27, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3321 (కుసుమపత్రంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"
(లేదా...)
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

78 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


నడిరేయి సరదా పూరణ:

ప్రేమను మధ్యదేశమున వింధ్యను వోలు ప్రభుత్వమేలగా
గోముగ జ్యోతి రాజు కడు గొప్పగు రీతిని జంపు చేయగా
భామలు మోదమొందగను భాజప పార్టికి చిహ్నమయ్యెదిన్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

జ్యోతి రాజు = Jyotiraditya Scindia
భామలు = Vasundhara Raje Scindia, Yasodhara Raje Scindia

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

భూములు త్రవ్వుటన్ విడిచి పోడిమి మీర యమేఠి నందునన్
దోమల త్రోలుచున్ ప్రజలు తోరపు గుంపుల చూచుచుండగా
కోమలి రాహులున్ గెలువ; కొట్టుచు డ్రమ్ములు పాడిరివ్విధిన్:👇
“కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

సమస్య :-
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"

*తే.గీ**

త్రాసు లోని కృష్ణుడు తూగు తాడనుకొని
సత్యభామ కనకమంత చక్కబెట్టె
స్వల్పమైన లేవగలేదు చక్రపాణి
తులసి దళముతో రుక్మిణి తూగజేసె
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
..................✍చక్రి

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

కోట్ల జనులకు స్వాస్థ్యముఁ కూల్చివేసి
గడప దాటక నింటయే గడుప జేసి
జగముఁ స్తంభింపజేయఁ చెలగె కరోన
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర౹౹

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(విష్ణుభక్తుడైన విప్రనారాయణుడు వారవనిత దేవదేవికి
వశమైనాడని విన్న పౌరులలో ఒకరు మరొకరితో)
శ్యామలవర్ణుడైన హరి;
సారసనేత్రు;రమాసమేతునిన్
నేమము దప్పకుండ తన
నెమ్మనమందున గొల్చుచుండు నా
ధీమణి- దేవదేవి యిటు
దింపెన మోహపురొంపిలోనికిన్!
కోమలపుష్పపత్రమదె
కొండను జీల్చె;గనంగ జిత్రమే!!
(నేము -నియమము ;ధీమణిన్ -బుద్ధిమంతుని)

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

నేమము

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"నమేఠి"?

pks kumar చెప్పారు...

[27/03, 04:49] PKSKumar: పోతన భాగవతమును సింగరాయ భూపతికిఅంకితము ఇవ్వమనగా శ్రీనాదునితో పోతన పలుకు సందర్భము సీసములో నా పూరణము

ఎవ్వడీ సృష్టికి హేతువాయెను, యే మ
హాత్ముని కుక్షిలొ నబ్ధి నేమి

లీనమై నుండునో, మానవ జాతికి
మూలమౌ కారణము లెచట గను

గొంటినో,, యెవ్వడు, తొంటి,నడుమ,లయ
కారకుం డెవ్వడో ,కరుణ రసము

నాపై గుప్పించి ఘనమగు నీ భాగవ
తామృత సారమ్ము ధరణి లోన

ప్రజలకు నా జేత బంచగ పూనెనో
నాతండు, దశరధ నందనుండు

సీతా సహచరుడు,శ్రీనాధు డర్హుడీ
భాగవతా కృతిన్ పట్టబోవ,

వినుము శ్రీ నాద, పోతన యివ్వ జాలడు
సింగరా యునకును,చెప్పు చుంటి


రాఘ వుండు ఘనుడు రమ్యగతి నిడెద

నంకి తమ్ము నతని కెప్పుడైన

రామ కొలువు నాకు, రాజుల మేటి ద

ర్బారె శరణ మయ్యెపండితులకు
: గురువు గారు నమస్కారం శుభోదయము నిన్నటి పూరణము ఒకసారి పరిశీలించండి

Zilebi చెప్పారు...



మనుజు డారడుగుల పైని మంకుఘటము
మాలిని కనులు రెపరెప మసకలాడె
హత్తుకొనమటంచు ఫలితమాయె పెండ్లి
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర



జిలేబి

BULUSU V S MURTY చెప్పారు...

చైన వదలిన వైరసు మనల చేరి 
కనబడదు కాని జనులను కడకు చేర్చు 
రక్ష లేదు రాజుకు యువరాజు నకును      
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర  

pks kumar చెప్పారు...

[27/03, 05:52] PKSKumar: పిల్ల వానికి నిత్తు ప్రేమతో పాలని శిశువును
ముద్దాడి చీర కప్పి


కంచుకమును తొలగించి కుచము నొక్క
దానిని జొనప‌, పెదవులు తెరచి


మొదటి గుటక వేయ ముదముగ బాలుడు,
కనబడె చుక్కలు కళ్ళ యెదుట,

రెండవ గుటకకు గుండె ఘోషిల్లగా
పూతన ప్రాణముల్ పోయె గాదె

మూడవ గుటక వేయంగ,
తాడి చెట్టు

వోలె కూలె ధరణి పైన, బాల కుడిని

గాంచి జనులు‌ పలికె నిట్లు యెంచి చూడ

కుసుమ పత్రము ఛేధించె కొండనౌర
నేటి శంకరాభరణం వారి‌‌ సమస్య నా పూరణ. సీసములో

Zilebi చెప్పారు...



ఆ మనుజుండు మంకు ఘటమాయెను ప్రేముడి హెచ్చుగానగా
కోమలి కన్బొమల్ ముడిచి కోరిక మీరగ సైగ చేయగా
కాముని వింటి బాణపు ప్రకంపన తాకగ పాణిబంధమున్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే


జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

సంజయుడు.. ధృతరాష్ట్రునితో...

ధీమహితుండు ద్రోణుడు మతిప్రతిభన్ రచియింప నేటి సం...
గ్రామమునందు వ్యూహమును., రాజితధైర్యపరాక్రమక్రమా..
క్రామితపద్మతంత్రునిగ రాజిలు పార్థసుతానురూపమౌ
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
అయ్యపర్ణపై మోహమ్ము నలుము కొనక
వెండికొండవలెన్ శివుడుండె మార!
కొమరుఁ డుదయించు టెట్లని యమరులడుఁగ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర!

vsnmhari చెప్పారు...

ఆమునిబాలుడైన లవు డద్భుతమౌనటు లావనస్థలిన్
నీమముతోడ నశ్వమును నిల్పి గ్రహింపగ జేరు సైన్యమున్
క్షేమము గూలునట్లుగను జేసిన వానిని మెచ్చి రీగతిన్
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్పలమాల
మా మర! తారకాసురుని మార్కొనఁ గల్గు కుమారసంభవ
మ్మే! మన యాది శంకరుడు మిన్నక నుండెను వెండికొండయై
భామ నపర్ణఁ గూర్చెడు వివాహము సాధ్యము నీకనన్ సురల్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!

Sitharamayya Solasa చెప్పారు...

చాలరకముల క్రిములను చంపగలదు
కుసుమపత్రంబు ; ఛేదించెఁ గొండ నౌర
యనుచు నాశ్చర్య పడనేల ! యతి సహజమె
మనకువచ్చు రోగమునొక మలగ తలచ

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

బాలుడీతడైననుగాని భయము లేక
గిరిని తానెత్తి పట్టెను కేలు తోడ
కుసుమ పత్రము ఛేదించె కొండ నౌర
యనుచు గాంచిరి ప్రజలెల్ల రబ్బురమున

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

గర్వ భంగము సత్యకు గల్గి నపుడు
భక్తి తోడ తులసి వేయ ఫలిత మబ్బె
దీని వలనను దెలిసెను ధీజను లకు
కుసుమ పత్రము ఛే దించె కొండ నౌర

gurram.jana@gmail.com చెప్పారు...

దోమ కాటు వలన పెద్ద సామజములె
సమసి పోయెనకట వ్యాధి సంక్రమింప
చెరుప నల్పులె చాలుగా చేటు మూడ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర!


మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

[నరకునితోడి యుద్ధమందు సత్యభామ శృంగారవీరరసయుక్తయై నరక సైన్యమును నుగ్గుసేసిన వైనమును నిట ననుసంధానించుకొనునది]

కోమలి సత్యభామ నరకుం దునుమంగను విల్లునందియున్
దా మురభిత్తునిం గుజుని దందడి శృంగము వీరముల్ దగన్
గోముగఁ గోపిగం గనుచు గొబ్బునఁ జీల్చెను దైత్యమండలిన్!

గోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!

శేషాద్రి సోమయాజులు చెప్పారు...

సూక్ష్మ జీవది జగమెల్ల చుట్టె చూడు
కోట్ల జనులను భయపెట్టి కూకపెట్టె
వినక రోనా విలయంబు వింతగొలిపె
కుసుమ పత్రము ఛేదించెఁ గొండనౌర

కవితా ప్రసాద్ చెప్పారు...

ఏమి సమస్యనిచ్చిరిది యెట్టుల పూరణ సేయనౌనొకో!
భామల వాలుచూపుల ప్రభావము వైరసు వోలె నంగనా
కామము రేగఁజేయుఁ గద! గాధిజు మేనక భ్రష్టుఁ జల్పదే!
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!

Akula shanthi bhushan చెప్పారు...

శంకరాభరణం ...27/03/2020
శుక్రవారం

సమస్య

"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

నా పూరణ
**** **** **

భామిని సత్యభామ తన భర్తని త్రాసున దూచనెంచుచున్

హేమము వేయ బళ్ళెమున నించుకయున్ హరి పైకి రాడొకో

క్షేమ మొసంగు శౌరి తులసీదళ శక్తికి దూగె నబ్రమే!

"కోమల పుష్పపత్రమదె కొండను జీల్చె గనంగ జిత్రమే"

ఆకుల శాంతి భూషణ్
వనపర్తి

Surya చెప్పారు...

ఏమని యందుమీ విలయమిట్టి భయమ్మును గల్గజేసెనే
సేమము దూరమాయె భువి జిన్న విషక్రిమి వల్ల జూడగా
నేమరుపాటునుండిననిదెంతటి కష్టము దెచ్చిపెట్టునో
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

కుసుమ ఉప్పలపాటి చెప్పారు...

రాణి రుద్రమ చెండాడె రౌద్ర మరుల !
ఝాన్శి రాణి శౌర్యము సాటి జాతి గలర ?
అతివ తలచిన ఢీకొను నమిత శక్తి !
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"

విరించి చెప్పారు...

క్షేమము గూర్చమంచు దరి జేర, నమర్త్యుల బాధతీర్చగన్
తామసు డైన దానవుడు తారకుఁ ద్రుంచిన బాలకుండు షో
డాముఖు డైన పావకి మృడాని కుమారుని గాథ తెల్పదే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

subbarao చెప్పారు...

కానిపించదువైరస్సు కంటికకట
వేలకొలదిగ జనములువిగతులైరి
యేమిపాపముజేసితిమేమొ మేము
కుసుమపత్రంబుఛేదించెగొండనౌర

subbarao చెప్పారు...

ఏమనిజెప్పనొప్పుదునునీశ్వర!గావుమయీకరోన,మా
సేమమునూడలాగుటకుజిత్రముగానరుదెంచెనిత్తరిన్
భామలువృద్ధులున్మఱియుపాపలుపోయిరిసోకినంతనే
కోమలపుష్పపత్రమిదెకొండనుజీల్చెగనంగజిత్రమే

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఉగ్ర సంగరమున నాపె నుగ్రుఁ డౌచు
నొక్క దివసమ్ము చెలరేఁగి యక్కజముగ
సింధుపతి భీమసేనాది సింహబలులఁ
గుసుమ పత్రంబు ఛేదించెఁ గొండ నౌర


బీమ బలాఢ్య దేశ తతి భీతిలఁ జేసె సమౌనరాగ కే
ళీ మనుజాంతక ప్రగతి రేఁగుచు విశ్వము నెల్లఁ జంపునా
యేమి కరోనకుక్షికృమి హీన తరాన్య మృదూపజీవియే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

[కర +ఊన కుక్షి కృమి = కరోన కుక్షి కృమి = చేతులు లేని పొట్టగల క్రిమి]

chandrashekhar yelisetty చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
chandrashekhar yelisetty చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
chandrashekhar yelisetty చెప్పారు...

ఉ:

ప్రేమము దెల్ప రాజసుత వీడెను భీష్ముని, సాళ్వ రాజునున్
నేమము మేర, సోమునిగ నెంచి శిఖండిగ మార్పు జెందగన్
కోమలి జేర నర్జునుని కూబరి జంపగ గంగ పుత్రునిన్
కోమల పుష్ప పత్ర మదె కొండను జీల్చె గనంగ జిత్రమే

రాజసుత: అంబ
సోమునిగ: శంకరుని గూర్చి తపస్సు చేయడం తో

వై. చంద్రశేఖర్

కంది శంకరయ్య చెప్పారు...

మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
'వింధ్యను+పోలు' అన్నపుడు సరళాదేశం వస్తుంది. గసడదవాదేశం రాదు. "వింధ్యను బోలు" అనండి. "చిహ్నమయ్యెడిన్" టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
"మీర నమేథి" అనడమే సాధువు.

seethadevi gurram చెప్పారు...

శ్యామలవర్ణుడైన హరి చక్కగనవ్వుచు ప్రేమమీరగా
నేమరుపాటులేక క్రమమేడు దినమ్ములు నొక్కహస్తమున్
దామరపూవువోలె గిరిదాల్చగ గాచుచు గోకులంబునన్
కోమల పత్రపుష్పమదె కొండనుజీల్చె గనంగచిత్రమే!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తూగుతాడు' అనడం వ్యావహారికం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"స్తంభింపజేయఁ జెలగె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
"శ్యామలవర్ణుడౌ హరిని..." అంటే ఇంకా బాగుంటుందేమో?

seethadevi gurram చెప్పారు...

వామనరూపుడై గదిసి వద్దనె స్వర్ణము పాడియావులన్
కామన కొద్దిపాటిదగు గట్టిది క్షేత్రము మూడడుంగులే
క్షేమము నెంచుచున్ భువికిచేర్చె బలిన్ వడి నాగలోకమున్
కోమల పత్రపుష్పమదె కొండనుజీల్చె గనంగచిత్రమే!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాపై గుప్పించి' అన్నచోట గణభంగం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జనులు పలికి రిటు లెంచి చూడ" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం. "విన కరోనా విలయమది వింత గొలిపె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భ్రష్టుఁ జేయదే" అంటే ఇంకా బాగుంటుందనుకుంటాను.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భర్తను... పైకి రాడయో..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారికి నమస్సులు.
లంక వాసులు పోరున లక్ష్మణుడను
మూర్ఛ జేసిరి యంతట మూర్తి మంతు
బల్క,జగతిన విడ్డూర బాహి నందు
కుసుమ పత్రము చేదించె కొండ నౌర.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్పలమాల
కోమలి 'పూలసోయగము' 'కొండ' నుఁ బోలిన నాదుగుండెనే
వేమరు చెప్పినన్ వినక వెఱ్ఱిగ లాగెనటన్న కీచకున్
దా మరులొల్కి మాలినియె నర్తన శాలకుఁ బిల్వఁ 'జీలె' నే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!

seethadevi gurram చెప్పారు...

ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పద్మదళములకెనయగు పడతికనులు
కనులుకావవి పదునగుకత్తి మొనలు
మొనయ మోహము చెలికాని మోముఁగనఁగ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కోమలివాలుకన్నుగవ కోలుమసంగినమారు తూపులే
గోముగనోరకంటగనగుండెగుభిల్లనునేరికైననా
మోమున పద్మపత్రములె మోదముగూర్చెడు నాపె చూడ్కులా
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"కోమల పుష్పపత్ర మదె కొండనుఁ జీల్చెఁ
గనంగఁ జిత్రమే"

సందర్భము:
శక్తి స్వరూపిణి కినుక వహిస్తే యుక్తులు పని చేస్తాయా!
సుమ సుకుమారియైన సీత త్రికూట పర్వతం మీదున్న లంకా పట్టణాన్నే పీనుగు పెంట గావించింది. అంటే పర్వతాన్నే ఛిన్నాభిన్నం చేసివేసింది. ఇది చాలా విచిత్రం. అనూహ్యం. మనకు అనూహ్యమైన విషయాలన్నీ విచిత్రాలుగానే భాసిస్తూ వుంటాయి. లేదా ఘోరాలుగా భయపెడుతూ వుంటాయి. దానికి కారణం ఆ విషయాలు కావు. ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయిన మనమే! అలా వెళ్ళడానికి కారణం మన అహంకారం.
అహంకారాన్ని వంచనను ద్వేషాన్ని చేజేతులా పెంచి పోషించి అవి తీరా నెత్తి నెక్కి తైతక్క లాడుతుంటే ఇంక పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మవలన చావు లేని వరాలు పొందిన రావణు నంతవాడినైనా ప్రకృతి వదలిపెట్టే ముచ్చటే లేదు. (నేటి చైనాలాగా)
ప్రకృతి.. మాత లాంటిది. అందుకే ప్రకృతి మాత.. అన్నారు. అది ప్రేమ పంచి జీవితా న్నిస్తుంది. దానిని సవతి తల్లిలాగానో రాక్షసిలాగానో మనమే తయారు చేసుకుంటే ఘోర పతనం మన వెనుకనే పొంచి వుంటుం దన్నది యథార్థం. మాయా స్వరూపిణి యైన ప్రకృతికి అసాధ్యం లేదు.
*ప్రకృతి వికృతి యైతే పతనమే గతి*
యౌతుం దన్న సారాంశాన్నే సీతాపహరణం రావణపతనం అనే సంఘటనల ద్వారా రామాయణం ఎన్నడో మన దేశానికి బల్లగుద్ది చెప్పింది. (వేరే దేశాల సంగతి వేరు.)
కోమలమైన పుష్పం చీల్చి వేయా లనుకుంటే కొండనైనా చాలా చక్కగా చీల్చి వేస్తుంది. అది చిత్రమే కాదు సుమా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*ప్రకృతి వికృతి యైతే..*

కోమల పుష్ప పత్ర సమ,
కోమలి సీతమ యా త్రికూట మన్
శ్రీ మహనీయ శైలమునఁ
జెల్వగు లంకకుఁ జేటు దెచ్చె నౌ
రా! మరి యేమి చెప్పవలె?
రాదు తలంప, వచింప నేరికిన్
గోమల పుష్ప పత్ర మదె
కొండనుఁ జీల్చెఁ.. గనంగఁ జిత్రమే!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.03.20
-----------------------------------------------------------

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

మిస్సన్న చెప్పారు...

భామవు చేయ సంగరము వచ్చితివా యిటు చూడు మాడగా
ప్రేమపు క్రీడలన్ రయమె వీడి శరమ్ముల చేర రాగదే
కామిని యన్న రక్కసుని కాలుని చెంతకు నంపె దుర్గయై
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే?

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నీమముఁ దప్పనీక కడు నిశ్చల బుద్ధిఁ తపంబు జేయుచున్
ధామము వీడి శీతనగధామము జేరెను శైలపుత్రి యా
ప్రేమకు శంకరాచలము భిన్నముజెందె సురాళి మెచ్చెనే !!
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ప్రసిద్ధ అవధానులు శ్రీ నరాల రామారెడ్డి గారి సూచన మేరకు సవరించిన పూరణ :

ఉత్పలమాల
ఓ మధుసారథీ! యసురు నుక్కడఁగించు కుమారసంభవ
మ్మే! మన యాది శంకరుడు మిన్నక యుండెను వెండికొండయై
భామ నపర్ణఁ గూర్చెడు వివాహము సాధ్యము నీకనన్ సురల్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

పొరుగు దేశము నందున పుట్టి నట్టి
చిన్న కీటకమ్మది యింత చేసె హాని
*కుసుమపత్రంబు ఛేదించె గొండ నౌర*
దైవ లీలల నెన్నంగ తరమె భువిని.