17, జూన్ 2020, బుధవారం

సమస్య - 3401

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... 
"గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె"
(లేదా...)
"గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్"

63 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నిర్భయ నామపుం వనిత నీరజ నేత్రయె వంగభూమిలో
    గర్భము కోరి వేడుచును గారబు రీతిని కాళిమాతనున్
    గర్భపు లక్షణంబులను కానగ రాగను "నీ సతీమణే
    గర్భముఁ దాల్చె, భర్త!"; యని భామ వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్!

      "గర్భముఁ దాల్చె భర్త యని భామ వచించెను సంతసంబునన్"

      ...యతి సరియా?

      "గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్" ?

      తొలగించండి

    2. మాకు యతి నో ప్రాబ్లెమ్ :)


      కందోత్పల


      కనులు కునుకు తీసెన్ ! చ
      య్యన గర్భముఁ దాల్చె భర్త యని భామ వచిం
      చెను సంతసంబునన్ వ
      చ్చిన కల లో తల్లితో కచిక్కున నవ్వెన్ !



      జిలేబి

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      పనుల ఒత్తిడి, తొందరపాటు కారణంగా యతిని గమనించకుండా ఇచ్చాను. సవరణకు ధన్యవాదాలు.
      చక్కని విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
      'సతీమణి+ఏ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది."నీదు భార్యయే" అనవచ్చు.
      *****
      జిలేబి గారూ,
      ఛందోవైచిత్రిని ప్రదర్శించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అర్భకు డౌచు నెన్నికల హానిని గాంచక పోరుచుండగా
    నిర్భయ మొంది వల్లభుడు నిక్కపు రీతిని వారణాసినిన్
    దుర్భర రీతి నోడుచును తుమ్ముచు కక్కగ; "మోడిచేతనున్
    గర్భముఁ దాల్చె భర్త" యని భామ వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  3. అర్భకురాలటం చతివ నందరు గేలిని సేయ నామెయున్
    దుర్భరమైన వేదనను దూరము సేయుమటంచు నీశ్వరున్
    నిర్భట దీక్ష వేడ గరుణించి వరమ్ముల నీయ దత్తఱన్
    గర్భముఁ దాల్చె భర్త యని భామ వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  4. ముంబయిలో సశాంతో మగాడిగా, తిస్తాదాస్ గా
    కోల్కకతాలో చక్రవర్తి అనునతడి ఆడదానిగా మారారని (Sex Reassignment Surgery) గతేడు పెళ్ళి చేస్కున్నారని పత్రిక ఉవాచ.

    ఆపరేషను వల్లనందాలు మారి
    భామ తిస్తాయె మారగ భర్తగాను
    చక్రవర్తి మారి వధువై శాస్త్ర రీతి
    గడిచె యేడాది, పెళ్ళాము కడుపు కనుచు
    గర్భముం దాల్చె మగఁడని భామ మురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ఆపరేషనుతో మారె నందమెల్ల" అందామా?

      తొలగించండి
  5. అందరికీ నమస్సులు🙏

    జంబ లకిడిపంబ నెరుగు జగ మునంత
    మంత్రమేయగ నాడది మగగ మారు
    లింగ మార్పిడి జరుగగ వ్యంగ్య మయ్యె
    *"గర్భముం దాల్చె మగఁడని భామ మురిసె"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి


  6. నిదుర రాక మంచము పయి నిటునటు దొర
    లుచునదే చట్టనుచు కనులు కునుకుబడ
    యంగ కలవచ్చె నందు హయారె నిండు
    గర్భముందాల్చె మగఁడని కాంత మురిసె!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సింహలగ్నము గాన హింసించు బుధుడు
    లాభగతుడౌట మారక ప్రదుడు గూడ!
    జాతి మరకతమణి దాల్చ శాంతి కూరు
    నంచు సిద్ధాంతి పల్కఁ బాటించి కేల
    కాంచ నాంగుళీయక మందు మంచి యశ్మ
    గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె!

    (అశ్మ గర్భము=మరకతమణి; బుధగ్రహ శాంతికి ఉంగరాదులలో ధరిస్తారు)

    రిప్లయితొలగించండి
  8. దుర్భరమౌ కరోనపయి దొర్లెడి వేళన నింటనుం డుచున్
    దర్భను గూడ నెత్తకనె దండిగ తిండిని బొక్కుతున్న సం
    దర్భమునందు బొజ్జ గతిదప్పుచు వర్ధిల జూచుచుండగన్
    గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోరంజకంగా ఉన్నది.
      ఇప్పుడు నా పరిస్థితీ అదే... కాకుంటే ఎగతాళి చేయడానికి ప్రక్కన భార్య లేదు!

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అర్భకులిద్దరేమొ! యొక యాత్మజయో! మగబిడ్డ యేమొ! సం...
    దర్భమదేవిశేషము., గనన్ తమ చెల్లెలు రాజమండ్రిలో
    గర్భముఁ దాల్చె భర్త ! యని కాంత వచించెను సంతసంబునన్
    దుర్భరమీ కరోన, బహుదూరము వెళ్లుట కష్టమే కదా!!😄😄

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. కంచ మందున గూర్చొని కదలకుండ
    మూడు పొద్దులు సుష్టుగ కూడు దినుచు
    మంచమందున లేవకమగని,నిండు
    కుండవలె నున్న గదిలెడి కుక్షి జూచి
    గర్భముం దాల్చె మగఁడనికాంత మురిసె

    రిప్లయితొలగించండి
  11. పెండ్లి జరిగి గడచె రెండు యేండ్లు,దిగులు
    చెందె దనకు గర్భము రాక,శంక వడెను
    మగని మగతనంబు నెంచి,మంచి గడియ
    గర్భముం దాల్చె,మగడని భామ మురిసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'రెండు+ఏండ్లు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'మగడని' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  12. సంతు లేదని చాన్నాళ్ళు సంశయమున
    తపమొనర్చుటకై బోవ తారసిల్లె
    మౌని, యిచ్చిన మూలిక మరిచి మ్రింగ
    గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె!!




    రిప్లయితొలగించండి
  13. తల్లి నౌదునటంచు నా తన్వి ప్రేమ
    మీర ముద్దిడ మగని చేరుకొనుచు
    నంతు లేని సంతసమందు నాతని గని
    గర్భముం దాల్చె మగడని కాంత మురిసె !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది.
      రెండవ పాదంలో గణభంగం. "ముద్దిడగ మగని..." అనండి.
      కాని పూరణలో అన్వయలోప మున్నట్టున్నది.

      తొలగించండి
    2. అలాగే నండి సవరిస్తాను.ధన్యవాదములు

      తొలగించండి
  14. దుర్భరమగు కరోనపై దొరలుటకయి
    దర్భ నైననె త్తక యుండె ధామమందు
    నిర్భరముగ భుజించగ నెగెడె బొజ్జ
    గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె

    రిప్లయితొలగించండి
  15. దుర్భర కష్టముల్ ముసర దుఃఖిల కుండగ సంతసంబుతో
    నిర్భయుడౌచు యోచనల నేర్పుతొ జేయుచు దుక్కి దున్ను సం
    దర్భములందు మేనెపుడు దాచని రైతయి సంఘ శ్రేయమే
    గర్భము దాల్చె భర్తయని కాంత వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  16. జీవన కడలి దాటెడు చేవ గలిగి
    ఎన్ని కష్టము లెదురైన నిష్ట ముగను
    చెదరి బెదరక వాటికి చింత పడక
    గర్భమును దాల్చె మగదని కాంత మురిసె

    రిప్లయితొలగించండి
  17. దుర్భరమయ్యె జీవితము,దుందుడుకొప్పగ పుట్టె నార్వురున్,
    నిర్భరమయ్యె కష్టములు,నేడిటు భామయు వెక్కసంబుగన్
    గర్భము దాల్చె;భర్త యని కాంత వచించెను సంతససంబునన్
    గర్భ దరిద్రమేర్పడగ కారణమెవ్వరు చెప్పుమాయనన్.

    రిప్లయితొలగించండి
  18. దుర్భగ కుండనంచు కడు దుఃఖము నొందినవాని భార్యయే
    గర్భము దాల్చె, భర్తయని కాంత వచించెను సంతసంబునన్
    నిర్భలు డైన వాడనియు నిత్యము వేకువ నందులేచి యోం
    భూర్భువ యంచు మంత్రమును మోదము తోడజపించు వాడనెన్.

    రిప్లయితొలగించండి
  19. వంధ్య యని గేలి చేసిన వనిత తాను
    పూజ లెన్నియొ చేసిన పుణ్య ఫలము
    గర్భముందాల్చె, మగఁడని కాంత మురిసె
    భార్యకు విధేయు డైనట్టి వాడె యనుచు.

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాము చేయక తినుటయే చలుపు నట్టి
    పతికి బొజ్జయే పెంపొంది వ్యాప్తి జెంద
    దాని చూసి హసించెడి దలపు కలిగి
    గర్భముం దాల్చె మగడని కాంత మురిసె.

    రిప్లయితొలగించండి
  21. సంతు కలగదని తెలిసి సంయమమున|
    నిజము కుక్షిని దాచుచు నేర్పు తోడ|
    నింద వేయక పత్నితో నెమ్మి నుండ|
    గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె"

    రిప్లయితొలగించండి
  22. పర్వదినమున నవకాయవంటకములు
    సుష్టుగాదిని యరగక రొష్టు పడగ
    పొటమరించినతనభర్త పొట్టజూసి
    గర్భముం దాల్చె మగఁడని భామ మురిసె

    రిప్లయితొలగించండి
  23. అర్భకుడైనవాడు సత మప్పుల బాధలు పెచ్చరిల్లగా
    దుర్భరమౌ స్థితిన్ కరము దుఃఖము నొందుచునుండ నట్టి సం
    దర్భమునందు పత్నిఁ గని దర్పము తోడుత నీదు భార్యయే
    గర్భముఁ దాల్చె భర్త! యని కాంత వచించెను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెండ్లియైనయేడాదికివీరలక్ష్మి
      గర్భముందాల్చె,మగడనికాంతమురిసె
      మంచిగుణములదోడనుమసలుచుండి
      మానవత్వముకలిగినమనుజుడుతన

      తొలగించండి
  25. ఉ:

    గర్భిణి యింతు లెల్లరకు గల్గెడి కష్టము లెంచి జూప సం
    దర్భము, నాటకీడు తన దైన విలక్షణ పాత్రపోషణన్
    దుర్బల మెట్లు నోడుటయొ దోసము లేక నటింప జూచుటై
    గర్భము దాల్చె భర్తయని కాంత వచించెను సంతసంబునన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. యజ్ఞ నైవేద్యమున్ దిన నతివ యపుడు,
    కేలు బట్టిన పురుషుని నేల బిలుతు,
    రవని సుఖ సౌఖ్యముల్ గని హ్లాద మెగయ,
    గర్భముం దాల్చె; మగఁడని; కాంత మురిసె!




    రిప్లయితొలగించండి
  27. దుర్భరమౌ హలాహలము తోరపురీతి బబయల్పడంగ దా
    నిర్భయుడౌచు శూలి కమనీయ విభూషణమట్లు కంఠపుం
    గర్భముదాల్చె భర్తయని కాంత వచించెను సంతసంబునన్
    ఆర్భటిలేకయే తనరు నాదియునంతము లేనివాడహో!

    రిప్లయితొలగించండి
  28. పెండ్లిరోజున కాన్కగా ప్రేమమీర
    పచ్చ పొదిగిన లాకెట్టు పతికినీయ
    నదియె మెచ్చుచు నందమైనట్టి అశ్మ
    గర్భముం దాల్చె మగడని కాంత మురిసె!!!...

    రిప్లయితొలగించండి
  29. కోపము నుపశమించఁగఁ గూర్మిఁ జేసి
    శాంత మూని చిత్తమ్మున సుంత నంతఁ
    జక్కని సహన మ్మది, బల్కి వాక్కు నర్మ
    గర్భముం, దాల్చె మగఁ డని కాంత మురిసె


    దర్భ కరాంబుజుండు నిరతవ్రత విప్రుఁడు సద్గుణుండు భూ
    గర్భ కృపా రసామృతము గ్రన్నన దక్కఁ గరమ్ము నెమ్మి నే
    నర్భకు వేఁడఁ దన్మయ కృశాత్మను వింత నిజోదరమ్మునన్
    గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్

    [తాల్చు = ఉంచు, చేర్చు, నిర్మించు; గర్భము = బిడ్డ]

    రిప్లయితొలగించండి
  30. సుగాత్రీ శాలీనులు

    [సరస్వతీదేవి, కాళికాదేవుల వరాల ప్రభావంవల్ల, పరస్పరాసక్తితో స్త్రీ (సుముఖాసత్తి) గా మాఱిన శాలీనుఁడును, పురుషుని (మణిస్తంభుని) గా మాఱిన సుగాత్రియు కలవడంచేత జరిగిన పరిణామం వల్ల, సుగాత్రి శాలీనునితో పలికిన సందర్భము]
     
    దర్భల చాపపైనను ముదమ్మునఁ గూర్చొని తాను, భర్త సం
    దర్భిత చేష్టలం దలఁచి, దబ్బున మోమున మోమునుంచి, "యీ
    యర్భకురాలె, యా మగని యట్లుగ మాఱఁగ, స్త్రీగ మాఱి, నా

    గర్భముఁ దాల్చె భర్త!" యని కాంత వచించెను సంతసంబునన్!

    రిప్లయితొలగించండి
  31. అర్భకురాలుగాదలచియామెకుమద్యముబోయగాననెన్
    గర్భముదాల్చెభర్తయనికాంతవచించెనుసంతసంబునన్
    గర్భముదాల్తురేచెపుమకాంతవచించుటచిత్రమేగదా
    గర్భమువచ్చుకేవలముకాంతలనంబడువారికేసుమా

    రిప్లయితొలగించండి
  32. తేటగీతి
    క్షీర సాగర మథనమ్ము క్ష్వేల మొసఁగ
    గ్రోల మంచును పతినీశుఁ గోరి నంత
    గళము నుందునఁ, గావ లోకమ్ము లుండు
    గర్భముం, దాల్చె మగఁడని కాంత మురిసె

    రిప్లయితొలగించండి
  33. పార్వత్యువాచ :

    ఉత్పలమాల
    దుర్భర మీ హలాహలముఁ దొందర గైకొను మంచు వేడ సం
    దర్భమెరింగి సిద్ధుడుగ తప్పదటంచును గ్రోలి సర్వులున్
    నిర్భయమంద కంఠమున నేర్పునఁ, గావ జగమ్ములుండెడున్
    గర్భముఁ, దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్!

    రిప్లయితొలగించండి
  34. శ్రీలక్ష్మీ నారసింహాయనమః
    తేది:17-06-2020.

    కోట్ల రూప్యము లార్జించె కోర్కె తోడ
    వసుధ శ్రీమంతు డనిపేరు బడయ జూసి
    అమ్మ లక్కలందరు గూడి యనిరి కనక
    గర్భముందాల్చెమగడని, కాంత మురిసె

    దుర్భర మైన నాటి గతి దూరము జేసెను రాగసాధనన్
    నిర్భయుడయ్యి తానిపుడు నేర్వగ బూనెను రాగసర్వముల్
    అర్భకరీతిసాధనపు నైష్ఠికుడై ఘన రాగమర్మమా
    గర్భము దాల్చె భర్తయని కాంత వచించెను సంతసమ్మునన్


    రిప్లయితొలగించండి