30, నవంబర్ 2020, సోమవారం

సమస్య – 3560

1-12-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా”

(లేదా…)

“నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే”

89 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కోవిడ్ వైరసువాచ:

    కేకల్ వేయుచు ముక్కులన్ ముడుచుచున్ క్రీడించగన్ మానవుల్
    శోకమ్ముల్ కడు తెచ్చుచున్ జనులకున్ శోభించుచున్ మాస్కులన్
    నాకమ్మందున పంపుచున్ వడివడిన్ నందమ్మునున్ బొందెడిన్
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే...

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శోకము గూర్చెడి తలపున
    లోకము నందున కరోన రుజగా నన్నున్
    ప్రాకించినవేళను మరి
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

    రిప్లయితొలగించండి
  3. లోకమునందలిజీవుఁడు
    ప్రాకటముగముందువెనుకప్రాణముఁబాయన్
    ఆకలిపురుషుండనియెను
    నాకర్తవ్యముజనవినాశనమెకదా

    రిప్లయితొలగించండి
  4. ఆ కురు వృద్ధుని, దమ్ముల
    తా కనుగొని పార్థుడంత తడబడి పలికెన్
    నాకనిపించెను కృష్ణా!
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గిరీశపు చుట్ట ఉవాచ:

    పేకల్ వేయుచు బల్లలన్ మురియుచున్ పేకాటలన్ మున్గుచున్
    పీకల్ మూయుచు మ్రింగుచున్ జనులహో భీతిల్లకే ధూమమున్
    జోకుల్ వేయుచు రింగులన్ విడుచుచున్ శోబిల్లగన్ క్లబ్బులన్
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే...

    రిప్లయితొలగించండి
  6. లోకేశుని విధి సృష్టి,ది

    వాకరుని విధి వెలుగిడు ట ,ప్రవచించెద గా

    యీకాలుని విధి, వినుమా

    ‌నా కర్తవ్యము జన వినాశనమె కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం "యీ కాలుడు చెప్పె నిటుల" అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
  7. ఏకమ్మాయెనుపేదగోప్పలునునీవేర్పాటుపోయెన్గదా
    బాకాలూదుచునాకరోనజనికీభావమ్ముచెప్పెన్బలే
    శోకంబందకునోరిమానవుడ! నీసోకుల్గతుల్దప్పులే
    నాకర్తవ్యంబునెఱుంగఁజెప్పెదఁప్రజానాశమ్మెసంక్షోభమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...జనికీభావమ్ము' ?

      తొలగించండి
    2. జని-ప్రజలుఅంతాసమానమేయనుభావమునుకరోనాబోధించినదిగదా

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శోకమ్మున్ నలుదిక్కులన్ పఱచగా సూక్ష్మక్రిమిన్నౌ ననున్
    లోకమ్మందున నన్ని దేశములలో రోగమ్ముగా జేయుచున్
    ప్రాకించెన్ ప్రతివాద ముష్కరులు పాపమ్మెంచి దుష్టత్వమున్
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే1

    రిప్లయితొలగించండి
  9. ఒక ఉగ్రవాది స్వగతం :-

    మూకుమ్మడి దాడులతో
    భీకరముగఁ జేయ వలెను విధ్వంసమ్మున్
    లోకముననుగ్రవాదిగ
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

    రిప్లయితొలగించండి
  10. మూకలనిలువంబెట్టుట
    పోకిరులను నాపు మేలు పోలీసులదే
    శోకమున జులాయి యనెను
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కొరొన తోడు ట్రంపనె
      శోకాన జనులు వగచిన శోభగ తోచున్
      నాకే పదవి వలదుగా
      నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా !!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. అందరికీ నమస్సులు🙏
    కరోనా అంతరంగం....

    లోకము పోకడ వలననె
    శోకము దరిచేరె జనుల సూనృత కర్మల్
    నూకలు చెల్లగ మీకున్
    *నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  12. ఒక దోమ అంతరంగం

    నాకాటు తోను మనుజుల
    జీకాకులు బెట్టుగొప్ప జీవినినేనే
    ఏకాలమైన నాదే
    నాకర్తవ్యమ్ము జన వినాశనమె గదా!

    రిప్లయితొలగించండి
  13. *కరోనా అంతరంగం*
    ...... ....... ...... ....... .... ..... ......
    లోకమె భీతిలు రీతిని
    నా కదలిక బెంచుచుంచి నరజాతినినే
    శోకమున ముంచ నెంచితి
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా

    రిప్లయితొలగించండి
  14. శోకము మిగల్చ వచ్చెన్
    కేకలు బెట్టుచు తుఫాను కేరింతలతో
    నూకలు పండిన వేళయె
    నా కర్తవ్యమ్ము, జన వినాశనమె కదా

    రిప్లయితొలగించండి
  15. విరాట్స్వరూపుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి ఆయన అభిమతాన్ని వ్యక్తము జేయుట, అహముతోగాక కింకరూదిగా దాన్ని అవలంబించమని జెప్పుట:

    శా||
    లోకంబందు వినాశనంబిడుట కల్లోలంబు జేయంగ నా
    యాకాంక్షన్ నెరవేర్చు కింకరుడవై యవ్వ్యక్తతన్ వీడి యీ
    మూకన్ జెండుము పార్థ! లీలయిదె యుద్బోధన్ ప్రసాదించెదన్:
    నాకర్తవ్యమెరుంగ జెప్పెద బ్రజానాశమ్మె సంక్షోభమే

    రిప్లయితొలగించండి
  16. భగవానువాచ:
    లోకమునందునపాపుల
    నేకముగాపెరిగిపుడమినెల్లనునిండన్
    వ్రేకమునుడుపగ ధరణికి
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కృష్ణుడెడందఁ దలచె
    నీ కౌరవపాండవులకు నెవ్విధి సంధిన్
    నే కూరఁగఁదోడ్పడుదున్?
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

    రిప్లయితొలగించండి
  18. సమస్య :
    నా కర్తవ్య మెరుంగజెప్పెద బ్రజా
    నాశమ్మె సంక్షోభమే

    ( " ఎందుకింత వినాశనాన్ని కలిగిస్తున్నా ? " వని ప్రశ్నించిన ఒక సిద్ధపురుషునికి కరోనాక్రిమి సమాధానం )
    శార్దూలవిక్రీడితము
    -----------------
    నీ కన్నుల్ల్ ముకుళింపజేసికొని యీ
    నిష్కామలోకమ్ములో
    గాకల్ దీరిన రోతభావములతో
    గాలించి వేధించిరే
    యాకాశాగ్నిధరిత్రివాయుజలభూ
    తాళిన్ మహాభ్రష్టులై ;
    నా కర్తవ్య మెరుంగజెప్పెద ; బ్రజా
    నాశమ్మె ! సంక్షోభమే !

    రిప్లయితొలగించండి
  19. లోకము గడగడ లాడగ
    చేకొనె పెక్కురి యసువులు చీకాకు పడన్
    శోకము మిగిల్చె ను కరో
    నా కర్తవ్య మ్ము జన వినాశన మె కదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూహించిన 'కరోనా కర్తవ్య' మన్న పూరణ మీనుండి వచ్చింది. దీనిని వాట్సప్ సమూహంలో షేర్ చేసాను.
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి


  20. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ !


    ఏకత్రాటిని తెచ్చుట
    నా కర్తవ్యమ్ము; జన వినాశనమె కదా
    మీ కోరిక ? కానివ్వను
    మీ కార్యకలాపములను మీ దుష్కృతులన్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  21. ఏకత్రాటిని తెచ్చి దేశమునికన్ శ్రేష్ఠంబు గాచేయుటే
    నా కర్తవ్య మెఱుంగఁ, జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే
    మీ కౌటిల్యపు బుద్ధి ! త్రుంచెదనిదే మీ దుష్కృతిన్; దుష్టులా
    రా! కానివ్వను మీ ప్రణాలికల నా రావమ్మిదే వృద్ధికై!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. సౌకర్యము కలిృగించుట
    నా కర్తవ్యమ్ము ; జన వినాశనమె కదా
    మీకు కనవచ్చు నెల్లెడ ,
    నాకగొలుపుట పరిపాటి యభివృద్ధియెడన్

    ఆకగొలుపు = నిరోధించు

    రిప్లయితొలగించండి
  23. సంధి పొసగదనిన రారాజు గని శ్రీకృష్ణ పరమాత్మ అంతరంగం....

    కందం
    శోకించి గోవు, ధర్మము
    లోకమ్మునఁ బాపమడఁచ రూపించుమనన్
    జేకొన జన్మ, దురితులన
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

    శార్దూలవిక్రీడితము
    శోకంబందుచు పాపభారమునకున్ స్తోత్రించ గో ధర్మముల్
    సాకారంబుగ నైతి నంద సుతునై సాగించి దౌత్యమ్ములన్
    బోకార్చంగ నధర్మవర్తనులనేఁ బూనంగ కాలోస్మినౌ
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే!

    రిప్లయితొలగించండి
  24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    నాకర్తవ్యమ్ము జన వినాశనమెకదా

    నాపూరణ

    కందము

    నీకే యర్జున వినుమా
    ప్రాకటముగ విల్లునంది పగతురఁ
    దునుమన్
    భీకర యుద్ధముఁ జేయుము
    నా కర్తవ్యమ్ము జనవినాశనమె కదా

    ఆదిభట్ల సత్యనారాయణ
    (సరి చేసి)

    రిప్లయితొలగించండి
  25. యమునితో కోవిడ్ 19 వైరస్

    మీకొక్కింతయు శంక కూడదిల స్వామీ!కార్యభారమ్ములన్
    వీక న్మించగఁ జేసి చూపెదను నిర్వేలాప్తహేలాకృతిన్,
    లోకమ్మెల్లెడ మారు మ్రోగ మృతికల్లోలోగ్రరావమ్ములన్,
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 01.12.2020
      అందరికీ నమస్సులు🙏

      నా పూరణ ప్రయత్నం..

      *కం||*

      భీకర బాధలు సృష్టిగ
      నాకలి తీరంగ లేని యాకలి బలికెన్
      పోకడ యిదియని భువిలో
      *“నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా”*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏

      తొలగించండి
  26. ఆకొన్నవారిబ్రోచుట
    నాకర్తవ్యమ్ము,జనవినాశనమెకదా
    రాకయకరోనవైరసు
    మూకుమ్మడిచావులవియమొదలిడెజగతిన్

    రిప్లయితొలగించండి
  27. రాకన్ మానను వచ్చిమీకునునికన్ రాబందులౌవారికిన్
    నాకర్తవ్యమెఱుంగజెప్పెదబ్రజానాశమ్మెసంక్షోభమే
    మీకున్ ధైర్యముసాహసంబులిట యేమేరంగబ్రాప్తించునో
    నాకున్ జెప్పిన నేనుబొందుదిపుడేనావారిసామీప్యమున్

    రిప్లయితొలగించండి

  28. కరోనా అంతరంగము

    లోకుల హింసించుటయే
    *నాకర్తవ్యమ్ము,జనవినాశనమెకదా"
    నీకలికాలమ్మునగన
    చీకాకులు గూర్చి జనుల చెండాడుటయే

    రిప్లయితొలగించండి
  29. పీకన్గోసెనుద్రౌపదేయులనుజంపెన్డింభకున్గర్భమం
    దేకారుణ్యములేదుద్రౌణికినయోదిక్కెవ్వరీప్రాణికిన్
    జీకాకైదరుణీమణుల్వగవగన్శ్రీకాంతుతోనిట్లెనెన్
    *“నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే”*

    (అశ్వత్థామ శ్రీకృష్ణుని తో, పాండవంశనాశనమే దుర్యోధనుని ప్రీతికరమైన దనిచెప్పుచూ)

    రిప్లయితొలగించండి
  30. కె.వి.యస్. లక్ష్మి:

    లోకపు పోకడ మార్చుచు
    భీకర రూపున కరోన పెరుగుచు ననియెన్
    చీకాకులు పెంచెద నిక
    నా కర్తవ్యమ్ము జనవినాశనమె కదా!

    రిప్లయితొలగించండి
  31. లోకాల సృజించు నలువ
    లోకాలను విష్ణు వేలు లోకోత్తరుఁడై
    యా కాలుం డను నివ్విధి
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా


    కాఁకల్ దీరిన దేశ రాక్షసులు నిర్ఘాతాలి తుల్యమ్ముగా
    వీకన్ జన్మ నొసంగి రుద్ధతిని నీ విశ్వమ్ముఁ బాలించఁగా
    నా కాయు స్సమితమ్ము భూమి పయి నణ్వస్త్రమ్ము నా పే రహో
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే

    రిప్లయితొలగించండి
  32. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉటంకిస్తూ నాప్రయత్నము

    శా:

    మైకుల్ ద్రుంచుచు చిత్తమెంచిన గతిన్ మైమర్చి చిందేయుచున్
    కాకై కూయుచు నోటి కంది నటులన్, కానివ్వ కేకార్యమున్
    లోకుల్ జూతురటన్న సంజ్ఞ నికపై లోపించ, నైరాస్యమున్
    నాకర్తవ్య మెఱుంగ జెప్పెద బ్రజా నాశమ్మె సంక్షోభమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో ప్రయత్నంగా:

      శా:

      లోకంబెల్లెడ విస్తరించి వడినిన్ లోపాయకారీ గతిన్
      చీకాకొందగ జేయు సన్న క్రిమిగా చెండాడు ప్రాణమ్ములన్
      టీకా లేక మరింత సంకట మవన్ ఠేవన్ సమృద్దౌ, కరో
      నా, కర్తవ్య మెఱుంగ జెప్పెద బ్రజా నాశమ్మె సంక్షోభమే

      వై.చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కాకి+ఐ, సమృద్ధి+ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    3. ధన్యవాదములు , మార్చే ప్రయత్నము చేస్తాను

      తొలగించండి
    4. సూచన కనుగుణంగా 2 వ పాదం మార్పు తో..

      శా:

      మైకుల్ ద్రుంచుచు చిత్తమెంచిన గతిన్ మైమర్చి చిందేయుచున్
      బాకా లూదుచు గొప్ప లెంచు కొనగన్, పాటించు సంరోధమున్
      లోకుల్ జూతురటన్న సంజ్ఞ నికపై లోపించ, నైరాస్యమున్
      నాకర్తవ్య మెఱుంగ జెప్పెద బ్రజా నాశమ్మె సంక్షోభమే

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    5. లోకంబెల్లెడ విస్తరించి వడినిన్ లోపాయకారీ గతిన్
      చీకాకొందగ జేయు సన్న క్రిమిగా చెండాడు ప్రాణమ్ములన్
      టీకా లేక మరింత సంకట మవన్ ఠేవన్ తలిర్చన్ కరో
      నా కర్తవ్య మెఱుంగ జెప్పెద బ్రజా నాశమ్మె సంక్షోభమే

      తొలగించండి
  33. లోకమున నాల్గు యుగములు 
    చీకాకులు పెంచు కలియె చివరి యుగమ్మౌ  
    భీకరమై యనును సదా  
    “నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా”  

    రిప్లయితొలగించండి
  34. ఆకారమ్మది లేక చైన యధి రాజ్యంబునన్ బుట్టి యీ
    లోకంబంతయు విస్తరింప జనులే రోధింపగా భీతితో
    నాకానందము కల్గుచుండెగద ప్రాణాలన్ బ్రయోషింపగా
    నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "...యధిరాజ్యంబందునన్ బుట్టి.." అంటే సరి!

      తొలగించండి
  35. ఏకంభై జనులెల్లరున్ నిలిపిరా హీనాత్మునిన్ మంత్రిగా
    నీకున్ నాకని పంచుకొంచు నిధులన్ నిత్యంబు దారాడెడిన్
    ఆ కర్కోటకుడా దురాత్ముడకటా ఆతండికన్ బల్కునే
    "నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే"

    రిప్లయితొలగించండి
  36. లోకుల తికమక జేయుచు
    చీకాకులు కలుగజేసె చీనా వాడే
    ఈ కలియుగమందు కొరో
    నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా !!

    రిప్లయితొలగించండి
  37. కం..
    రాకాసి జన్మనెత్తితి
    నాకుకరోనా యనియెడి నామంబు తగెన్
    లోకము శోకము జూచెద
    నాకర్తవ్యమ్ము జనవినాశనమెకదా
    - గానుగుల

    రిప్లయితొలగించండి