8, జూన్ 2020, సోమవారం

సమస్య - 3393

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"
(లేదా...)
"కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్"

57 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కొమరుని పత్నినిన్ విడిచి కొండొక రేయిని పారిపోవుచున్
    సమరము చేసి జ్ఞానమును చక్కగ పొందుచు బోధి క్రిందనున్
    విమలపు బుద్ధుడాదటను ప్రేమను పంచుచు రాగ వీటికిన్
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చెమటల నోర్చి వీధులను చిన్నలు పెద్దలు చూచుచుండగన్
    క్రమముగ రెండు పోరులను గాఢపు రీతిని హస్తినమ్మునన్
    సమరము చేసి చూపగను సంతస మొందుచు; నాకమందునన్
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

    రిప్లయితొలగించండి
  3. శివుని విల్లును మోపెట్టి చిదుమి నట్టి
    ధీరుడా యయోధ్యాధిపతి దశ రథుని
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ ,
    ననుగు పుత్రి సీతను బెండ్లియాడ మనుచు

    రిప్లయితొలగించండి


  4. కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
    బ్రహ్మచారియై తా నిలబడుచు నచట
    పழని మలపైన వెలయగ బాలచర్యు
    డయ్య జ్ఞానఫలంపు గొడవల వలన!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      నాకు బాగా నచ్చిన క్షేత్రాలలో పళని ఒకటి. ఇప్పుటకి రెండుసార్లు దర్శించుకున్నాను.

      తొలగించండి


  5. కందా చంప్స్



    విను పళని కథను ఝషలో
    చన! కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుం‌డు జనుల్
    గొనియాడఁ గూర్మితోన్ మురు
    గుని జ్ఞానఫలమ్ము గా సుగుణముల వనిగా



    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. అమలినభక్తిభావమున నందరు జేరి శివాలయంబునన్
    గ్రమముగ నిల్చి గొల్చు నెడ కాంత యుమన్ తనయుండు శంకరున్
    దమనిట గావుడంచనిన తాను మహోదరు నేకదంతుడౌ
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్"

    రిప్లయితొలగించండి
  7. గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణను పరిశీలింప ప్రార్థన.

    పశ్య మొసంగదే మధురవాణి సమాజ శుభమ్ము గోరు నా
    దృశ్యము జూచు వారలకు! ధీమతి యొక్క వకీలు తోడుతన్
    పాశ్యను జిక్కినట్టి పసి భామల బాగొనరించె గాదె, యీ
    వేశ్యల జీవితమ్మతి పవిత్రము! సాధ్వులు వారి సాటియే!
    (పశ్య = విస్మయము; పాశ్య = వల)

    రిప్లయితొలగించండి


  8. అమరెను కొండ పైన మురుగాయని కొల్వగ జ్ఞానపండితుం
    డమరెను బాలచర్యునిగ డాంకృతి మీరగ చేత బట్టి దం
    డమును! ఫలమ్మతండె ఘనుడాతడె "వేలవ"నాతడేసుమా
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. తనదు మనమును‌ పసిగట్టి
    మనసు బెట్టి

    తాను కోరిన స్త్రీ తోడ తనదు సుతడు

    తనకు మనువు చేయంగ శంతనుడు బీష్ము

    నిరతిని గని మనసులోన సరస గతిని

    కొమరునకు మ్రొక్కె జనకుండు‌ కూర్మి తోడ

    రిప్లయితొలగించండి
  10. పుణ్య భాగ్యవశంబున సన్యసించి
    దక్షిణామ్నాయ పీఠపు తదుపరి యధి
    కారియౌ "విధుశేఖర భారతి" మును
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
    (మును = సన్యసించక ముందటి)

    రిప్లయితొలగించండి
  11. కొమరునకుమంచి చదువులకొఱకుతండ్రి
    విద్యలకునొజ్జయనియెంచి విఘ్నపతిని
    భక్తిమదినింపి శిరమొంచి పరమశివుని
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    రిప్లయితొలగించండి
  12. తమతమ సేవలందునను దండ్రియె కొల్వును జేయుచున్న గ్రా

    మమున సుతుండు సైతమట మానిత జీవిక సల్పుచుండె నా

    కొమరుని గాంచి మొక్కె జనకుండు జనుల్ కొనియాడ కూర్మి తోన్

    ప్రమదమె యౌగదా!యతని వత్సుని యున్నతమౌ స్థితింగనన్.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందఱకు నమస్సులు!

    విమలయశోవిభూషితుఁడు వీక్షిత లక్ష్మణ యుక్త సద్గురుం
    డమలకపర్దిచాపభిదుఁ డంచిత సద్గుణగణ్యశోభితుం
    డమితవినీలదేహుఁడగు నా రఘురామునిఁ గ్రొత్త పెండిలిం
    గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!

    రిప్లయితొలగించండి
  15. తే.గీ//
    తరలి వచ్చిరి వేల్పులు, దశరథదొర
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !
    సీత పరిణయ సమయంబు చిత్తమలరు
    రామచంద్రుని పదములె క్షేమమనుచు !!

    రిప్లయితొలగించండి
  16. శివుని విల్లును విరచిన జేత కిత్తు   
    నవనిజనన పలుకరైరి యవని విభులు    
    గురుని యాజ్ఞను రాముడు విరువ రాచ  
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    రిప్లయితొలగించండి
  17. యాగ రక్షణఁ జేసిన యనఘు డైన
    పంక్తిరథుని సుతునితోడ పలుకువాలు
    కదలి తా వచ్చినట్టి యా గాధి రాజు
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    రిప్లయితొలగించండి
  18. సుమనసవేదిగూర్చిఘనసోమునిసూనుడువిఘ్నరాజును
    న్గొమరితఁబెండ్లివేడుకనఁగోర్కెనుఁగోరగనెంచుచుండగ
    న్సుమశరబంచబాణహరసోమునిపుత్రుడుషణ్ముఖుండునౌ
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  19. విక్రమము జూపి రాముడు విల్లు ద్రుంచ
    సీత కళ్యాణ మది సాగె చిత్త మలర
    విఘ్నముల నెల్ల నెడ బాపు వేల్పు శివుని
    కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ

    రిప్లయితొలగించండి
  20. అన్నయ్యకు అంకితం!

    క్రమమును దప్పకుండ ప్రతిరాత్రిని శంకరు బ్లాగులోననున్
    చెమటల గ్రక్కుచున్ మిగులచెన్నగు పద్యములల్లుచున్ సదా
    యమితపు హాస్యధోరణిని హద్దులులేక చెలంగ శాస్త్రియే
    కొమరునిగాంచి మ్రొక్కెజనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమితపు కామవాంఛలను హద్దులుమీరిన వర్తనంబునన్
      సమకొన శాపమే తనదు సత్వము యవ్వనమంతరింపగా
      సముచితరీతి తండ్రికిని జవ్వనమున్ దగధారవోయగా
      కొమరునిగాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!

      తొలగించండి
  21. తనదు వార్ధక్యమును గొని తనదు సుతుడు


    పురు తనదు యవ్వనమును
    వి తరణ మిడగ

    మది పరవశ మొంద యయాతి మనసు లోన,

    కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ

    రిప్లయితొలగించండి
  22. మఱొక పూరణము:

    తమను మునీంద్రుఁ డా యడవి దాపునకుం గొనిపోవఁ, దాటకన్
    విమల శరాళిఁ గూల్చి, తనివిం గన మౌని, శిలం బడంతిగా
    నమర నొనర్చి, శంకరు శరాసన మోర్చిన యా యయోధ్య రా
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!

    రిప్లయితొలగించండి
  23. వినియు, సీతా స్వయంవర విషయమెఱిగి
    మునితొ జనుదెంచ గని మోదమున దశరథ
    కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మితోడ
    నయ జయమిడు కాలము కారణార్థముగను...!

    రిప్లయితొలగించండి
  24. విమలపు జ్ఞాన మాయుధము వేదపు వాదమునందు వందితో
    నమలిన రీతిఁ వాడి తన నాన్నకు బంధ విముక్తి గల్గజే
    యు మహిత మౌని బాలకుని, యుత్తమ దేశికు డేకపాదునిన్
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
    (అష్టావక్రుని కథ)

    రిప్లయితొలగించండి
  25. సుమములు నారికేళములు సోమము లోహిత పుష్పకమ్ముతో
    ప్రమదయు పుత్రి తో పళణి వాసుని క్షేత్రము జేరి యచ్చటన్
    దమనసుతుండు శక్తిధరుఁ దారక హారిని కేకి వాహనున్
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.

    రిప్లయితొలగించండి
  26. ధనువుఫెళ్ళుమనవిఱుచుదశరధుప్రియ
    కొమరునకుమ్రొక్కెజనకుండుగూర్మితోడ
    యంతపూలమాలనువేయసీతసాధ్వి
    పూలవర్షముగురిపించిరెల్లసురలు

    రిప్లయితొలగించండి
  27. మిథిల జేరి గురువు యాన మీర దాను
    శివుని విల్లు విరిచి బట్టె సీత చేయి
    ధన్యమాయె జన్మమని యంత దశరథుని
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    రిప్లయితొలగించండి
  28. శ్రీ గురుభ్యో నమః
    8.6.20
    శ్రవణ పుత్రుడె వెడలెను సద్దు లేక
    కరియని తలచి బాణము కాచి వేయ
    నరచి పడిపోయె బాలుడు నంత లోనె
    జలము నిమ్మని చెప్పుచు జాలిగాను
    *కొమరునకు మ్రొక్కె జన కుడు కూర్మి తోడ*

    రిప్లయితొలగించండి
  29. సవరించితిని గురూజీ
    తే.గీ//
    తరలి వచ్చిరి వేల్పులు, దశరథవిభు
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !
    సీత పరిణయ సమయంబు చిత్తమలరు
    రామచంద్రుని పదములె క్షేమమనుచు !!

    రిప్లయితొలగించండి
  30. సుమములుబత్రముల్నికనుసోయగమబ్బెడుగంధమాదులన్
    నమలినభక్తిగన్పఱచియాశివపూజనుజేయుచున్నయా
    కొమరునిగాంచిమ్రొక్కెజనకుండుజనుల్గొనియాడగూర్మితోన్
    గొమరునినున్నతిన్గదిలగోరుదురయ్యలుదల్లులెప్పుడున్

    రిప్లయితొలగించండి
  31. అమల మనస్కుడై వఱలు యారఘురాముడు వెంటనంటి సం
    యమి హవనమ్ముఁ గాచి కడు హర్షముతోడుత చెంగలించి గో
    త్రమునను,మౌని పన్పునను త్ర్యక్షుని విల్లును త్రెంచ చెచ్చెరన్
    విమలమతిన్ మహీజ లలి వేయగ మాల్యము శౌరిఁ పెండ్లియౌ
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

    రిప్లయితొలగించండి
  32. బ్రహ్మ రుద్ర శక్రాదులు బ్రహ్మఋషులు
    నింక దేవర్షి గణముతో నెలమి రాఁగ
    మిథిల నాఁ బురి నేలెడు మేటి ఱేఁడు
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    [కొమరుఁడు = కుమారస్వామి]


    కమలజు కన్నతండ్రి లతికా సుతనూ కమలా ధవుండునుం
    గమల ధనూ రమాసుతుని కన్న మహాత్ముఁడు నందపుత్రుఁ డా
    కమలదళాక్షఁడే వరుణ కాంతు జగమ్మున కేఁగి నందుఁ దేఁ
    గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. సమరమునందుజూపెతనశౌర్యముసింహకిశోరమై యరిం
      దమునిగ ఫల్గుణాత్మజుఁడు తల్లడమొందగజేసి వైరులన్
      సమయగనాజియందు తన స్వాంతమునందు జ్వలించునార్తితో
      కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

      తొలగించండి
  34. చం:

    దుముకుచు లాడ బెండ్లమును తొందర జేర్చగ వైద్యశాలకున్
    సమయము కూడి దా వలని శక్యము పుత్రుని బొంద గోరుటై
    విమల మనస్కుడై మదిని వేడగ నా పరమాత్ము , తత్కృపన్
    కొమరుని గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితోన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. క్రమముగ నాది శంకరుల గౌరవ పీఠపు టుత్తరాధికా
    రమునను శృంగ పర్వతపు ప్రస్తుత పూజ్య యతీంద్రవర్యులే
    ప్రమదము మీరగా సుతుని వారసుగా బ్రకటింప స్వామియౌ
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.

    రిప్లయితొలగించండి
  36. శ్రీగురుడు,దత్త రూపుండు, సిధ్ధయోగి!
    అంబ కిచ్చిన వరముకై యవని బుట్టె!
    దైవమును గన్న జన్మము ధన్యుమనుచు!
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"

    రిప్లయితొలగించండి
  37. తేటగీతి
    హరు విలుఁద్రుంచి జానకి మురిసి పోవ
    పెళ్లి వేదిపై వరుడన్న విష్ణువనుచు
    కాళ్లు కడుగి మురిపెమునఁ గని దశరథ
    కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ

    రిప్లయితొలగించండి
  38. అమిత పరాక్రమం బెనయ నాసుర శక్తుల గూల్చి మౌని యా
    గమునకు రక్ష గూర్చి మునికాంతకు శాపము నొల్చి శైవ చా
    పము నవలీల డుల్చి ఘన పావని సీతను నేలినట్టి రా
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.

    రిప్లయితొలగించండి
  39. చంపకమాల
    సుముఖత గాధిసూనునకు స్తోమము గాచిన రామచంద్రుడున్
    సుమశరు వైరి వింటిఁ గొని స్రుక్కగ దిక్కులు ద్రుంచి వైచి శ్రీ
    రమయన నొప్పు సీతఁ గొన రంజిలి విష్ణువు రూపమంచు రా
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్

    రిప్లయితొలగించండి
  40. 08/06/2020
    అందరికీ నమస్సులు 🙏

    *నా పూరణ*

    (కరోనా warriors)

    *తే గీ* 🌹

    సమర యోధుడి రూపున సంతసముగ
    వచ్చె రోగుల బాధను వదుల గొడుచు
    కష్టములిచట తాను సుఖములనుగొను
    *"కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  41. దశరథుని సుతుగొం పోయి దండి విద్య
    నెల్లయు ను నేర్పి నట్టి మునీంద్రుడైన
    కౌశికు డన బరంగెడు గాధి రాజు
    కొమరునకు మ్రొక్కెజనకుండు

    రిప్లయితొలగించండి