28, మార్చి 2020, శనివారం

శార్వరి ఉగాది పద్య సంకలనము

        నిన్న ప్రకటించిన ఉగాది పద్య సంకలనం అందరికీ ఆనందాన్ని కలిగించింది. సామూహిక భాగస్వామ్యంతో పుస్తకంగా ముద్రించాలని అందరి కోరిక. ఈ కరోనా వ్యగ్రత తొలగిన తర్వాత అలాగే చేద్దాం. ఇప్పుడు తొందర లేదు.
        అయితే ఇప్పటి పి.డి.యఫ్.లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. కొందరు పంపిన ఉగాది పద్యాలు నా అజాగ్రత్త వల్ల తప్పిపోయాయి. మరికొందరు "అయ్యో... మాకు తెలియదండీ. ఇప్పుడు పంపించమంటారా?" అని అడిగారు.
        ఎలాగూ పొరపాట్లు సరిచేసి శుద్ధప్రతిని సిద్ధం చేయబోతున్నాను కనుక తప్పిపోయిన కవిమిత్రులు తమ ఉగాది పద్యాలను పంపించ వలసిందిగా కోరుతున్నాను.
        మీ పద్యాలను shankarkandi@gmail.com అన్న చిరునామాకు మెయిల్ చేయండి. లేదా నా వాట్సప్ నెం. 7569822984 కు పంపించండి.

9 కామెంట్‌లు:

  1. చాలా మంచి ప్రయత్నం గురువుగారూ! నా పద్యాలా పిడియఫ్ లో కనిపించాయి.....దానికెంత ఖర్చైనా అందరమూ భాగస్వాములమవుదాం -
    _/|\_

    రిప్లయితొలగించండి
  2. నేను పంపించినవి వున్నాయో లేదో నాకు తెలియలేదు గురువుగారూ ! తెలియజేయగలరు 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీరు పంపిన ఐదు (మధ్యాక్కర, మహాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కర) పద్యములు ఉన్నవి


      👌

      తొలగించండి
  3. అప్పుడు రాయలేని వారికి ఇప్పుడు రాసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు అన్నయ్యగారు.ఎన్ని పద్యములు పంపవచ్చునో తెలుపగలరు

    రిప్లయితొలగించండి


  4. నెనరుల్స్ పంపించినాము


    బ్లాగులో పెడితేనో లేక పీడీయెఫ్ లో పెడితేనో బెటరు ప్రింటు పుస్తకంగా చదివేవారుంటరంటారా ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కంద పద్యం :
    కవి వరులిందరు కూర్చిరి
    చవులూరు పదప్రయోగ ఛందో రీతుల్
    కవనపు సవనము సాగెను
    భువన విజయవైభవముల పులకలు పొడమన్ !!

    రిప్లయితొలగించండి