11, మార్చి 2020, బుధవారం

సమస్య - 3306 (శ్రీకరముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు"
(లేదా...)
"శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే"

82 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    (ఉదా: ముత్తుకూరు గ్రామం బ్రాహ్మణ వీధి):

    పేకల నాడగా తలచి పేరిమి మీరగ సత్రమందునన్
    మేకల వోలె జేరగను మేయుచు పానులు పండితుండ్లహో
    వాకిలి ముందుగా చనగ బంగరు బొమ్మలు జీన్సు టాపులన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాగి తందనా లాడుచు తప్పు కూత
      లెన్నొ కూయు జులాయిల కింపుగొల్పు
      బూతు మాటలు! శ్రీకరములు బుధులకు
      కావు! మూసికొందురు కాద కర్ణములను!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      కవితా ప్రసాద్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మూసికొందురు గదా..." అనండి.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పాకము వండుచుండగను బల్లియె దూరగ కాళ్ళమధ్యనున్
    కేకలు వేయుచున్ వడిగ కిక్కిరి బిక్కిరి కూతలందునన్
    కోకను విప్పగా సుదతి కోరిక తీరగ పద్యమల్లుటన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "తత్ఫలితముల్దెలియగ దలతురేని.." అనండి.

      తొలగించండి



    2. పాలకులనెన్న బూనుట పౌరుల విధి
      ఎన్నికలబూతు లద్దానికిరవులౌను
      తత్ఫలితముల్దెదిలియగ దలతు రేని
      బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు
      సవరణ సూచనలకు గురువు గారికి కృతజ్ఞతలు.

      తొలగించండి
  4. చీకటి చట్టమెందులకు?ఛీయనిచెంపనగొట్టులోకమే
    ప్రాకటమైనతీరుగద ,ప్రాభవమందగజేయుపాలనన్
    కూకటివ్రేళ్ళతో పెకలి ,కూల్చగజూడగ రాజధానియే
    శ్రీకరముల్ సుధీజనవశీకరముల్గదబూతు, మాటలే
    ++++++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  5. తాత కష్టేఫలి కథలు మజుబూతు

    తాత కష్టేఫలి కథలు తరమగు మజు
    బూతు మాటలు, శ్రీకరమ్ములు బుధులకు!
    చదువ దగునందరున్ ప్రవచనములవి జి
    లేబి నేటికాలమునకు లెస్స గాను!


    kastephale.WordPress.com



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కష్టేఫలి వారిని ప్రస్తావించిన మీ పూరణ 'మజుబూతు'గా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. తెల్లారి లేస్తూ లేస్తూనే టీవీలలో చర్చా కార్యక్రమముల పోకడ :)


    వేకువ జాము మంత్రములు వేదపు నాదము నిక్వణమ్ములై
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద! బూతుమాటలే
    లా! కదనమ్ములేల నరులార వినండయ దుష్టశీలురై
    ప్రాకుడురాళ్ళ పై సడలి పాపపు త్రోవను బట్టుటేలనో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. రాగవైరములు, విమర్శ పొగడికతలు,
    బూతుమాటలు శ్రీకరమ్ములు, బుధులకు
    సమములే, వారి జీవము తామరాకు
    మీద నీరువలెనె, గీత బోధ యిదియె౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్థితప్రజ్ఞుల గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. హా!కలుషాత్ములంతట మహాపద గూర్చుచు ధర్మదీప్తికిన్
    భీకరకృత్యముల్ సలిపి విజ్ఞుల నోళ్ళను నొక్కుచుండగా
    నీకలికాలమందు వసుధేశులు వీరలె యౌచు నుండినన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే"

    రిప్లయితొలగించండి
  9. ( సద్భాషణములు - దుర్భాషణములు )
    ఊకొనజాలు నౌచితిని ,
    నుజ్వలరీతిని నింపుకొన్న యా
    వ్యాకులపాటు లేని ప్రతి
    భాయుతసత్కవివాక్కు లెప్పుడున్
    శ్రీకరముల్ సుధీజనవ
    శీకరముల్ గద ; బూతుమాటలే
    వాకొనరాని యాపదల
    బారిన వైచును నెంతవారలన్ .
    ( ఊకొనజాలు - ఒప్పుకోదగిన ; వ్యాకులపాటు - కల
    వరపాటు )

    రిప్లయితొలగించండి
  10. "అకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై"
    వికటప్రాకటవాక్కులియ్యవి కటా! విజ్ఞుండ విట్లందువో?
    సకలజ్ఞుండగుఁ గాక రావణుడు, భూజాతం జెరం బట్టడే
    మకుటప్రాయశివార్ఛనానిరతిసమ్మాన్యాగ్ర భక్తుండునై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. వ్రాసె గద కవి చౌడప్ప వాసిగాను
    కంద పద్యాలు నిండుగా ఖలులు మెచ్చు
    బూతుమాటలు, శ్రీకరమ్ములు బుధులకు
    నవరసమ్ములు నిండిన కవనమైన.

    రిప్లయితొలగించండి
  12. లోకవినూత్నరీతులను లోగడ క్షేత్రయ మువ్వగోపునిన్
    ప్రాకట గేయకావ్యగతి బాడుచు వీనుల విందుగా రసో
    ద్రేకమొనర్చె నా కృతుల రేగిన భావములన్నియున్సదా
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే"

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    [కవి చౌడప్ప జనులకు బూతాడితేనే నవ్వుప్పుట్టుతుందని చెప్పుచు నొక శతకమునే రచించిన సందర్భము]

    "చేకొని బూతు కావ్యమునె సెప్పెను జగ్గన కూచిమంచియే!
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే!
    నీకును నాకు నీ సభకు నీతులు బూతులె నవ్వు!" లంచుఁ దాఁ

    బ్రాకట రీతిఁ జెప్పెఁ గవివర్యుఁడు చౌడప బూతు పద్దెముల్!

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. పీకనుఁ దాక త్రావితివొ? పెంపు వహించిన మత్తు మున్గితో?
      వాకొన నేల సంగతమొ? వాసి వహించగఁ జేయు యత్నమో?
      ప్రాకటపాలకాగ్రణిసభావికృతోక్తులఁ వోలె నేలనో?
      శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. తాకిడి యేమిలేక కడు తాలిమి తోడన దుష్టశీలురౌ
    మూకలనన్నిటిన్ కలిపి ముద్దుగ నేర్పిన మాటలన్నియున్
    శ్రీకరముల్ ; సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే
    పీకలనిండ మెక్కి తమ పెద్దల నెక్కొని యుండు వారికిని్

    తాకిడి = ఒత్తిడి

    రిప్లయితొలగించండి
  16. చేర రానట్టి వారల చెలిమి కలిగి
    పాడుపనులకు నలవాటు పడి తరచుగ
    మద్య మాంసముల్ మ్రింగు నున్మత్తు డనెడు
    బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు
    కావు కాని దూరముంచుడు కాపురుషుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణంభంగం. "కా వనుచు దూరముంచుడు" అనండి.

      తొలగించండి
  17. గోకితి బుర్రపైన మరి గోకితి రక్తము వచ్చునట్లుగన్
    ప్రాకితి నేలపైన సురపానము చేయుచు నాట్యమాడితిన్
    దూకితి మార్కటమ్మునయి దుర్మతి!పూరణసాధ్య మెవ్విధిన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    రిప్లయితొలగించండి
  18. చెలిమి చనువున నొండొరుల్ చిలిపి తనపు
    బూతు మాటలు శ్రీకరమ్ము లు : బుధులకు
    సాత్వికంబగు వచనాలుఎ సవ్యమగుచు
    సర్వ సౌఖ్యము కోరుచు సాగు చుంద్రు

    రిప్లయితొలగించండి
  19. గోపికమ్ముల చీరలు గోప బాలు
    డకట దోచిన కథలవి హాయి గూర్చు
    భాగవతమున బూతులు బాగు బాగు
    బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ:

    *మేకవు* పద్యముల్ గనగ మేటి కవిత్వమునల్లువాడవై!
    *పాకవు* సర్వభావముల పాటలు కట్టెడివాడవౌటచే!
    *పేకవు* నీకవిత్వమున పేదలు కన్పడునన్ పొగడ్తలే
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  21. తాకగ నంబరంబు దన దక్షత ధీమతి దానధర్మముల్
    వీకను సంస్తుతించగను వేడుకమీరగ వందిమాగధుల్
    తేకువమించగా ప్రభువు తీరగ ఠీవిగ గద్దెయందునన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    బూతు = భట్రాజు
    వీక = ఉత్సాహము
    తేకువ = గౌరవము

    రిప్లయితొలగించండి
  22. ప్రవచనము లిడుచుండిరి ప్రతిదినమును
    పండితులు పలువురు మెచ్చ 'పాల బూతు'
    కడను పరమార్ధము తెలియ గడుముదముగ
    బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు

    రిప్లయితొలగించండి
  23. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు"

    సందర్భము: ఆంజనేయుడు లంకనుండి తిరిగి వచ్చాడు. మహేంద్ర గిరిపై దిగినాడు (నిపపాద మహేంద్రస్య శిఖరే.. సుం.కాం. 57-30). వానరులంతా పరమానందం చెందారు. పావని ఒక్క మాటలో సీతను చూశా నన్నాడు. (దృష్ట్వా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్..36)
    " నవ వ్యాకరణాలూ మథించిన వాడవు. నీకు మాటలు వచ్చు. బుధులకు నీ మాటలు శ్రీ కరములేమో గాని మేము పామరులము. సీతను చూశా నన్నావే! ఏదీ సుబూతు (సాక్ష్యం) చూపించు మరి..అప్పుడే నమ్ముతాము."
    అని నిలదీశారు వానరులు.
    జాంబవంతుడు కోరగా తాను బయలు దేరినది మొదలు నేటివరకు జరిగినదంతా విపులంగా చెప్పాడు మారుతి. (58-7నుంచి166)
    "సీత ఆశ్చర్యకరమైన శ్రేష్ఠమైన చూడామణి నిచ్చింది." (...వరారోహా మణిప్రవర మద్భుతమ్ ప్రాయచ్ఛత్ 58-102) అన్నాడు.
    "నేను ఊరకే వెళ్ళి ఊరకే తిరిగిరాలేదు. రాముని దగ్గరనుండి ఉంగరాన్ని తీసుకువెళ్ళి సీత కిచ్చాను. సీతవద్దనుండి చూడామణిని తీసుకొని వచ్చి రామున కీయబోతున్నాను. సీతను చూశా ననడానికి ఇదే సాక్ష్యం" అంటూ చూడామణిని చూపించినాడు.
    వానరు లే విధంగా మారుతిని ప్రశ్నించా రన్నది పద్యంలో చిత్రించబడింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సుబూతు*

    పాపు మా శంక.. మే మేమొ పామరులము..

    తొమ్మి దగు వ్యాకరణములతో ప నేమి?

    చూచితిని సీత నంటివే!.. చూపు మిక సు

    బూతు... మాటలు శ్రీకరమ్ములు బుధులకు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    11.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  24. మేతల నొకరింకొకరిని మించుచు నిక
    నీతుల వలె వల్లింతురు నేతలిపుడు
    బూతుమాటలు; శ్రీకరమ్ములు బుధులకు
    రీతిగ జన హితమొసంగు జేతలె గద
    నేతలు యటువంటి నడత నేర్తురెపుడొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేతలు + అటువంటి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "నేత లిటువంటి నడతను..." అనండి.

      తొలగించండి
  25. చతురులనుకొని యాంధ్రుల చట్ట సభకు
    పంపగ నచట పలికెడు పలుకులగన
    నచ్చెరువు కలుగగ తప్ప దందరెంచ
    బూతుమాటలు శ్రీకరంబులు బుధులకు

    రిప్లయితొలగించండి
  26. పలుకకూడదుసాములుపండితులును
    బూతుమాటలు,శ్రీకరమ్ములుబుధులకు
    గావుగానార్య!పరికించ,కాపురుషుల
    లక్షణములయ్యవివినుటశక్యమౌనె?

    రిప్లయితొలగించండి
  27. ఉత్పలమాల
    శ్రీకరుఁడౌనె కృష్ణుఁడు వశీకరణమ్మున నన్య భామలన్
    జేకొన? 'బూతు' నష్టపదిఁ జేసెనె మీ జయదేవుఁడంచనన్!
    బ్రాకటమైన దేవుఁగొని రంజిలు జీవుల దృష్టిఁ గాంచినన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద' బూతు' మాటలే! !

    రిప్లయితొలగించండి
  28. నీతిహీనుడుపలుకును రోతగొలుపు
    బూతుమాటలు, శ్రీకరమ్ములు బుధులకు
    సభ్యతగలిగి పలికెడు సద్వచనము
    మాటపొందిక మేల్గూర్చు మానవులకు

    రిప్లయితొలగించండి
  29. మనుషు లందుత్తముండునై తనరు చుండ
    ధనవిహీనుం డయిన నేమి యనవరతము
    త్యాగనిరతుండు దీన దయాగుణంపుఁ
    బూతు మాటలు శ్రీకరమ్ములు బుధులకు

    [పూతుఁడు = పవిత్రుఁడు]


    వీఁక మరల్చ వచ్చుగద భీతి వహించక కాలు జాఱినం
    గాఁకను నోరు జాఱ మఱి కాలుని కైన మరల్ప శక్యమే
    నీకును నాకు వాచ్యముల నిత్యము వీడిన, నెట్టివారికిన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద, బూతుమాటలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హృచ్ఛాంత్యర్థము దుఃఖ నాశ రతి రోషేర్ష్యాది దుశ్చింతనా
      విచ్ఛిన్నార్థము భక్తిఁ గొల్తు వరదా! విశ్వేశ! దైత్యాలయ
      ప్రచ్ఛన్నస్థిత! దాన వాన్వయవర ప్రహ్లాద సంపూజితా!
      తుచ్ఛస్వాంత హిరణ్య భుక్తి నఖ సద్యో జిన్నృకంఠీరవా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      అంతకంటె అత్యద్భుతంగా ఉన్న నృసింహ స్తుతిపద్యం యొక్క నేపథ్యం?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      మిత్రులతో బంచుకొనుటయే నా ఉద్దేశమండి. దోషము లున్న బహిర్గత మగు ననియు.

      తొలగించండి
  30. తేటగీతి
    సర్వ వేద శాస్త్రాదుల సారమెల్ల
    గీతఁ జేయుచు నరునకు కృష్ణమూర్తి
    జెప్పె సాబూతు మాటలు! శ్రీకరమ్ము
    లు బుధులకవె మానసఁపు విలోకనమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు. మీరు సూచించిన మూడవపాదాది సవరణతో

      తేటగీతి
      సర్వ వేద శాస్త్రాదుల సారమెల్ల
      గీతఁ జేయుచు నరునకు కృష్ణమూర్తి
      సెప్పె సాబూతు మాటలు! శ్రీకరమ్ము
      లు బుధులకవె మానసఁపు విలోకనమున

      తొలగించండి
  31. శ్రీకరముల్సుధీజనవశీకరముల్గదబూతుమాటలే
    భీకరమైనదీపలుకుపేరిమివోవునుగాదెమాపయిన్
    లోకులుకాకులైమనలలూటినిమాదిరిచూతురేగదా
    తేకువగల్గువోలెనిలదీపగుమాటలుబల్కనోపగున్

    రిప్లయితొలగించండి
  32. "శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే"



    ప్రాకెనుకందిశంకరులబ్లాగునబూతులుతుచ్ఛమౌపదాల్
    సాకుసమస్యపూరణముసాధ్వులుసాధువులాగ్రహించిను
    ద్రేకపడంగతప్పగునుదేశమెలెక్షనుబూతుచర్చలన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  33. ప్రాకటమొప్పపండితులు ,ప్రాభవమందగజెప్పె చాటువుల్
    శ్రీకరమౌచునిల్చెనవి,శ్రీనిధులై మనతెన్ గుసాహితిన్
    భీకరమైనచోటునవి, భీతినిబెంచెను నీతిబోధలై
    శ్రీకరముల్సుధీజనవశీకరముల్ ,గద బూతుమాటలే
    +++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు



    రిప్లయితొలగించండి
  34. గోకుల మందు మాధవుడు గోపికలం గొని రాస కేళి ను
    త్సేకము తోడ నాడుటలు జీవుల దేవు డనుగ్రహించుటే
    నీకవి బూతు లౌనె కట నేరవు చిన్మయమూర్తి లీలలన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే.

    రిప్లయితొలగించండి
  35. ఇంకొంచెం మెరుగులు దిద్ది:

    గోకుల మందు మాధవుడు గోపికలం గొని రాస కేళి ను
    త్సేకము తోడ నాడుటలు జీవుల దేవు డనుగ్రహించుటే
    నీకవి బూతు లైన నిక నేమను వాడను కృష్ణ లీలలన్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద
    బూతుమాటలే"

    సందర్భము: సీతను చూసివచ్చిన సంతోషంతో వానరులు మధువనంలో జొరబడి తేనెలు తాగి చెల్లాచెదురు చేసిరి. వన పాలకుడైన సుగ్రీవుని మేనమామ దధిముఖుని కింకరులను మోకాళ్ళపై యీడ్చి దేవమార్గం చూపించిరి. (దేవమార్గం ప్రదర్శితాః)
    (సుం.కాం. 62-16)
    వానరులు దేవమార్గం చూపి అవమానం చేసినారని కొట్టినా రనీ కింకరులు దధిముఖునికి చెప్పుకొనిరి. 17
    (వయం చ జానుభిః కృష్టా దేవమార్గం చ దర్శితాః)
    అతడు వచ్చి అడ్డుకోగా బంధు వని కూడ చూడక అంగదుడు నేలమీద పడవేసి కొట్టినాడు. కింకరులతో దధిముఖుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి వానరులు కొట్టినట్టు ఈడ్చినట్టు దేవమార్గం చూపి బూతులు మాటాడినట్టు విన్నవించుకున్నాడు. (ప్రకృష్టాశ్చ యథాకామం దేవ మార్గం చ దర్శితాః 63-9)
    సుగ్రీవు డిలా అన్నాడు.
    ప్రీతోఽస్మి సోఽహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః
    మర్షితం మర్షణీయంచ చేష్టితం కృతకర్మణామ్
    (సుం.కాం.63-27)
    పని చేసుకొని వచ్చిన వానరులు మధువనాన్ని అనుభవించినందుకు సంతోషించినాను. కార్యం సాధించుకొని వచ్చిన వాళ్ళు చేసిన చేష్టితం మర్షణీయం (సహించదగినది). కాబట్టి సహించబడింది. (క్షమిస్తున్నాను.)
    సీతాన్వేషణం సఫలమైనందుకు సుగ్రీవుని కానందం.. అందుచేత అనుచితమైన పనులు చేసినా వానరులను క్షమించాడు. "సీతారాముల కలయిక త్వరలో సంభవిస్తుంది. అది లోకాని కంతటికీ శ్రీకరమే! సుధీజనవశీకరణమే! బూతుమాటలైనా అందుకే కారణ మౌతున్నాయి." అన్నాడు.
    దేవమార్గం చూపు = ముడ్డి చూపు
    కృతకర్ములు = చేయబడిన కర్మ గలవారు
    మర్షణీయము = సహించదగినది
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *దేవ మార్గము*

    "ప్రాకట దేవమార్గమును
    బాగుగఁ జూపిరి వానరాధముల్..
    మా కిది సిగ్గు చేటు గద!
    మానక బూతుల నాడి రయ్యొ! చీ
    కా కొనరించి ర వ్వని న
    కారణ మల్లుడ!" యన్న వా డనెన్...
    "శ్రీకరముల్ సుధీజన వ
    శీకరముల్ గద బూతు మాటలే!" 1

    "ఆ కృతకర్ములైన కపు
    ల ట్లొనరింపగ మర్షణీయమే
    మాకు.. క్షమించినార మిక
    మామ! సమీరకుమారుచేత సీ
    తా కలకంఠి దర్శనము
    తప్పక సంభవమయ్యె.. నౌనులే!
    శ్రీకరముల్ సుధీజన వ
    శీకరముల్ గద బూతు మాటలే!" 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    11.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. వేకువఝామునందుకడువీనులవిందొనరించురీతిగా
    నాకసవాణిలోపలుకునద్భుత శ్రావ్యపుభక్తిగీతముల్
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద, బూతుమాటలే
    వాకొన నేటికోజనులు వాతెఱకేమిఫలంబుగల్గునో?

    రిప్లయితొలగించండి
  38. పలుక బోకుమయ్య యిలను పరులు కెపుడు
    *బూతు మాటలు, శ్రీకరములు బుధులకు*
    సంత సమ్ము కలుగునట్లుచక్కగాను
    మెలగు చున్న సహృదయులై మెత్తురయ్య.

    రిప్లయితొలగించండి