22, నవంబర్ 2020, ఆదివారం

సమస్య - 3552

23-11-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్”

(లేదా…)

“ఎలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్”

101 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    భవిష్య పురాణము:

    తలుపులు మూసి వంగమున తైతక లాడుచు నాల్గుప్రక్కలన్
    ములుకులు గ్రుచ్చుచున్ విరివి పుండులు చేయుచు భాజపాజనుల్
    కెలుకుచు దీదినిన్ త్వరగ క్రిందకు నీడ్చిరి నిట్టి రీతిగా:
    "నెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్..."

    రిప్లయితొలగించండి
  2. పలువురు మెచ్చగ నిరువురు
    తలపులు కలువంగ బిందు తంత్రము నాడన్
    కలుగున దాగుచు భ్రమతో
    నెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    బిందు తంత్రము = చదరంగము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదరంగము లోని ఏనుగును తినుబండారమనే భ్రమతో ఎలుకలు తమ కలుగులోకి ఈడ్చుకెళ్లాయి

      తొలగించండి
  3. పొలమున రాళ్ళ వాన బడ మున్గెను చేలును రాలె సస్యముల్
    వలవల నెత్తినోరులను బాదుచు సైరికు లేడ్వ నాయకుల్
    బలుకరు సాయమీయరు సభాస్థలి నా ప్రతిపక్ష మిట్లనున్
    *“యెలుకలు గంధవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్*

    రిప్లయితొలగించండి
  4. అలయక వాన వానలకు నంతయు పంకము పంకమందునన్
    మొలకలు బుట్టె బుట్టినను మూషక కోటుల దాడి దాడిలో
    *నెలుకలు గంధవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్*
    గలుగున ధాన్యరాశిగని కర్షకు లెంతగ తల్ల డిల్లిరో

    రిప్లయితొలగించండి
  5. అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    *కం||*

    పలుకులు తీపిగ బల్కుచు
    పలు పలు విధములుగ మార్చు పార్టీ నేతల్
    కలలను దీర్చెద మని యా
    *“యెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  6. చెలి పంచదార తోడన్
    బలువిధ బొమ్మలను చేసి బాలల కొరకై
    పులియన నుంచగ గాంచిన
    యెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలువిధ బొమ్మలు' దుష్టసమాసం. 'కాంచిన నెలుకలు..' అని ఉండాలి.

      తొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కలుపుచు బెల్లమున్ మురిసి కన్నియ చేయగ విగ్రహమ్మునున్
    కలుగున జేరి చూచియట కమ్మగ నుండు గణేశు మూర్తినిన్
    కులుకుచు నర్ధరాత్రినిక కూడుచు మైత్రిని దొంగచాటుగా
    నెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్...

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెలిమరి కీయగ నెంచుచు
    ఎలమిని బొమ్మల పొడగల నేతిమిఠాయిల్
    మెలపుగ గదినుంచిన వడి
    ఎలుకలు తమ కలుగులోనికేనుగు నీడ్చెన్.

    రిప్లయితొలగించండి
  9. తులువలు పద్మవ్యూహ మ
    నిలోన పన్ని యభిమన్యుని దునుమ నొకటై
    కలియఁబడిరి! అచ్చొచ్చో!
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తలపున నింతుల నెఱుగని
      దులిపుత్త్రుడు ఋష్యశృంగుఁ దోలుక రారే
      చెలు లంగ దేశమునకును
      నెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెలిమరితో గదినందున
    చెలగుచు చదరంగమాడి చివరకు నచటన్
    అలయుచు పావులు వదలగ
    ఎలుకలు తమకలుగులోనికేనుగు నీడ్చెన్.

    రిప్లయితొలగించండి
  11. కందం
    విలువలును నీతి బోధలుఁ
    బలు పలు విన్యాసములను బాలలు మురియన్
    మలచిన ననిమేషనులో
    నెలుకలు తమ కలుఁగు లోని కేనుగు నీడ్చెన్

    చంపకమాల
    విలువలు నీతి బోధలకు వేదికలౌ యనిమేషనాదులన్
    బలు పలు వింత చేష్టల వివాదములన్ సృజియించి బాలలున్
    గిలకిల నవ్వులాడుకొన కృత్రిమ గాథల నేర్చి కూర్చఁగా
    నెలుకలు మత్తవారణము నీడ్చె గనుండు కలుంగు లోనికిన్

    రిప్లయితొలగించండి
  12. చిలుకలు పాము లేనుగులు జింకల జేసెను పంచదారతో
    లలనయె బిడ్డకోరెనని, రక్షణ కోసము దాచెనంట పు
    త్తలముల విస్తరాకున ముదమ్మున, వాటిని గాంచినంతనే
    యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
  13. అలగులమాటలశల్యుడు
    పలువిధములక్రుంగఁదీసిబలిసేయంగా
    చలమునుగోల్పడెకర్ణుఁడు
    ఎలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్

    రిప్లయితొలగించండి
  14. పలు రూపపు బొమ్మలతో
    చెలువపు టేనుగు నొకటిని చేసియు నొకచో
    నిలుపగ రాతిరి యందున
    నెలుకలు తమ కలుగు లోని కేనుగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  15. అలుగులమాటలశల్యుఁడు
    పలువిధములక్రుంగఁదీసిబలిసేయంగా
    చలమునుబాయగకర్ణుఁడు
    ఎలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శల్యుడు ఏకవచనం, ఎలుకలు బహువచనం కదా!

      తొలగించండి
    2. మహాలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ***
      సీతాదేవి గారూ,
      అర్థాంతరన్యాసంలో ఆ లోపం ఉండదు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! 🙏🙏🙏

      తొలగించండి
  16. నెలతలు చక్కగ చేగొని
    సలుపగ పశుపక్షి తతుల శర్కర ప్రతిమల్
    తలచుచు నిజనాయకు నట
    ఎలుకలు తమ కలుగులోని కేనుగునీడ్చెన్

    బలిమిని నాక్రమించగను భారత
    దేశము దెల్లవారలే
    తలచుచు భారతీయులను తక్కువ
    వారిగ దెల్వియందునన్
    చెలిమిని నేకతాటిపయి చేతులు గల్పుచు నాటినేతలే
    సలిపిరి సత్యమార్గమున చక్కని పోరును నిట్టితీరుగా
    నెలుకలు మత్తవారణము నీడ్చె గనుండు కలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నలుపగు వారలెన్నడును నాగరికమ్మును నేర్వరంచు దా
      బలుపున బల్క ట్రంపుదొర బాధ్యత
      లేకయె యెన్నికందునన్
      విలువల నేర్పుచున్ గెలిచె పేదల దైవము భామహారిసే
      ఎలుకలు మత్తవారణము నీడ్చె గనుండు కలుంగులోనికిన్

      తొలగించండి
    2. అలయక నతులిత తపమును
      సలిపిన మునివర్యుడమర జాణను గలియన్
      మలినపు నింద్రియములనెడు
      నెలుకలు తమ కలుగులోని కేనుగునీడ్చెన్

      తొలగించండి
    3. మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
  17. వలయముగాగవీరులునువాలుగనేర్పడిఁజుట్టిరచ్చటన్
    విలవిలనాడఁజేసెనుగవారినిక్రుష్ణునిమేనయల్లుఁడున్
    బిలబిలవచ్చిరందరునుబాలునిఁజంపగభీకరంబుగా
    ఎలుకలుమత్తవారణమునీడ్చెకనుండుకలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు:

      చెలిమరితో కుటీరమున స్నేహమునన్ చదరంగమాడుచున్
      అలయుచు నాటనాపి గదినందున విందును జేయ బోవగన్
      చెలగుచు పావులన్నియునుచిందరజేసి రయమ్మునొందుచున్
      యెలుకలు గంధవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్.

      తొలగించండి
  19. కలులు తమ లాభమెంచగ
    చెలిమిగ మాదక విషముల చేపగ నెంచన్
    పలుసుద్దులు దుర్నీతుల
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  20. పలువురు మెచ్చురీతిగను పాలనజేసెడు నాయకత్వమున్
    విలువలపెంచునట్లుగను వేవురి నెన్ను కొనంగ నెంచగా
    పలుచనసేయగోరు పలు వాదములెంచుచు నడ్డునిల్వగా
    ఎలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్!!

    రిప్లయితొలగించండి
  21. కలకండ దోడ బొమ్మలు
    పలురూపంబులను జేసి వాయన మిడగా
    చిలుకకు చీమలు బట్టెను
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  22. నెలవున సమ్మతి కొరవడ
    చెలువముగా ముఖ్యమంత్రి జేసెద మనుచున్
    చలనపట నటుని జేకొన
    నెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  23. సమస్య :
    ఎలుకలు మత్తవారణము
    నీడ్చె గనుండు కలుంగులోనికిన్

    ( జొనాదన్ స్విఫ్ట్ నవల " గలివర్స్
    ట్రావెల్స్ " లోని ఒక సన్నివేశం )

    చంపకమాల
    ------------

    బిలబిలలాడి యొండొరుల
    బిల్చుచు లిల్లిపుటుల్ చటుక్కునన్
    కులకుల గూయుచున్ పొడవు
    గుండిన త్రాళుల గట్టి క్రుద్ధులై
    వలయములన్ గలీవరుని ;
    బంధితు ; నిద్రితు ; లాగుచుండిరే !
    యెలుకలు మత్తవారణము
    నీడ్చె ; గనుండు ; కలుంగులోనికిన్ .
    ( గలివర్ - ఆరడుగుల నవలానాయకుడు ; లిల్లిపుటుల్ - నాలుగంగుళాల బుజ్జిమను జులు ; మత్తవారణము - మదపుటేనుగు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గలీవర్ ప్రస్తావనతో నన్ను నా బాల్యానికి తీసుకువెళ్ళారు. గలీవర్, సిందుబాద్, ది కౌంట్ ఆఫ్ మాంటుక్రిష్టో, ది ప్రిన్స్ అండ్ ది పాపర్, లే మిజరబుల్, టామ్ సాయర్... ఎన్నో గుర్తుకు వచ్చాయి.
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. బలమే అరణ్యములో శరణ్యము. చలికి అన్ని జంతువులూ సతమరమౌతుంటే
    ఒక సిం హము ఒక ఏనుగును చంపి ఈడ్చుకుపోవడం ఎలుకలు చూసాయి.. ఆ ఎలుకలు చూసాయని తెలియడానికి "మీరు", ఆ కలుగులోకి చూడండి, ఎలుకలు ఆ సన్నివేశం చూస్తూ కనిపిస్తాయి. 😀😀😀

    చం||
    చలి మొదలయ్యె దేశమున జాలని తిండి వనాంతరంబునన్
    విలయము పొంచియుందనుచు వేచెను జంతువులన్నియున్ మహా
    బలయుతసింహమేనుగును భండనమున్ తెగటార్చి, జూడగన్
    ఎలుకలు, మత్తవారణమునీడ్చె! గనుండు కలుంగులోనికిన్!

    ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
      'ఉంది' అనడం వ్యావహారికం. "పొంచియున్నదని..." అనండి.

      తొలగించండి
  25. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    ఎలుకలు తమ కలుగు లోనికేనుగునీడ్చెన్
    (లేదా)
    ఎలుకలు మత్తవారణము నీడ్చె గనుండు తమ కలుంగు లోనికిన్

    నా పూరణ

    1) కందము

    వలలోపలఁ బడవేయగఁ

    పలువురతోపద్మరచన పటువుగఁ
    జేయన్

    బలియయ్యెను పార్థుసుతుడు

    ఎలుకలు తమ కలుగు లోనికేనుగు నీడ్చెన్

    2) కందము

    అలతిగ రాజ్యముఁ బొందగ
    బలవంతులఁ బాండుసుతులఁ బాచికలాటన్
    సులువుగఁ గెలిచితి రకటా
    ఎలుకలు తమ కలుగులోని కేనుగునీడ్చెన్

    3) చంపకమాల

    పలుమరు రెచ్చగొట్టుచును వాసవసూనుని దూరపొంతకున్

    బిలువ సుశర్మ , పార్ధుడ వివేకుడు భీకరపోరు సల్పుచున్

    నిలువగఁ , గాలగమ్యముననిచ్చట పుత్రుని కోలువోవగా

    ఎలుకలు మత్తవారణమునీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి


  26. పలువిధములగు తెఱగు బొ
    మ్మల చేయంగను జిలేబి మధురమ్ముగ, మా
    పు, లటుక్కున సడి సేయక
    యెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  27. ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)


    చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
    వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
    యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
    పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాకు తోచిన అసంభావితాలు...
      ఒకటి జిలేబీ భయపడడం... రెండు మీ యింట ఎలుక కలుగు ఉండడం!

      తొలగించండి
    2. :) ఒకటి కరెక్టు :) రెండోది కాదు :)

      తొలగించండి
  28. చలమున పాండుభూవరలసద్గుణధర్మవిశిష్టపుత్రుల
    న్బలియులఁ, కౌరవుల్ జెనకి పాచికలాటల గెల్చి యంపిరే
    యలయ నరణ్యవాటికల నక్కట సృష్టివిచిత్రవిలాసమియ్యదో!
    యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "సృష్టివిచిత్ర మియ్యదో/సృష్టివిలాస మియ్యదో"

      తొలగించండి
    2. అవునండీ ధన్యవాదములు
      సవరణతో

      చలమున పాండుభూవరలసద్గుణధర్మవిశిష్టపుత్రుల
      న్బలియులఁ, కౌరవుల్ జెనకి పాచికలాటల గెల్చి యంపిరే
      యలయ నరణ్యవాటికల నక్కట సృష్టివిలాసమియ్యదో!
      యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

      తొలగించండి
  29. వలలో బడగా ధనముకు
    బలహీనత గల్గియున్న పార్టీకొచ్చెన్
    బలిసినపార్టియు నాయక,
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనమునకు' అనడం సాధువు. 'వచ్చెన్' అన్నదానిని 'ఒచ్చెన్' అనరాదు.

      తొలగించండి
  30. బలమును గల్గిన కరియగు
    వలయముబన్ని నభిమన్యు పరిమార్చుటకున్
    బలహీన కౌరవ దళము
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి


  31. కంద చంప్స్


    చకచక తిరిగి కనులు కా
    నక నెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుం
    డు కలుంగులోనికిన్ చో
    టిక లేకయు చచ్చెనవి కుటిక కూలంగన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. చిలుకలు కోరుచు ఫలలము తినెనుగా కూర్చుండి వృక్షంపు కొమ్మ పైన,

    పావురములు పట్టి బంధించె వెరవక
    సింగము నొక్క టిన్ చెరువు చెంత,

    మర్కట మొక్కటి మకరము
    ను బయట
    కీడ్చెను రయముగ,కినుక తోడె

    లుకలు తమ కలుగులోని కేనుగ నీడ్చె
    నెక్కడైనను గని నిజము తెలుప

    మని నొకడు తన సందియము నడుగంగ,

    సంభ వంభగు నిలలోన
    శంకరార్య

    ఘన సమస్యా సమూహమం దనుచు పలికె

    కవి వరుండొకడు రయమున్ స వివరముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తెలుపుమని యొక్కడు..." అనండి.

      తొలగించండి
  33. చిలుకలబలుకులవోలెను
    బలుకుచుదాదోచుకొనుచుపడతులమనముల్
    నెలమినివశపరమగుటను
    నెలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్

    రిప్లయితొలగించండి
  34. వెలుగులు విరజిమ్ముచునే
    విలయము సృష్టించు విధము వేధనమిగులన్
    మలుపులు దిరిగిన పోరున
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్!!

    రిప్లయితొలగించండి
  35. పలుకులుకావవిములుకులు
    కలవరమునుకలుగజేసె కర్ణునిమదిలో
    తలచెను శల్యుండప్పుడు
    ఎలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి
  36. రిప్లయిలు
    1. 1962 లో అరుదైన ఎన్నికల ఓటమిని వాజపేయి కి అందించిన మహిళ -సుభద్ర జోషి , ఆ విషయంలో ఈ ప్రయత్నము.

      చం:

      అలమట లేక యెన్నికలు నాటగ గెల్చెడి వాజపేయికిన్
      బలిమియె లేని స్త్రీ యొకతె భారమె యయ్యె ననూహ్య రీతిలో
      నిలబడు నిట్టి సంఘటన నిత్యము నివ్విధి బల్కు రీతిగా
      నెలుకలు మత్త వారణము నీడ్చె గనుండు కలుంగు లోనికిన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  37. బలమునభీముడార్తజన బాంధవుడాతడు సద్గుణుండునా
    బలముఱిఁదాకె 'కోవిడ'ను ప్రాణముదీయు మశూచి యంతటన్
    కలవరపాటుతోడకడుగాసిలియెల్లరు పల్కిరిట్లహో
    "ఎలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్"

    రిప్లయితొలగించండి
  38. కలదు యశస్సు నాకనుచు గర్వముతోడుత మాటలాడుచున్
    విలువ నొసంగకుండ కడు ద్వేషమునున్ గురిపించ స్పర్తిపై
    నిలికపు గుంపుగా తలచి, యింపును జూపి ప్రజాళి యెంచగా
    నెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
  39. చంపకమాల
    చెలఁగి యిరాకు నేలెడు హుసేనను దిగ్గజమున్ సహించరై
    కలతలఁ బెట్ట యయ్యమెరికాధిపతుల్, వెఱ నిస్సహాయుడై
    తొలగుచు నేలమాలిగను దొంగడె! యన్యుల భూమి దూరు నా
    యెలుకలు మత్తవారణము నీడ్చె గనుండు కలుంగు లోనికిన్!

    రిప్లయితొలగించండి
  40. అలుకనుజెందగాసరళ యప్పటికప్పుడు జేయచక్కెరన్
    నెలుకలుబాములన్ దనరయేనుగులాదిగబొమ్మలత్తరిన్
    లలితమనోహరంబగుట లాస్యముతోడన,సంతసంబునన్
    నెలుకలుమత్తవారణమునీడ్చె గనుండు కలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
  41. కలయో వైష్ణవ మాయయొ
    మలిగెను నరకుంజరమ్ము మాయఁగ బలమే
    యల బభ్రువాహనున కని
    నెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

    [నర కుంజరము = అర్జునుఁ డను నేనుఁగు; ఇచట బభ్రువాహనుఁ డొక్క ఎలుకకు కాక పలు నెలుకలకు సమానము]


    పలువురు పైనఁ బడ్డ మఱి వారికి సింహబలుండు చిక్కఁడే
    కలిగిన వీర్య ధైర్యములు కార్య వివేకము తద్ద యున్ననుం
    జెలఁగి వనమ్ములోఁ గరము సింహ సమూహము, సూచుచుండఁగా
    నెలుకలు, మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగు లోనికిన్

    [కలుఁగు = గుహ]

    రిప్లయితొలగించండి
  42. మైలవరపు వారి పూరణ

    లలితవచోవిలాసులు విలాసవతుల్ గణికాప్రవృత్తిలో
    చిలకలనంగ బిల్వబడు చేడియలొక్కట గుంపుగాగ., వి...
    హ్వలుడయి జావగారి ధనవంతుడు జిక్కగ వారి మధ్యలో
    నెలుకలు గంధవారణమునీడ్చె గనుండు కలుంగులోనికిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  43. సులభము కాదు ధర్మజుని సూర్యుని వంటి కిరీటి చెంతగా
    మెలగిన బంధిసేయగను మేడెము నందని ద్రోణుడాడు మా
    టలవిని కుట్రపన్నుచు నటన్ ఖలు రైన సుశర్మ బృందమౌ
    యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్

    రిప్లయితొలగించండి
  44. తెలివిగ సభలో సచివుడు
    పలుకుచు నుండెను గడుసుగ పరిపరివిధముల్
    నిలువుగ ముంచగ పరులను
    నెలుకలు తమ కలుగు లోని కేనుగు నీడ్చెన్

    రిప్లయితొలగించండి