4, మార్చి 2020, బుధవారం

సమస్య - 3299 (గుండె యాగినపుడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గుండె యాగినపుడె పండుగ యగు"
(లేదా...)
"గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

46 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వండగ నాదు పత్నియహ వందల లడ్డులు కజ్జికాయలున్
    దండిగ బూరెలన్ తినుచు దారుణ భీతిని స్వప్నమందునన్
    పండుగ రాత్రి రాహులుని భళ్ళున గాంచ ప్రధానమంత్రిగా
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ!

    రిప్లయితొలగించండి

  2. దైత్యగణము గాంచ దారుణముగ సుర

    మునిజనులకు ననయము వగలిడుచు

    చుందు రకట!యట్టి శుంఠల నీచుల

    గుండె యాగినపుడె పండుగ యగు"

    రిప్లయితొలగించండి
  3. సమస్య :-
    "గుండె యాగినపుడె పండుగ యగు"

    *ఆ.వె**

    అమ్మ వంటి నిర్భయమ్మను వేటాడి
    కనికరమ్ము లేక కాటువేసి
    ప్రాణభిక్ష కొరకు ప్రాకులాడెడు వారి
    గుండె యాగినపుడె పండుగ యగు
    .....................✍చక్రి

    (ఉరి వాయిదాలు వాయిదాలు పడుతున్న సందర్భంగా)

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు

    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      కుండల పోతవర్షమున గుండును దాచగ వంగభూమినిన్
      కొండొక చెట్టు నీడనటు గొల్లున నేడ్చుచు దాగుచుండగా
      చండిని పోలు దీదియహ చక్కగ నవ్వుచు చేర చెంతనున్
      గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ

      తొలగించండి
  5. దండిగ దేవతాదులకు దైత్యగణమ్ములు కర్కశమ్ముగన్

    దండన జేయుచున్ మిగుల తాపము నిచ్చుచునుంద్రు;వారలన్

    ఖండనజేసి దేవతల కష్టము దీర్చును శౌరి;వారిదౌ

    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  6. ముక్తి కిదియె మార్గము జిలేబి విను‌ పర
    మాత్మ యే నిజమని మదిని తలచి
    శివశివ యను నెపుడు చింతలు తొలగుచు
    గుండె యాగినపుడె పండుగ యగు


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. అండగ వాడు నీకు గలడంచు నిజమ్మతడే యటంచు పూ
    దండల తోడు భక్తిని సదా శివ నామ జపమ్ము చేయుచున్
    మెండుగ బాల! తత్వపు సమీకరణమ్మును తీర్చిదిద్దగా
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. వీర రసవిభాస వేషభాషలతోడ
      సత్య రణ మొనర్చె శౌరిగూడి
      యతివ విశిఖవృష్టి కానరకు కరకు
      గుండె యాగినపుడె పండుగ యగు"

      తొలగించండి
  9. ( అచ్చుబోసిన ఆబోతుల్లాగా తిరుగుతూ
    పసిపిల్లలను , ఉద్యోగినులను , గృహిణు
    లను ప్రాణమానభంగాలు చేసే చండాలుర
    గుండె ఆగినప్పుడే సమాజానికి పండుగ )
    నిండగు బొండుమల్లియల
    నిర్మలహాసపు చిన్నిపాపలన్ ;
    దండిగ నింటనున్ బయట
    దాల్మి శ్రమించెడి ముగ్ధకాంతలన్ ;
    షండములట్లు వెంటబడి
    సర్వము దోచెడి దుండగీండ్రకున్
    గుండియ యాగినప్పుడె య
    కుంఠితసౌఖ్యము దక్కు పర్వమౌ .
    (తాల్మి - ఓర్పు ; షండములు -ఆబోతులు)

    రిప్లయితొలగించండి
  10. రాజధాని మార్చరాదంచు రైతులు
    తెలుపుచున్న యట్టి తీరుజూడ
    నమలుబర్చ బోవు యారాష్ట్రనేతల
    గుండె యాగినపుడె పండుగ యగు

    గుండె = ధైర్యము
    ఆగు = అణఁగు

    రిప్లయితొలగించండి
  11. ఎండయు వానయంచనక యెల్లెడ యాచకుడైభ్రమించుచున్
    నిండిన వేదనన్ బ్రతుకు నిక్కముగా బహుభారమౌట నా
    కండ యొకండు లేడనుచు నార్తిని గ్రుంగిన దీనుడిట్లనెన్
    "గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

    రిప్లయితొలగించండి
  12. లోక కంటకులను లోకేశు దునిమేను
    సూక్ష్మ క్రిములఁ జంప సూత్రుడెవడు?
    లుప్త మవగ తుదకు రోగకారి కరోన
    గుండె యాగినపుడె పండుగ యగు.

    రిప్లయితొలగించండి


  13. రాజు దుష్టుడగుచు రమణుల పీడించ
    విసిగిపోయినట్టి వెలదులెల్ల
    రోకలెత్తి కొట్ట రొప్పుచు నా రాజు
    *గుండె యాగి నపుడె పండుగ యగు.*


    మరొక పూరణ

    నిండుమనంబుతో సతము నెమ్మి ని చూపెడి యాడ కూనకున్
    తిండిని పెట్టగా పిలిచి తీర్చగ కోర్కెను రమ్మటం చుతా
    దుండగుడైచరింపగని దోషమనెంచకకొట్టినంతనే
    *గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ*.


    రిప్లయితొలగించండి
  14. క్రూర మృగము లట్లు ధారుణి చరియించి
    కరుణ వీడి మెలగు గర్వ మతుల
    తక్షణ o బు కఠిన శిక్ష ల నమ లు తో
    గుండె యాగి నపుడె పండుగ యగు

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    మెండు ధనమ్మదేల ? రసమేదురచిత్తము చాలు., భూమిపై...
    నుండిన జీవితమ్మున పరోపకృతిన్ బ్రదుకంగ జాలు., నీ...
    యండయె నాకు పెన్నిధి !" శివా" యని నిన్నె స్మరించుచుండగా
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. దొమ్మి జేయ వలయు దుష్ట రాక్షసుఁ జంప
    కదులు మోయి కృష్ణ కయ్యమాడ
    ధరణి కంటకుండు నరకాసురుడు వాని
    "గుండె యాగినపుడె పండుగ యగు"

    రిప్లయితొలగించండి
  17. సంతసమ్ముతోడ సర్వ ప్రజకు నిండ
    గుండె, యాగినపుడె పండుగయగు
    ఆడువారిపైన పాడుకృత్యంబులు!
    కవి ప్రసాదుమాట కాస్త వినర!

    రిప్లయితొలగించండి
  18. పైరు పచ్చల గని పరవశించితి నాడు
    వృష్టి యెక్కుడయ్యి నష్ట పోతి
    నమ్ముకున్న యాశ వమ్ము కాగ యెటుల
    గుండె యాగినపుడె పండుగ యగు ?
    (కాగనెటుల ? కాగ యెటుల?)
    **)()(**
    (మొన్న సంక్రాంతి పండుగ యెలా జరుపు కున్నావని యడిగిన మిత్రుడితో హతాశుడైన ఒక రైతు యిచ్చిన సమాధానం)

    రిప్లయితొలగించండి
  19. నిండు కుండ వోలె నిల్చు తటాకమ్ము
    గట్టు మీద నెగురు పిట్ట లాట
    రైలు నుండి కనగ రహి నొప్పి ౘాలబా
    గుండె, (నా)యాగినపుడె పండుగ యగు!

    (ఆ రైలు ఆగగా ఆ దృశ్యాన్ని చూస్తే యింకా వేడుకగా ఉంటుందనే భావనతో....)

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [నరకాసురుని దుర్మార్గములను గూర్చి లోకులు ముచ్చటించుకొను సందర్భము]

    మెండుగ దౌష్ట్యకర్మముల మేదినిఁ జేయుచుఁ, గన్యకా తతిన్
    నిండిన కాముకత్వమున నెక్కొని చెచ్చెర బంది సేసియున్,
    గొండొక రాక్షసుండు నరకుండు సెలంగె! వధింప వానికిన్

    గుండియ యాగినప్పుడె, యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ!

    రిప్లయితొలగించండి
  21. ఆటవెలది
    రావణాసురుండు చావఁగన్ దసరాయె!
    నరకుఁడంతమొంద ధరకు వెలుగు!!
    హరియె యవతరించి హరుడైన, దుష్టుల
    గుండె యాగినపుడె పండుగ యగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గౌ. డా. వెల్దండ సత్యనారాయణ వారల సూచన మేరకు సవరించిన పూరణ :

      ఆటవెలది
      రావణాసురుండు చావఁగన్ దసరాయె!
      నరకుఁడంతమొంద ధరకు వెలుగు!!
      హరియె యవతరించి హరుడైన, దుష్టుని
      గుండె యాగినపుడె పండుగ యగు

      తొలగించండి
  22. నేటి శంకరాభరణము వారి సమస్య
    నా పూరణ క్రమాలంకారములో


    చెప్పు ప్రముఖ మేది జీవి బ్రదుకుటకు?
    బస్సు నెప్పు డెక్క వలెను మనము?,
    తెల్పు భోగి పిదప దినము యేమియగును?
    గుండె , యాగి నపుడె ,పండుగ యగు

    రిప్లయితొలగించండి
  23. మనసెరిగిన ప్రియుడు మధురముగ పిలువ |
    యెడద యాగి కదలు నేమి వింత!
    మరల మరల వినగ మరులు గొల్పునెపుడు |
    "గుండె యాగినపుడె పండుగ యగు"

    రిప్లయితొలగించండి
  24. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో హనుమద్విజయం గురించి ప్రవచిస్తూ...

    ఉత్పలమాల
    ఉండిన దేదొ చాలు ధనముండిన సౌఖ్యము రాదు రాదకో!
    యండయె దైవమై ప్రవచనాదుల బల్కుదు పైకమేలొకో?
    మెండుగ దైవ బోధనల మేదిని నే ప్రవచించు వేళలో
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ!

    రిప్లయితొలగించండి
  25. ఊరిప్రజల బాగునోపనిదుష్టుల
    గుండెయాగినపుడెపండుగయగు
    నమ్మవలదుదుష్టునయగారపుపలుకు
    లెట్టితరుణమందుచిట్టి!నీవు

    రిప్లయితొలగించండి
  26. .... శంకరాభరణం....
    04/03/2020...బుధవారం

    సమస్య.
    *******

    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ

    నా పూరణ. ఉ.మా.
    ** *** *****

    దుండగులన్ దౌష్ట్యకార్యములతో జెలరేగెడు నీచులన్ సదా

    నిండిన కామమున్ జెలగి నిర్దయ గన్యల మానభంగముల్

    దండిగ జేయు వారలను దండన జేయుచు ద్రుంచ వారికిన్

    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "గుండె యాగినపుడె పండుగ యగు"

    సందర్భము: కైకేయి దశరథుని వరాలు కోరగా రాముడు పితృవాక్య పరిపాలనంకోసం వనాలకై బయలుదేరబోతుంటే లక్ష్మణు డన్నా డిలా.
    విపరీతశ్చ వృద్ధశ్చ
    విషయైశ్చ ప్రధర్శితః
    నృపః కిమివ న బ్రూయాత్
    చోద్యమానః స మన్మథః
    (అయో.కాం.21-3)
    విరుద్ధ ప్రవృత్తి గల వయోధర్మం గలవాడూ, వృద్ధుడూ, విషయ వాంఛలచేత తిరస్కరించబడిన వాడూ (విషయవాంఛలకై దశరథుడు ప్రాకులాడుతున్నాడు గాని అవి ఇతణ్ణి అంగీకరించటం లేదు.. అని) అయిన రాజు కాముకుడై కైకేయిచే ప్రేరితుడై యేమి పలుకడు?
    (ఏమైనా పలుకగలడు? పలికినంత మాత్రాన అంగీకార యోగ్యం కాదు..అని)
    తండ్రి ప్రాణాలు తీసియైనా సరే నీకు పట్టం కట్టుతా నన్నాడు లక్ష్మణుడు రామునితో.. (అతడు రాజుగా వుండడానికి తగడు.. అని లక్ష్మణుని ఉద్దేశ్యం.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *లక్ష్మణావేశము*

    పండుగౌను నీకుఁ బట్టంబుఁ గట్టుటే!

    రాజు నిపుడె చంపి రాదగు గద!..

    ఆలి మాటల కెదు రాడజాలని యయ్య

    గుండె యాగినపుడె పండుగ యగు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    4.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. అండనీశుడుండ నాతృతయేలరా?
    ఎండవాన కతడు యేడుగడగ
    మెండుభక్తి నామమేపారగా సాగి
    గుండె యాగినపుడె పండుగయగు!

    రిప్లయితొలగించండి
  29. నిండగు జీవితమ్ము మది నిశ్చల తత్వముతో చరించుచున్
    మెండుగ భక్తి దోడ పరమేశ్వరు నామమునే స్మరించుచున్
    యుండెడి వారలౌ పరమ యోగుల కైహిక వాంఛ లేక నా
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ

    రిప్లయితొలగించండి
  30. అదితి వేఁడె నిట్టు లరవింద లోచన
    వాసుదేవ విహగ వాహనా ము
    కుంద కృష్ణ వరద ఘోర నరక దైత్యు
    గుండె యాగినపుడె పండుగ యగు


    నిండఁ దలంపు చిత్తమున నిత్యము కాల కరోగ్ర సంచల
    ద్దండ విఘాత హీనమయి తామరసాంబక విష్ణు నామ స
    న్మండిత పారవశ్యమున మానవ భక్త వరాళి కెల్ల నీ
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రత నిష్ఠార్చిత మానవాకలన దేవవ్రాత మున్యోఘ స
      న్నుత హర్షోల్లసి తాంతరంగ గిరి ధానుష్కార్ధ దేహస్థితన్
      విత తానుగ్రహ దివ్య వీక్షణ సుధా విస్తారఁ గాత్యాయనిన్
      శ్రిత మందారను మంగళప్రద వరశ్రీగౌరి నేఁ గొల్చెదన్

      తొలగించండి
  31. కండలుదీరువాడయినగాటికెపోవునునెప్పుడాయనన్
    గుండియయాగినప్పుడె,యకుంఠితసౌఖ్యముదక్కుపర్వమౌ
    భండనమందునన్జయమువచ్చినవారికిదప్పకుండగన్
    మెండగుభక్తితోడపరమేశ్వరుసేవనుజేయగాదగున్

    రిప్లయితొలగించండి
  32. ఉ:

    మొండిగ ధిక్కరించ నను మోదము దెల్పని తల్లిదండ్రులన్
    కొండొక రీతినైన నతి గోముగ మెప్పును పొంద గోర నై
    గండి పడంగ యోచనల కన్నుల గట్టి యనుంగు జేరుటన్
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. దుష్టబుద్ధిగల్గు దురితాత్ములవనిలో
    మసలరాదువారి మట్టుబెట్ట
    వలెనుమంచివారి బ్రతుకున దుష్టుల
    గుండె యాగినపుడె పండుగ యగు

    రిప్లయితొలగించండి
  34. గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

    ఖండితగాత్రుజేసినరకాసురుఁజంపగసత్యభామయా
    పండుగవచ్చెదీపములపంక్తులతోడనివాళులివ్వగన్
    దుండగులంతరింపగనుద్రోహులుక్రూరులనేతభీతిలన్
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  35. నా చిరు ప్రయత్నం 🙏

    *తే గీ*

    వందల జనుల నిల వధియించగా, మరి
    వేయగ నురి శిక్ష వెసులు బాటు
    దొరుక, విర్ర వీగు దుర్మార్గుడికి నిక
    *"గుండె యాగినపుడె పండుగ యగు"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "గుండె యాగినపుడె పండుగ యగు"

    సందర్భము: కైక వరాలు కోరిందని తాను అడవి కేగబోతున్నా నని రాముడు చెప్పగానే అప్పటివరకు ఎంతో సంతోషంగా వున్న కౌసల్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తల్లి గుండె ఎంతో తల్లడిల్లిపోయింది.
    "త్వయి సన్నిహితే ప్యేవ/మహ మాసం నిరాకృతా/కిం పునః ప్రోషితే తాత!/ధ్రువం మరణ మేవ మే" (అయో.కాం. 25-41)
    "నాయనా! నీవు సమీపంలో వున్నప్పుడే నే నిలా తిరస్కరింపబడ్డాను. (అగౌరవానికి గురి అయ్యాను. అంటే నా కొడుకువైనందుకు నీకూ అవమానమే జరిగింది.) నీవు దూరంగా (అడవికి) వెళ్ళిపోతే (ఇంకెంత అవమానం జరుగుతుందో!) నాకు మరణమే నిశ్చయం." అన్నది.
    "పుట్టక పుట్టక చాలా కాలానికి పుట్టాడు. ఘనుడే! (విశేష గుణాలు గలవాడు. అవతార పురుషుడే!) సంతోషం..
    నేడే పట్టాభిషేక మన్నారు, పండుగన్నారు. ఇంకా సంతోషం. ఆ పట్టరాని సంతోష మంతా ఒక్క క్షణంలో పాడైపోయింది. సంబర మంతా ఇట్టే నీరుగారిపోయింది... ఇక నా గుండె ఆగిపోతేనే పండుగ. అంతకన్నా మరేమీ లేదు." అన్నది నిస్సహాయంగా..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *తల్లడిల్లిన తల్లి గుండె*

    పుట్టె నొకడు ఘనుడు పుట్టక పుట్టక..

    పట్ట మనిరి.. నేడు పండు గనిరి..

    పట్టరాని హాయి పాడాయె.. నింక నా

    గుండె యాగినపుడె పండుగ యగు..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    4.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. Okay then...

    This may sound a little creepy, and maybe even kind of "supernatural"

    WHAT if you could simply hit "PLAY" to LISTEN to a short, "magical tone"...

    And magically attract MORE MONEY to your life?

    What I'm talking about is thousands... even MILLIONS of DOLLARS!!!

    Sound too EASY? Think it's IMPOSSIBLE?!?

    Well then, Let me tell you the news.

    Sometimes the most magical miracles life has to offer are the easiest to GET!!!

    Honestly, I'm going to PROVE it to you by letting you listen to a real-life "magical money-magnet tone" I developed...

    You simply click "PLAY" and the money will start coming into your life... starting almost INSTANTLY...

    TAP here NOW to PLAY this magical "Miracle Money-Magnet Sound Frequency" - as my gift to you!!!

    రిప్లయితొలగించండి