15, జులై 2020, బుధవారం

దత్తపది - 169

కవిమిత్రులారా,
పాపి - ఖలుఁడు - హీనుడు - ద్రోహి
పై పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
విష్ణుస్తుతి చేయండి.

47 కామెంట్‌లు:

  1. పాపి ఖలుఁడు హీనుడు ద్రోహి వాడెవడవు
    శ్రీమహావిష్ణుని చరణశ్రీయుగంబు
    చింత నిల్పెనేని చరమ జీవితక్ష
    ణంబు నైననారాయణు నగరిఁజేరు

    రిప్లయితొలగించండి
  2. పాపి కంసమామఁ బరిమార్చి నుతినొందె
    ద్రోహి పంక్తికంఠుఁ దునిమి వైచె
    హీనుడు శిశుపాలు ప్రాణమున్ హరియించె
    ఖలుడు వాలి నేసె కమలధవుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లోక కంటకులను పీకివేసి జగతి
      రక్ష సేయు ఘనుని రమకు మగని
      నేమని నుతియింతు? గాము దండ్రిఁబొగడ
      శంకరార్య శక్తి చాలకుండె!

      తొలగించండి
  3. పాపి రావణుఁ గూలిచి వసుధ గాచె
    ఖలుడు కంసుని నిర్జించి కలత బాపె
    బుద్ధి హీనుడు శిశుపాలు బొగరుమార్చె
    ద్రోహి సైంధవు దెగటార్ప దోడు నిల్చె
    ధర్మ రక్షకుడౌ హరి దయను బ్రోచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధర్మరక్షకు డా హరిన్ దలతు మదిని" అంటే స్తుతి కూడా తోడౌతుంది కదా?

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి హేమమేఖలుడు చింతిత కామములిచ్చు ధేనువే
      కాపరి యెల్లవారికిని కామవిహీనుడు కాలరూపి సం
      తాపము దీర్చువాడు సుర తాపసకోటికి దైత్యద్రోహియై
      పాపినిదిద్ది తానొసగు పావన పుణ్యపదంబు చెంతనే

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    కరోన నుండి కాపాడుమని :
    __________________________

    భక్త జనుల బ్రోవ - ప్రావేల్పు మూకల
    ప్రాణముల్ హరియించు - పాపి యెవడు
    దుర్వర్తనము జేయు - దుష్టుల పరిమార్చు
    కర్మము నొనరించు - ఖలుడెవండు
    రక్కసు వధియించి - రత్నగర్భను గావ
    యేకలీడైనట్టి - హీనుడెవడు
    బలి దానమును గొని - పాతాళమునకంపి
    ద్రోహమున్ జేసిన - ద్రోహి యెవడు

    అట్టి వానిని విష్ణువు - నాత్మ నిలిపి
    క్రూరముగ చెలరేగుచున్ - క్షోణి నింక
    రుద్ర భూమిగ మార్చు క - రోన మృతుల
    నాప గల్గెడి టీకానొ - యౌషధమునొ
    వేగమిమ్మని వినుతింతు- వేనవేలు !
    __________________________
    ప్రావేల్పు = రాక్షసుడు, ఖలుడు = క్రూరుడు, ఏకలీడు = పంది

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  6. పాపియెవడు హీనుడెవం
    డో పావనుడె దయచూప ద్రోహియగునెవం
    డో పుట్టువడుగు కావం
    గా! పీతాంబరుని గొల్వ ఖలుడెవ్వడగున్ ?



    శుభోదయం

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. హీనుడ! పాపిని ద్రోహిని !
    నేను ఖలుడనయ్య దేవ ! నీ దయ రాదా!
    ఆ నరసింహుడవై నీ
    వే నన్నిక గైకొనంగ వేడెద నయ్యా


    ఇది జీపీయెస్ వారి తరపున :(


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. నీ కృ’పా పి’పాసితుడనై నిరతము నిను
    తలచెద దయా శి’ఖలుడు’వు దానవారి
    ఇందిరామందిరమ నే స’హీ ను డు’ వెద
    ధ్రువునిజేర మ’ద్రోహి’త దుముకు చుండె

    శిఖ = కిరణము
    ఉడువు = విడుచు
    సహీ = నిజము
    రోహిత = నెత్తురు

    రిప్లయితొలగించండి
  9. రామను వీడి ధర్మద్రోహి బలి యింట ద్వార పాలకు డవై దాగినావు,

    అధిపా పిలుచుచుంటి నార్తితో నిన్నని కరిరాజు మొరలిడ కట్టు కున్న

    భార్యకున్ చెప్పక పరుగు బెట్టితివీవు,
    త్ర్యంగటముని యొక్క‌ తపము‌ నాప

    మనుచు తెలిపి నీదు తనయు ని అంగహీ
    నుడుగ మలచినావు పుడమి పైకి


    వెలుగుల నిడుచు ఖలుడుగా పిలువ బడచు,

    ధర్మ పధమున నడపుచు కర్మ ఫలము

    జనుల కిడునట్టి శ్రీ హరీ మనము లోన

    సతతము కొలుచు చుందును సంతసముగ

    రిప్లయితొలగించండి
  10. నీకృపా పిపాసిని నేను నీరజాక్ష!
    సతమఖలుడుగ వైద్యము సలిపిమించి
    యీకరోనతో నారోగ్య హీనుడైతి
    బ్రోవుమయ్య విద్రోహి కరోన నుండి

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతి స్వర్ణ మేఖలుడు సేయు కృపాపికరావ వేణు నా
    లాపము విన్న చాలునని రాగము మీరగ రామలందరా
    రూపమె తల్వ, ద్రోహులకు ద్రోహిగ కౌరవులంతమొందగన్
    తాపము దీర్చె ధర్మజుకు ధార్మిక హీనుడు గాక నెప్పుడున్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.

    ఖలుడు,హీనుడు,పాపియౌ కంసుఁ జంపె
    ద్రోహి శిశుపాలు శిరమును త్రుంచి వైచె
    నా హరిని స్తుతియింతు ననవరతమ్ము
    భక్తిఁ వేడెద సతము కాపాడమనుచు.

    రిప్లయితొలగించండి
  13. హీనుడు పాపియు ఖలుడగు
    దానవుడా ద్రోహి జంప ధరణిని నీవే
    మానవునిగ పుట్టిన హరి
    నీనామమె నాకు రక్ష నీరజ నేత్రా!

    రిప్లయితొలగించండి
  14. భక్తుల ప్రాపా ! పితవై
    యుక్తము సంసార శృంఖ లుడుగం జేయ న్
    ముక్త సహీ నుడు ల గొలుతు
    భక్త ద్రోహిని దునిమెదు పాహి మురారీ !

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    నిందాస్తుతి

    పాపియుఁ బాపకార్యశతభాగ్యునినా శిశుపాలుఁజంపుటన్.,
    శ్రీ పరిమత్తు గర్వగుణనిర్మలునా బలి ద్రొక్కి ద్రోహియున్.,
    మాపతినెంచగా ఖలుడు మాతులు బంధువు జంపియుంట., దా..
    నీ పగిదిన్ గనంగ గుణహీనుడు నిర్ఘృణతన్ జరించుటన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. ఖలుడుగాఁదోచునభిమన్యుగావలేక
    హీనుఁడుకన్పట్టునోకపట్టుహ్రీనివీఁడి
    రక్కసుకడుపుదాగియుద్రోహియయ్యె
    పాపివిష్ణునిచేష్టలుబోధపడవు

    రిప్లయితొలగించండి
  17. పాపిపాపము శ్రీహరిబాపునపుడు
    ఖలుఁడు వీడనిమనమున తలుపబోడు
    బుద్ధిమంతుడైననుహీనబుద్ధియైన
    ద్రోహియైనను కాపాడు పాహియనిన

    రిప్లయితొలగించండి
  18. పాపి కంసునిఁ దునుమాడ వసుధఁ బుట్టి
    హీనుడు ఖలుఁడు ద్రోహియౌ మేన బావ
    యైన శిశుపాలుఁ జంపిన యధిప సతము
    జేరి కొలుతును బ్రోవుమా జినుడ నిన్ను.

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. పాపచయము పాపి భృశము
      కాపు నఖలుఁడు జపియించఁ గైటభ దమనా
      యేపుగ నహీనుఁడు తలఁచఁ
      బ్రాపును భద్రోహిత విధిఁ బడయఁగఁ గనుమా

      తొలగించండి
  20. 15.07.2020
    అందరికీ నమస్సులు🙏

    *పాపి - ఖలుఁడు - హీనుడు - ద్రోహి*
    పై పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
    విష్ణుస్తుతి చేయండి.

    *ఆ వె*

    పాపులనితలపక బాపుము శ్రీహరి
    ఖలుడ నేను గాదు కొలుతును, బల
    హీనుడనుగొనుమిక హింసించకుమిటుల
    ద్రోహి గాదు నాకు తోడు నీవు

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  21. తే.గీ.

    పాపి కర్మల విడనాడి పదము జేర
    ఖలుడు హీనుడు మదిగోరి కయిని మోడ్ప
    ద్రోహి తప్పును మన్నించి త్రోవ చూపు
    వరము లొసగెడి హరి నీకు వందనమ్ము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. ఖలుడుహీనుడుద్రోహియౌకంసునిహతి
    జేసి పాపియౌరావణుచిలుమునణచి
    సకలజనులకునొనరించిసంతసమును
    రక్షజేసిననోహరి!లచ్చిమగడ!
    వందనంబులుశతకోటివందనములు

    రిప్లయితొలగించండి
  23. పాపిట నిల్చి లక్ష్మికి సపర్యలు చేసెడు పావనుండు తా
    బాపును చీకటుల్ ఖలడు!పాల సముద్రము నేలురాజు మా
    శ్రీపతి యంగహీనుడు వచించును తండ్రి యటంచువీని హే!
    పాపికి ద్రోహియౌనితడు పాములపై శయనించు ధీరుడై

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  24. వ్యాపి! నినుగొల్వ మనుజుడు పాపి యగునె!
    అఖలుఁడని నమ్మి గొలచితి నాదిదేవ!
    గావుమింక గ్రహీనుడ కాదనకుమి!
    ద్రోహితాత్మకులా చీని దూకుడణచు!

    అఖలుఁడు-ఉత్తమ వైద్యుడు
    గ్రహీనుడు-గాలి సోకినవాడు (కరోన)

    రిప్లయితొలగించండి

  25. ఉత్పలమాల
    పాపిని రావణాసురుని వాటున గూల్చి పరమ్మునిచ్చితే
    పాపని దైత్యుడై ఖలుడు బాధల బెట్టగ ద్రుంచి బ్రోచితే
    సైపక దంతవక్త్రునొక సర్గ విహీనుని జీల్చి కాచితే
    పాపకుడైన ద్రోహి శిశుపాలుని ముక్తిపథమ్ముఁ జేర్చితే
    యోపుచు మాదు తప్పుల సమున్నతి నీయగ రావె మాపతీ!

    రిప్లయితొలగించండి
  26. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః మహోదయులకు శుభోదయం.
    నేటి దత్తపది కి ప్రయత్నం.

    స్వామీ ! పాపిని బ్రోవవు!
    నీమాహాత్మ్యము ఖలుడికి నీతియు గాదే!
    నీమర్మము హీనుడు గన
    డే! 'మా'! ద్రోహి వినలేడు శ్రీనరసింహా!

    రిప్లయితొలగించండి
  27. పాపి కంసువధించిన బాలకృష్ణ
    ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
    ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
    హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
    పార్థ సారథివైనట్టి పద్మనాభ!

    రిప్లయితొలగించండి
  28. పాపి కంసువధించిన బాలకృష్ణ
    ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
    ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
    హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
    పార్థ సారథివైనట్టి పద్మనాభ!

    రిప్లయితొలగించండి
  29. పాపి కంసువధించిన బాలకృష్ణ
    ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
    ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
    హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
    పార్థ సారథివైనట్టి పద్మనాభ!

    రిప్లయితొలగించండి