13, నవంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3543

 14-11-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నరకునిం జంపె సీత వానరులు గనఁగ”

(లేదా…)

“నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”

90 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మురియుచు మన్మరాలిగని ముద్దుల నిచ్చుచు హైద్రబాదునన్
    వరుసగ లడ్డులన్ తినుచు పండుగ పూటను వైభవంబుగా
    నరకొర మాటలన్ పలికి హాయిని గూర్చెద నివ్విధంబుగన్:
    “నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”

    రిప్లయితొలగించండి
  2. బాధలనువిన్నవించగామాధవుండు
    సత్యతోకూడిరణభూమిజనియెనాజి
    నరకునింజంపె,సీతవానరులుగనఁగ
    నగ్నిజొచ్చెనుసత్యునినానతివిని

    రిప్లయితొలగించండి
  3. సత్య కూడి గిరిధరుడు సమర మందు

    నేమి జేసె,రాముడడుగ నెవరు దూకె

    లంకలో నగ్ని లోనికి జంకు లేక

    నరకుని జంపె,సీత వానరులు గనగ

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తిరుగుచు వంగభూమినహ త్రిప్పలు సైచుచు మీనులందునన్
    మరచుచు చిన్ననాటి కథ మైకము నొందుచు పద్య విద్యనున్
    గురువులు చెప్పగా వినుచు కొండొక శిష్యుడు నమ్మెనిట్టులన్:
    “నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నరక చతుర్థి బోనస్:

      కంది గురువుల కంకితం:

      సరసపు మాటలాడుచును సత్యయె చేరగ తేరునందునన్
      మురియుచు కృష్ణుడే చనుచు ముచ్చట మీరగ యుద్ధమందునన్
      కురుపుచు బాణవర్షముల, కూరిమి నొందగ మూడు లోకముల్,
      నరకునిఁ జంపె,... సీత, సురనాథుఁడు, దైత్యులు, వానరుల్ గనన్

      తొలగించండి

    2. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారు ఉవాచ:

      "నరకుని చంపినది కృష్ణుడే, సత్యభామ కాదు"

      తొలగించండి

    3. కామేశ్వర రావు పోచిరాజుఅక్టోబర్ 29, 2016 10:02 PM

      శ్రీమదాంధ్ర మహా భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.

      తొలగించండి

    4. సీత స్వర్గమునుండి చూచుచుండగా...

      తొలగించండి
    5. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      బోనస్ పూరణలో కృష్ణుడు చంపినట్లే ఉన్నది కదా?
      'కురియుచు బాణవర్షమును...' అనండి.

      తొలగించండి
    6. రెండవ పూరణకు ముందు 'ఒక తాత తన మనుమరాలు సీతతో చెప్తున్నాడు....'
      అని వ్రాసి.. సమస్యలోని సీత శబ్దాన్ని సంబోధన(సీత!)గా సూచిస్తే అద్భుతంగా ఉంటుంది.

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  5. సత్యరూపంబుసీతయెసాధనమున
    జ్ఞానివానరుడాయమజాడతెలిసె
    రామరూపంబురావణురాగమణచి
    నరకునింజంపెసీతవానరులుగనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరక శబ్దానికి నీచస్థానం, దుర్గతి, కష్టకారణం అనే అర్థాలున్నాయి. రావణుడు నరక శబ్దవాచ్యుడే (సీత నపహరించి నీచస్థానం పొందినవాడు, సాధుజనులకు కష్టకారణమైనవాడు)
      కనుక మీ పూరణ సమర్థనీయమే. బాగుంది. అభినందనలు.

      తొలగించండి


  6. పల్కె తలతిక్క గానరె "పతిని, మీదు
    నరకునిం జంపె సీత వానరులు గనఁగ”
    చేత కాని మొగుడరరె చెప్ప గాను
    వినడు, కొట్టగానిక వెక్కి వెక్కి యేడ్చు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. తరుణులసాధుపుంగవులదాచివధింపగగిన్కసత్యతో
    సరగుననేగియచ్యుతుడుసంగరమందునదుష్టదైత్యుడౌ
    *“నరుకునిఁ జంపె ;సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”*
    ధరుణముజొచ్చియీలువునుధాత్రినుతించగజాటెజానయై

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శైలధరుడు సత్యనుగూడి సమరమందు
    జనులనిల హింసపెట్టెడి దనుజ ఖలుడు
    నరకునిం జంపె; సీత వానరులు గనగ
    పవనపుత్రుని నెంతయు ప్రస్తుతించె.

    రిప్లయితొలగించండి
  9. సత్య తోడుత శ్రీహరి చంపె నెవని?
    చితిన దూకెనే నాతి దా పతిని జేర?
    తెలియ జెప్పుము శీఘ్రమె తెలుగు బాల!
    నరకునిం జంపె; సీత వానరులు గనఁగ.

    రిప్లయితొలగించండి
  10. సత్యతో గూడి కృష్ణుండు సమర మందు
    చంపె నెవని? జనకుని వశ యెవరంటి?
    పవన తనయుడెప్పుడు తాను వనధి దాటె?
    నరకునిం జంపె, సీత, వానరులు గనఁగ

    రిప్లయితొలగించండి


  11. పలికె తలతిక్కగ "నపాం
    సుల నర కునిఁ జంపె సీత సురనాథుఁడు దై
    త్యులు వానరుల్ గనన్" విదు
    రులు చేసిరి బడితపూజ రోసి జిలేబిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. కరకగు రాక్షసాధముడు, కాంతుని తోడుత సత్యభామయే
    సరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమ
    ధాటిజూపుచున్
    నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్
    నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదాన్ని "కరకగు రాక్షసున్ దునుమగా హరి తోడుగ సత్యభామయే..." అనండి. అన్వయం చక్కగా కుదురుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో 🙏🙏🙏

      కరకగు రాక్షసున్ దునుమగా హరితోడుత సత్యభామయే
      సరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమ
      ధాటిజూపుచున్
      నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్
      నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధరణి జనాళినిన్ తనదు దానవ చేష్టల కష్టబెట్టుచున్
    తిరిగిన రాక్షసాధముని దేవకిపుత్రుడు సత్యతోడుతన్
    నరకునిజంపె; సీత నరనాధుడు దైత్యులు వానరుల్ గనన్
    ధరణమునందు దూకి తను దగ్ధముగాక పునీత యయ్యెగా!

    రిప్లయితొలగించండి
  14. నరుల బాధలు బాపగ నాతి సత్య
    వెంట జనుదేర కృష్ణుడు వీరు డగుచు
    నరకునిన్ జంపె : సీత వానరులు గనగ
    ఋజువు జేసెను తన శక్తి రూఢి గాగ

    రిప్లయితొలగించండి
  15. తరుణియు కృష్ణుడున్ గలిసి దందడిఁ జంపెనెవండనో?
    హరుని ధనుస్సునే విరువ యా రఘు రాముని బెండ్లియాడె నె
    వ్వరు? ఘన రాముడా యనిని వైరిని జంపిన తీరు తెల్పుమా?
    నరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "తరుణిని కృష్ణుడే కలిసి దందడితో జని యేమి చేసెనో" అనండి ... అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  16. సురవర పూజితుండుహరి చూడగ యుద్ధభూమిలో

    త్వరపడి సత్యభామ రణ తత్పరతన్ పతితోడ నేగియా

    నరకునిఁజంపె , సీత సురనాధుడు దైత్యులు వానరుల్ గనన్

    చొరగొని యగ్ని దూకె నిలఁజూపగ తాను పవిత్ర మూర్తిగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "చూడగ నందరు... పతితోడ నేగగా..." అనండి. నరుకుని కృష్ణుడే చంపిన అర్థం వస్తుంది.

      తొలగించండి
  17. ధవుని యెదుటనె భూదేవి తన తనయుడు
    నరకునిం జంపె ; సీత వానరులు గనఁగ
    ధవుని యెదుటనె నిప్పున దాటె ననుచు
    పోతన భాగవతమునందు బొందుబరచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధవుడు కృష్ణుడు భూదేవి తనయుడైన..." అనండి.

      తొలగించండి
  18. భాగవతం లో నరకుని చంపినది కృష్ణుడేనట మరి

    దార యెదుటనె కృష్ణుడు తన తనయుడు
    నరకునిం జంపె ; సీత వానరులు గనఁగ
    ధవుని యెదుటనె నిప్పున దాటె ననుచు
    పోతన భాగవతమునందు బొందుబరచె

    రిప్లయితొలగించండి
  19. సత్యతోగూడి శ్రీ కృష్ణు సంగరమున
    నరకునిం జంపె, సీత వానరులు గనఁగ
    కొలిచి భూమాత నొడిలోకి కూర్మిజేరి
    తనువుచాలించె తరుణియె దనరుభక్తి!!


    రిప్లయితొలగించండి
  20. సమస్య :
    నరకుని జంపె సీత సుర
    నాథుడు దైత్యులు వానరుల్ గనన్

    (శిష్యులకు చిలకమర్తివారి గణపతి చెప్తున్న పాఠం - తల్లి సింగమ్మ మందలింపు )
    చంపకమాల
    -----------
    " నరకుని జంపె సీత సుర
    నాథుడు దైత్యులు వానరుల్ గనన్ . "
    " అరరరె ! గణ్పతీ ! యటుల
    నంటివి యేమిర? బుద్ధి లేదురా?
    నరకుడు ద్వాపరంబునను
    నర్మిలి సీతమ త్రేతనున్ గదా !
    అరవకు నవ్విపోదురెవ
    రైనను విన్నను చాలుచాలురా !"
    ( ఒక్కమాటు బందావారి సమర్పణలో విజయవాడ ఆకాశవాణిలో వచ్చిన 'గణపతి '
    నాటకంలో నండూరి సుబ్బారావు గారిని , సీతారత్తమ్మ గారిని గుర్తుచేసుకోగలరు .)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీపూరణ అద్భుతం!గతంలో చదివినగణపతి నవలను గుర్తుచేసిన మీకు ధన్యవాదములు!

      తొలగించండి
    2. ఇటువంటి పూరణలకు పెక్కురు శకారునో, ఉన్మాదినో, త్రాగుబోతునో ఆశ్రయిస్తారు. చిలకమర్తి వారి గణపతి (మందబుద్ధి) మాటగా మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. గురువర్యులకు, సమూహ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు.

    గురువులు కంది వారు సమకూర్చి యొసంగ సమస్య నిట్టులన్
    "నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్"
    సరిసరి యంచు పండితులు చక్కని పూరణ లంద జేయగా
    నరుసము నిండ శంకరులు హాయిగ పంచిరి స్వస్తి వాక్కులన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదీ సమస్యాపూరణలో ఒక పద్ధతియే... తప్పించుకొని వెక్కిరించడం!
      ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  22. (మమతాను బంధాలను ఖండనము చేయువాడను భావము తో)

    తేటగీతి
    భిక్షువై వచ్చి లంకకు వెంటగొనియు
    శోకమందున నుంచ యశోక వనిని
    పూని రామమూర్తిన్, మమతాను బంధ
    నరకునిం జంపె సీత వానరులు గనఁగ

    చంపకమాల
    దరుమముఁ దప్పి బిక్షవుగ తారకరాముని కన్నుగప్పుచున్
    ధరణిజ లంకజేర్చ పరదారను బొందెడు నూహ, రావణున్
    సురపతి స్యందనమ్మునని జొచ్చిన రామునిఁ బూని మోహపు
    న్నరకునిఁ జంపె సీత సురనాధుఁడు దైత్యులు వానరుల్ గనన్

    (మోహము తో నీచుడైన వాని అను భావము తో)

    రిప్లయితొలగించండి
  23. దురమున భర్త దోడ జని దుష్టుని నెవ్వరిఁ సత్య గూల్చెనో
    అరిగెను భర్త దోడ వనమందున నెవ్వరు తోడు నీడగా
    పర సతి నాహరించి గొనె వంశ వినాశము సాక్షులెవ్వరో
    "నరకునిఁ జంపె" "సీత" "సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "..గొనె వంశవినాశము రావణుం డెటుల్" అంటే అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
  24. సతియు తోడుగ  కృష్ణుడు సమరమునను  
    "నరకునిం జంపె,  వానరులు గనఁగ”
    జనక సుత అగ్గిలో పడె జడుపు లేక
    భర్తకును తన పవిత్రత బయలుపఱుప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యలోని 'సీత'ను వదలి వేసారు.

      తొలగించండి
  25. సాయుధయయయికోపానసత్యభామ
    నరకునిజంపె,సీతవానరులుగనగ
    జేరెహస్తిపురికివెనుకనరాముసేనరాగ
    సుఖమయంబాయెరామునిసుచరితంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాయుధ యయి... నరకునిం జంపె..' టైపాట్లు.
      మూడవ పాదంలో గణభంగం. అయినా సీత చేరింది అయోధ్యకు... హస్తిపురికి కాదు.

      తొలగించండి
  26. చం:

    వరుసలు గల్పి ప్రేమయను వంకన నిత్యము గోలసేయచున్
    పరుషపు మాటలున్ కడకు ప్రాణము తీయగ నెంచ నాతృతన్
    మొరకుడి బారి నుండి భయమొందగ సత్యను బోలు సామ్యమున్
    నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. అన్నదమ్ము లిద్దఱు గూడి యాడుచుండఁ
      దత్క్షణము పల్కు ఘోరానృతమ్ము ననుచు
      నన్న యడుగఁ జెప్పె నిటులఁ జిన్నవాఁడు
      నరకునిం జంపె సీత వానరులు గనఁగ


      పరులు తలంతు రివ్విధిని భామయె నిల్చి వధించి నట్టులం
      బరఁగఁగ నేల సందియము పద్మ సులోచన! చిత్త మందు నా
      వరసతి సత్యభామ తన ప్రక్కన నుండఁగ వాసుదేవుఁడే
      నరకునిఁ జంపె సీత! సురనాథుఁడు దైత్యులు వా నరుల్ గనన్

      [వా నరులు = నో రున్న (తెఱచిన) నరులు]

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. మైలవరపు వారి పూరణ

    హరి రఘురామమూర్తి సిరి యాతని పత్ని విదేహపుత్రిగా
    వరకపివర్గమైరి సురవాసులు రామకథావసానమం..
    దరిగిరి స్వీయదేశములకప్పుడు ద్వాపరమందు సత్య యా
    నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  29. ద్వాపరమునందుసత్యయెవ్వానిజంపె?
    త్రేతయందున శ్రీలక్ష్మి దేవియెవరు?
    రాముడెవ్వరితోగూడి లంకకరిగె?
    నరకునిం జంపె సీత వానరులు గనఁగ

    రిప్లయితొలగించండి
  30. హరి పరిమార్చె నెవ్వరిని యంబురుహాక్షి రధమ్ము త్రోలగా?
    ధరణిజ యన్నయవ్వరిల? దైత్యుల కున్ రిపు వెవ్వరెంచగా?
    దురమున జంపె రాఘవుడు దుష్టుడు రావణు దోర్బలమ్ముతో
    నరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు, దైత్యులు వానరుల్ గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... నెవ్వరిని నంబురుహాక్షి... యన్న నెవ్వరిల..." అనండి.

      తొలగించండి
  31. అరకొరతెల్వియుండియునునాద్యుడువోలెనుసంచరించునా
    విరసునిమాటలిట్లుగనువెర్రిదనంబునుజూపుజూడుడీ
    నరకునిజంపెసీతసురనాధుడుదైత్యులువానరుల్ గనన్
    నరకునిజంపెసత్యయనినమ్ముడుగాదనిసీతయెప్పుడున్

    రిప్లయితొలగించండి
  32. సరగునరామచంద్రవిభుసన్నిధిజేరగ నగ్గలించునా
    సరసిజనేత్ర సీత యొక స్వప్నముగాంచెను మానసంబునన్
    పరమదయాళుడౌపతితపావనరాముడు రావణాసురున్
    నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్

    రిప్లయితొలగించండి
  33. సమర రంగము నందున సత్యభామ
    *నరకునిం జంపె, సీత వానరులు గనగ*
    చేసె నగ్ని ప్రవేశము శ్రీరఘువరు
    డాన తీయ మారాడక నప్పు డచట

    రిప్లయితొలగించండి