11, జనవరి 2021, సోమవారం

సమస్య - 3601

2-1-2021 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున”

(లేదా…)

“సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్”

36 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    సూర్యుడు దాగగా మురిసి సుంతయు బుద్ధిని వీడి మబ్బులన్
    కార్యములన్ని వీడుచును గండర గండుడు ముత్తుకూరునన్
    భార్యనువీడి గ్రోలగను బ్రాహ్మణ వీధిని కల్లుముంతలన్
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్..

    రిప్లయితొలగించండి
  2. కార్యమున భర్తను యముని

    శౌర్యము బారి పడనీక ఛాయగ కరమున్

    ధైర్యమ్మునడ్డు వేళన

    సూర్యుఁడు చంద్రుని తెఱఁగున శీతకరుండే”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. ఆర్యుఁడుద్రోణుఁడుననినని
    వార్యుడుదుర్మతులమదమువారింపంగన్

    పేర్మినిశిష్యులదయగను
    సూర్యుడుచంద్రునితెఱగునశీతకరుండే

    రిప్లయితొలగించండి
  4. వెలుగులను నింపి జగతికి ప్రీతి గూర్చి
    కలుగ జేయును చైతన్య కాంతు లొసగి
    దినమణి యె : శీత కరుడు చంద్రుని తెఱఁగున
    నెవరు గలరయ లోకాన నెంచి చూడ?

    రిప్లయితొలగించండి
  5. ఆర్యుఁడుద్రోణుడుననినని
    వార్యుడుదుర్మతులమదమువారింపగ, నా
    చార్యుడుశిష్యులదయగను

    సూర్యుడుచంద్రునితెఱగునశీతకరుండ

    రిప్లయితొలగించండి
  6. అగ్ని గోళము వలె మండు నంబరమున
    పట్టపగలను మాటయే వాస్తవంబు
    చూడ పూర్వాద్రు లందు నుషోదయాన
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

    రిప్లయితొలగించండి
  7. కందం
    భార్యా సమేతులుగ గురు
    వర్యులుదౌ మరసవల్లి పయనమ్మున నౌ
    దార్యతఁ దెలిమబ్బునరుఁగ
    సూర్యుఁడుఁ జంద్రుని దెఱఁగున సుషిమకరుండే

    ఉత్పలమాల
    ఆర్యులు కందిశంకరులు నా గురుపత్ని సమేతులై జనన్
    సూర్యుని నర్సవల్లిఁ దగ జూడఁగ భక్తికి మెచ్చి నింగి నౌ
    దార్యతఁ దెల్ల మబ్బు తెర దాగుచు హాయినొసంగ నాడుఁ దా
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  8. ధైర్యము గల్గినట్టి తన దారయె కోరగ మందహాసమున్
    గార్యము లెన్నియున్న మమ కారము జూపుచు జెంతజేరి తా
    భార్యకు జెప్పె పండితుడు వాస్తవమంచు నుషోదయమ్మునన్
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  9. చౌర్యము జేయగా హిమము సారసమిత్రుని మార్గశీర్షమున్
    పర్యవసానమై తనరి ప్రాగ్దిశ దోచెను శీతసానువై
    శౌర్యము జూపెడున్ దరణి చండ్ర మయూఖతతుల్
    కృశింపగా
    సూర్యుడు చందమామవలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    ప్రణతులిడ శంకరార్యులు భార్యఁగూడి
    యరసవల్లి భక్తిఁ గొలువ నరుగుఁ దెంచ
    తెల్లమబ్బుల దాగుచుఁ దేలి నాడు
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

    రిప్లయితొలగించండి
  11. సమస్య :
    సూర్యుడు చందమామవలె
    శోభిలు శీతకరుండుగా దివిన్

    ( " చాణక్య - చంద్రగుప్త " సినిమా చిత్రీకరణ సందర్భం )

    ఆర్యులు గాంచుడయ్య ! నట
    నార్యుడు చిత్రము దీయువేళలో
    మౌర్యుడు చంద్రగుప్తు దరి
    మాధురి చిందెడి మంజులాంగియౌ
    భార్యయె చేరుచుండగను
    భారతధీరుడు గాంతిమంతుడౌ
    సూర్యుడు ; చందమామవలె
    శోభిలు శీతకరుండుగా దివిన్ .

    రిప్లయితొలగించండి

  12. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆర్యులు కందిశంకరులు హాయిని జేరుచు నర్సవెల్లినిన్
    శౌర్యముజూప సూర్యునకు జంబపు కైపదమీయగా వడిన్
    ధైర్యము కోలుపోవుచును దగ్గుచు తుమ్ముచు శైత్యమందునన్
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్...

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    ఆర్యుడు శంకరుండు నిసు మంతయుజంకక కార్య దీక్షతో
    ధైర్యము నెంచి తర్కమున తార్కొనె మండన మిశ్రు తోడుతన్
    పర్యవసానమున్నిలిచె ప్రశ్న పరంపర కోర్చి నీలుడౌ
    సూర్యుడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ:

      భార్యను గూడి శంకరులు పావన తీర్థము లెల్ల గాంచుచున్
      పర్యటనందు క్షేత్ర సమ భావము నొప్పెడి పూరణమ్ములన్
      కుర్యగ జేయుచున్ సభలు గ్రోలెడు వెల్తురు పాఱజల్లు నా
      సూర్యుడు చందమామవలె శోభిలు శీతకరుండు గా దివిన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  14. క్రౌర్యము కోపతాపములు రక్తపు పోటును పెంచునే, సుతుల్
    భార్యయు భీతి చెంది నిను ప్రబ్బిడి యందురు "మండు ఎర్రనౌ
    సూర్యుఁడు"! చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్
    చర్యలు చేయునట్లు నువు శాంతియు శర్మము కల్గియుండుమా౹౹

    రిప్లయితొలగించండి
  15. అర్యముడు వేడి నిడుచుండు నాగక , దన
    కార్య విధిగ పగటి పూట ; గనబడడుగ
    శర్య సమయమందున , దన సడ్డముగియ
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

    అర్యముడు = సూర్యుఁడు
    శర్య = రాత్రి
    సడ్డ = అక్కఱ

    రిప్లయితొలగించండి


  16. తయిర్ వడై పత్రిక :) నో మసాలా ఓన్లీ కూల్ న్యూస్ :)


    ప్రకటమ్ముగ నాణ్యపు వా
    ర్తకు కాణాచిగ నిలిచెగద దినమణియె శీ
    తకరుఁడు చంద్రుని తెఱఁగున
    సకల తమిళ ప్రజలకు దివసముఖమ్ముననే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. భారతావనినందున పగటిపూట
    వేడిగాలివీచుచురాత్రివేళయందు
    పృధ్వి తిరుగాడనమెరికా వెళ్ళిపోగ
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

    రిప్లయితొలగించండి


  18. చకలన్నది లేదందు! చ
    వక! సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీ
    తకరుండుగా దివిన్ ప
    త్రిక దినమణి తమిళమున ప్రతిదినము సుదతీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. భార్యకు బాధ పిల్లలకు బాధర తల్లికి బాధ తండ్రికి

    న్నార్యుకనార్యుకున్దనకునందరి మంచిని కోరు వారికి

    న్ధార్యముజేసి బాధలను ; తాగుచు వీధిన పొర్లు ధూర్తుకున్

    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. అంబరమునతుషారపు యవనిక రవి
    బింబమునుకప్పి దీప్తుల బెరికి జేయ
    నరుణతాపము భువియందు నణగి తోచె
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున
    (బెరికి=కొఱత, తక్కువ *ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
  21. సూర్యమయూఖమందునొకసుంతయు నూష్మములేక మంచుతో
    శౌర్యముకోలుపోబడిన సైనికు చందము బిక్కు బిక్కుగన్
    కార్యవిమూఢుడై దివిని గ్రాలుచునుండగ దోచెనంతటన్
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  22. తీర్థ యార్థల గల్గెను దివ్యదీప్తి
    కోరికలుదీర బ్రతుకాయె కోమలమ్ము
    ఫలము దక్కగ దోచెను భాగ్యసీమ
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున

    రిప్లయితొలగించండి
  23. ఆర్యులు ధ్యానయోగ సమయంబున శాంతులు దాంతులై సదా
    కార్యము లాచరింతురట కాగల క్షేమము యోగ భూతికై
    వీర్యు లమేయ శ్రేయమిడు వేల్పులు తేజమునందు యోగియే
    *సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్”*

    రిప్లయితొలగించండి
  24. జగమునకువెలుగు నునిచ్చు ఖగమునుండి
    దినమణీయె,శీతకరుడుచంద్రునితెఱగున
    భరణియంతయునుండిన ప్రజలుపొలుపు
    జీవనంబును సాగింత్రు సిరులతోడ

    రిప్లయితొలగించండి
  25. విరహ చిత్తుల కిద్ధర వేదన నిడు
    రాత్రిమణి దినమణి భంగిఁ జిత్రముగను
    స్నేహ మలరఁగఁ బద్మ సమూహమునకు
    దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున


    వీర్య విహీన నిత్య ఘన భీర జనాలికి దూది యెంచఁగా
    వార్యమ యౌను ప్రస్తర నిభమ్ముగ మోయ నశక్యమై ధరం
    గార్యము లందు మగ్ను లగు కార్య రతాత్మ నరాలి కెంచఁగన్
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. వార్యముగానిరీతిరఘురాముడుదానవసంహరుండునై
    ఆర్యులమానసంబునకునారనితేజమునిచ్చుసూర్యుడై
    కార్యపుసాధనంబుననుకాంతనుచేగోనిశాంతినిచ్చెగా
    సూర్యుడుచందమామవలెశోభిలుశీతకరుండుగాదివిన్

    రిప్లయితొలగించండి
  28. సూర్యుడుచందమామవలెశోభిలుశీతకరుండుగాదివిన్
    సూర్యునికాంతిపుంజములుసోకగదేహమువేడియౌగదా
    సూర్యునివోలెకాక హరిచుక్కలఱేడయి శీతలత్వమున్
    శర్యములందునన్నిడును జల్లనివెన్నెలనద్భుతంబుగాన్

    రిప్లయితొలగించండి
  29. వర్యుఁడటంచు మేలుగ వివాహము జేసిన గాని మీదటన్
    కార్యపు మూర్తమున్నరయ కాల విలంబము గాగ తాపమున్
    భార్యను జేరి యుల్లసిలు వానికి వేసవి యైన శీతమౌ
    సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  30. శౌర్యము చూపనెంచుచును సాగగ రాముడు వార్ధికట్టగన్
    ధైర్యముతోడవానరులు దాటగ నెంచుచు సంద్ర రాజమున్
    కార్యము పట్ల దీక్షనట గాంచుచు సాయము చేయు దల్చుచున్
    సూర్యుడు చందమామ వలె శోభిలె శీతక రుండుగా దివిన్

    రిప్లయితొలగించండి
  31. సార్, నమస్తే, నేను కొన్ని పూరణ పద్యాలు వ్రాశాను..కానీ అవి యిక్కడ లేవు..దయచేసి బ్లాగులో పెట్టగలరు...
    పి.ఎల్.నాగేశ్వరరావు, హైదరాబాదు

    రిప్లయితొలగించండి