను నీతినీకు
బంధకుండను యపకీర్తి పరిఢవిల్లు!

విరించి చెప్పారు...

*మద్యమును కీచకునకిచ్చిరమ్మని ఆదేశించిన సుధేష్ణతో ద్రౌపది మాటలు గా నూహించిన పద్యం*

కలికిరొ సబబా కుంటెన కత్తియ వలె
పరిఢ విల్లుట పాటియే యరయ నీకు
వీరుడనని బండాలముఁ వీగువాని
చెంత కంపుట సరికాదు కాంత వినుమ.

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

గమికత్తియ నీ కీచకు
రమియించెను కామ జ్వాల ప్రభవిల్లుచు, నా
తమి కరదండాలేల? హ
ఠము యుక్తంబా కుమారి? టక్కున రావే!
(కీచకుని అంతరంగం)

కంది శంకరయ్య చెప్పారు...

మిక్కిలి బాగున్నది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'కుటిలత్వమేల' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అత్తపత్తి'ని 'అత్తిపత్తి అన్నారు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
"...తిమిరమ్ములారు" టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కత్తిగట్టు' అన్నపుడు స్వార్థంలో ప్రయోగించినట్లే.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బండాలములో డాలు లేదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కామ జ్వాల' అన్నపుడు 'మ' గురువై గణభంగం. "కామవాంఛ" అనవచ్చు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. వికీపీడియా అత్తిపత్తి అనిచెబుతుంటే వ్రాశాను. మీరన్న తర్వాత ఆంధ్రభారతి లో చూస్తే 'అత్తపత్తి' అని కనిపించింది. 🙏🏻

Sitharamayya Solasa చెప్పారు...

సవరణతో

విరటు గొల్వున 'బాకు'కు వేషధారి
యైన భీమకు కీచకు నాగ'డాలు'
పరిఢ'విల్లు'ట గూర్చి ద్రౌపది తెలుపగ
అంటు'కత్తి'య రూపున నరయు దుననె

పాకుకుడు = వంటవాడు
పరిఢవిల్లు = వెల్లివిరియు
అంటుకత్తియ = విటురాలు

Sitharamayya Solasa చెప్పారు...

🙏🏽

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

బంధకుండను నపకీర్తి యనవచ్చునండి. యడాగమము తగదు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రన్య దేశపదము ప్రయోగింతు రని యూహించ లేదండి.

A.Satyanarayana Reddy చెప్పారు...

విరాట రాజుతో సైరంద్రి
అంటకత్తియ గా నెంచి వెంటపడియె
పెద్దల సభా? కువాదుల వేశ్య వాడ?
వెంబరకునర దండాలు వేయలేర?
ఉద్బవిల్లు ప్రళయమొక్క యువిద యేడ్వ

subbarao చెప్పారు...

రాణి సుధేష్ణచెలికత్తిననెడుమాట
మఱచియెగబాకుచుంటివి మందమతిని
నుద్భవిల్లునుజగడాలులుచ్ఛగాడ!
యనుచుననియెనుద్రౌపదియసురుతోడ

seethadevi gurram చెప్పారు...

గురువుగారికి ధన్యవాదములు,నమస్సులు!
పూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు!సవరిస్తానండీ!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఎగబాకు పద మసాధు వని యెఱింగి సవరణముతో:

ప్రభవిల్లు నరుం డాలుఁ గొ
ని భాసురం బాకులంపు నిజరిపు చయమున్
సభ కత్తిరస్కృత ధరా
విభులన్ దూరమ్ము సేసి వింటి బలమునన్

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

ద్రౌపది చెలి'కత్తి'యెనయె దైవలీల |
పైకి నెగ'బాకు'తెగువను పాండు సుతులు|
పరిఢ'విల్లు' ట కనలేని పాప బుధ్ధి
నరయ దాయాది మత్సర యాగ'డాలు' |

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

కత్తి.. బాకు.. డాలు.. విల్లు..
అన్యార్థంలో భారతపరంగా దత్తపది...

మరోపూరణ🙏

ధర్మరాజు.. శ్రీకృష్ణునితో..

హరి నీవే మము గాచెదెప్పటికి మాకత్తింటిబంధుండవై!
కురుసమ్రాట్టిటు జేయ మాకిది హితంబా? కుందగాజేసె ! త్వ..
ద్వరవాగ్వైఖరి సంధి జేయ జనుమా! దండాలు దండాలు! వా...
రు రణమ్మున్ విరమింపగా పరిఢవిల్లున్ శాంతిసౌభాగ్యముల్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂దత్తపది🤷‍♀....................
కత్తి, బాకు, డాలు, విల్లు.. పై పదాలు
అన్యార్థంలో భారతార్థంలో పద్యం

సందర్భము:
ఉత్తమా తారకోపేతా
మధ్యమా లుప్త తారకా
అధమా సూర్య సహితా
ప్రాతస్సంధ్యా త్రిధామతా
ఉదయం చుక్క లున్నపుడు చేసే సంధ్యా వందనం ఉత్తమం. అవి పోయిన తర్వాత చేసేది మధ్యమం. పొద్దెక్కిన తర్వాత చేసేది అధమం.. అన్నారు.
సంధ్యావందనంవల్ల శరీరానికి రోగనిరోధక శక్తి , మనస్సుకు స్థిరత్వం, తద్వారా దేవతానుగ్రహం కలుగుతా యన్నారు. (దాని కోసం వీలైనంత ముందుగా లేచి స్నానం చేయవలె.)
దేవతల మేలుకొలుపు పాటలన్నీ నిజానికి మనం మేలుకోవడంకోసమే! ఆ ప్రయోజనం పొందడంకోసమే!
దురదృష్టవశాత్తు మనం ఇవన్నీ మరచే పోయినాము. ఆధునికయుగంలో రాత్రి పొద్దుపోయినంతవరకు మేల్కొనియుండడం ఎప్పుడో పొద్దెక్కాక లేవడం అనే చెడ్డ అలవాట్లు చేసుకున్నాం.
విశ్వామిత్రుడు రాముని మేల్కొలుపుతూ ఇలా అన్నాడు.
"పరిసరాలు తెల్లబడినవి రామా! ఆ తిమిరహరుడు (సూర్యుడు) మీరినాడు (అతిశయించినాడు లేదా ఉదయించినాడు). ఐనా లేవవు. ఇది సబబా! (సమంజసమా!) మేలుకో!..
తూర్పు డాలు (వెలుగు) చూసి మేలుకో! (అలా మేలుకుంటే) స్వస్థత (ఆరోగ్యం) అవలీలగా పరిఢవిల్లుతుంది (అతిశయిల్లుతుంది లేదా చక్కబడుతుంది)."
అని ముని (విశ్వామిత్రుడు) పలికినా డని ముని (మార్కండేయ మహర్షి) వినిచినాడు (వినిపించినాడు) ధర్మరాజుకు.. రామకథలో భాగంగా..
23.10.19, 30.10.19 నాటి దత్తపదుల పూరణములలోను మార్కండేయుడు ధర్మరాజుకు రామగాథ వినిపించిన సందర్భాలు పేర్కొనబడ్డాయి.
చూ.మహాభారతము.. అరణ్య (వన) పర్వము 6 వ ఆశ్వాసం 267-411
7 వ ఆశ్వాసం 1-169
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*మేలుకొలుపు వల్ల మేలు కలుగు*

"తెల్లబడె రామ! పాయ _క_ _త్తి_ మిర హరుడు

మీరె.. లేవవు.. సబ _బా కు_ మార! తూర్పు

_డాలుఁ_ గని లెమ్ము.. స్వస్థత లీలఁ బరిఢ

_విల్లు"_ నని ముని యనె నని వినిచెను ముని

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
23.03.20
-----------------------------------------------------------

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


కత్తి.. బాకు.. డాలు.. విల్లు..
అన్యార్థంలో భారతపరంగా దత్తపది...

మరోపూరణ🙏

ధర్మరాజు.. శ్రీకృష్ణునితో..

హరి నీవే మము గాచెదెప్పటికి మాకత్తింటిబంధుండవై!
కురుసమ్రాట్టిటు జేయ మాకిది హితంబా? కుందగాజేసె ! త్వ..
ద్వరవాగ్వైఖరి సంధి జేయ జనుమా! దండాలు దండాలు! వా...
రు రణమ్మున్ విరమింపగా పరిఢవిల్లున్ శాంతిసౌభాగ్యముల్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Yajnesh చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చేరి చెలికత్తి*యగ కృష్ణ చెందె శ్రమము
మారెభీముఁడుబాకుకుఁదీరునచట
విరటుకొల్వునగండాలు* వేనవేలు
పాండవులకవివరములై పరిఢవిల్లు*

subbarao చెప్పారు...

3వపాదంచివరన
సత్యమిదియ
గాచదువప్రార్ధన

Yajnesh చెప్పారు...

కత్తి- - బాకు - డాలు - విల్లు
భారతార్థములో

భీమ ప్రతిజ్ఞ:
బోనకత్తిగ ద్రౌపదిఁ బొందు కోరి
బల్కు దుర్యోధనుఁ నని బేబాకు చేతు
నండ పిండ బ్రహ్మాండాలు నదర, పరిఢ
విల్లుఁ గీర్తి పాండవులకు నెల్లెడలను.

బోనకత్తి-దాసి
బేబాకు-బాకీలేకుండ చేయు

బోరెల్లి హర్ష చెప్పారు...

సవరణతో
పుట్టినింటభరింపలేనట్టిబాధ
ఆమెకత్తింటఁబోయెడిఆనలేక
యాహిడింబాకుటీరాననడుగుమోప
వింతయైనట్టిపూలతావిల్లునిండ
తల్లిదండాలుమీకనితరలిరెల్ల...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

స్వర్గంలో అర్జునునితో ఊర్వశి....

కందం
సరసమున కత్తిరింపులె?
విరుపులు సబబా? కురువర! విరివిల్తుడు నీ
కరదండాలు బిగించెనె?
మురిపాలకు పల్లవిల్లు పురుషుఁడ వేరా?


chandrashekhar yelisetty చెప్పారు...

తే.గీ.

సొగసు కత్తియ ద్రౌపది సొబగు జూడ
జన్మ చండాలు సోదరి చంకకెక్కి
భావ మెరిగించి పొందుకై బాకులాడ
పరిఢ విల్లుచు నుండెనా పాటు గనగ

జన్మచండాలుడు: కీచకుడు

వై. చంద్ర శేఖర్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ఆందకత్తియ నాశించి యాత్మ యందు
కీచకుడెగ బాకుచు నుండ కేలుతోడ
భీము డణచ నాచండాలు భీకరముగ
పరిఢవిల్లుచు నుండె నా పడతి మోము

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

దత్తపది :-
*‌కత్తి, బాకు, డాలు, విల్లు*
పై పదాలను అన్యార్థంలో
భారతార్థంలో
నచ్చిన ఛందంలో....


*కందం**

చెలికత్తియకు పొగరు తగదు
పిలిచిన దండాలు మరచి బిడియము లేకన్
నిలబడ సబబా? కుమతిగ
విలువనిడక పరిఢవిల్లు వెలదీ ప్రియమే
..................✍చక్రి

(కీచకుడు సైరంధ్రి తో....)