7, నవంబర్ 2020, శనివారం

సమస్య - 3538

 8-11-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ”

(లేదా…)

“నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా”

69 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    భద్రమ్మంచును చెప్పగా హితులహో బాగోగులన్ గాంచకే
    నిద్రన్ వీడుచు లేచి వేగముగనున్ నిర్వాణమున్ కోరుచున్
    భద్రాద్రిన్ కడు లేటు జేరగనయో వయ్యారి నౌకందునన్
    నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా...

    రిప్లయితొలగించండి
  2. భద్రత యొసగును చదువులు
    భాద్రపదమ్మున పరీక్ష ప్రకటించిరిగా
    భద్రా! బద్దకము విడుము
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ?

    రిప్లయితొలగించండి
  3. శార్దూలవిక్రీడితము
    ముద్రాపూర్వక యోగ సాధనమునన్ బొంగారు నారోగ్యమే
    భద్రమ్మైన మనోస్థితిన్ బడయుచున్ బద్మాసనా రూఢులై
    చిద్రూపమ్మున ధ్యాస శ్వాసనిడుచున్ జెన్నొందు ధ్యానంబునన్
    నిద్రాసక్తుడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    రిప్లయితొలగించండి
  4. కందం
    ముద్రాపూర్వక యోగము
    భద్రమ్మైన మదిగూర్చఁ బద్మాసమునన్
    జిద్రూపిగ ధ్యానమ్మున
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      కందం
      ముద్రాపూర్వక యోగము
      భద్రమ్మైన మదిగూర్చఁ బద్మాసనువై
      జిద్రూపిగ ధ్యానమ్మున
      నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

      తొలగించండి
  5. నిద్రోన్మత్తుడవైన నేమి ఫలమో నేస్తంబ!యోచింపుమా!
    సద్రత్నంబుగ నిర్విరామముగ భాషా సేవలో మున్గుమా!
    విద్రోహంబును మాని జనహితాభీష్టంబులన్ జేయు ని
    ర్నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    1960:

    క్షుద్రంబయ్యెడి పాత్రనున్ కొసరుచున్ గుండమ్మ చిత్రంబునన్
    నిద్రన్ వీడుచు లేచి బొగ్గు రథమున్ నింపాదిగా తూగుచున్
    మద్రాసున్ పడి లేచి చేరగనయో మాంబ్ళంపు సత్రమ్మునన్
    నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా...

    రిప్లయితొలగించండి
  7. భద్రా! లెమ్మిక తెల్లవారె నదిగో భాస్వంతు డేతెంచె గా
    ఛిద్రంబౌ భవితవ్యమంచెఱుగుమా చిన్నా! నువీరీతిగా
    నిద్రాసక్తుఁడవైన, నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా
    నిద్రన్ వీడుచు లక్ష్యసాధనకికన్ నిత్యంబు కష్టించినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నువు+ఈ... 'నువు' అన్నది సాధుప్రయోగం కాదు.

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. మేఘనాధుడి పై యుద్ధముకు బయలుదేరిన లక్ష్మణుణ్ణి ఆశీర్వాదిస్తున్న రాముడు
      శా ||
      భద్రమ్ముల్ శుభముల్ మహామునులు భవ్యమ్మౌగతిన్ జూపుగాన్
      సద్రాజుల్ మనపూర్వులున్ బొసఁగు తా శౌర్యమ్ము, నాతండు యే
      క్షుద్రక్రీడను సైచినన్ సుగుణి యో !కోదండ భాస్వంత! ని
      ర్నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఛి ద్రంబగు జీవుల కిల
    భద్రము గల్పింప నెంచి పావన మతియై
    యే ద్రవ్య ముగోరక ని
    ర్ని ద్రా సక్తుం డ వైన నీకు జయ మ్మౌ

    రిప్లయితొలగించండి
  10. భద్రగజంబునకైనను
    ఛిద్రంబౌ స్వప్నమందు సింహము గాంచన్,
    భద్రము దేవుని గొలు ని
    ర్నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ!

    రిప్లయితొలగించండి
  11. రుద్రాదులెత్తివచ్చిన
    నిద్రనుదరిజేరనీక నిశ్చలమతివై
    భద్రపుపహరాకాయు వి
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

    రిప్లయితొలగించండి
  12. సమస్య :
    నిద్రాసక్తుడవైన నీకు జయమౌ
    నిక్కంబిదే నమ్ముమా

    ( యువరాజు సిద్ధార్థునికి అంతర్వాణి కావిస్తున్న ప్రబోధం )
    శార్దూలవిక్రీడితము
    ------------------
    ఛిద్రంబున్ బొనరించి చింతలను ని
    శ్చింతన్ బ్రసాదింపగన్ ;
    భద్రంబౌ బ్రతుకిచ్చి ప్రాణులకు దౌ
    ర్బల్యంబు బోకార్పగన్ ;
    క్షుద్రంబౌ మదమత్సరాలణచి యీ
    క్షోణిన్ గటాక్షింప ; ని
    ర్ణిద్రాసక్తుడవైన నీకు జయమౌ
    నిక్కంబిదే నమ్ముమా !!

    రిప్లయితొలగించండి
  13. భద్రంబైనది గాదె జాగరణమే భావింపగా కర్మలన్
    ఛిద్రంబౌనుగ స్వప్నముల్ జతనమే
    చేపట్టలేకున్నచో
    క్షుద్రంబైన తమోగుణమ్ము దొలగన్
    శుద్ధాంతరాళమ్ము ని
    ర్ణిద్రాసక్తుడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భద్రా! దగుల కరోనా
      భద్రంబౌ నింటనుండ భయమును వీడన్
      భద్రాహారమును గొనుచు
      నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏

      భద్రా! తగుల కరోనా గా చదువ ప్రార్ధన! 🙏🙏

      తొలగించండి
  14. ఛిద్రమగు పనులు సలుపక
    భద్రముగ సహృదయుడనెడి పరపతి నిలుపన్
    క్షుద్రము విడి హాయిగొలుపు
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

    రిప్లయితొలగించండి
  15. భద్రాద్రీశు పదమ్ములే నిరతమౌ పాపాపహారంబులున్
    సద్రామాంకిత మానసంబె కలిదోషంబుల్ హరించున్ సుమా!
    నిద్రన్వీడుచు రామ రామ యన మన్నీడున్ మదిన్ నిల్పగన్
    నిద్రాసక్తుడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    నిద్రాసక్తుడు= ధ్యానాసక్తుడు (సమాధి స్థితి)

    రిప్లయితొలగించండి


  16. నిద్రాశక్తుండవైన నీకు జయమ్మౌ
    (లేదా)
    నిద్రాశక్తుండవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా



    1)

    నిద్రాణమ్మగు ప్రతిభలు
    భద్రత చేకూర్చునట్టి భవితవ్యంబుల్
    భద్రముగా వెలిఁదీవలె
    నిద్రాశక్తుండవైన నీకు జయమ్మౌ

    2)

    నిద్రాణంబగు నీ నిగూఢ రచనానిర్మాణ చాతుర్యముల్
    ముద్రాపూరితమౌ కవిత్వ ప్రతిభల్ మోదంబు చేకూర్చగా
    భద్రమ్మంచునునెంచి మేల్కొనుము నీ భావంబు లందెల్పుమా
    నిద్రాశక్తుడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నిద్రాసక్తుడు' టైపాటు.

      తొలగించండి


  17. భద్రంబైనది వినుమా !
    ఛిద్రంబవనీకు మదిని జియ్యకు సరియౌ
    తద్రూపపు యోగమ్మున
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  18. భద్రంబైనది యొగ్గుమా చెవిని సౌభాగ్యంబు నీదే యగున్
    తద్రూపమ్మగు జియ్య పై మనసులో తాదాత్మ్యతన్ చెందుచున్
    ఛిద్రంబయ్యెడి మానసమ్మును సమీక్షింపంగ, యోగమ్ములో
    నిద్రాసక్తుఁడవైన, నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  19. నిద్రయె సుఖమ్ము నిచ్చును
    భద్రమ్మునుజేర్చు నదియె పనితనమొసగున్
    రౌద్రమ్మునడచు నరుడా
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. నిద్రాసక్తుడు భీమసేను హరి మున్నేరీతి మేల్కొల్పెనో
    నిద్రాసక్తుడు కుంభకర్ణునికి పెన్నిద్రాలసత్త్వంబహో
    ఛిద్రంబౌటకునెంత పాటు లవి! సంక్షేమార్థివై యేలనో
    నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ? నిక్కంబిదే నమ్ముమా.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  21. యీ ద్రౌపది కోర్కె మిగిలె
    భద్రత లేనట్టి బ్రతుకు పాండుకుమారా
    నిద్రాణమ్మాయె బలము
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ!!

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రౌద్రము పోజేయుటకై
    భద్రుని పూజలు సలుపుచు భక్తిని గుడిలో
    రుద్రము జేయుచు నట ని
    ర్నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ.

    రిప్లయితొలగించండి
  23. భద్రత కరువయ్యెనురా 
    నిద్రనులేపంగ వలసె నేరము తెలిసిన్ 
    భద్రా ! నడుము రణమునకు 
    “నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ” 

    రిప్లయితొలగించండి
  24. క్షుద్రుండౌ కురురాజు చర్యలెపుడున్ క్రూరమ్ములే యెంచగా
    భద్రమ్మౌ గతి కాపుకాయ వలయున్ ప్రాణమ్ములన్ నిల్పగా
    నిద్రన్ మున్గిన నీదు సోదరులకై నీదౌ యభిజ్ఞానమున్
    నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    రిప్లయితొలగించండి
  25. చిద్రూపిసదానందుని
    ముద్రను ధరియించి నామమున్ స్మరియింపన్
    భద్రంబగుసద్యోగపు
    నిద్రాసక్తుండవైననీకుజయమ్మౌ

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    భద్రమ్మే ఘృతనిర్మితంబయినదౌ వాసమ్ము? నిత్యమ్మునీ
    నిద్రన్ బోవు సగమ్ము జీవితము., దీనిన్ మున్గ రక్షావిధిన్
    ఛిద్రమ్మేర్పడునన్ వివేకమతివై చింతించి మేల్కాంచుచో
    నిద్రాసక్తుడవైన నీకు జయమౌ! నిక్కంబిదే నమ్ముమా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  27. అక్కడే మో కంది వారు బాగున్నది ప్రశస్తము అద్భుతము అంటూంటారు. అక్కడేమో శ్యామలీయం వారు తూచ్ సదనంలో రాసేవన్ని పద్యాలేనా అంటూంటారు.

    జడశతకమూ ఓ శతకమేనా‌ అంటూ తీసి యేకి పారేసారు.

    ఏవిటో ఈ విష్ణుమాయ!

    నారదార్వాళ్ ఉంగళుక్కు ఏదావదు పురియరుదా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి


  28. భద్రము గూర్చగ రమ్మా
    చిద్రూపాయనుచు సతము చిత్తము నందున్
    భద్రాత్మున్ కొలిచి మదిని
    నిద్రాసక్తుండ వైన నీకు జయమ్మౌ

    మరొక పూరణ

    చిద్రూపుండగు శ్రీహరిన్ సతతమున్ చింతించు చున్డెం దెమున్
    భద్రంబందునటంచునుందురిలలో పంతమ్ము తోడన్ మహా
    భద్రాత్మున్ స్మరియించినొప్పు గనుతా బంధించుచున్ ధ్యాసలన్
    నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా”

    రిప్లయితొలగించండి
  29. భద్రా!యిట్టులనుండిన
    ఛిద్రంబగునీదుబ్రదుకుచింతలతోడన్
    భద్రంబుగమసలుగొనక
    నిద్రాసక్తుండవైననీకుజయమ్మౌ?

    రిప్లయితొలగించండి
  30. కం:

    రౌద్రపు వేడిని సైచగ
    భద్రత నెంచుచు సరిపడు బడలిక దీరన్
    క్షుద్రపు చర్యలకంటెను
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. విద్రుమ మే యగు రాత్రిన్
    నిద్రాసక్తుండ వైన నీకు సుఖంబే
    క్షుద్రం బీ సుద్దనృతమె
    నిద్రాసక్తుండ వైన నీకు జయమ్మౌ


    భద్రం బిచ్చును రాత్రి నిద్రయె శిరోభారమ్ముఁ దగ్గించుచున్
    నిద్రా భంగము కాక యున్న నిసిలో నిత్యమ్ము నిక్కంబు యీ
    మాద్రిం గాక దినమ్ము నందు విడుమా మధ్యాహ్న కక్ష్యాంత రా
    నిద్రాసక్తుఁడ వైన నీకు జయమౌ నిక్కం బిదే నమ్ముమా

    [కక్ష్యాంతర +అనిద్రాసక్తుఁడ = కక్ష్యాంత రానిద్రాసక్తుఁడ]

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. భద్రా!యేమియుజేయకుంటివిగయేపాత్రంబుజూడంగనౌ
    నిద్రాసక్తుడవైననీకుజయమౌ? నిక్కంబిదేనమ్ముమా
    భద్రంబయ్యదిలేనిచోటునసిరుల్బాఱంగనీనోపునే?
    ఛిద్రంబౌనుగజీవితమ్ములుభువిన్ ఛీత్కారమొందగగా

    రిప్లయితొలగించండి
  34. భద్రత గల్గును నీకా
    రుద్రుని మనమున గొలిచిన రూడిగ మేలౌ
    ముద్రను కైదాల్చుచు ని
    ర్నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ !!

    రిప్లయితొలగించండి
  35. రావణుడు కుంభకర్ణునితో...

    నిద్రాభంగంబనకుము
    క్షుద్రులు నర వానరముల గూల్చగ జనుమా
    భద్రత గూర్చుము లంకకు
    నిద్రాసక్తుండవైన నీకు జయమ్మౌ

    రిప్లయితొలగించండి