7, జూన్ 2020, ఆదివారం

సమస్య - 3392

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ"
(లేదా...)
"వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే"

57 కామెంట్‌లు:

  1. సి.వి. సుబ్బన్న శతావధాని గారి పూరణ.....

    వశ్యు మునీశ్వరున్ వలచి పైకొని మేనక గాధినందనున్
    భ్రశ్యదఘున్ శకుంతల యనందగు పుత్రికఁ గాంచె నామె యి
    క్కాశ్యపి శ్రీకరున్ భరతుఁ గాంచెఁ గుమారు గణింప దేవతా
    వేశ్యల జీవిత మ్మతి పవిత్రము సాధ్వులు వారి సాటియే?

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    పాత కాలం కబుర్లు:

    నశ్యపు కాయలన్ ముడిచి నందన మొందుచు బుఱ్ఱ గోకుచున్
    వశ్యము జేయబూనుచును వందన లిచ్చుచు వేగ వచ్చెడిన్
    కాశ్యపు గోత్ర పండితుల గారబు పెండ్లికి నాట్యమాడెడిన్
    వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  3. వశ్యంబిహ బంధనముల
    వేశ్యల జీవితము; గడుఁ బవిత్రము సుమ్మీ
    ఆ‌ శ్యాముని చరణమ్ము ల
    వశ్యముగా మదిని దాల్చు వారల దెరగున్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దేశ్యపు రీతులన్ నడిచి తీరుచు దిద్దుచు కన్నెశుల్కముల్
    నశ్యము గ్రోలు పండితులు నాటక మందున లాగబూనగా
    వశ్యము జేసెడిన్ మధురవాణుల వోలెడు పుణ్యజీవులౌ
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  5. వేశ్యాజాతిన్ 'గిరిక' య
    వశ్యంబుండినటు వేయిపడగలు నవలన్
    వశ్యులయిన దైవమునకె
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  6. వేశ్యల నడుమన పెరిగియు
    వేశ్యా జీవనమునందు వెగటునుబొందన్
    వేశ్యావృత్తిని విడచిన
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  7. దృశ్యము"దేవదాసు"ననరిందగమారినదేవినిన్గనన్
    దృశ్యముబ్రేమబాత్రముగరీతినిదెల్పుచుసాగిబోవగన్
    వేశ్యలువేషధారులుగవేగులబోలుచుదేశరక్షకున్
    వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి



  8. నశ్యపు రీతి జరుగునా
    వేశ్యల జీవితము, గడుఁ బవిత్రము సుమ్మీ
    పశ్యత్పాలుని సేవ! అ
    వశ్యంబగు సూవె కర్మ ఫలము జిలేబీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సవరించిన పూరణము:
      మిత్రులందఱకు నమస్సులు!

      వేశ్య వసంతసేన, వలపించిన నొక్కనిఁ జారుదత్తు, నై
      రాశ్యములేక, ప్రేమయె స్థిరమ్ముగఁ దాల్చియు, నా శకారు కా
      ర్కశ్యముచేతఁ గష్టములఁ గాంచియు, స్వప్రియు నందె! నిట్టిదౌ
      వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే!

      తొలగించండి


  10. కందోత్పల


    వలపుల చూపంగను సిక
    తిల వేశ్యల జీవితమ్మతి పవిత్రము సా
    ధ్వులు వారి సాటి యే నా
    డిలలో కనరారనుచు వడిని పలుకకుడీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. వేశ్యయిననుచింతామణి
    వశ్యమ్మాయెను విరక్తిభావమ్మునకున్
    వేశ్యావృత్తిని వీడిన
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'వేశ్య+అయినను' అన్నపుడు సంధి లేదు. "వేశ్య యయిన చింతామణి" అనండి.

      తొలగించండి


  12. నశ్యపు రీతి వాడి తమ నా మనుజుల్ విడువంగ జూతురే
    వశ్యము కారు భార్యలిల వారివలెన్, తమ టెక్కు చూపరే,
    పాశ్యము వేసి కట్టుకొని వారిని, చుల్లర వెట్టి చూడరే?
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. వశ్యులు గాకను  విటుల క 
    వశ్యము లొంగక తమదగు పవిత్రతతో నై 
    రాశ్యము చొరబాఱని యా     
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  14. వశ్యము నందున నుండదు
    వేశ్యల జీవితము : కడు బవిత్రము సుమ్మీ
    వేశ్య వలె వాంఛ దీర్చుచు
    వశ్యము నందుండు సతియె పతి దేవుని కిన్

    రిప్లయితొలగించండి
  15. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    వేశ్యల జీవితము గడు బవిత్రము సుమ్మీ

    ఇచ్చిన సమస్య. కందము లో

    నా పూరణము సీసములో


    దేవ వేశ్యల అయిన. రంభ,మేనక,ఊర్వసి పవిత్రులు అని ముని తన శిష్యులకు చెప్పు సందర్భము


    రంభ శాపము పొంది రావణుం డానాడు
    తాక కుండెనట సీతమ్మ నెపుడు,

    ఫల్గుణు నకును శాపం బిడి యూర్వసి మేల్జేసెనుగ నాడు,మేనక యును

    గాధి సుతుని గూడి ఘనమైన
    భారత‌
    కధకు మూలంబాయె, కాంచి
    నంత

    చిత్రమౌ వేశ్యల జీవిత
    ము గడుబవిత్రము సుమ్మీ దివిజ. వరాంగ


    నలు భువికి చేసె మేలును,
    చెలిమి తోడ

    దేవ వేశ్యల కధలన్ని దివ్య మైన

    వని తలచి శోభ పొందంగ వలయు ననుచు

    తెలిపె శిష్యులన్ కని‌ నొక‌‌ పొలము‌ తెంకి


    పొలము తెంకి = ముని

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. 07.06.2020
      అందరికీ నమస్సులు🙏🙏

      నా పూరణ ప్రయత్నం😊

      *కం*

      వేశ్యలు తామెప్పుడును, న
      వశ్యము తమ మనసు మార్చి వరియించెదరే
      దాస్యము విటుల కొరకనెడి
      *"వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏

      తొలగించండి
  17. వశ్యము కాగను జన్మమ
    వశ్యము భవునకు, పడుపుది పంకజవలె నై
    రాశ్యము తోడను మనగన్|
    "వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ"

    రిప్లయితొలగించండి
  18. వశ్యుల జేసికొంచు మగవారిని మోసము జేతురన్ననా
    వేశ్యల యందు గొందరు పవిత్ర మనస్కులు స్త్రీల మేలునా
    వశ్యకమంచు నమ్మి దమ వంతుగ సాయము జేతురట్టి యా
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  19. వేశ్యల గృహమున కర్మల
    దృశ్యముల దలచుచు పూజ దేవుని తగునా,
    వేశ్యయు మది శివునిడ నా
    వేశ్యల జీవితము కడు బవిత్రము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. వేశ్యలెయైననుగడునై
    రాశ్యమునుంజెందకెపుడులాస్యముతోడన్
    వేశ్యావృత్తినివిడిచెడు
    వేశ్యలజీవితముగడుపవిత్రముసుమ్మీ

    రిప్లయితొలగించండి
  22. 07.06.2020
    అందరికీ నమస్సులు 🙏🙏

    *ఉ*

    హాస్యము కూడదన్న పరిహాసము చేయగతల్చగూడదే
    దాస్యము జేయుచున్ విటుల దాహము దీర్చెడి దుస్థితిన్ తధా
    వశ్యము జేయకన్ నెపుడు వచ్చెడి వారిని గౌరవించు నా
    *"వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  23. వేశ్యలెయైననున్మిగులవేగిరపాటునుజెందకుండగా
    దేశ్యపుటింతులన్వలెనువేషముభాషనునేర్చుచున్వెసన్
    వశ్యులుగాకయేరికినిబావనరీతినిమెల్గుచుండుటన్
    వేశ్యలజీవితమ్మతిపవిత్రముసాధ్వులువారిసాటియే

    రిప్లయితొలగించండి
  24. వేశ్యలుగూడమర్త్యులిల పేదరికమ్ముననట్టివృత్తికిన్
    వశ్యులుగానొనర్చెవిధి వారినిచక్కనొనర్చునట్టియా
    వశ్యకతన్ గ్రహించితగుభద్రతగూర్చిన నొందుగాదెయా
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  25. కాశ్యపి లోగన హీనము
    వేశ్యల జీవితము, గడుఁ బవిత్రము సుమ్మీ
    పశ్యత్పాలుఁ గృప మన క
    వశ్యమనుచు తలచువారి బ్రతుకులె యిలలో.

    రిప్లయితొలగించండి
  26. వేశ్యల చెంతభూరిగను పింజరముండునటంచు గాదె నై
    రాశ్యము నందు పల్కితివి ప్రాజ్ఞులు మెచ్చని రీతిగా భువిన్
    వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే
    హాస్యము కోసమైన తమరట్లు వచింపగ కూడదందునే.

    రిప్లయితొలగించండి
  27. వేశ్యాలోలులు మానవు
    లా శ్యామల జోలి కేఁగ కావల యున్నన్
    వేశ్యలఁ జూడన్ శక్యమె
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ


    వశ్యలె వారు క్షుద్రుల కవద్య నరాలికి నెన్నఁ డేని కా
    ర్కశ్యపుమాట లేల సుర కాంతలు క్షీర సముద్భ వాంగనల్
    కశ్యప మౌని పుత్రికలుఁ గారణ జన్మలు వింత యేల స్వ
    ర్వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  28. ఉ:

    వేశ్యలు సంఘ సేవకులు వెంటగ నుండరె చింతబాపగన్
    వేశ్యలు దౌత్యవేత్త లుగ విశ్వము నెల్లన తేజరిల్లగన్
    వేశ్యల పాండితీ ప్రతిభ విశ్రుతి కల్పన గాథ లెన్నియో
    వేశ్యల జీవితమ్మతి పవిత్రము సాధ్వులు వారి సాటియే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. వేశ్యల చెంతభూరిగను పింజరముండునటంచు గాదె నై
    రాశ్యము నందు పల్కితివి ప్రాజ్ఞులు మెచ్చని రీతిగా నటన్
    కశ్యము గ్రోలివచ్చి యిట కైపున వాగుచు నుంటివిట్టులన్
    వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి
  30. 1. వేశ్యలవెంటబడే భర్తతో భార్య :

    వశ్యమ్మైన దనుచు న
    వశ్యము బాగోగులఁగనఁ బత్ని మఱచు వై
    వశ్యమె? నీ దృష్టిలో
    వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ?

    2.
    ఉత్పలమాల
    వశ్యత వేమనార్యుడట బంధుర విశ్వద వీడకున్న నా
    వశ్యమటంచు మార్చి జనవంద్యుని జేయదె యోగమంది సా
    దృశ్య సుశోభితంబనఁగఁ దీర్చఁగ నా శతకమ్ము, హేతువౌ
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే?

    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల
    వశ్యుడుగాక తా విషయవాంఛల నుండెడు ఋష్యశృంగు నా
    వశ్యము నంగరాజ్యమున వర్ష హితంబిడ నేగుదెంచ వై
    వశ్యము జెందఁ జేసి గొనివచ్చిన రాజ్య హితైషు లైన నా
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే?

    రిప్లయితొలగించండి
  32. పశ్య యగున్ గదా మధురవాణి సమాజ శుభమ్ము గోరు నా
    దృశ్యము జూచు వారలకు! ధీమతి యొక్క వకీలు తోడుతన్
    పాశ్యను జిక్కినట్టి పసి భామల బాగొనరించె గాదె, యీ
    వేశ్యల జీవితమ్మతి పవిత్రము! సాధ్వులు వారి సాటియే!
    (పశ్య = విస్మయము; పాశ్య = వల)

    రిప్లయితొలగించండి
  33. కశ్యపమౌనిభార్యధృతిఁ గాంచె ఘటిల్లగ లోకశాంతి ని
    ర్దేశ్యపు లక్ష్యమున్ బడసి దేవతలందున నంద గత్తెలన్
    దేశ్యమునెంచి వజ్రి యుపదేశముచే చరియించు దేవతా
    వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే

    రిప్లయితొలగించండి