22, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3317 (వందే మాతర మనుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వందే మాతర మనుటయె పాపమ్మగురా"
(లేదా...)
"వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

86 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    From Jama Masjid, Delhi:

    "సందుల్ గొందుల కావి వన్నియలవౌ జండాలనున్ పాతుచున్
    నందమ్మొందుచు భాజపా జనులహో నర్తించుచున్ పాడగా...
    సందేహమ్మిసుమంత లేదు గిలితో సాయీబు లేనాటికిన్
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    From Congress High Command, Delhi:

    "నందమ్మొందుచు మంత్రిగా తనరుచున్ నౌకర్లు చాకర్లతో
    విందుల్ జేయుచు రాత్రులన్ పవలులన్ విస్తారమౌ రీతినిన్
    వందల్ వేలుగ లంచముల్ కొనుచు వే పంపింపకే దిల్లికిన్
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

    రిప్లయితొలగించండి


  3. అందరికిన్ మేలైనది
    వందే మాతర మనుటయె, పాపమ్మగురా
    జిందాబాదుజిహాదని
    కొందలపరచి జనులను ప్రకోపించుటయే

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణం......22/03/2020
    ఆదివారం

    సమస్య. : 
    **** ***

    "వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

    నా పూరణ :: శార్ధూల విక్రీడితము
    **** ***** ***** ***** ***** ***

    చిందుల్ ద్రొక్కుచు నిత్యమున్... జనులకున్ జేటున్ సదా జేయుచున్..

    నందమ్మొందుచు శ్రేయ కార్యములనే
    నాశంబు గావించుచున్...

    సందేహించక పాపకార్యముల విస్తారంబుగా సల్పుచున్...

    వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  5. కుందాపూరు జిలేబి సత్యమిదియే కొవ్వెక్కిపోవేసుమా
    సందేహించకు దేశసంపదను విస్తారమ్ముగాదోచుకో
    జిందాబాదను ప్రక్కదేశమునకోయ్ జిమ్మన్దగున్ ద్వేషమున్
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. చిందించు ద్వేషమున్ బల్
    సందేహమ్మేల దేశ సంపద నొడుచన్
    జిందాబాదను ద్రోహికి
    వందే మాతర మనుటయె పాపమ్మగురా

    రిప్లయితొలగించండి
  7. ఎందరు జెప్పిన కూడను
    నందరు కలయ నది నాశ మవ్వుట లోనన్
    కొందరు దయమందున లే
    వందే , మాతరమనుటయె పాపమ్మగురా

    రిప్లయితొలగించండి


  8. సందేహించకు వేదభూమియిది విస్తారమ్ముగామేలురా
    వందే భారత మాతరమ్మనుట, పాపమ్మౌను నేరం బగున్
    జిందాబాదని ప్రక్క దేశములతో చేతుల్ వినాశమ్ములన్
    చిందింపంగను కల్పి స్వార్థులగుచున్ జిమ్మంగ ద్వేషమ్ములే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. (తెల్లదొరల నెదిరించిన మన స్వాతంత్ర్యవీరులలో ఒకరు మరొకరితో)
    సందర్భంబు బురస్కరించుకొని సు
    స్వాంతుం డొసంగెన్ గదా!
    డెందంబుల్ బులకింప గీతమును; రం
    డింకన్ మహోత్సాహులై;
    పందల్ బోలెడి యాంగ్లమూర్ఖుల నిదే
    ప్రశ్నింత "మే రీతిగా
    వందే భారతమాతరమ్మనుట పా
    పమ్మౌను నేరంబగున్ ?"
    (సుస్వాంతుడు-మంచిమనస్సు గలవాడు,బంకించంద్రచటర్జీ)

    రిప్లయితొలగించండి
  10. వందన మొనర్చ వలయును
    సందర మందున వసించు సాగర సుతకున్
    నిందింప నేల నేవిధి
    వందే మాతర మనుటయె పాపమ్మగురా?

    రిప్లయితొలగించండి
  11. మందుల్ నేటిసమాజమందు మతముల్ మార్చంగ యత్నించునీ
    చందంబుంగన స్పష్టమౌను హితుడా సందేహమేలేదిటన్
    హిందూత్వమ్ము వహించుటౌను కుకృతం, బీనేలపై భక్తితో
    వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్


    సందేహించక దేశభక్తులపుడా స్వాతంత్ర్య సంగ్రామమం
    దిందీనేల బ్రభుత్వదౌష్ట్యగతులన్ హింసన్ విమర్శించు నా
    చందంబున్ గని యాంగ్లపాలకు లిటన్ జాటించి రీరీతిగన్
    "వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'అందింది' అన్నది వ్యావహారికం కదా!

      తొలగించండి
    2. సంగ్రామమందు+ఇందు+ఈనేల
      సంగ్రామమందిందీనేల

      తొలగించండి
  12. సందేహము లేదిక మనము 
    వందే మాతర మనుటయె, పాపమ్మగురా
    మందుడవై భావిని తలచ 
    వెందరొ తగిలిరి కరోన చెప్పఁగ వినరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణభంగం. "...లేదు మనము... భావిఁ దలచ.." అనండి.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. అందఱి మేలును గోరుచు
      పొందికయౌ జీవనమిడు భూమిని బొగడన్
      సందేహమేల? యెవ్విధి
      వందేమాతర మనుటయె పాపమ్మగురా?

      తొలగించండి
    2. నేను ముందు పద్యాన్ని సవరించే లోగా మీవ్యాఖ్య వచ్చింది.మన్నించండి.🙏

      తొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    *జనతాకర్ఫ్యూ*

    మందుల్ లేనిది తాకనంటెడి మహమ్మారిన్ నిరోధింపనా...
    నందశ్రీ రహియించు! దేశము కరోనాహీనమౌనంచు స...
    త్సందేశమ్మిడె మోది., దానిపయి విశ్వాసమ్ము లేకుండగన్
    వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🙏

      హిందూవాదమనంగజంపుటయె! జైహిందన్న జైల్పాలు., మేన్
      జిందన్ రక్తము దేశభక్తులను హింసింపన్ ముదంబందుచున్
      క్రిందన్ ద్రోసిరి స్వేచ్ఛ ధూర్తులగునాంగ్లేయాధముల్ ! నాడటన్
      వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి



  15. శార్దూలవిక్రీడితము
    సందేహించవె యింట వేరొకరిదౌ సంచారమున్ భీతితో?
    ముందీ మాట వివేకమెంచి పరులన్ బోజేయ క్షేమమ్మగున్
    సందీయంగ విమర్శ జేయుటకు నిస్సందేహమై మీఁదటన్
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్!

    రిప్లయితొలగించండి
  16. అందరి బాధ్యత యగుగద
    వందే మాతర మనుట యె : పాపమ్మ గు రా
    నిందించి భరత మాతను
    మందుడు గా మెలగు ట నిన మన్నింప రిల న్

    రిప్లయితొలగించండి
  17. కందం
    విందుఁ గొని భారతమ్మును
    బంధించఁగ వారు దేశభక్తులనెల్లన్
    చిందించుచు రక్తమ్మును
    వందే మాతర మనుటయె పాపమ్మగురా?

    రిప్లయితొలగించండి
  18. ముందామాటలు కట్టిపెట్టు మది నీ మూర్ఖత్వమున్ దెల్పదే
    నిందారోపణ లేలసేసెదవు నిన్నేరీతి మన్నించు నీ
    హిందూ క్షేత్ర జనాళి చాలుమికరా హేయంబదే, యెవ్విధిన్
    వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్?

    రిప్లయితొలగించండి
  19. వందేమాతరమనుటకు
    సందేహము లేదు మున్ను సమతను బెంపన్,
    సందేహంబును వీడక
    "వందేమాతర మనుటయె పాపమ్మగురా "
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  20. రందిగ మత్తిడు సుర గొని
    చిందులు వేయుచు పథముల చేయుచు తప్పుల్
    చందాలఁ గొంచు బలిమిని
    వందే మాతర మనుటయె పాపమ్మగురా

    రిప్లయితొలగించండి
  21. ఒవైసీ ఉవాచ

    చిందించుము రక్తమునే
    నిందించుచు భాజపాను నిత్యము భాయీ!
    సందియము వలదు మనకున్
    వందేమాతర మనుటయె పాపమ్మగురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరూ అన్నయ్య బాట పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ఇది నేనన్నమాట కాదు గురువుగారూ,ఒవైశీయే స్వయంగా వందేమాతరం అననని ప్రకటించాడు! అటువంటివారు మన ప్రక్కనే నివసించడం మన దురదృష్టం!

      తొలగించండి
  22. సందేశమ్మిదె మోడి నేడు తెలిపెన్ సాగించుమా కర్ఫ్యు పా
    బందీచేయ కరోన వైరసను సంప్రాప్తించు పుణ్యమ్మహో
    వందే భారత మాతర మ్మనుట! పాపమ్మౌను నేరం బగున్
    వందల్ వేలుగ నైదుగంటలకు చప్పట్లంద గన్ జేయరే

    శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  23. హిందూ ముస్లిము వేరుచేయునది సీయేయేయనిం జెప్పుచున్,
    పందేరమ్మును జేసి ఓటు కొని లాభంబొందుచున్, రక్షయౌ
    కందాచారముఁ గేలి చేయుచును, సంస్కారమ్ముఁ వక్రించుచున్
    వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్౹౹

    రిప్లయితొలగించండి
  24. అందరిబాధ్యతవసుధను
    వందేమాతరమనుటయె,పాపమ్మగురా
    నిందలువేయుటసతిపై
    నిందనువిడనాడనాత్రినేత్రుడుమెచ్చున్

    రిప్లయితొలగించండి

  25. అందంబగు భరతావని
    కందింతుము వందనంబు లనవరతంబున్,
    నిందింతురు కుటిలు లిటుల
    వందేమాతర మనుటయె పాపంబగురా!

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. సమస్య :-
    వందే మాతర మనుటయె పాపమ్మగురా

    *కందం**

    వందేమాతర మన్నను
    వందల యేండ్లుగ బ్రిటీషు పరిపాలనలో
    నిందింప బడిరి తాతలు
    వందే మాతర మనుటయె పాపమ్మగురా !
    ..........‌‌............✍చక్రి

    రిప్లయితొలగించండి
  29. చిందుల్ద్రొక్కకుముందుగావినుధరన్ఛీత్కారభావంబుతో
    వందేభారతమాతరమ్మనుటపాపమ్మౌనునేరంబగున్
    నిందారోపణజేయకుండగశుచిన్నేత్రాలపర్వంబుగా
    వందేభారతమాతయంచునుదగన్భావింపుమాయూహలన్

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "వందే మాతర మనుటయె పాపమ్మగురా"

    సందర్భము:
    కైక దుర్వర్తనంవల్ల ఎన్నో చెడ్డ పరిణామాలు సంభవించగా భరతు డెంతో దుఃఖించి తల్లిని తీవ్రంగా దూషించినాడు.
    మృత్యు మాపాదితో రాజా
    త్వయా మే పాప దర్శిని!
    సుఖం పరిహృతం మోహాత్
    కులేఽస్మిన్ కుల పాంసని!
    (పాపం చేసేదానవు. నీచేత మా తండ్రి (రాజు) మరణించినాడు. వంశంలో ఎవ్వరికీ సుఖం లేకుండా చేశావు.కులాన్నే చెరచినదానవు నీవు) అన్నాడు.
    (అయో. కాం.. 73-5.. ఇంకా ఈ సర్గములోని 11,19,25 శ్లోకాలూ చూడవచ్చు.)
    అన్యోన్యంగా తనతో మెలిగేవా డైనందున ఏకాంతంలో శత్రుఘ్నునితో భరతుడు తన తల్లిగురించి చెప్పుకొని ఇలా వాపోయినాడు.
    "మా యమ్మ ఇంతమందిని పీడించిందిరా! దీంతో యే మొరిగింది చెప్పు. ఛీ!ఛీ! రాము డైనందుకు మా యమ్మను మన నందరినీ పోనీ లె మ్మని మన్నించినాడు గాని ఆయనకు బదులుగా (ఆ చోట) ఇంకొక రెవరైనా వుంటే అంత తేలిగ్గా తీసుకునేవారా! క్షమించి వదలిపెట్టేవారా!
    తమ్ముడూ! రాముడైనా "నే నెందు కరణ్యవాసానికి వెళ్ళాలి. నేను చేసిన నేర మేమిటి?" అని మొండి కేసి వుంటే చేసే దేముంది? మన దగ్గర సమాధాన మే ముంది?
    ఇటువంటి సమయంలో వందే మాతరం.. అనడం కూడా పాపమే ఔతుందిరా!"
    (చూ. 20.10.19, 9.1.20, 22.1.20, 28.1.20, 3.3.20 నాటి పూరణములూ దీనికి సంబంధించినవే!)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *భరతుని హృదయ ఘోష*

    "కుందగఁ జేసెనురా తా

    నిందరి!.. నే మొరిగె నిపు.. డిసీ! రాముండై

    నందుకు మన్నించెనురా!..

    వందే మాతర మనుటయె పాప మ్మగురా!"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    22.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. ఎందేనియుఁ గలదే యిది
      మందాత్మా సుంత దల్చుమా చిత్తమునం
      గందోయి మూసి భక్తిన్
      వందే మాతర మనుటయె పాపమ్మగురా?


      ఒక ముత్తవ్వ మునిమనుమనితో:

      సందేహమ్మది యేల నీ కకట వీసంబైన సత్యంబ క
      న్విందై వెల్గ నలంకరించి వసు కాంతిన్ విగ్రహార్థమ్ము వీ
      టం దోయమ్ము లొసంగుటం బరమ మూఢాచార సంయుక్తమే,
      వందే భారత! మా తర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్

      [భాః రత = భారత; సూర్యు నారాధించు వాఁడా; మా తరమ్ము = మా యొక్క తరము ]

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  32. హిందుత్వమ్మన రాక్షసత్వమను ఆ హీనాత్ములిట్లందురే
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్;
    హిందూ ధర్మము శాంతి మార్గమవగాహింపంగ స్పష్టంబగున్
    వందే భారత మాతరమ్మనగ సద్భావమ్ము సంపన్నమౌ

    రిప్లయితొలగించండి
  33. ముం దేయే తర మాగమించునొ? కటా! మూర్ఖప్రజానీకముల్
    చిందుల్ వేయుదు రేమొ! యీ భరతవిచ్ఛేదమ్ముఁ జేఁగూర్తురో!
    యిందే ద్రోహులు పెచ్చరిల్లుదురొ! హా యీ మాట లేపారినన్ !
    "వందే భారతమ్" ఆ ( మ్+ఆ = మా )తర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  34. సందేహింపగనేల జాటుమిక విశ్వమ్మంతటన్ మేలుగా
    హిందుత్వమ్మను సద్విధానమున నేకీభూతులన్ జేయుగా
    వందే భారత మాతరమ్మనుట; పాపమ్మౌను నేరం బగున్
    హిందూ ధర్మము దూలనాడు ఖలులా హీనాత్ములన్ నమ్ముటే

    రిప్లయితొలగించండి
  35. శా:

    చిందుల్ వేయుచు నెందరో పొరుగు దేశీయుల్ ఘృణాతీ తులున్
    సందున్ దూరిరి భారతావనిని నాశంజేయ నేకంబుగా
    సందేహంబదియేల వీరలకు ఘోషింపన్ సదా నీసు తో
    వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరంబగున్

    నాశం: నాశము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. సందేహమొకింతవలదు
    విందువినోదమ్ములందు విచ్చలవిడిగా
    మందును గ్రోలుచు మత్తున
    వందే మాతర మనుటయె పాపమ్మగురా

    రిప్లయితొలగించండి
  37. సమస్య :-
    వందే మాతర మనుటయె పాపమ్మగురా

    *కందం**

    వందేమాతర మన్నను
    వందల యేండ్లుగ బ్రిటీషు పరిపాలనలో
    నిందింప బడిరి తాతలు
    వందే మాతర మనుటయె పాపమ్మగురా !
    ..........‌‌............✍చక్రి

    రిప్లయితొలగించండి

  38. మందమతుల దుష్చేష్టల,
    మందిరముల, శిల్ప ధ్వంస మాగతి సేయన్
    హిందువులు క్షమను జూపిరి
    *వందేమాతరమనుటయె పాపమ్మగురో?

    రిప్లయితొలగించండి