1, జూన్ 2020, సోమవారం

సమస్య - 3386

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శవపూజ లొసంగును శుభసంతోషములన్"
(లేదా...)
"శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే"

48 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కవులున్ లేమలు హైద్రబాదు నగరిన్ గాఢంపు బిర్యానినిన్
    పవలున్ రాత్రియు మెక్కుచున్ బలుపుగా వంకాయ బజ్జీలునున్
    లవలేశమ్మును సిగ్గు వీడి తనరన్ రాకాసి కాయంబనన్
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    రిప్లయితొలగించండి
  2. అవగడములు కలిగించెడి
    శవ పూజలు కో రుచుండు జంతువుల బలిన్
    అవిరామము జేసెడి కే
    శవపూజ లొసంగును శుభసంతోషములన్

    అవగడము = కీడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'బలిన్+అవిరామము' అని విసంధిగా వ్రాయరాదు. "జంతు బలులనే । యవిరామము..." అనవచ్చు కదా!

      తొలగించండి

  3. నా పూరణ. మత్తేభము
    **** **** ***

    భవ పాథోనిధి నీద శక్యమగు నా పద్మాక్షునిన్ గొల్చినన్

    శివముల్ కూర్చియు బ్రోచు వేడ మదినిన్ శ్రీనాథునిన్ భక్తిచే!

    పవలున్ రాత్రియు శ్రద్ధ దల్చ హరియే పాలించడే? దివ్య కే

    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే"



    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా అంతరంగము:

    పవలున్ రాతిరి భారతీయ భటులే ప్రాశస్త్యమౌ తీరునన్
    భువిలో ధీరుడు వీరుడన్ వెలిగెడిన్ మోడీని ధ్యానించుచున్
    చవటల్ కాకయె చంపుచున్ విరివిగా జంబంపు చీనీయులౌ
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    రిప్లయితొలగించండి


  5. తవణించు వేళ యిదియే
    గవతంబాయెను కరోన కారణముగ మా
    నవుల బతుకులు సుమా! కే
    శవ! పూజ లొసంగును శుభసంతోషములన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. శివనామామృతగానము
    నవదుర్గాంబలకుబెట్టునైవేద్యంబుల్,
    నవవిధమార్గపుశివకే
    శవపూజ లొసంగును శుభసంతోషములన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి

  7. కాలమిదియె ధ్యానమునకు !

    అవకాశమ్మిదియే! కరోన కరణంబాయెన్ సుమా యెల్లరున్
    గవతంబయ్యిరి మానవాళి ప్రకృతిన్ కాపాడకన్ బోవగా
    ను! వరంబాయె మరో విధమ్ముగ సుమా నుంపారగా నర్చ, కే
    శవ! పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే



    జిలేవి

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. నవరాత్రి తొలిదినమున శి

    వ లలిత రూపిణిగ నుద్భ వమ్ము‌ బడయ గా

    శివమను కోరి పరచు శై

    శవ పూజలొసంగును శుభ సంతోషములన్

    రిప్లయితొలగించండి
  10. కం//
    భవునికి భస్మము కొరకున్
    శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !
    అవనిన నుజ్జయనీశుడె
    నవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!

    రిప్లయితొలగించండి
  11. అవమానంబని తెలుపుచు 
    ఎవరును పోకూడదనెడు ఎకసక్కెములన్  
    చెవి పెట్టక చేసిన కే  
    శవపూజ లొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    🕉నమో నారాయణాయ🙏🙏💐🌷

    అవధుల్ లేని మహత్వపూర్ణమగునా యష్టాక్షరీమంత్రమున్
    వ్యవధానంబిసుమంత లేక మదిలో వల్లించి వల్లించి., త...
    త్స్తవముల్ జేయుచు నిత్యకృత్యముల., భక్త్యావిష్టులై మ్రొక్కు కే...
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  13. నవ విధ భక్తిని గొల్చుచు
    కువలయ మందలి జనతతి కోరిక తోడన్
    భవ బంధ నాశు డగు కే
    శవ పూజ లొసంగును శుభ సంతోష ము ల న్

    రిప్లయితొలగించండి
  14. శివమున్ గోరుచు నిత్యము
    భవభయ హరులంచు జనులు వాసిగ నమ్మే
    యవనిని బ్రోచెడు శివకే
    శవపూజ లొసంగును శుభ సంతోషములన్

    రిప్లయితొలగించండి
  15. సవితృడు నక్రగతుండగు
    పవిత్ర సంక్రాంతి మనకు పర్వదినము! రెం
    డవ దినమౌ కనుమను పా
    శవపూజ లొసంగును శుభసంతోషములన్!

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తివురును చెందని విధమున
    పవిదగు భక్తిని నిరతము పరిశుద్ధుడవై
    పొవడుచు ఘటించు శివ కే
    శవ పూజ లొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి
  17. భవనాశమ్మొనరించువాడనుచు విశ్వాసమ్ముతో భక్తులే
    శివమున్ గోరుచు భోగముల్ విడిచి సచ్చీలుండ్రుగా నిత్యమున్
    దవిషమ్మే తనవాసమై భుజగమే తల్పమ్ము గాగల్గు కే
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    రిప్లయితొలగించండి
  18. అవిరళభక్తినొనరుకే
    శవపూజలొసంగునుశుభసంతోషములన్
    శివపూజజేయునెడలను
    భవబంధములెల్లదొలగిభగముంగలుగున్

    రిప్లయితొలగించండి
  19. నవనీ తోపమ సు మనో
    వివశత నిత్యామర వర వేష్టిత జగతిన్
    వివిధ వ్యథోపశమ నా
    శవ పూజ లొసంగును శుభసంతోషములన్

    [ఆశవము ==శీఘ్రత]


    అవనీదేవుల సంయమీశ్వరుల హృద్యానంద సంధాయ కై
    క వరాభ్యర్చనలన్ రమా కుధరజా కాంత ప్రశంసాలి స
    న్నవ గానామృత తృప్త చిత్తమున సద్భక్తిన్ గవాహ్యాది పా
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    [నవము =స్తోత్రము; గో+అహి+ఆది = గవాహ్యాది; పాశవము = పశువులకు సంబంధించిన]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 26/6/2016 నాటి సదృశ పూరణములు: (అరసున్నలు, ద్రుత సంధి సవరించి)

      అవనీ భారము దీర్పఁ బుట్టు నిల మాహాత్మ్యంబునన్ విష్ణువే
      సవనాధీశుఁడు లోకపాలకుఁడు తత్సన్నామ సంకీర్తనల్
      భవతోయాంబుధి దాట నావలట సంప్రాప్తింప నిత్యమ్ము కే
      శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!


      సవనమ్ము లేల సేయఁగ
      భవసాగర మీద గాఢ భక్తిని హరినిం
      గవనములఁ బొగడ నగుఁ గే
      శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్

      తొలగించండి
  20. భువిపైపుట్టుచు పూర్వజన్మపు ఫలమ్మున్ పొంద కర్మమ్ముచే
    చవిగొంచున్ పలుహీనమౌ పనుల నీచమ్మైన సంతృప్తికై
    యవసానమ్మున ముక్తిఁ గోరుకొని పద్మాక్షుండు దైత్యారి కే
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    రిప్లయితొలగించండి
  21. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ 😄
    ( *e-తరగతుల ఎఫెక్ట్* )

    *కం|*

    చివరకు జెప్పిన దిది కే
    *"శవ పూజ లొసంగును శుభసంతోషములన్"*
    నెవరది పలికెనిటుల ఛీ
    *"శవపూజ లొసంగును శుభసంతోషములన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😄🙏

    రిప్లయితొలగించండి
  22. శివుఁడునుకేశవుడిరువురు
    భవనాశకులుర్వియందుభావింపంగా
    నవిరామముగా శివకే
    శవపూజ లొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి
  23. భవుడున్ కేశవులిర్వురొక్కటిగసంభావించు భక్తాళికిన్
    భవనాశంబగునిక్కమీ పలుకు సంప్రాప్తించు మోక్షంబు కే
    శవుడే శర్వుఁడు శర్వుడే యజుఁడుసంసారార్ణవోద్ధారి కే
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే

    రిప్లయితొలగించండి
  24. అవనిని కరోన రేగగ
    భవభయ హరుజేరి కొలువ బాయును కదరా!
    లవలేశమైన శివ, కే
    శవపూజ లొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి
  25. సవనంబులు వలనుపడం
    బవిరళ తపములొనరంగ నల్పాయువులౌ
    తవ భక్తులకు కలిని కే
    శవ పూజలొసంగును శుభ సంతోషంబుల్

    సవనంబుల్ దగజేయలేరు తమినిన్ శ్రద్ధాళులై యొప్పుగా
    నవిరామంబగు సంయతిం సలుపగా నల్పాయువుల్ మానవుల్
    తవ నామంబును భక్తితో బలుకుచున్ ధర్మాత్ములై నిత్య కే
    శవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరే !

    రిప్లయితొలగించండి
  26. కందం
    ఎవరిఁ గొలిచి కనక కశిపు
    నవగడముల దాటె భక్తుడౌ ప్రహ్లాదుం
    డవలీలన్ దగ, నా కే
    శవపూజ లొసంగును శుభసంతోషములన్


    మత్తేభవిక్రీడితము
    శ్రవణీయంబుగ శ్రీహరిన్ గొలిచెడున్ ప్రహ్లాదుపై క్రోధియై
    పవలున్ రేయియు మాననెంచుమనుచున్ బాధించినన్ దండ్రియే
    స్తవముల్ జేయుచు మాధవున్ గెలిచి తా సాధించె సంతృప్తి కే
    శవ పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే!

    రిప్లయితొలగించండి
  27. శివునికి హరికిని బేధము
    లవలేశము లేదు నరయ రక్షణ నిడగన్ |
    నవతలు తొలగగ శివకే
    "శవపూజ లొసంగును శుభసంతోషములన్"

    రిప్లయితొలగించండి
  28. శ్రీలక్ష్మీ నారసింహాయనమః
    తేది:01.06.2020.
    మహోదయులకు వందనములతో,శుభోదయం.
    నేటి సమస్యాపూరణ ప్రయత్నం -

    భవబంధమోచనంబీ
    భువిసర్వసుఖంబు లంద బేర్మిసుహృది స
    ద్భావమలరంగ యాకే
    శవపూజలొసంగును శుభసంతోషములన్.

    కవనోత్తుంగతరంగశీకరము లుత్క్రష్టాభిభావంబుతో
    స్తవనీయంబగు నక్షరాంజలుల ప్రస్తావంబుసల్పందగన్
    నవమోహంబగు సుందరాకృతుని నాన్యంబౌ తలంపుండ కే
    శవపూజాభిరతుల్ శుభంబు గనరే, సంతోషముంబొందరే

    రిప్లయితొలగించండి
  29. మ:

    అవతారమ్ము నఘోర వేశమున నావాహింప యాత్రాగతిన్
    కవియించన్ తమ టక్కు చేష్టలన బాకానూదుచున్ దీవెనల్
    ద్రవిణమ్మున్ సమకూర్చ నీచముగ నేదారైన నర్తింప నై
    శవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. నవదుర్గాంబలుశక్తిరూపమగుసన్మాత్రల్విశేషంబునై
    శివసంకల్పముభక్తిరూపమునశ్రీచిద్రూపదైవంబునై
    నవమార్గమ్ములరాగధారలన,శ్రీనామంబునానందకే
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  31. భవ బంధనముల జిక్కిడి
    శివుడని కేశవుడని మది చింత యదేలా
    ధ్రువముగ నొకటౌ శివ కే
    శవ పూజ లొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి
  32. సరిజేసితిని గురూజీ ! 🙏
    కం//
    భవునికి భస్మము కొరకున్
    శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !
    అవనిని నుజ్జయనీశుడె
    నవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!

    రిప్లయితొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    [తమ దీనస్థితిని బాల్యమిత్రుఁడగు కేశవున కెఱింగించి, తగిన ధనసహాయము నొందుఁడని కుచేలునకు నాతని భార్య హితవు బోధించిన సందర్భము]

    భవదీయాంచిత బాల్యమిత్రుని హరిం బ్రార్థించి, యర్థించుచో
    స్తవనీయుం డిఁక నీదు దైన్య గతికిం దా నోర్చునే? వేగమే
    సవయస్కున్ నినుఁ జేరఁదీసి, విభవత్సౌఖ్యంబిడుంగాదె? కే
    శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?

    రిప్లయితొలగించండి
  34. భవ బంధములను బాపును
    శివమున గూర్చు ననయమ్ము సేవించినచో
    జవమును చేసిన శివకే
    శవపూజలొసంగును శుభసంతోషములన్

    రిప్లయితొలగించండి