17, జనవరి 2021, ఆదివారం

సమస్య - 3607

18-1-2021 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్”

(లేదా…)

“నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై”

28 కామెంట్‌లు:



  1. అందల మెక్కగ దుష్టులు
    నందనుల దహించిరంట, నాఁటి పురంధ్రుల్
    డెందమున కసిరగెలె వా
    రందరిని దునుమ విడువక రణమున సుదతీ



    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నందము నొంది త్రాగుచును నందను లెల్లరు రౌడి పుత్రులై
    గందర గోళమై కడకు గార్దభ రీతిని హైద్రబాదునన్
    చిందర వంద్రగా నడిచి చీరలు లాగుచు మీదవ్రాలగా
    నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై...

    రిప్లయితొలగించండి
  3. విందులతో చిందులటా
    పందెము లాడుచు మహిళల బాధించంగా
    నందరునొకటై రాక్షస
    నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్!


    రిప్లయితొలగించండి

  4. కొందరు భైరవాశ్వములు, కొందరు పార్థుని తేరి టెక్కెముల్
    కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్
    కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు కాగ రౌడిలన్
    నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై...

    😊

    రిప్లయితొలగించండి
  5. భందము వేసిన భర్తయె
    పొందగ తనువుకు విముక్తి జంటన్పోగ
    న్నందును ముక్తియనెడి విధి
    నం; దనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చందముగూడు శుభాంగుల
    వెందవులుచు విరలిగూడ వేచుచు నెపుడున్
    దందన జేసెడి కాముక
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్.

    రిప్లయితొలగించండి
  7. చిందులు వేయుచు దురితులు
    నిందించుచు హింస పెట్టు నీచుల గనియున్
    పొందగు పథక ము తో నా
    నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  8. ఇందీవరాక్షులను కా
    మాందులు వంచించిరంచు మంథరమందున్
    ముందింటివాని ముద్దుల
    నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  9. బందెలమారులై చెలగు భానువు పుత్రులు భోగలాలసుల్
    సుందరులైనకాంతలను జూచిన చాలును మత్తికారులై
    పొందును గోరునట్టి కడు మూఢులటంచు నెఱంగి రుట్టు నా
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చందముగూడు భామినుల సౌఖ్యము నొందగ నీతిబాహ్యులై
    దందనతోడ వెందవిలి దానవ తత్త్వము లుద్భవించగా
    అందమునైన శీలముల నాగడమున్ సత మాహరించునౌ
    నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై.

    రిప్లయితొలగించండి
  11. కె.వి.యస్. లక్ష్మి:

    విందుల నాడుచు తేలుచు
    నందము లెంచుచు నతివల నల్లరి పఱచన్
    డెందము ఖేదము లొందగ
    నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  12. ఉ:

    స్పందన లేని రక్షకులు సాకుల నెత్తుచు నీసడించగన్
    బంధము లెంచ కుండగను పాపపు బుద్ధుల క్షోభ గూర్చెడిన్
    పందల శాస్తి జేసి వడి బద్దలు సేయగ బాధలన్నిటిన్
    నందనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకై

    పంద=దుష్టుడు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. అందగ పంటలు చేతికి
    పొందగ హర్షము,పుడమికి పూజల కొరకున్
    పొందికగ తృణముల, కలిసి
    నందనుల, దహించిరంట నాఁటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  14. సందుల గొందులన్ ప్రజల సందడి దందడి మందలించు గా
    మందుల ముందు సుందరిని మన్నన సేయక గేలి సేయగా
    చిందర వందరన్ దరుమ శెట్టి పడంతులు కీచకాధిపున్
    *నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై”*

    రిప్లయితొలగించండి
  15. చిందున కపిలముని సగర
    నందనుల దహించిరంట ; నాఁటి పురంధ్రుల్
    ముందుగ పతుల గలయ తమ
    బొందుల గాల్చు కొనిరంట మోదము తోడన్

    రిప్లయితొలగించండి
  16. పొందవలె స్వతంత్ర మునిక
    అందరు గాజులు తొడిగిరి, అంగనలవలెన్
    సందేశ మిదను, పదముల
    నందనుల, దహించి రంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  17. మందును తాగుచు సతతము
    పందుల వలె పగలు రేయి పలుకుచు బూతుల్
    చిందులు తొక్కెడి కాముక
    నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  18. : అందరి భర్తలున్ మడియ నాహవమందున, రాణివాసపున్
    బంధములన్ తలంచి, తమ భర్తల చేరగ స్వర్గభూమికిన్
    బందిగమందు వైరులిడు బాధల నన్నియు తల్చియగ్నిలో
    నం, దనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకై

    రిప్లయితొలగించండి
  19. పందెముగాయుచుతమలో
    విందునుఁజేయుచుతలపడివీఁగుచునీతిన్
    ముందరనిలచినమన్మధ
    నందనులనుదహించిరటనాఁటిపురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  20. స్యందన గజ తురగ బల
    స్పందిత దే శావ నార్థ సన్నద్ధపు టా
    క్రందమున భర్తలు సమసి
    నం దనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్

    [సమసినన్ + తనుల = సమసినం దనుల]


    ఇంతులు నాఁడు కా రబల లెంచఁగ నింపుగ ధీర చిత్తలే
    సంతత ధర్మ పాలికలు సద్గుణ రాశులు కోరినట్టి వి
    త్తుం దమి నొట్టు నాఁ బలుకు దుష్ట జ నేతర మానినీ రమ
    న్నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై

    [నందనుఁడు = సంతోషించువాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 11/12/2020 నాటి పూరణములు:

      అందఱు నట్లొనరింతురె
      యుందురె వారిప్డు కాం
      చి యొప్పునె యన నీ
      చందము గంగాదేవిని
      నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్


      డెందము లెల్లఁ దల్లడిల ఠీవిగఁ గాష్ఠ గతాగ్ని నంత వే
      గం దమ నాథులం గలయఁ గాంతలు సేరరె మున్ను వింతయే
      పందలు కాక యాజి నిజ భర్తలు గూలఁ దలంచ కించుకై
      నం దనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

      [తనులు = దేహములు]

      తొలగించండి
  21. చిందర వందర చెత్తను
    గొందఱుగని నూడ్చదాని,గొందఱుప్రోగున్
    నందంబుగదాబేర్చెడు
    నందనులదహించిరంట నాటిపురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  22. అందముగా నగుపించిన
    సుందరులను చెరను బట్ట క్షోభను గనులన్
    చిందగ క్రోధాగ్ని యసుర
    నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  23. విందులువినోదములతో
    చిందులువేయుచుసుదతుల శీలంబుల రా
    బందులవలె దోచు దనుజ
    నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి