6, జూన్ 2020, శనివారం

సమస్య - 3391

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"
(లేదా...)
"రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్"

36 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒకానొక యవధానమున ధారణము పూర్తికాఁగనే, సంతోషమునఁ బంచె దులుపుకొనుచు నొక యౌత్సాహికుఁడు పైఁకి లేచిన సందర్భము]

    గుణయుత సద్వధానమునఁ గూర్చొనియుండిన సద్వధాని కా
    రణయుత పృచ్ఛలన్నిటికినిఁ గ్రక్కునఁ బద్దెములన్ని సెప్పి, పూ
    రణము మనోజ్ఞరీతిఁ గడు రమ్యత నన్నియు నొప్పగించె! ధా
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్!!

    రిప్లయితొలగించండి


  2. పణముల దండిగ దింప వి
    పణివీథి మెరుగపడంగ బాజారున తో
    షణముక నబడెను ! నేటికి
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్!


    :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. తృణధాన్యములందలిపో
    షణసామర్థ్యమునుగూర్చి సభలో తెలుపన్
    గుణదోషములనువిని వివ
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్

    రిప్లయితొలగించండి


  4. కందోత్పల :)


    పణముల దండిగ దింప గ
    ణన రణము సమాప్తమైన ననురక్తుఁడు లే
    చెను బంచె దుల్పుచున్ వ
    చ్చిన కాసులెమేలనుకొని చీర్సనుకొనుచున్ :)


    అమెరికా మార్కెట్టు ఆకాశమెక్కె :)/సోమవారము ముంబై మార్కెట్టు గాలిలో తేలును :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. గుణయుతశంకరార్యకవికోవిదు డోర్మి తగన్ సమస్యలన్
    రణవిధపూరణమ్మునకు రండని బిల్వగ సత్కవీంద్రు డా
    క్షణమున పూర్తి జేసి సరసమ్ముగఁ దాఁ దెలవారుజాము పూ
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి పూరణ

    దానవదుర్మదాంధులను ధర్మము వీడి చరించు వారలన్
    బూని వధించి సాధుగుణపుణ్యులఁ గావగ కృష్ణుడయ్యెడన్
    మానుగ శైశవాప్తమహిమన్ శకటుం బరిమార్చ నత్తరిన్
    దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"

    రిప్లయితొలగించండి
  7. ఫణి యొక్కటి కంటపడగ 
    వణకుచు భయమున పరుగిడు వైనము తెలియన్ 
    మణి ధైర్యము చూపి దునుమ 
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ 

    రిప్లయితొలగించండి


  8. ఔరా ! ఇవ్వాళ జీపీయెస్ వారి సరదా పూరణలింకా రాలేదేమిటి ?


    రిప్లయితొలగించండి
  9. గణగణ బడిగంటకు శి
    క్షణ నేటికి ముగిసెనంచు ఛాత్రుడు తా, త
    క్షణమే సంచిని సర్దుచు
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.

    రిప్లయితొలగించండి
  10. అణువును దడ బడ కుండగ
    చెణుకులు విసురుచు సభికులు సెహ బాసన గా
    మునుకొని యవ దాన పు పూ
    రణము ముగిసిన దనుచు నను రక్తుడు లేచెన్

    రిప్లయితొలగించండి
  11. అణిమాగరిమాలఘుమల
    గుణగణసంయుతులుజేరిగూర్చినసభనై
    ఘనమవధానపుసభ,ధీ
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  12. గణపతి నవరాత్రులకై
    పణమును గైకొంచు వేయ పందిరి నచటన్
    పణబంధము చేసికొని క
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.

    రిప్లయితొలగించండి
  13. గణితము నేర్పువాడె పలు కావ్యములన్ రచియించె, వాడె నే
    డణుకువతోడ నచ్చట మహాద్భుత రీతి వధాన మొక్కటిన్
    దొణకక చేసెనాతడు ప్రదోషము నందు బుధుల్ నుతింప ధా
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్

    రిప్లయితొలగించండి
  14. గణయతులట్లు ప్రాసముల కట్టడి మీరక, సద్వధానవి

    స్ఫురణముఁ గొల్పురీతి,నుడిసోయగము ల్విలసిల్లు భంగి,ధా

    రణ తడ వొందనీక, యవధానసమస్యల నెల్ల రమ్యపూ

    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్‌

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    --------------------------------

    దానవదుర్గుణంబులను దాల్చిన వాడెవ డైననున్ సరే
    మానుష భోక్తయౌను | మును , మౌనిసతీమణి మానభంగమున్
    దానొక కుక్కుటం బగు చొనర్చె - సురేంద్రుడు | తాపసి వీక్షసేయగా
    దానవరూపియై విడిచె , దానవరూపము దానవుండటన్ !

    ( మానుషభోక్త = దానవుడు ; వీక్షసేయు = కనుగొను ; )

    """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  16. రణమే నాగృహమున కా
    రణములు లేకయె,పొరుగు పర జనులకు బ్రతి
    క్షణమది వేడుకె,నాదిన
    రణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.

    రిప్లయితొలగించండి
  17. రణగొణ ధ్వానముల నడుమ
    చెణుకులు చెవి బడక సరిగ శ్రీమతి మీరా
    సణుగుడు నాపుడు చాలన
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ 😛

    రిప్లయితొలగించండి
  18. అణువణువుంబులకించగ
    నణకువగానుండునటులనదుపుంజేయన్
    వినయుతుడునగుటనాప్రే
    రణముముగిసినదనుచుననురక్తుడులేచెన్

    రిప్లయితొలగించండి
  19. క్షణమును విడువక మగనిని
    వ్రణమన నిందలు సలిపెడి వల్లభ టివి వీ
    క్షణ సమయమవ విడిచెనిక
    "రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"

    రిప్లయితొలగించండి
  20. చ: గణగణ మంచు పాడుచును కమ్మగ నాడుచు రంగమందు ధా
    రుణిపయి పేరుపొందితిరి రూపకమందున తెల్గునేలపై
    హనుమకు రాముతోడనట నంకము గాంచుచు తెల్లవార్లు నా
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
    అంకము: యుద్ధము

    రిప్లయితొలగించండి
  21. కం:
    కణకణకడుపులుకాలగ
    చెణకుల పనియేమి వానిచింతయెతీరన్
    ఘణభోజనమేకుదిరిన
    రణము ముగిసిన దనుచు ననురక్తుడులేచెన్

    రిప్లయితొలగించండి
  22. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ..

    (కరోనా కాలము)

    *కం*

    అణువంతయు లేకయె దా
    రుణ మరణమ్ములను జూపు రూపమె యొక మా
    రణ హోమమున్ తలపిన చ
    *"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  23. క్షణము యుగమ్ముగా గడిచె కార్యపు రాత్రి ప్రతీక్షణమ్మునన్
    తొణికిసలాడు సిగ్గు గనుదోయిని దాచుచు పారవశ్యమున్
    వణికెడి మేన జేరువగు భామిని గూడి యనంగ రంగమున్
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్

    రిప్లయితొలగించండి
  24. వ్రణకారక ద్విష ధను
    ర్గుణ ధ్వనులు నంతరించె క్షోణితలమునన్
    క్షణమాత్రమ్మున నర మా
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్


    ఫణిశయనస్త వాభిరత పావన విప్ర మహాకులైక భూ
    షణుఁడు నిరంత రాధ్యయన శాంత మనస్కుఁడు సత్యవంత స
    ద్గుణగణ ధాముఁడున్ లస దకుంఠిత వైష్ణవ సంభృతాంక ధా
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్

    రిప్లయితొలగించండి
  25. రణమె సమస్య నేడు రణరంగమునన్ కవిరాజులందరున్
    రణమునకర్థముల్ వెదకి వ్రాయగ బూనిరి పద్యముల్ భళా
    రణమన ధారణమ్మనుచు వ్రాసిరి గొందరు తోరణమ్మనిన్
    రణముననంగ సంగర సరాగము జేసిరి కొందరంచు పూ
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ 🙂

    రిప్లయితొలగించండి

  26. చంపకమాల
    అణువణువందు పట్టుదల నార్తిగ దూకుచు నెన్నికందునన్
    బణముగఁ బెట్టి సంపదల వైభవమెంచుచు, నోట్ల నెంచునం
    కణమున వైరికిన్ గెలుపు కైవసమౌచును నోక్కవోటుతో
    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్

    రిప్లయితొలగించండి

  27. కందం
    పణముగ సంపదఁ బెట్టియు
    నణుకువ గెలువన్ శ్రమించి యపజయమందన్
    గణనమున నొక్క యోటుకు
    రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్

    రిప్లయితొలగించండి
  28. హరికథ వినడానికి వస్తే హరిదాసు మోసాన్ని గ్రహించిన సందర్భములో....

    చం:

    గొణుగుట నాపి రామకథ గొప్పగ గానము జేయమన్న దా
    కణతలు రుద్దుచున్ నుదురు గట్టిగ నొక్కుచు మోస గించుటన్
    వణకుచు దెల్పె దాసు తల వంచగ తప్పు క్షమించ మన్న కా
    రణము సమాప్తమైన ననురక్తుడు లేచెను బంచ దుల్పుచున్

    దాసు =హరిదాసు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. ఫణమున ధర్మజుండు తమపత్నిని ద్రౌపది నోడజూచి, త

    క్షణము సుయోధనుం గనుచు శస్త్రసమంబగు పాచికా యిరిం

    గణమున నూడ్చి వేసితినిగా యని యాశకునిట్లు బల్కుచున్

    రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్

    -యజ్ఞభగవాన్ గంగపురం

    రిప్లయితొలగించండి
  30. అణకువనొప్పగానొదిగినాతురతోడనునాలకించిపూ
    రణముసమాప్తమైనననురక్తుడులేచెనుబంచిదుల్పుచున్
    వినయముతోడుగాగనునభీష్టముసిద్ధినొందుచోనగున్
    ననితరసౌఖ్యముందగునాయువు,బెర్గునునెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  31. గణకుడొకండువాదమునఁజక్కగపండితసంఘముఖ్యులున్
    ఫణితిఁబరాభవించెనుసభాస్థలిఁబ్రగ్రహణాంతరమ్ముకా
    రణమునుతెల్పసత్కృతివిరాజితుడైసభనందునేడువా
    "రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్"

    రిప్లయితొలగించండి
  32. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:06-06-2020.మహోదయులకు ఉషోదయ నమస్సులతో,
    నేటి పద్యపూరణా యత్నం -

    గణముల గూర్పుచు , యతు లను
    గుణమౌ పొందిక , సుభావ కోమల లుప్తం
    బణగగ పద్యము ముగియగ
    రణము ముగిసిన దనుచు ననురక్తుడు లేచెన్

    రిప్లయితొలగించండి
  33. గణములు వాసిగ కుదరక
    సణుగుచు నుండన్ సఖుడొక సలహా యొసగన్
    క్షణము ననీ పద్యపు తో
    రణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.

    రిప్లయితొలగించండి