31, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3473

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్"
(లేదా...)

"బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్"

59 కామెంట్‌లు:

  1. ఇంగ్లాడున క్రైస్తవులకు
    జంగ్లీలకు వనమునందు జగమంతటికిన్
    సింగ్లీశుడె దైవమనగ
    బంగ్లా దేశీయులెల్ల భర్గుని భక్తుల్

    సింగిల్ + ఈశుడు = సింగ్లీశుడు
    ఈశ్వరుడొక్కడే

    రిప్లయితొలగించండి
  2. సమస్య -
    "బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్"
    (లేదా...)
    "బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్"

    ఆంగ్లేయులు వామభక్తు
    లింగ్లీషే రాని బాబు లిక్కటులిడినన్
    జంగ్లీలు కాదు పశ్చిమ
    "బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణ

      ఆంగ్లేయులు మార్క్సిస్టు లు
      నింగ్లీషే రాని బాబు లిక్కటులిడినన్
      జంగ్లీలు కాదు పశ్చిమ
      "బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

      తొలగించండి
    2. (సవరించిన) మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    బంగ్లానారులు కాళి రూపులగుచున్ బంధించుచున్ భర్తలన్
    జంగ్లీలౌచును గడ్డముల్ పెనిపెడిన్ జంబంపు ముల్లాల తా
    ముంగ్లీలందున త్రిప్పి యేలగనహో హుందాగ పర్దాలనున్
    బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్

    రిప్లయితొలగించండి

  4. ఆంగ్లేయులు మార్క్సిస్టు లు
    నింగ్లీషే రాని బాబు లిక్కటులిడినన్
    జంగ్లీలు కాదు పశ్చిమ
    "బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    బంగ్లాదేశమహమ్మదీయు లవురా
    భక్తాగ్రణుల్ శూలికిన్
    (ఒకప్పటి భారతదేశభాగమైన బంగ్లాదేశ్
    నేటికీ తన సంస్కృతిని విస్మరింపలేదు )
    బంగ్లాదేశము ఖ్యాతిగాంచినదిగా
    భారత్ పురాదీప్తికిన్ ;
    బంగ్లాభాషను మాటలాడుదురు చే
    వన్ దప్పకే నిత్యమున్
    బంగ్లాదేశమహమ్మదీయు ; లవురా !
    భక్తాగ్రణుల్ శూలికిన్
    బంగ్లాదేశమునందు నుండెడి సభా
    భ్రాజిష్ణులౌ పండితుల్ .
    ( పురాదీప్తి - వెనుకటి కాంతి ; చేవ - సారము ; సభాభ్రాజిష్ణులు - సదస్సులో ప్రకాశించువారు )

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జంగ్లీలై తారాడక
    ఆంగ్లేయులవలె నిరతము ననువగు రీతిన్
    ఇంగ్లీషు నెంచు పశ్చిమ
    బంగ్లా దేశీయులెల్ల భర్గుని భక్తుల్.

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆంగ్లేయుల్ కనినట్టి వారధినహో హౌరాన హుగ్లీననున్
    బంగ్లాదేశము వీడి వచ్చి కనగన్ బ్రహ్మాండమౌ కొల్కతన్
    బంగ్లారాష్ట్రమునన్ కరోన గొనగా ప్రార్థించుచున్ దుర్గనున్
    బంగ్లాదేశ మహమ్మదీయులవురా భక్తాగ్రణుల్ శూలికిన్

    రిప్లయితొలగించండి
  8. ఆంగ్లేయులు దొంగపనుల
    కంగ్లీలుగ వదలిరి కసిగా భారతమున్
    యింగ్లీషు నేర్వ పశ్చిమ
    బంగ్లాదేశీయు లైరి భర్గుని భక్తుల్

    (కంగ్లీ = బిచ్చగాడు (ఉరుదు))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భారతమున్+ఇంగ్లీషు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జంగ్లీలై తనరారకుండక ఘనమౌ జాతీయ భాషల్ మరిన్
    ఆంగ్లంమందున నేర్పు నొంది ననువున్నచ్చమ్మునౌ తీరునన్
    ఇంగ్లీషున్ పలుకంగ నుండి సతమున్నేపారు ప్రత్యక్కునౌ
    బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ సూలికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరిన్' అనడం సాధువు కాదు. 'సతమున్+ఏపారు' అన్నపుడు ద్విత్వనకారం రాదు.

      తొలగించండి
    2. జంగ్లీలై తనరారకుండక ఘనమౌ జాతీయమౌ భాషలన్
      ఆంగ్లంమందున నేర్పు నొంది ననువున్నచ్చమ్మునౌ తీరునన్
      ఇంగ్లీషున్ పలుకంగ నుండి సతమున్ యేపారు ప్రత్యక్కునౌ
      బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ సూలికిన్

      తొలగించండి
  10. బంగ్లాలనందు నుండియు
    బంగ్లా దేశీయులిష్ట పడెదరు చేపన్
    బంగ్లనె బలికెడు పశ్చిమ
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి


  11. జంగ్లీ లనుకున్నావా ?
    మంగ్లీలను కొంటివా ? తమాషా కాదే !
    టాంగ్లా నగరపు హిందూ
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. ఆంగ్లము పలుకగ లేరట
    బంగ్లా దేశీయులెల్ల, భర్గుని భక్తుల్
    మంగ్లీ! హిందువులే వా
    రింగ్లండుననున్న నేమి యిది నిజము సుమా!

    రిప్లయితొలగించండి
  13. జంగ్లీలు రాక మున్నను
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్
    ఆంగ్లేయులు విడదీసిరి
    బంగ్లా ప్రాంతమును తూర్పు పశ్చిమ మనుచున్

    రిప్లయితొలగించండి


  14. జంగ్లీలా? భళి కాదు! ఛాందసులకో? ఛా! కాదు అల్లామియా
    బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్! శూలికిన్,
    మంగ్లీయమ్ముగ నాడు మ్రొక్కిరి సుమా, మారెన్ మతమ్మే సఖా!
    యుంగ్లీ చూపకు వారి పైన వినుమా యుంజాను వర్యుల్ సుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. బంగ్లాలో నున్నను మరి
    జంగ్లాలో నున్నగాని జగతిని జనముల్
    బంగ్లా కాళిని కొలిచెడి
    *బంగ్లా దేశీయులెల్ల భర్గుని భక్తుల్.*

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఈ గ్లానిన్ హరియింతమన్చు నిరతంబీగతిన్ కరోనాంతమున్
      ఇంగ్లీషౌషధ వేద్యులున్ సకల దేశేశుల్ వడిన్ వేడగన్
      ఇంగ్లాండాదిగ దేశదేశములుసర్వేశాంఘ్రినిన్ జేర నీ
      బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్

      తొలగించండి
  17. మైలవరపు వారి పూరణ

    హుంగ్లీ బంగ్లి యటంచు బాడెదరదేదో యాసలోనద్దియే
    బంగ్లాయేమొ., యదే శివార్చనమొ., తద్భక్తుల్ ముసల్మానులో!
    బంగ్లాదేశ్ జని వింటి.. నప్పుడిటు సంభావించితిన్ బాపురే!
    బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  18. మంగ్లీ! చెప్పెద నాలకింపుమివి నామాటల్ యధార్థమ్మదే
    యాంగ్లంబంతగ బల్కలేరిలను సత్యంబేకదా కాంచినన్
    బంగ్లాదేశ మహమ్మదీయులవురా, భక్తాగ్రణుల్ శూలికిన్
    బంగ్లాదేశము నందుకూడగలరే పాటించుచున్ గాంచినన్

    రిప్లయితొలగించండి
  19. ఇంగ్లాండు నందు చదివియు
    నాంగ్లేయుల పొత్తు కలిగి యలరిన గానీ
    జంగ్లీ లయినను పశ్చిమ
    బంగ్లా దేశీయ లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి
  20. బంగ్లాఖాతము పొంగగన్ మునుగగా
    భవ్యంపు సౌధమ్ములే
    బంగ్లాలన్నియు ఖాళిజేసి దరలెన్
    భార్యా సమేతమ్ముగా
    బంగ్లాదేశ మహమ్మదీయు; లవురా!
    భక్తాగ్రణుల్ శూలికిన్
    బంగ్లాలందునె నిత్యపూజగొనుచున్
    ప్రార్ధించగా బట్టిరే!

    రిప్లయితొలగించండి
  21. ఇంగ్లండునుండి వచ్చిన
    యాంగ్లేయులనెల్ల దరిమినట్టి వజీరుల్,
    ఇంగ్లపు కణికలు గారే
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!

    వజీరులు-పరాక్రములు
    ఇంగ్లము-నిప్పు

    రిప్లయితొలగించండి
  22. బంగ్లాపై జేరిరి గన
    బంగ్లాదేశీయు లెల్ల, భర్గుని భక్తుల్
    బంగ్లా దేశమున మరొక
    బంగ్లాలో నచ్చెరువుగ భజనలు సేయన్

    రిప్లయితొలగించండి
  23. బంగ్లా దష్కర ప్రాసగ
    బంగ్లా పునరుక్తమాయె భవధీయుడనై
    బంగ్లా యననిదె పశ్చిమ
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!!


    రిప్లయితొలగించండి
  24. బంగ్లాదేశపువారలు
    జంగ్లీలుగనుండికూడసతతముశివునే
    గంగ్లీలునుబూజించగ
    బంగ్లాదేశీయులెల్లభర్గునిభక్తుల్

    రిప్లయితొలగించండి
  25. కె.వి.యస్. లక్ష్మి:

    ఆంగ్లము నేర్చిరి పశ్చిమ
    బంగ్లాదేశీయులెల్ల; భర్గుని భక్తుల్
    ఆంగ్లేయులు నింగ్లండున
    ఆంగ్లమున నమకమె వ్రాసె రాశ్చర్యముగన్.

    రిప్లయితొలగించండి
  26. ఆంగ్లేయుల్ దగ క్రీస్తు భక్తులటులే యల్లాకు సద్భక్తులా
    బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్
    బంగ్లా రాష్ట్రమునందు హిందువులు, సంభావింప గాన్పించునే
    బంగ్లా యైనను నాంగ్లమైన నొకడే బ్రహ్మంబనేకంబుగా

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. నం గ్లీతక వచనమ్మున
      నాంగ్లము పలుకక కడింది యలరించఁ గదే
      సంగ్లానపు భాషణ మిది
      బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

      [నను + క్లీతక = నం గ్లీతక; క్లీతకము = మధురము; సంగ్లానము = మిక్కిలి బడలిక]


      పుం గ్లౌ తాదృశ నిర్మ లానన కృపా పూర్ణాత్మ వీరాలి గాం
      చం గ్లీబాల్ప మనంగ నేరికి నిటన్ శక్యంబె వే భీకరం
      పుం గ్లానిం దగఁ జేయగాఁ బరులకుం బో నిత్య సన్నద్ధులై
      బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్

      [శూలి = శూలము ధరించిన వాఁడు, ఇక్కడ సైనికుఁడు; పుం = పురుష; గ్లౌ = చంద్రుఁడు]

      తొలగించండి
  28. బంగ్లాదేశమహమ్మదీయులవురాభాక్తాగ్రణుల్ శూలికిన్
    మంగ్లీ!వింటివెయార్యుమాటలుభళీమైనార్టిదేశమ్మునై
    బంగ్లాదేశపువారలందఱుగడున్ భక్తాగ్రణుల్ కాలుకున్
    బంగ్లాదేశమునందుకాకమనెభూభాండమందంతటన్

    రిప్లయితొలగించండి
  29. జంగ్లీజాన్వరులందువ?
    బంగ్లాదేశస్థులాప్తబాంధవులెపుడున్
    బంగ్లాలోలేకున్నను
    బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి
  30. బంగ్లా తూరుపు వోలెను
    బంగ్లా పశ్చిమము గలదు! భారత నారీ
    మంగ్లీ, వినుమిది, పశ్చిమ
    బంగ్లా దేశీయు లెల్ల భర్గుని భక్తుల్

    రిప్లయితొలగించండి
  31. ఆంగ్లమ్మన్ననునిచ్చగించెదరువారాహార్యమందున్ విరా
    మం గ్లానిన్ సమదృష్టిజూసెదరు నైర్మల్యంపు చిత్తంబుతో
    బంగ్లాదేశ మహమ్మదీయులవురా, భక్తాగ్రణుల్ శూలికిన్
    బంగ్లాదేశమునందుహైందవులు సంభావింత్రు దైవంబుగా.

    రిప్లయితొలగించండి
  32. బంగ్లాదేశములోమహమ్మదునకున్భక్తిన్సలాంజేయరే
    బంగ్లాదేశమహమ్మదీయులవురా,భక్తాగ్రణుల్శూలికిన్
    బంగ్లాలోవసియించుహైందవులుసంపన్నుల్సదాచారులున్
    బంగ్లాశైవమతానుయాయులనిశంబాసాంబునర్చింపరే

    రిప్లయితొలగించండి
  33. కం:

    బంగ్లా పశ్చిమ వాసులు
    బంగ్లా తూరుపు జనులకు భక్తిని గూర్చన్
    మంగ్లీ తెలుపెను నదిగని
    బంగ్లా దేశీయులెల్లఁ భర్గుని భక్తుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. శంకరాభరణం
      31, ఆగస్టు 2020, సోమవారం
      సమస్య - 3473
      కవిమిత్రులారా,
      ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

      "బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్"
      (లేదా...)
      "బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్"

      నా ప్రయత్నం :

      కందం
      ఆంగ్లేయులు స్వేచ్ఛ నిడఁగ
      బంగ్లా దేశమ్ము వీడె భారతి ప్రేమన్
      బంగ్లాలోగల హిందూ
      బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్!

      శార్దూలవిక్రీడితము
      ఆంగ్లేయుల్ భరతావనిన్ విడువనైక్యమ్మెంచ లేకుండగన్
      బంగ్లాదేశము తూర్పునందువిడెనే పాకుత్తూతరంబెంచఁగన్
      బంగ్లాదేశపు హిందువుల్మతమునిర్బంధమ్ముగా మారగన్
      బంగ్లాదేశ మహమ్మదీయు ల! వురా భక్తాగ్రణుల్ శూలికిన్!

      తొలగించండి
  35. ఆంగ్లంబందున దిట్టలు
    బంగ్లాదేశీయు; లెల్ల భర్గుని భక్తుల్,
    ఇంగ్లాండు కేగు దెంచిన,
    బంగ్లాలో శివుని గొల్చి భాగ్యము బడసెన్!




    రిప్లయితొలగించండి