29, జూన్ 2020, సోమవారం

సమస్య - 3412

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్"
(లేదా...)
"పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్"

54 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వగలన్ మాపెడు శంకరాభరణమున్ భాగ్యమ్ముగా నెంచుచున్
    సగమౌ రాత్రిని కైపదమ్ము గనుచున్ స్వాస్థ్యమ్ము కోల్పోవకే
    దిగులున్ జెందక పూరణమ్ము లిడెడిన్ ధీమంతుడౌ శాస్త్రికిన్
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకే కాదు... ఈస్థితి మరికొందరిది కూడా...
      చక్కని (సరదా) పూరణతో శుభారంభం చేసారు. అభినందనలు.

      తొలగించండి

    2. సరదాగా: (డాక్టర్ మునిగోటివారి స్ఫూర్తితో)

      "యా నిశా సర్వభూతానాం..."

      వగలన్ మాపగ మానసంపు వసతిన్, ప్రారబ్ధ కర్మంబులన్
      తెగెడిన్ రీతిని గైకొనన్ ముదమునన్ ధీశక్తినిన్ బ్రోవగన్,
      రగులన్ యోగికి హృత్తునందు తపమున్ రంజిల్లగా బ్రహ్మమే
      పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

      తొలగించండి
  2. నగరములందున నేడిటు
    దిగబడె నమెరిక కొలువుల తీరును జూడన్
    సగటున నుద్యోగులకిక
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దిగులున్ జెందుచు వైరసున్ తలచి వే తెప్పించుచున్ మాస్కులన్
    వగలన్ జెందెడి సాఫ్టువేరు ఘనుడే వ్యాపారియై కొంపనున్
    సగమౌ రాత్రిని క్యాలిఫోర్నియులతో సంభాషణల్ కూర్చగన్
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  4. ("పూజాఫలం"చిత్రంలో "పగలే వెన్నెల" గేయంలో మహాకవి నారాయణరెడ్డి గారి సురభిళసూక్తి )
    వగలన్ బాపెడి గేయముల్ వరుసగా
    వర్షించు "సీనారె"యే
    జగమే సంతసిలంగ జెప్పెనుగదా
    చాతుర్య మొప్పారగా
    పొగడల్ జిమ్మెడి గంధపుంబలుకునే
    "బూజాఫలం"బందునన్
    బగలే రాత్రిగ రాత్రియే పగలుగా
    భావంబునం దోచెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
      (1964 లో పూజాఫలం విడుదల అయినపుడు నేను 9వ తరగతిలో ఉన్నాను. మొదటిరోజే ఆ సినిమాను చూసి వచ్చిన మా సైన్సు మాస్టారు మరునాడు క్లాసులో "ఛ.. ఛ... ఏం పాటలురా? పగటిపూట వెన్నెల అట.. ఊహలు కదులుతాయట... వాటికి కన్నులట.. అర్థం పర్థం లేని పాటలు! రోజురోజుకు సినిమా సాహిత్యం దిగజారిపోతున్నది" అని బాధపడ్డాడు)

      తొలగించండి
    2. అన్నట్టు... నాకెంతో ఇష్టమైన పాటలలో ఇదొకటి. మా అమ్మాయికి కూడా!

      తొలగించండి
  5. పగలున యరుణ గ్రహణము ,
    నగరము రేతిరి దివియల యంశువు లుండన్
    నగరము నా దినమందున
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి


  6. జగమే ఊయల బతుకున
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్
    వగలాడి జిలేబి కరము
    ను గైకొన మనికితపాటును పడెనొడయుడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. "జగడాలమ్మిని పెండ్లియాడ నరరే సంహార సల్లాపమా
    యె గదా జీవిత మిద్ది" యింటి మగడే "యేనాటి బంధమ్మిదో
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్
    భగవాన్" కావుమయా యటంచు విభుడిన్ ప్రార్థించె పోరామితో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కర్మ యోగి:

      చెవులు మెలియబెట్టి చెంపమీద చరచి
      గుండు మీదమొట్టి కొట్టకుండ
      మంచి మార్కులిచ్చి మనసునెపుడు దోచు
      కంది శంకరయ్య కర్మ యోగి!

      మరల మరల వందమార్లు తప్పునుజేయ
      మరల మరలదిద్ది వరలుచుండు
      విసుగులేని ముసుగు వీరుడయ్య ఘనుడు
      కంది శంకరయ్య కర్మయోగి!

      యతులు దొబ్బబెట్టి మతులను పోగొట్టి
      ప్రాస మట్టుబెట్టి పద్యమల్ల
      సుత్తి కొట్టకుండ సూత్రములను జెప్పు
      కంది శంకరయ్య కర్మ యోగి!

      అర్ధ సున్నలడిగి హైరాన గావించి
      అన్య భాషలన్ని సన్యసించి
      సున్నలిచ్చి నగెడు శూరుడు కాడయా
      కంది శంకరయ్య కర్మ యోగి!


      పరమానందపు శిష్యుడు:
      జి. ప్రభాకర శాస్త్రి
      హైదరాబాదు

      తొలగించండి

    2. జిలేబి గారు:

      వీటికి మరో 96 కలిపి "మన శంకర శతకం" పూర్తి చేయుడీ!

      😊

      తొలగించండి
  8. సగ భాగము జారె నకట!
    మగవాడను పెండ్లి లేదు మగువయు లేదే 
    నాగతి యింతేనాయని 
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్ 

    రిప్లయితొలగించండి
  9. సెగలన్ రేపెడి వయసున
    చిగురుంబోడియె దొరకగ సిగ్గులు పారన్
    బుగులన్నది వదిలేయగ
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ నాటి శంకరా భరణము‌ వారి సమస్య


      పగలే రాత్రి గను రాత్రి పగలుగ నయ్యెన్


      ఇచ్చిన పాదము కందము‌‌ నా పూరణ సీసములో




      కలుగులో‌ దాచెగా కౌరవుల్ సైందవున్ పార్ధుని ఘనమౌ శపధమును విని,

      మాయతో కృష్ణుడు మార్తాండు‌
      ప్రభలను
      నాప తిమిరము కన బడెను గద

      భీముని తనయుడు భీకర రణమును
      సలుపు చుండగ నా రిపులకు చుక్క

      లే కన బడ పగలే రాత్రి గను రాత్రి
      పగలుగ నయ్యెన్ నభమున నాడు

      సైంధవ వధ సమయమున సవిత పగలు

      కను మరుగు కాగ పగలు చీకట్లు కమ్మె,

      నసురుల రణమున్ కాంతులు నభము లోన

      కలుగ రాత్రి సమయము పగలుగ దోచె

      తొలగించండి
  11. నగములు సంద్రములు గడచి
    మగతగ దేశమును జేరి మాటల నుడువన్
    రగులగ జెట్లాగు సెగలు
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్!

    రిప్లయితొలగించండి
  12. జగమం దన్నివిధాల సంపదలెపో సంతోషముల్ గూర్చు నా
    కగు నవ్వానిని బొందు టెట్లయిన ధ్యేయం బియ్యదే యంచు బూ
    ర్తిగనందే చరియించువాని కిచటన్ ధీశక్తి క్షీణించు నీ
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  13. జగమంతయు మారెనుగా
    నగరమిదా యనగనేడు నవయుగమందున్
    నగుబాటయె నాగరిగత
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  14. మగడా దూరవిదేశకార్యగతుడౌ మారప్రతీకప్రభా
    ద్విగుణీభూతమనోహరాకృతిమనస్తేయుండు ప్రాయమ్మహో
    సొగసుం జిందెడి ప్రౌఢమై యెసగె యిచ్చో విప్రలంబాప్తిలో
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. విగతుండయ్యెనువిభుడని
    వగపది యును హెచ్చుచుండ వపువది క్రుంగన్
    దిగులది మనమున నిండగ
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  16. మగువకురులలోరాతిరి
    వగలనుకురిసెడివయారివాల్చూపులలో
    పగలునుగాన్పించుటతో
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  17. మైలవరపు వారి పూరణ

    దిగులో! మోదమొ! నేనెఱుంగ! గడు భీతిన్., దేవ! త్వద్విశ్వరూ...
    పగతంబయ్యె గ్రహాదులున్ భువనముల్ బ్రహ్మాండభాండమ్ములున్!
    జగదాధార! యనేకబాహునయనాస్యాలోకనభ్రాంతిచే
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  18. పగలిక విద్యుత్తుండదు
    మగనికి సాయమ్ము జేయ మాలతి యందున్
    మగువలు పిల్లలతో జన
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి

  19. నా పూరణ.
    *** ********
    (మయసభలో ప్రవేశించిన దుర్యోధనుని ఉవాచ...)

    మత్తేభ విక్రీడితము
    **** *** **** ****

    తెగ దోచెన్ మది రమ్యమౌ మయసభే! దివ్యమ్మె ఈ సౌధమే!

    అగుపించెన్ గద చిత్రముల్!తెలుప శక్యంబౌనె ఈ మాయలన్

    సొగసైనట్టి భవంతినందు దిరుగన్ చోద్యంపుగా హృత్తుకున్

    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోచెడిన్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  20. రగిలెన్ మానసమంతయున్ విరహమే రాత్రిళ్ళు బాధింపగా
    మగువన్ జేరగ మోజుతో పనులనే మానేసి తాజేరగన్
    మగడేతెంచెనటంచు మోదమున సమ్మానించి సేవింపగా
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  21. పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్
    బిగువున్ వీడక రేబవళ్ళు కునుకే వేయంగఁ నే నోచవే
    నగముల్, లోయల మంచులోపలను, నానా యెండలన్ మ్రగ్గుచున్
    జగమున్ నీసరితూగ పాతికుడ నే జైకొట్టి మ్రొక్కన్ దగున్

    పాతికుడు-సిపాయి

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.

    అగుపించక క్షణకాలము
    గగనము నందు రవి పూర్తి గ్రహణంబందున్
    అగుపించ గ్రహణము పిదప
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్.

    రిప్లయితొలగించండి
  23. వగలాడి వలపు మత్తున
    సిగ లోతుగ మునిగి నట్టి చెలువపు ప్రియకు న్
    జగమే యూయల యగుచున్
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యె న్

    రిప్లయితొలగించండి
  24. నగుమోము తోడ వెలిగెడు
    నగణితమహిముని గనుచును ననవరతంబున్
    జగమునె మరచిన మునులకు
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  25. తెగ పుత్రోత్సాహంబీ
    నగవులయోధ్యా పురమున నరులందరిలో
    నిగ, రాముని జననముతో
    పగలే రాత్రిగను రాత్రి పగలుగనయ్యెన్

    రిప్లయితొలగించండి
  26. పగఁబట్టినరాహువుచూ
    డగతనవిషమంతజిమ్ముఠావుననినుడే
    వగతోతేజముఁబాయగ
    పగలేరాత్రిగనురాత్రిపగలుగనయ్ష్యెన్

    రిప్లయితొలగించండి
  27. విప్రవర్యుడు అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణపరమాత్మ తో....

    కందం
    జగమే మీరుగ రుక్మిణి
    సుగతిన్ బడయంగఁ గృష్ణ శోచించెనయా!
    స్వగతమ్మున తమ యూహలఁ
    బగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్!!

    గురువుగారితో శిష్యప్రముఖుని సతీమణి:

    మత్తేభవిక్రీడితము
    రగిలెన్ గోరిక తా వధాన మొకటిన్ రంజిల్ల జేయంగనే
    తగదన్నన్ వినఁబోడు వ్యాకరణ, తత్సంబంధ శాస్త్రాదులన్
    మిగులన్ నేర్వఁగ నంకితమ్మగుచుఁ దా మేనెంచడై నిద్రలన్
    బగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్


    రిప్లయితొలగించండి
  28. నగవుల్ జిమ్ముచు మోముపై పనుల విన్నాణమ్ముతోచేయుచున్
    సెగలన్ రేపుచు చిక్కకున్నపవలున్ చీకట్లు క్రమ్మున్ మదిన్
    రగులన్ కోర్కెలు, వెల్గులీను సఖి తారాన్ విచ్చు చీకట్లు వే
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  29. నగరంబందుననర్ధరాత్రముననైనన్ దీప సందోహముల్
    పగలేయట్టులకానుపించునికనేపారంగ లోగిళ్ళలో
    పగలున్ దీపములేనిచోనచటకన్పట్టన్న మావాస్యగన్
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  30. మగసిరిగలిగినభర్తను
    బగలునుఱేయియువిడువకప్రమదముతోడన్
    గౌగిలియందుననునుపగ
    పగలేరాత్రిగనురాత్రిపగలుగనయ్యెన్

    రిప్లయితొలగించండి
  31. దిగులే నిద్రకు ముదుకకు
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్,
    వగలే నూత్నపు జంటకు
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్.

    రిప్లయితొలగించండి
  32. తగ నానందం బేపా
    రఁగ మిత్రయుగము పరస్పరమ్మున్ భాషిం
    చఁగ నట ఖండాంతరములఁ
    బగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్


    క్రమాలంకార స్ఫురణము:

    విగతశ్రీ గత మిత్ర బాంధవ యశో విధ్వంస భావంబునన్
    మృగలోలాక్షి ధ రార్థ ధాన్య వహముల్ నిత్యంబు వర్ధిల్లగన్
    గగ నాకారము దాల్చి చిత్తమున దుఃఖహ్లాదముల్ గల్గగాఁ
    బగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

    రిప్లయితొలగించండి
  33. వృద్ధస్తావత్ చింతాసక్తః

    బిగువది సడలగ కాయము
    తగు పనిలేకయె పగటిని దానిద్రించున్
    దిగులును రాత్రులు మేల్కొను
    పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్

    నగరంబందున రాత్రివేళలను నానాభంగులన్ వెల్గుచున్
    వగలన్ జూపుచు నాతులే సరసమౌ వ్యాపారమున్ సేయగా
    పగటిన్ స్తబ్ధుగ జోగెడిన్ నెలవునన్ వారాంగనా జీవికన్
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునన్ దోచెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వగలన్ మాపుచు మేల్కొనన్ పగటినిన్ భార్యామణుల్ బంధులున్
      దిగులున్ జెందక గుఱ్ఱుగొట్ట ముదమున్ ధీమంతులౌ తాతలే
      సగమౌ రాత్రిని కేకలేసి వరలన్ స్వప్నమ్ములన్ భీతినిన్
      పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్

      తొలగించండి
  34. జగమంతామయ బాధలన్ బడగ నాశాపాశ సంబద్ధుడై
    సగమౌ జీతముతో కుటుంబ మెటులంచాలోచనే నిత్యమై
    దిగులున్ జెందుచు జీవనంబెటుల యేదీతీరమున్దిక్కనన్
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోచెడిన్

    రిప్లయితొలగించండి
  35. అగుపడు నక్షత్ర శాలన
    జగమంతయు జూపు చుండ జనులకుమదిలో
    సొగసునచంద్రుడు,చుక్కలు
    పగలేరాత్రిగను రాత్రిపగలుగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  36. మగవాడింటనునుండగాగృహిణిదామైకంబుతోనుండుచో
    బగలేరాత్రిగరాత్రియేపగలుగాభావంబునందోచెడిన్
    వగలేజేయునునట్లుగానెఱుగుమోబాలా!విచిత్రంబునీ
    పగలున్ఱేయియువారికుండదికనాభావంబునేనాటికిన్

    రిప్లయితొలగించండి
  37. మ:

    నగరమ్మందున లాకుడౌను కడు దీనావస్థ యింటుండనై
    వగలున్ ప్రేమము వంటనేర్పె సతి నేవారించినన్ బెట్టుతో
    మొగ మాటమ్మిక వీడె పాకముల నామోదింప వండించనై
    పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునన్ దోచెడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి