6, నవంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3537

7-11-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్షకుండు గొనెను ప్రాణములను”

(లేదా…)

“రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై”

100 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    దీక్షను పొందుచున్ మురిసి దేవళ మందున చర్చిలోననున్
    వీక్షణ జేసి వోటరుల విందును జేసి మసీదులందునన్
    భక్షణ జేయుచున్ తనరి వందల లక్షలు ముఖ్యమంత్రియై
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై....

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రావణు నని నడచి రామచంద్రుడు జగ
    ద్రక్షకుండు గొనెను ప్రాణములను
    నిలిపె లోకమెల్ల నెఱిని ప్రశాంతిని
    జనులలరెడి రీతి ఘనముగాను.

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Virus-killer:

    శిక్షను నోర్వజాలకయె శీఘ్రముగానొక పండితుండు తా
    కుక్షిని నింపలేక కడు కోపము రాగనె ముక్కు, నాల్కపై
    మోక్షము నిచ్చి వైరసుకు;...ముచ్చట మీరగ నాంగ్ల వైద్యుడే
    రక్షకుఁడంచుఁ జేరఁగనె;...ప్రాణము దీసె దయావిదూరుఁడై...

    రిప్లయితొలగించండి
  4. నరకు డతడు ధరణి నరరూప రాక్షసుం
    డతడు జనుల జంపు సతులచెరచు
    పలువ, భటుని గాంచి పారిపోదలచగా
    రక్షకుండు గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి
  5. గజము‌ ప్రార్ధించ పరుగిడె కాచ
    దుష్ట

    శిక్ష కుండగు హరి, శిష్ట రక్ష కుండు

    గొనెను ప్రాణములను చక్రమును రయముగ

    మడుగు లోనున్న మకరిపై విడిచి నపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవెలది సమస్యకు మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.
      "విడిచి యపుడు" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  6. గానమధురిమ లవి వీనులవిందయ్యి
    సంతసించి నాడెసంద్రమంత
    ‌‌తనదు సభన వెలుగ తరలించ బాలును
    రక్షకుండు గొనెను ప్రాణములను!!

    రిప్లయితొలగించండి
  7. రాక్షసుడై చరించి ధవళాక్షుల మానము దోచె, తీవ్రవాదిగా
    శిక్షణపొంది దేశమున చిచ్చును బెట్టుచు జాతిసంపదన్
    భక్షణజేయు కట్టిడి, సిపాయియె స్నేహితుడంచు వాడె నా
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  8. దుష్ట రాక్షసుండు దురితు రావణు గూల్చి
    జగతి బ్రోచె రామ చంద్ర విభుడు
    ధర్మ నిరతి జూపి తాపసులను గాచి
    "రక్షకుండు గొనెను ప్రాణములను"

    రిప్లయితొలగించండి
  9. అందరికీ నమస్సులు🙏
    ఉ.మా

    శిక్షణ నొందగన్ భటులు శ్రేయము చూడగ నిందిరమ్మకున్
    దీక్షగ పాలనన్ నెరపు ధీమతి ప్రాణము దీయనెంచగన్
    వక్షము నందు కాల్చగనె వ్యాఘ్రము నేలను కూలెనక్కటా!
    *రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  10. కంసు డనుప వచ్చి కపట వేషముతోడ
    కృష్ణుఁ జేత కూల కౄరముగను
    ధర్మ రక్షణమ్ము తలపుచు నా లోక
    రక్షకుండు గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్రూరముగను' అనడం సాధువు. అప్పుడు యతి తప్పుతుంది. "తలచుచు" అని ఉండాలి.

      తొలగించండి
  11. నరకు బారి నుండి నరులను రక్షింప
    పంత మూని హరియు బ వర మందు
    సత్య తోడు రాగ సాహసము న జగ
    ద్ర క్ష కుండు గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి

  12. కం
    రాజీవాక్షిదె రాజ్యము,
    వాజిని యాగాశ్వమంచు వారిజ నేత్రుల్,
    కాజేయంగ ప్రమీలా
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    రాజీవాక్షి-ఇక్కడ ప్రమీల
    నరుడు- అర్జునుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రమీలా గాజులు' అన్నది దుష్టసమాసం. "కాజేయ ప్రమీల కరమున గాజులు..." అనండి.

      తొలగించండి
    2. నామవాచకము దష్ట సమాసమనుకోలేదు.
      🙏🏻🙏🏻

      తొలగించండి
  13. రక్షరక్ష యనుచు రక్షింప వేడగా
    తక్షణమ్ము మకరి దంష్ట్రనుండి
    పక్షివాహన మెక్కి పరువెత్తి వచ్చి తా
    రక్షకుండు గొనెను ప్రాణములను

    తక్షణ కోపమంది తన తండ్రికి జేసిన బన్నమెంచుచున్
    శిక్షగ శాపమీయగను శీఘ్రము జావగ బాముకాటుచే
    తక్షక కాటునున్ దొలగ త్రాతగ విష్ణువు
    నాశ్రయించుచున్
    రక్షకుడంచు చేరగనె, ప్రాణముదీసె దయావిదూరుడై,
    మోక్షము నీయగాను బహుపుణ్యపు
    గాథల శ్రోత్రలాభమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'తత్క్షణమ్ము' అన్నది సాధువు. మూడవ పాదంలో గణభంగం. "పక్షివాహనమున" అనండి.
      రెండవ పూరణలో 'తత్క్షణకోప'మని ఉండాలి. అప్పుడు ప్రాస తప్పుతుంది. 'తక్షక కాటు' దుష్టసమాసం. "తక్షకు కాటు" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణలతో 🙏🙏🙏

      వీక్షణజేసి సర్పమును వేసటనొందుచు
      దండ్రికంఠమున్
      శిక్షగ శాపమీయగను శీఘ్రము జావగ బాముకాటుచే
      తక్షకు కాటునున్ దొలగ త్రాతగ విష్ణువు నాశ్రయించుచున్
      రక్షకుడంచు చేరగనె, ప్రాణముదీసె దయావిదూరుడై,
      మోక్షము నీయగాను బహుపుణ్యపు
      గాథల శ్రోత్రలాభమున్

      రక్షరక్ష యనుచు రక్షింప వేడగా
      తత్క్షణమ్ము మకరి దంష్ట్రనుండి
      పక్షిరథము నెక్కి పరువెత్తి వచ్చి తా
      రక్షకుండు గొనెను ప్రాణములను

      తొలగించండి
  14. రాజధాని మార్చి , రాష్ట్ర జనావళి
    రక్షకుండు గొనెను ప్రాణములను
    పృథివినిడిన రైతుపెద్దల వంచించి ,
    ప్రజలబాధ నెంచ వలనుకాదు

    రిప్లయితొలగించండి
  15. ఏక్షణమందునేమగునొ నీవిధి ఎవ్వరు జెప్పలేరుగా
    రక్షణగోరిరాగ మరి రాక్షసుడయ్యెనదేలనో మరిన్
    తక్షణ లంచముందినగ తామసమందున మున్గనా తడే
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. 'తత్క్షణ'మన్నది సాధువు. దానివల్ల ప్రాస తప్పుతుంది.

      తొలగించండి
  16. ( తనను అమ్మోరికి బలి యిస్తున్న యజమానిని చూచిన మేకపోతు )
    ఈ క్షణమంతదాక కృప
    నెంతయొ చూపుచు మేపుచుండెనే !
    శిక్షల నీయకే మిగుల
    చెంతకు జేర్చుచు బుజ్జగించెనే !
    వక్షమునందు మోమునిడి
    వత్సలతన్ గురిపించెనే ! కటా !
    రక్షకుడంచు జేరగనె
    ప్రాణము దీసె దయావిదూరుడై !!

    రిప్లయితొలగించండి
  17. ఉ:

    లక్షణ మైన జోడి యని లక్షల కట్నము బోసి యెంచగన్
    రాక్షసుడై మెలంగుచును రాచుచు రంపము నందు బెట్టుచున్
    లక్షము నెచ్చు కానుకలు లాగుట హేతువు పత్ని తోడుతన్
    రక్షకుడంచు జేరగనె ప్రాణము దీసె దయా విదూరుడై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. రక్షకభటుడన్న రాజుల సేవకే
    ప్రజలమేలుమరచి బాధగూర్చ
    చిన్నతప్పునైన ఎంచి పెద్దగజేసి
    రక్షకుండు గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి
  19. శిక్షణ పూర్తి జేసుకొని సేమముగా దన నింట జేర్చగా
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై
    రక్షక వేష ధారి యగు రాక్షసుడా దురితాత్ముడక్కటా
    రక్షణ లేదయో ధర వెలందులకున్ గడు గడ్డు కాలమే

    రిప్లయితొలగించండి


  20. మనుజుడ! యేసును నమ్ముము!
    మనుగడకు వలయు మనికియు మహితహితముగా
    కనికరము రక్ష కుండు గొ
    నెను, ప్రాణమ్ములను వాడు నేర్పుగ గాచెన్!


    ఆమెన్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. తనదు ప్రాణ మొడ్డి తలగాచు తన యంగ
    రక్షకుండు గొనెను ప్రాణములను
    ఇందిరమ్మ చరిత యించుకైనను గొల్పు
    నింగితమును నీకు తంగిరాల౹౹

    రిప్లయితొలగించండి
  22. ఆటవెలది
    ద్వార పాలకునిగఁ బసుపు బొమ్మను జేసి
    ప్రాణమిడుచు గిరిజ తానమాడ
    నడ్డగించె ననుచు నాదిదేవుడు జగ
    ద్రక్షకుండుఁ గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      లక్షణమౌ హరిద్రము విలక్షణరీతి సుతుండునయ్యె నా
      పేక్షగఁ దాన మాడ పరివేష్టితుఁ జేయగ గౌరి ముంగిటన్
      శిక్షితుఁడై హరున్ నిలుపఁ జిర్రున వీడెటు నాదు యింటికిన్
      రక్షకుడంచుఁ? జేరఁగనె ప్రాణముఁ దీసె దయావిదూరుడై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. గురుదేవులకు మరియు శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    4. నాదు యింటికిన్ : యడాగమము చూడండి.
      పరివేష్టితుఁ జేయగ గౌరి ముంగిట: పరివేష్టితు సరియైన పదము కాదండి.

      తొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లక్షణమైన దానినని రండులు మోసము జేయబోవగన్
    వీక్షణ జేసినట్టి దొర వీకను వారి నడంచి దెచ్చి తా
    నున్ క్షణ మాగకున్ తమిని నొబ్బిడిజేసి వదించెనే కటా!
    రక్షకుడంచు జేరగనె ప్రాణము దీసె దయా విదూరుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు. ప్రాసతప్పలేదుగదా!

      తొలగించండి

  24. కందోత్పల

    బెదురుచు హరిణియె కావలి
    కద రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీ
    సె దయావిదూరుఁడై మా
    రె దేశమున ధర్మమెల్ల రెవటలు నలిగెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. శిక్ష లేదు నేడు కక్షలు  తీర్చగ 
    యిచ్చి పుచ్చు కొనుట లెక్కువాయె 
    యడుగ బోవువాడె యపరాధి యనుచును 
    'రక్షకుండు గొనెను ప్రాణములను”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తీర్చగ నిచ్చి... లెక్కువాయె నడుగబోవు..." అనండి.

      తొలగించండి
  26. భిక్షువొకండుదక్షుడనివేడెనుభిక్షనుస్థూలలక్షునిన్
    గుక్షినినింపుమోక్షమిడుక్షుత్తుపిసాసశమించునంచుసం
    రక్షకుడంచునెంచిజనప్రార్థకుగారలబంపెయోధయే
    *“రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై”*

    రిప్లయితొలగించండి
  27. దక్షకుడంచునోటరులుదారతవేసినమాటదప్పిదా
    భక్షకుడైజనాళికిసభాంగణమందునపన్నుపోటుతో
    శిక్షవిధించివేతనపుజీవులనారడిబెట్టబల్కరే
    *“రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై”*

    రిప్లయితొలగించండి
  28. ఆ క్షణమందు వెంటపడు నా దురితాత్ముని బారి నుండి సం
    రక్షణఁ గోరిఁ జేరగ విలాసమధుప్రమదుండునై కటా!
    కుక్షికుతంత్రమ ట్గగుట క్రూరుడు చేలను మేయు కంచెయై
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. కె.వి.యస్. లక్ష్మి:

    శరవణభవయన్న సతతము గాచెడి
    రక్షకుండు గొనెను ప్రాణములను
    దివిజ విజయమె తన దీక్షగ బూనుచు
    తారకు ననినందు జీరె సామి.

    రిప్లయితొలగించండి
  30. దక్షతతో ప్రధాని కడు దర్పము పాలన చేయుచుండగా
    రాక్షస శత్రు సంతతులు రౌరవమున్ కలిగింప, వంచగా
    కక్ష ఘటిల్ల చిత్తమున కావరి యైన భటుండె యింటిలో
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై

    రిప్లయితొలగించండి

  31. శంకరాభరణం
    సమస్య -3537 7-11-2020 (శనివారం)

    సమస్య
    **** ***

    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై

    నా పూరణ. ఉ.మా
    *** *** ***

    ( ఎన్నో ఆశలతో కూతురు వివాహము చేసి అత్తారింటికి పంపితె పాదాల పారాణి ఆరకముందె వాడు బిడ్డను హతమొనర్చగ ఓ తండ్రి ఇలా బాధపడుచున్నాడు...)


    లక్షణుఁడంచు దక్షత గలండని కూతురు బాగుఁ గోరుచున్

    లక్షల కట్నముల్ మరియు లాంచనముల్ గడు ధార వోయుచున్

    దక్షణమే వివాహము ముదమ్ముగఁజేయుచు సూనఁ బంపఁ దాన్

    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  32. నరకుజంపబూనినారాయణుడు,సతి
    సత్యభామతోడసమరమందు
    చంపెసుగమరీతిచక్రధారి,జగ
    ద్రక్షకుండుగొనెనుప్రాణములను

    రిప్లయితొలగించండి
  33. విశ్వమందురక్షవిష్ణుడుండెమనకు
    కర్మదాటియెవఁడుకానరాఁడు
    జీవిచేతలన్నిచెప్పునేభవితను
    రక్షకుండుగోనెనుప్రాణములను

    రిప్లయితొలగించండి
  34. అక్షయనామకంబలరుయౌవనకాంతయనొక్కవేకువన్
    రక్షణగోరిజేరగనురక్షణసేవకనాలయంబునున్
    రక్షణసేవకుండొకడురాక్షసరీతినిబాడుచేయగా
    రక్షకుడంచుజేరగనెప్రాణముదీసెదయావిదూరుడై

    రిప్లయితొలగించండి
  35. కుక్షిని నింపనెంచియొక కొంగజపంబొన రించియంతలో
    నేక్షణ మోనికం గొలను నేర్పడఁ జూడగ తోయహీనమౌ
    రక్షణఁజేతుమి మ్మనుచు రమ్మనఁ జేపలు వెంటఁబోయినన్
    రక్షకుడంచుఁ జేరగనె ప్రాణముఁదీసె దయావిహీనుడై

    రిప్లయితొలగించండి
  36. వాలిఁ గాంచి యంత మాల లేని కపిని
    విల్లు నెక్కుపెట్టి వేగ వేసి
    రాఘవుండు దా నమోఘ శిఖిని ధర్మ
    రక్షకుండు గొనెను ప్రాణములను


    యీ క్షితి మాన వాకృతిని హీన మనస్కులు దుష్ట చిత్తులున్
    భక్షణ మెంచి సంతతము వారక మత్స్య విహంగ జన్యులన్
    దక్షతఁ బట్టి తిందు రని తా మది నేరకయే శశమ్మహో
    రక్షకుఁ డంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      సరిదిద్దానండి.

      తొలగించండి
  37. కక్షలేలమనకు కార్పణ్యములవేల
    కలిసిమెలిసియున్న కలదు సుఖమ
    నంచుమాయమాటలాడి కాపటికపు
    రక్షకుండు గొనెను ప్రాణములను

    రిప్లయితొలగించండి


  38. దక్షుని కూతురైన 'సతి' తండ్రి కదాయని పుట్టినింటికిన్
    లక్షణబద్దయై చనగ రమ్మనలేకయు యజ్ఞవేదికన్
    త్య్రక్షుని తూలనాడె కడు నందరి ముందర ప్రేమహీనుడై
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై.

    రిప్లయితొలగించండి
  39. సెక్షను లెన్నియున్న, వనజేక్షుల కెప్పుడు పాటులేగదా!
    రక్షణ నిచ్చెడిన్ భటులు రాక్షసులా యన మానభంగముల్!
    వీక్షణ జేయగా తెలిసె వేలుగ పత్రిక వార్తలందునన్
    రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై.

    రిప్లయితొలగించండి
  40. బాహుబలి - కట్టప్ప

    దక్షుడు సర్వసేనలకు దారినిజూపెడు
    వాడు కట్టప
    అక్షయ మైనబానిసగ నచ్చపు నమ్మిక సేవజేసి దా,
    కక్షను రాణిగోరగ, పెనుఘర్షణ నొందుచు రాకుమారునిన్
    రక్షకుడంచు చేరగనె ప్రాణము దీసె దయావిదూరుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదమున
      కక్షను రాణిగోరగను ఘర్షణ నొందుచు గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. మొదటిపాదము చివర
      దారిని జూపెడు కట్టపాఖ్యుడే గా చదువ ప్రార్ధన !

      తొలగించండి
    3. సవరణలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురువర్యా! ఈరోజు అన్నీ సవరణలే అయ్యాయి! 😒😒 🙏🙏🙏

      తొలగించండి
  41. మైలవరపు వారి పూరణ

    గతంలో విశాఖపట్నంలోని నర్సింగ్ కాలేజీ సంఘటన ఆధారముగా..

    శిక్షణనిచ్చుకేంద్రమని చెప్పగ పల్వురు చేరియుంటి., సం...
    రక్షణ నాది భారమని మాయల మాటల నన్ను ముంచగా
    శిక్షకు పాత్రుడీతడని చేసితి గోలను., గక్షగట్టె., సం..
    రక్షకుడంచు జేరగనె ప్రాణము దీసె దయావిహీనుడై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  42. శిష్ట జనుల కాచి జీవుల రక్షించు
    రక్షకుండు, గొనెను ప్రాణములను
    దుర్మతులను తాను దురమునశిక్షించ
    చక్రధారి యగుచు జవము గాను


    మరొకపూరణ

    లక్షలు పోసి గొంటినికలక్షల నార్జన చేయుటొక్కటే
    యీక్షణమందుచేయమది యెంచుచు నేగెదురా శతోనటన్
    రక్షణ చిక్కెనంచు ననురాగము తోడను చేయి పట్టుచున్
    *రక్షకుఁడంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై.*



    రిప్లయితొలగించండి