17, జులై 2020, శుక్రవారం

సమస్య - 3429

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంది శంకరయ్య కవులఁ జెఱచు"
(లేదా...)
"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"
(కవితాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

64 కామెంట్‌లు:

  1. గురువు గారికి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు

    సమస్య :-
    "కంది శంకరయ్య కవులఁ జెఱచు"

    *ఆ.వె**

    కంది శంకరయ్య కవులఁ జెఱచు నని
    గిట్ట నట్టి వారు కేక వేయ
    తెలియ నట్టి వారు తెలుసుకుందురు గదా!
    గొప్ప పేరు వచ్చు కోవిదునకు
    ......................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య :-
      "కంది శంకరయ్య కవులఁ జెఱచు"

      *ఆ.వె**

      పోటు గాడి వైన పూరణ జేయుము
      పండితుండ! దత్తపదుల నింపు
      నచ్చినట్లు వ్రాయి న్యస్తాక్షరులనుచు
      కంది శంకరయ్య కవులఁ జెఱచు
      ......................✍️చక్రి

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    కంద పద్యమందు నేను కాంగ్రెసోళ్ళ తిట్టగన్
    నందమొంది నవ్వుచుండి నాకు హర్ష మీయుచున్
    ఛందసంత నేర్పి నాకు ఛాందసమ్ము త్రోలెడిన్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్

    రిప్లయితొలగించండి
  3. 17.07.2020
    కంది గురువులకు జన్నదిన శుభాకాంక్షలతో...💐💐🌸🌸

    *సమస్యే* పూరణం.. 😊

    *ఆ వె*

    విద్యనేర్పు తాను విశ్వము నంతయు
    పద్య కవుల కొరకు పాటు బడును
    మాడు పగులు పలు సమస్యలిచ్చి, యకటా
    *కంది శంకరయ్య కవులఁ జెఱచు*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    💐🍫🎂7️⃣0️⃣🎂🍫💐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 17.07.2020
      మరో పూరణ..
      *ఆ వె*

      పద్య సేద్యమనుచు పండితులకు, నహో
      అర్ధరాత్రి వచ్చి యావహించి
      మాడు పగులు పలు సమస్యలనిచ్చుచున్
      *కంది శంకరయ్య కవులఁ జెఱచు*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🌸🌹💐🍫🎂🍫🌸🌹💐

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నందమొంది యాంగ్లమందు నాల్గు మాటలొల్లుచున్
    సందు చిక్కగానె నేను జంకువీడి వాడగన్
    మందబుద్ధి యనుచు నన్ను మందలించకుండెడిన్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి సప్తతి శుభాకాంక్షలు

    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
    అందురేల మీకు తగదు అట్టి మాటలాడుటే
    అందజేయు నిరతమున్ మహత్వ పద్య విద్యలన్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను నిలబెట్టగన్

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    అబ్బో కోతలే కోతలు :
    __________________________

    పంది మేయు పానకమ్ము - పరమ ప్రీతి తోడుతన్
    సందు లోన కోడి యెగురు - సాగరమ్ము దాటగన్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
    మంది కోత కోయుచుండ్రి - మర్మమేదొ తెలియదే
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. మంచి పద్దెమల్ల మహిన కీర్తింతురు
    వ్రాయనెంచ బూన వరలుసుఖము
    యెవరు బల్కినారు యీరీతి మాటల
    కంది శంకరయ్య కవుల జెఱచు!!

    రిప్లయితొలగించండి
  8. కంది శంకరయ్య కవులఁ జెఱచునంచు
    తప్పు మాటలాడ తగదు తగదు
    కంది శంకరయ్య కవుల కుల గురువు
    వందనమ్ము జేతు భక్తి నెపుడు

    రిప్లయితొలగించండి
  9. B-2)
    నూటికి నూఱుపాళ్ళూ అపవాదే :
    __________________________

    చందమామ లాగ వెలుగు - చల్లగ ప్రసరించునే
    వందలాదిమందికి తను - పద్యవిద్య నేర్పెనే
    ఎందువలన వాదు పుట్టె - నేరికి కనుకుట్టెనో
    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    __________________________

    రిప్లయితొలగించండి
  10. B-3)
    అబ్బో కోతలే కోతలు :
    __________________________

    కందుకూరు నందు పుట్టె - కాకికి నొక కేకియే
    మందు త్రాగు మానవుండు - మఘవుడుగను మారునోయ్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
    మంది కోత కోయుచుండ్రి - మర్మమేదొ తెలియదే
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  11. B-4)
    పాదాభివందనం :
    __________________________

    వందనములు సేయ రండు - పాదములకు శంకరున్
    వంద కాదు వేనవేల - పద్యములను దిద్దెనే
    ఎందువలన వాదు పుట్టె - నెవరికి కనుకుట్టెనో
    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    __________________________

    రిప్లయితొలగించండి
  12. ఆ.వె//
    సామరస్యముగను స్పందన దెలిపెడి
    కంది శంకరయ్య, కవులఁ జెఱచు l
    ననుట భావ్యమేన ? నాందివాదులగు, మీ
    దివ్యవాక్కువలన భవ్యమగును ll

    రిప్లయితొలగించండి
  13. (సరదా పూరణ)
    విందుజేయు పద్యములకు వేదిక నమరించి తా
    నందరికిని విద్య బంచుటందె పొందు మోదమున్
    అందు మోజు బెరిగి కడకు వ్యసనమాయె కవులకున్
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్

    రిప్లయితొలగించండి
  14. కంది వారనిన‌‌ సతము కవుల గురువు

    గాను ఘనత నొందు నిచట, కష్ట మనుచు

    నెపుడు తలచక నోర్పుతో నెమ్మి బడసి

    కవుల పూరణల్ వీక్షించి కాచుచుండు,

    శంక యేలేక నా (కంది శంకరయ్య

    కవుల చెరచు) నొకపరి దుష్కర పు ,క్లిష్ట

    ప్రాస తో సమస్య నిడును స్వంత పనులు

    తనకు యున్నచో వీక్షణ ల్ తప్పు కొనుచు

    చక్క బెట్టు తన పనులు‌ ,నిక్క మిదియె


    (గురువు గారికి జన్మ దిన శుభ కాంక్ష లతో

    సరదాగా చిరు పద్య సుమము
    పాద పద్మముల చెంత నిడుచు

    క్షమార్హుడను మనసు నొప్పించిన)

    రిప్లయితొలగించండి
  15. B-5)
    నేత కాడూ దొంగా కాడూ - మరిఎందుకీ వాదు??? :
    __________________________

    మంది తిండి మొత్త మంత - మర్మముగను మెక్కెనా ?
    వంద వేలు లక్షలాది- పైకము తను దోచెనా ?
    ఎందువలన వాదు పుట్టె - నెవరికి కనుకుట్టెనో ?
    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  16. B-6)
    పళ్ళ చెట్టుకే గదా - రాళ్ళ దెబ్బలు :
    __________________________

    కంద పద్య రచన నేర్వ - కకుభముగను నిలచునే
    నింద పద్య రచన నందు - నేర్పరులను జేయునే
    విందు మించి పద్య రచన - విభవములను విప్పునే
    ఎందువలన వాదు పుట్టె - నెవరికి కనుకుట్టెనో ?
    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  17. B-7)
    సుద్దులు నేర్పే సుందరుడు :
    __________________________

    చిందు వేయ వచ్చు వాని - చిత్రితమగు రచనతోన్
    సుందరుండు శంకరయ్య - సుద్దుల తను నేర్పగన్
    ఎందరెన్ని మాటలనిన - నెప్పుడు తను పూజ్యుడే
    ఎందువలన వాదు పుట్టె - నెవరికి కనుకుట్టెనో ?
    అందముగా చెప్పినట్టి - యనృతమిది తెలియుమా
    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  18. B-8)
    పంది పెంట వాని నోట పగలగొట్టి పెట్టరే :
    __________________________

    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    దుందుడుకుగ చెప్పినట్టి - దుష్టులనిక పట్టరే
    పంది పెంట వాని నోట - పగలగొట్టి పెట్టరే
    ఛందములను నేర్చినట్టి - ఛాత్రులు కదలండహో
    ఎందరెన్ని మాటలనిన - నెప్పుడు తను పూజ్యుడే
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  19. B-9)
    కంది శంకరయ్య ఘనుడు కవులను జెడ పెంచగన్ :
    __________________________

    ---"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"---
    మందు త్రాగి చెప్పినట్టి - మాయ మాట లివ్వియే !
    ముందు నిలచి కాదనంగ - పూజ్యులార రండహో
    కంది శంకరయ్య ఘనుడు - కవులను జెడ పెంచగన్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    :
    __________________________

    కంది శంకరయ్య - కవులజేయు నిజము !
    కంది శంకరయ్య - కవులఁ జెఱచు
    నన్న వాని గుండు - సున్నపు బొట్లెట్టి
    రేవుగుఱ్ఱము పయి - ద్రిప్పరండు
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  21. పద్య పాద మనుచు పద సమూహమునకు
    చేతనమునిడి పూర్తిజేయ గోరు
    కంది శంకరయ్య, కవుల జెఱచు
    వారి జడత నుండి , బయలు పడునటుల

    రిప్లయితొలగించండి
  22. A-2)
    మట్టి వాని నోట గొట్ట వలయు :
    __________________________

    కంది శంకరయ్య - కవులజేయు నిజము !
    కంది శంకరయ్య - కవులఁ జెఱచు
    నన్న వాని వదన - మన్న మెట్లు తినును
    మట్టి వాని నోట - గొట్ట వలయు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  23. A-3)
    నేర్పు హెచ్చ పాఠాలు నేర్ప గలుగు దిట్ట :
    __________________________

    కంది శంకరయ్య - కవులఁ జెఱచు నన
    నమ్ము వారు లేరు - యిమ్మహి గన !
    కంది శంకరయ్య - కపులకే పాఠాలు
    నేర్ప గలుగు దిట్ట - నేర్పు హెచ్చ !
    __________________________
    కపులు - కపిత్వం వ్రాసేవారు(అంటే తప్పులు వ్రాసేవారని...)

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  24. A-4)
    క్రతువు జేయ నెంచు కావ్యకారి :
    __________________________

    కావ్యరచన యందు - సవ్యసాచి యతడు
    కంది శంకరయ్య ! - కవుల జెఱచు
    ననుట కల్ల కల్ల ! - యశ్రాంత కావ్యంపు
    క్రతువు జేయ నెంచు - కావ్యకారి !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  25. శ్రీమాన్ కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్షలతో



    ఒక దశాబ్ద కాలముగ జిలేబీ భళి
    కంది శంకరయ్య కవులఁ జెఱ,చు
    రుకరి యై విముక్తి రూఢిగ చేసెను
    కైపదముల నిచ్చి కైపు జేర్చి



    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. A-5)
    గొడ్లు కాయు వాడు కూసెనీ రీతిగా :
    __________________________

    కంది శంకరయ్య - కవులను కాపాడు
    నొప్పు తప్పు జెప్పి - యొజ్జ వోలె !
    గొడ్లు కాయు వాడు - కూసెనీ రీతిగా
    -"కంది శంకరయ్య ! - కవుల జెఱచు"-
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులకు వినమ్ర వందనములతో జన్మదిన శుభాకాంక్షలు!

    పొద్దుపొడవకుండ పూరణలంచును
    కంది శంకరయ్య కవులఁ జెఱచు
    ననుచు గేలిచేయునట్టియిల్లాలికి
    గురువుగారిఘనత యెరుకరాదు.

    రిప్లయితొలగించండి


  28. ఆటవెలది ఆడె నాట్యము ఉత్సాహ
    ముగ జిలేబులమర ముందు వెనుక :)

    శంకరాభరణపు చావిడి త్వరితము
    రండి "కంది శంకరయ్య ఘనుఁడు
    కవులను జె డఁగొట్టఁ గన్" వెలసె నిచట
    కైపదమ్ములనెడు కాశ్య మిచ్చి



    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. వ౦ది లెవరు లేరు క౦దిని పొగడ౦గ
    పద్య మన్నయతని ప్రాణ మగును
    అ౦చు నూరుకోక అ౦దర చేర్చుకు
    కంది శంకరయ్య కవులఁ జెఱచు

    రిప్లయితొలగించండి
  30. కర్మ యోగి యతడు కవికుల తిలకుండు
    కువలయమ్ము కెల్ల గురువతండు
    కంది శంకరయ్య కవులఁ జెఱచు నంచు
    నీర్ష్య తోపలుకగ నీకు తగదు.

    రిప్లయితొలగించండి


  31. అందె వేసి నట్టి హస్త మాయె కైపదమ్ములన్
    సుందరమ్ము గాను చేర్చి సుప్రతిభను పంచగా
    నందరికి వెలసె జిలేబి నవ్యమైన పాంథుడై
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్



    ఉత్సాహమేనా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. కమిమిత్రులకు నమస్కృతులు. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన, తెలుపుతున్న శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.
    ఈనాటి సమస్య నన్ను ఉద్దేశించిందే కనుక దానిపై వచ్చిన పూరణలను నేను సమీక్షించడం ఉచితం కాదనుకుంటాను. అందులోను సప్తతి ఉత్సవం ఏర్పాట్లలో వ్యస్తుణ్ణై ఉన్నాను. కనుక కవిమిత్రులెవరైనా పూనుకొని ఈనాటి పద్యాలను సమీక్షిస్తే కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  33. తలను పెట్టుకొనును తప్పు వ్రాసినను దాఁ
    గంది శంకరయ్య కవులఁ, జెరచు
    దొసగుల నతి శ్రద్థ తోడ సుకవులను
    జేయ మనసు నొవ్వఁ జేయకుండ!

    రిప్లయితొలగించండి
  34. అందమైనపద్యరచనలలవరించుమీకివే
    వందనమ్ములందుకొనుడుపద్యపృచ్ఛకాగ్రణీ
    కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
    నిందవేయువారుమీదునెనరుతెలియజాలరే!

    రిప్లయితొలగించండి

  35. శ్రీ కంది శంకరా!
    చిరాయుర్భవ! యశస్వీ భవ! నమోऽస్తు!! 💐🙏

    తాను నేరిచి యితరుల తప్పుదిద్దు
    వారె యాచార్యు., లందు మీ పేరు గలదు!
    సప్తతిజననదినమహోత్సవము మీకు
    నాయురారోగ్యభోగభాగ్యమ్ములిడుత !!


    సమస్యాపూరణం😊🙏

    సుందరతరవర్ణశబ్దసూక్ష్మభావదృష్టితో
    నందముగసమస్యలిచ్చునర్ధరాత్రి., మా పతుల్
    పొందు మరచి., నిదుర మాని మున్గు చుంద్రు కైతలన్ !
    కందిశంకరయ్య *ఘనుడు* కవులను జెడగొట్టగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  36. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సప్తతి సందర్భంగా మీకు దంపతులకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరాలని మీరిలా సాహితీ సుధలను పంచుతూ కలకాలం విలసిల్లాలని కోరుకుంటున్నాను.🌹🌹🌹🎂🎂🎂💐💐💐

    కంది శంకరయ్య కవుల చెఱచు నన
    యచ్చు తప్పె యగును కచ్చితముగ
    శంకరాభరణపు వంకతో నీ కంది
    శంకరయ్య కవుల సతము మలచు!

    రిప్లయితొలగించండి
  37. పద్య కవుల మెచ్ఛు ప్రాజ్ఞు డై విలసిల్లి
    మిగుల ప్రోత్స హించు మేరు ఘనుడు
    కంది శంకరయ్య కవుల చెఱచు నెట్లు?
    వెన్ను తట్టు నతడు విజ్ఞు డగుచు

    రిప్లయితొలగించండి
  38. కంది శంకరయ్య యనగ కవిగ తార్కికునిగ మా
    కందరికిని మార్గదర్శకంబు జేసి సతతమున్
    సందియంబు దీర్ప నితడె సవ్యసాచి ! యిపుడు యే
    కందిశంకరయ్య ఘనుడు కవులను జెడగొట్టగన్

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. జటిల పూరణముల జంజాటమందున
    సమయ మెల్ల కూడ సాగి పోగ
    ఆగెనింట పనులు నాలితో తిట్టులు
    కంది శంకరయ్య కవుల జెఱచు

    డా.బి. ద్వారాకనాథ్

    రిప్లయితొలగించండి
  41. అందజేయు జ్ఞాన మధువు హర్ష మిడుచు నెప్పుడున్
    చిందు చుండు కవన వృష్టి శిష్యులైన వారికిన్
    మందబుద్ధియైన వాడె మాటలాడు నివ్విధిన్
    “కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్”

    రిప్లయితొలగించండి
  42. కందిశంకరయ్యకవులజెఱచుననె
    నమ్మవలదుమీరుకొమ్మలార!
    కవులబ్రోత్సహించెగమ్మనిబలుకుల
    సహనశీలియతడు సద్గురువును

    రిప్లయితొలగించండి

  43. పిన్నక నాగేశ్వరరావు.

    పద్య కవులకెల్ల వందిత వర్యుడు
    కంది శంకరయ్య; కవుల చెఱచు
    వ్యక్తి యనుట తగదు,పద్య దోషములను
    దిద్ది కవుల తీర్చి దిద్దు ఘనుడు.

    రిప్లయితొలగించండి
  44. నిలువ నేర్చి నట్టి బల్లిదులు కవులు
    గలరె వీని ముందుఁ గాంచ నెందుఁ
    బద్య భండనమునఁ బాటవమ్మది మీఱఁ
    గంది శంకరయ్య కవులఁ జెఱచు


    ఉత్సాహము.
    అంద ఱేల యుందు రిట్లు నందు నిందుఁ గందుమే
    సందు దొఱక నాడు వాఁడు చాలు నింక హాస్య మం
    దెందు ముందు నుండు, చింత నేల నొందు దయ్య యో
    కందిశంకరయ్య! ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవెలది పూరణమద్భుత మార్యా!నమోనమః!

      తొలగించండి
    2. సత్యవాక్కుకదా సుందరముగనే యుండును డా. సీతా దేవి గారు. ధన్యవాదములు.

      తొలగించండి
  45. వందనీయులందుప్రధముడుగదయెన్నభువినియీ
    కందిశంకరయ్య,ఘనుడుకవులనుజెడగొట్టగన్
    మందబుద్ధిగలుగుమందుడటులమాటలాడునే
    బంధులనగవారుపలుకసొబగుకాదుధాత్రిలో

    రిప్లయితొలగించండి
  46. సందియమ్ము లేదు సరిదిద్దు చక్కగ
    కంది శంకరయ్య కవుల;జెరచు
    ఛందపుం దొసగుల ఛాత్రుల పద్యాల
    వందనమ్ము లెన్నొ యందుకొనుచు

    మందలించడెపుడు దాను మన్ననలిడుగాని యే
    ఛంద మందు దొసగులన్ని సరళరీతి దిద్దెడా
    కంది శంకరయ్య ఘనుడు;కవులను జెడగొట్టగన్
    సందడించడయ్య నిజము జంగమయ్య సాక్షిగా

    రిప్లయితొలగించండి
  47. ఉత్సాహము:

    ముందు చూపు పద్యమలర ముదము మీర నేర్పుగా
    పొందు పరచె బ్లాగు నొకటి పూరణంబు పట్టుగా
    నెంద రెన్ని తప్పు జేయ నింద మాట లాడకన్
    ఛంద మింత జారనీక చక్క బెట్టి చూపరే
    కంది శంకరయ్య ఘనుడు కవులను చెడ గొట్టగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  48. తెలుగు బాష సొగసు తేటతెల్లము జేయ
    పద్య విద్య నేర్పి పలువురకును
    అనుదినమ్ము నదియె అలవాటుగాజేసి
    కంది శంకరయ్య కవుల జెరచు!!!

    రిప్లయితొలగించండి
  49. ఎందునైన కానగలమె యిట్టి గురువు నిమ్మహిన్
    వందనములు జేతురెల్ల వందనీయుడనుచునూ
    వందలాది మందికిలను పద్యవిద్య నేర్పినా
    కందిశంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్
    మందెమేలమునకు నైన మాట తప్పు బల్కడే!!!

    రిప్లయితొలగించండి
  50. వందనీయుడై కవిజన బంధువై సపర్యలే
    యందుకొనెడు మాన్యుడై సదాచరణ పిపాసియౌ
    కంది శంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్
    ముందు నిల్తు రంచుఁ బలుకు మూర్ఖుడెవడురా యిలన్.

    రిప్లయితొలగించండి
  51. ఉత్సాహము (క్రమాలంకారము)
    చందమున్ ప్రశస్తమైన చందమందు నేర్పుచున్
    విందుగన్ సమీక్ష నెఱపు వేల్పు నౌచుఁ, నంతకున్
    ముందు వచ్చిరాని చదువు బూని పాత గురువులున్
    కంది శంకరయ్య ఘనుడు, కవులను జెడఁగొట్టఁగన్

    రిప్లయితొలగించండి
  52. ఆటవెలది
    డెబ్బదేళ్ల యువకుఁ డబ్బురమన నర్ధ
    రాత్రమున బొడచెడు నంబరమణి!
    వాగ్విభవము నొసఁగు ప్రాజ్ఞుఁడనఁగ నెట్లు
    కంది శంకరయ్య కవులఁ జెఱచు?

    రిప్లయితొలగించండి
  53. పద్య మల్లు నట్టి ప్రతిభను నేర్పిన
    కంది శంకరయ్య కవుల చెరచు
    నన్న వారె చెడుదు రనుట జగతియందు
    వాస్తవ మగు నట్టి పచ్చి నిజము.

    మరొక పూరణ

    మేధకు పనిపెట్టి మేటిగా వ్రాయించు
    కంది శంకరయ్య కవుల చెరచు
    నన్నమాట నమ్మ నవనిలో సాధ్యమే
    చెప్పు డయ్య బుద్ధి జీవులార!

    రిప్లయితొలగించండి