3, జూన్ 2020, బుధవారం

సమస్య - 3388

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై"
(లేదా...)
"రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో"

34 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    రాముడు లక్ష్మణుండు కడు రాక్షస వీరుల దున్ముచుండగా
    ధీమతి వోలె కన్పడక ధీరుల వీరుల మభ్యపెట్టుచున్
    గోముగ మేఘనాదుడట గోలను సైచక;...వేచియుండగా
    రాముఁడు;...గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రాముని వేషమేయుచును రాహులు బాబయె రామలీలలో
    గోముగ జంద్యమూనుచును గొప్పగ కూయుచు కేకలెన్నియో
    దోమలు కుట్టగా మిగుల తోషము వీడుచు దిక్కుతోచకే...
    రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో

    రిప్లయితొలగించండి
  3. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.
    తేది:03-06-2020.
    మహోదయులందరికీ శుభోదయం.

    నేటి సమస్యాపూరణాల యత్నం -

    ఏమోదముకొర ? కే ?ల
    క్ష్య మాకాంక్షించి ? యెట్లు? సారపు ధర్మ
    మీమాంసము సు మి!దేలన్?
    రాముడు గోతులను దునిమె, రావణ హితుడై.


    ఏమగునో? విచారవదనీయుడు కూర్చొని సావకాశుడై
    రాముని యుద్దముం గెలుతు రామపరాజయ మింకనిశ్చయ
    మ్మే !మది లోచనాంబుధి సమేతుడు స్వప్నముం జూసెనిట్లు శ్రీ
    రాముడు గోతులం దునిమె రావణు నెయ్యము గోరి యాజిలో


    రిప్లయితొలగించండి


  4. మామా శకారుడా ర
    మ్మా! మా గురువుల కొరకు ఘుమ ఘుమ జిలేబీ
    లా మాంఛి పలుకు చెప్మా ;
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై



    జిలేబి

    రిప్లయితొలగించండి

  5. కందోత్పల

    "ధుమధుమ కోపము కాగ త
    నిమ, రాముఁడు గోతులందునిమె రావణు నె
    య్యముఁ గోరి యాజి లో" పలి
    కె మా కెడ శకారుడేను కెలుక జిలేబీ


    తనిమ- విస్తారము ఆంధ్ర భారతి ఉవాచ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గురుభ్యో నమః

    కం

    కామకుడై పరభామగు
    భూమిజ కాశపడిలొంగ దీయమదముతో
    కోమలి సీతకు చెప్పగ
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై!


    రిప్లయితొలగించండి


  7. రాముడు మాకు దైవము పరాత్పరుడాతడు ! శోభలొల్కగా
    నీ మది లోని భావనల నిప్పుడె తెల్పుచు తేనెలూరగా
    మామ! శకార! పల్కవలె మంచిగ మాటయు! చెప్పె నాతడే
    "రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. కం//
    ధామము వీడెను మతిచెడి
    రాముఁడు, గోతులను దునిమె రావణ హితుఁడై !
    కామాంధ కుంభకర్ణుడు
    రామునితో పోరు సలిపి రాలెను భువిపై !!

    రిప్లయితొలగించండి
  9. ప్రాముచుఁ గాల్సేతులతో
    నాముకొనిన కుంభకర్ణుఁ డసురులలోనన్
    భీముడు, సంయన్మహదభి
    రాముఁడు, గోతులను దునిమె రావణ హితుఁడై

    రిప్లయితొలగించండి
  10. గోముగ రామాయణమును 
    నీమముతో చదువుచుండు నిష్ఠాపరుడే  
    ఏమరుపాటున పలికెను 
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై  

    రిప్లయితొలగించండి
  11. కామమునాదిగాగలుగుఁగారకఁగోతులనేమిజేసెనో?
    ధీమతనంగదున్బనిచిదీరుగరావణునేమిగోరెనో?
    క్షేమము రక్షణార్థమన క్షీరముఁబంచగనాతడేవిధిన్?
    రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  12. పామరులైనను పలుకరు
    "రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై
    నీమముచెడి" యనుమాటలు
    రాముడుగోతులనుగూడిరావణుదునిమెన్ !

    రిప్లయితొలగించండి
  13. కామము వీడి ధర్మమును గానుచు సీతను తిప్పిపంపగా
    ధీమతి యా విభీషణుఁడు దెల్పెను
    వేడుమటంచు, గాచు నా
    రాముఁడు; గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో
    తామిక యన్నమాట జవదాటక జచ్చెను కుంభకర్ణుడే.

    రిప్లయితొలగించండి
  14. నేమము తప్ఫి దుర్మతుల నీడను జేరిన వాడొకండు తా
    భామినితోడ గూడి సురపానము జేయుచు మత్తులో నటన్
    క్షేమము వీడి వాగెనట ఛీయని పెద్దలు చీత్కరింపగా
    రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో.

    రిప్లయితొలగించండి
  15. కోమలి రక్షింప కదిలె
    రాముఁడు, గోతులను దునిమె రావణ హితుఁడై
    భీమర మందున నా సు
    త్రామదమనుడు చెలగుచు ప్రతాపముఁ జూపెన్.

    సుత్రామ దమనుడు= ఇంద్రుని యోడించినవాడు మేఘనాదుడు.

    రిప్లయితొలగించండి
  16. భూమిజ రక్షింప వెడలె
    రాముడు : కోతులను దునిమె రావణ హితుడై
    తామసుడు కుంభకర్ణుడు
    బీమ పరాక్రమము జూపి విగతుండయ్యె న్

    రిప్లయితొలగించండి
  17. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య


    రాముడు కోతులను దునిమె రావణ హితుడై


    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో



    సుగ్రీవుడు భార్యలతో సరస సల్లాపములలొ మునిగి రామ కార్యమును మరచి పోతాడు అప్పుడు రాముడు లక్ష్మణుని పంపుతాడు. సౌమిత్రి క్రోధముతో అంత పుర గవాక్షమందు నిలుచుని ధనుష్టంకారము చేస్తాడు. వేగుల వారి ద్వారా విషయముతెలుసుకొని సుగ్రీవుడు భయ కంపితుడు అయిన సమయములో భార్య తార అతనిని అనునయించి పలుకు సందర్భము.
    ( రావణ హితుడు రు+ణిచ్+ల్యుట్, రావయతి భీషయతి శత్రూన్ శత్రువులను భయపెట్టువాని హితుడు అన్న అర్ధములొ వాదబడినది)





    వాగ్దానము మరచె వానర భూపతి,
    సీత జాడ కొరకు సింగి ళీక


    ములను పనుచు కుండె మూర్ఖ సుగ్రీవుడు
    ననుచు కినుక కల్గి ధనువు దాల్చి


    కోదండ(రాముడు కోతులను దునిమె,
    రావణ హితుడై)న రామ చంద్రు


    కార్యము మరచిన కలుగు జాతి క్షయము
    ననెడొక పీడక లనుకనుగొని


    తిని కపివరా యుదయమున , ధనువు దాల్చి

    రౌద్ర రూపియై నడుగిడె లక్ష్మణుండు,

    నుచిత రీతిగ పలుక మనుచు తెలిపెను

    తార సుగ్రీవుని బెదురు తనము కాంచి




    రిప్లయితొలగించండి
  18. ప్రేముడి సాయము గోరెను
    రాముడు గోతులను,దునియె రావణ,హితుడై
    భూమి భరము తగ్గించె ద
    నే ముందు తరముకు సరగు నేలిక జూపెన్.

    రిప్లయితొలగించండి
  19. భూమిజకై సాయమడిగె
    రాముఁడు గోతులను; దునిమె రావణ హితుఁడై
    దామసమున వానరులను
    యామిగొనుచు కుంభకర్ణుడాలమునందున్

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. క్షేమము నొసగను లంకకు
    ధామముతో ఇంద్రజిత్తు తగవుకు తరలెన్
    ధూముతొ కలవర మొందను
    "రాముఁడు, గోతులను దునిమె రావణ హితుఁడై"

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. నీముని, విభీషణు నిలిపె
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడ
    య్యామొనను కుంభకర్ణుడు
    తామరిగి రమరపురికిక తామసులగుటన్.

    మొన-యుద్ధము.

    రిప్లయితొలగించండి
  24. పామరుడొకడిట్లనియెను
    రాముడుగోతులనుదునిమెరావణహితుడై
    రామాయణకధవినియును
    నేమరుపాటుగలిగియనెనిట్లుగగడిమిన్

    రిప్లయితొలగించండి
  25. పాఠ్య పుస్తకాలలో చరిత్ర మార్పు అనే చర్చఆధారముగా:

    ఉ:

    గోముఖ వ్యాఘ్రముల్ భరత గోళమునందున రాజ్య కాంక్ష తో
    స్కాములు జేయుచుండిరట సాక్షము లెల్లను రూపు మాపుచున్
    తాముగ మార్చుచున్ చరిత, తప్పును నొప్పుగ జెప్ప నిట్టులన్
    రాముడు గోతులన్ దునిమె రావణు నెయ్యము గోరి యాజి లో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. ఏ మనఁ దగు నాగడముల
    సామర్షాత్ములు కలియుగ సంభవు లుభయుల్
    భీమ బలాఢ్యులు దుష్టులు
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై

    [గోతి = స్త్రీ]


    భూమిభృ దింద్ర సన్నిభుఁడు భూమిజ భర్త నరోత్తముండు నా
    కోమలి సీత రక్షణకుఁ గోపమునన్ శిబి రార్థ రక్తినిం
    దామరసాక్ష యుగ్ముఁ డటఁ ద్రవ్వి సమర్కట కోటి లంకలో
    రాముఁడు గోతులం, దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో

    [నెయ్యము = ఇంపు]

    రిప్లయితొలగించండి
  27. రాముడుగోతులందునిమెరావణునెయ్యముగోరియాజిలో
    రాముడుగోతులందునీమెవ్రాయగనిట్లుగబాడియేయికన్
    రాముడుయుద్ధరంగమునరావణునెయ్యముగోరెనా?భళా
    రాముడుసంహరించెననిరాక్షసమూకనురావణున్గదా

    రిప్లయితొలగించండి
  28. సామపు మాటలన్ వినక సంధి త్యజించుచు రావణుండు సం
    గ్రామము చేయగా తలచి గర్జన చేయగ, వేగ దింపి శ్రీ
    రాముఁడు గోతులం, దునిమె రావణు. నెయ్యముఁ గోరి యాజిలో
    భూమిని వీడి దైత్యుడల పోవగ చెచ్చెర మాఱుజన్మకున్

    రిప్లయితొలగించండి
  29. కోమలి జానకి కోసము
    రాముఁడు, గోతులను దునిమె రావణ, హితుఁడై
    రామకు విభీషను(డు, సం
    గ్రామములంకన, ధరణిజ-రాము(డు గలిసెన్

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందఱకు నమస్సులు!

    [రావణుని వీరభటులలో శ్రేష్ఠుఁడౌ నొకఁ డింద్రియలోలుఁడు, స్వామికార్యమొనర్తునని పలికి, యుద్దరంగమునఁ గ్రోఁతిమూఁకను దునుమాడిన సందర్భము]

    భీమపరాక్రమోన్నతగభీరవచోవిలసన్నిశాచర
    గ్రామణి యొండు రావణుని కార్యమొనర్తునటంచుఁ బల్కి, సం
    గ్రామ నివేశమందు, హరిగర్జన సేయుచు, దుష్టుఁ డింద్రియా

    రాముఁడు, గోతులం దునిమె, రావణు నెయ్యముఁ గోరి యాజిలో!

    రిప్లయితొలగించండి
  31. చామను గన నాతురపడె
    రాముఁడు ; గోతులను దునిమె రావణ హితుఁడై
    పామర రాక్షసు డొక్కడు
    నీమముగనె లంకలోన నెక్కొనె రెండున్

    రిప్లయితొలగించండి
  32. కందం
    భూమిని పుట్టిన రాముడుఁ
    గాముక రావణునడంచె కపిసేనలతో
    నేమరి పలికితిరో? యే
    రాముఁడుఁ గోతులను దునిమె రావణ హితుఁడై?

    ఉత్పలమాల
    భూమిని పుట్టి రాఘవుడు ముప్పుగ మారగ కోతిమూకతో
    కాముక రావణాసురుని కాష్టము కాలె నిరంతరాయమై
    యేమని జెప్పుచుంటిరయ! యేమరి పల్కిన పల్కులేమొ? యే
    రాముఁడుఁ గోతులన్ దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో?

    రిప్లయితొలగించండి