6, మార్చి 2021, శనివారం

సమస్య - 3655

7-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిద్దిపేట కేగవద్దు కవులు"
(లేదా...)
"వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్"
(సిద్దిపేటలో జరుగనున్న 4 అవధానాలకు నేను వెళ్తున్న సందర్భంగా...)

40 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నిద్దుర లేచివేకువను నీరస మందున పండ్లుతోముచున్
    ముద్దుగ బస్సునెక్కుచును ప్రొద్దుట పూటను హైద్రబాదునన్
    కొద్దిగ పద్య విద్యలను కూరిమి లేకయె కాఫిగ్రోలనున్
    వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్...

    రిప్లయితొలగించండి
  2. పద్యములను పరిచి పాటవమ్ము తడిపి

    సభలకు కొనిపోయె శంకరయ్య

    జనులు నిండె పురము జలము దొరకదట

    సిద్దిపేట కేగవద్దు కవులు"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. మాటమాటపెరుగుమాటులేకపలుకు
    మర్మమెంచిఁజూడమరపురాదు
    తేటతెల్లమౌనుతెలుగుమాటలజోరు
    సిద్దిపేటకేగచిత్రకవులు

    రిప్లయితొలగించండి
  4. సిద్ధిపేట కేగ సిద్ధించు కవులకు
    ముద్దుముద్దు కవిత పొద్దుపొద్దు
    విద్దె నేర్వకుండ పద్దెమ్ము వద్దన
    సిద్ధిపేట కేగవద్దు జనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్దిరబన్న యందురుగ యచ్చతెనుంగున పద్దెమల్లగా
      విద్దెల గారవించు యలివేణులు, పిన్నలు, పెద్దలందరున్
      దిద్దక పద్యరీతులను తీరుగ పద్యము వ్రాయలేనిచో
      వద్దుర సిద్ధిపేట జనవద్దు కవుల్, గనరారు సజ్జనుల్

      తొలగించండి
  5. పెద్దలు పద్య సేవకులు ప్రేమగ రమ్మని పిల్పు పంపగన్

    ముద్దు కరోనలందుకొని ముందుగ చేరెను పద్య ప్రాంగణిన్

    హద్దులు మూసిరంట సరి హద్దులు దాటనునీయరంటయా

    వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. మద్దతుచూపకేమనలమాటలమర్మమువిప్పలేరులే
    హద్దులుదాటుచున్కలిమిహాయనివింతగతూలనాడుచున్
    పద్ధతిపద్యమందుగలభాసిలుశోభనుచూడరాసభన్
    వద్దురసిద్ధిపేటఁజనవద్దుకవుల్కనరారుసజ్జనుల్

    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    వద్దుర సిద్దిపేట జన
    వద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    ( సిద్దిపేటలో మంచిపద్యాలు చెబితే పులకింత - ఏదోగా చెబితే ఏవగింత )

    ఉత్పలమాల
    -------------

    ముద్దులు గారు పద్దెముల
    మోజుగ విందురు సభ్యులెల్లరున్;
    బెద్దగ గారవించెదరు ;
    పెంపుగ నింపుగ జెప్పలేనిచో
    వద్దుర సిద్దిపేట జన
    వద్దు కవుల్ ; గనరారు సజ్జనుల్
    మొద్దుగ నేవొ పద్యముల
    ముక్కుచు జెప్పిన నాలకింపగన్ .

    రిప్లయితొలగించండి
  8. సిద్దిపేటయందు నుద్దండులున్నారు
    వారి మెప్పు పొంద నేరి తరము?
    పరువు నిలుపుకొనగ ప్రద్రవమది మేలు
    సిద్దిపేట కేగవద్దు కవులు

    రిప్లయితొలగించండి
  9. అచట గాంచ వచ్చుఁ నష్టావ ధా నముల్
    సిద్ది పేట కేగ : వద్దు కవులు
    జార విడువ రాదు చక్కని య వకాశ
    మంచు శంక రయ్య యనెను గాదె

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    అపరవాగ్విభవులు నవధానముల సేయ
    దిగ్గజములఁ బోలి తీరి రాగ
    నవధరింపలేక యభినందనమ్ముల
    సిద్దిపేట కేగవద్దు కవులు

    ఉత్పలమాల
    అద్దరి పాండితీ ప్రభల నయ్యవధానులు దిగ్గజమ్ములై
    తద్దయు వాగ్విభూషణల ధన్యులఁ జేయ వధానవేడుకన్
    విద్దెల చూడబోవుటకు వేదిక వద్దకు తప్ప నన్యులై
    వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  11. గ్రాస మునకు కొరత, గ్రామము మున లేదు
    పల్లెలు మనకునిడు పణము చాల
    పచ్చనివరిచేలు, పైరగాలి , కలుగు
    సిద్ది, పేట కేగవద్దు కవులు

    రిప్లయితొలగించండి
  12. రసపిపాసులు నగరములోని జనులెల్ల
    నటగల దవధానమనుచు నెఱగి
    వచ్చిరెల్ల రిండ్లు వదలి సభకు గాన
    సిద్దిపేట కేగవద్దు కవులు .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  13. పెద్దలు జ్ఞానపూర్ణులగు విజ్ఞులు హెచ్చుగ నున్న పట్టణం
    బిద్దియె, గాంచ పండితుల కిచ్చట లోటను మాటలేదులే
    విద్దెలు భూరిగా గల వివేకులు చేరిరి సాహితీసభన్
    వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్, గనరారు సజ్జనుల్ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    ముద్దుగ మాటలాడెదరు మోదము నొందెడి భుక్తి గూర్తురౌ
    హద్దులు లేని యాదరణ యడ్డము లేదట నక్కు జెర్చగన్
    బద్దకమున్నవారలును పద్దెము వ్రాయుట రానివారలే
    వద్దుర సిద్దిపేట జన వద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. పెద్దలు వారు సత్కవులు పేరును బొందిన పండితాగ్రణుల్
    పద్దెములల్లు విద్దెలను వారికి వారలె సాటి యండ్రు యే
    పొద్దును వారి ప్రాభవము పొల్పుగ జూపక విశ్రమింతురే?
    వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  16. సభ జరుగును నేడు సమయమునకు రమ్ము
    వేడుక పదములది, విందె మనకు
    అలసటలను దీర్చు, అసలాలసముగను
    సిద్ది పేట కేగవద్దు కవులు

    రిప్లయితొలగించండి
  17. పెద్దలు పిన్నలున్ బుధులు వేదిక నందలి ప్రౌఢ ధీరులున్
    బద్దలు గట్టి ఛందమున వాదము సేయుచు నీవు నేననన్
    విద్దెల పోరు బెంచిరట భీరుల మొద్దుల నీదు వెంట తే
    వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  18. కవులు లేనిచోట యవధాన విద్యయున్
    జరుపుకొనుట నెటుల చక్కగాను
    శంకరయ్య గురువు శలవిచ్చె నెందుకో
    సిద్దిపేట కేగవద్దు కవులు

    రిప్లయితొలగించండి
  19. సిద్దిపేట కేగవద్దు కవులెపుడు
    హద్దు మీరుచుందురచటి వారు
    ముద్దుగ కయిపదము బూరించ కుండిన ,
    మొద్దు లెవరు లేరు పురమునందు

    రిప్లయితొలగించండి


  20. ఓర్ని! పాసగూల! ఒక్కరు లేరక్క
    డౌర తెలుగు తెలిసి ! డాబు చేయు
    వారు పెక్కు గలరు ! వలదు వద్దిక వద్దు
    సిద్దిపేట కేగవద్దు కవులు!

    రిప్లయితొలగించండి


  21. అనుభవముతో పలికితి సు
    జన! వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్!
    గనరారు సజ్జనుల్ తెలి
    యని విషయములను! విడువరయా యొరకొనకన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. ఇట్టితలపుతమకు తట్టనే గూడదు
    "సిద్దిపేట కేగవద్దు కవులు"
    మంచి ప్రశ్న వేసి మన్ననలందుము
    సందియమ్ముతగదు శంకరార్య !

    రిప్లయితొలగించండి
  23. సుద్దులు చెప్పుచుండె తన సూనునకున్ జనకుండు పుత్రకా!
    పద్దెములన్ బఠించుము శుభంబగు నీకును జ్ఞానవృద్ధియౌ
    చద్దుల నారగించి యనిశంబు గృహమ్మున జేరి యుండుమా
    వద్దుర సిద్ది! పేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  24. వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
    హద్దును మీరు చుందురట నచ్చటి
    పౌర జనంబు లెల్లరున్
    ముద్దుగ కైపదంబులను బూరణ జేయని వేళలందునన్ ,
    మొద్దులు కారు వారెవరు , బుద్దుల
    నెంచుచు జూచినప్పుడున్

    రిప్లయితొలగించండి
  25. మద గమనముతోన మత్తేభ గుంపులు

    చంపకముల మాల శాతబట్టి

    సభల తిరుగబట్టె, జాగరూకులవరో

    సిద్దిపేట కేగవద్దు కవులు"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  26. కవితాగానకార్యక్రమానికి
    'దుమ్ముపేట' అనే వంచకులు ఎక్కువగా ఉండే ఊరికి వెళ్ళుచున్న సిద్ధరామయ్య అనే ఉత్తమకవి తో మరో కవిమిత్తుడు,...

    పద్దెము గిద్దెముల్ యతులు ప్రాసలు సత్కవనమ్ము గానముల్
    ముద్దులు గూర్చ వేవియును మోసము చేయుటె వారి వృత్తి నీ
    యొద్ద గలట్టి విత్తమునె యూడ్చెద, రూడును కొండ నాల్క హా!
    వద్దుర సిద్ది! పేటఁ జనవద్దు కవుల్ గన, రారు సజ్జనుల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. సుద్దులు జెప్పవద్దు గడు చోద్దెము ముద్దుగ పద్దెమొద్దికన్
    బెద్దలు బద్దకంబు విడి విద్దెల బుద్దిగ ప్రొద్దు ప్రొద్దునన్
    హద్దులు మీరి నేర్చి రపహాస్యము సేయగ పొద్దుపోక పో
    **వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్; గనరారు సజ్జనుల్"*
    గద్దియబుద్ధవిగ్రహముగాగనువిందొనరించనించగా

    రిప్లయితొలగించండి
  28. రాష్ట్రమునక రోన రగులుచు వ్యాపించె
    సిద్దిపేట కేగ వద్దు కవులు
    నెందు కైన మంచి దేగ కుండగనింటి
    యొద్ద యుండి వినుడు పద్యములను

    రిప్లయితొలగించండి
  29. వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
    నద్దమఱేయి వచ్చెనటయచ్చటకేమఱి యాకరోన సూ
    ముద్దనువోలె గన్పడుచు మోమున దూరుచు గంఠమందు దా
    దద్దయు బాధవెట్టునట తాలిమి చాలని నంతగా రవీ!

    రిప్లయితొలగించండి
  30. బూచి చెలఁగు చుండి దోఁచుఁ బ్రాణమ్ములు
    కానఁ బడదు కంటఁ గాని కలదు
    వింత జాల మందు వేడుకఁ జల్పుఁడీ
    సిద్దిపేట కేఁగ వద్దు కవులు


    తద్దయు సంధు లొల్లరు సతమ్ము దృతమ్ముల గౌరవింపరే
    సుద్దుల యందుఁ బొంక మది చోద్యమె వద్దన నాలకింపరే
    గ్రద్దనఁ బద్దె మల్లుటయుఁ గద్దుమ యన్వయ ముండ నేరదే
    వద్దుర సిద్దిపేటఁ గనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్

    [కేవలము పూరణార్థమె. నా భావ మిది కాదు.]

    రిప్లయితొలగించండి
  31. కలువనింటకవులకష్టమా రోజులన్
    మనసువిప్పినిడివిమాటలాడ
    వెడలియుంద్రుకనగఁవేదికన్ శంకరున్
    సిద్దిపేట కేగవద్దుకవులు

    ---గాదిరాజు మధుసూదనరాజు


    కంది శంకరయ్య వారే స్వయంగా ప్రకటన చేశాక..ఇక కవులను కలిసేందుకు .....ఆ అవధానాలు ఉండే రోజులలో సమయంలో. .కవుల ఇళ్ళకు వెళ్ళటం వృధా ..ఆ వేదికల వద్దే ఉంటారు మంచి వారూ మంచికవులుకూడా..ఆనందోత్సాహాలతో. ఉత్కంఠగా.. చూస్తూ వింటూ.

    రిప్లయితొలగించండి

  32. వెడలియుంద్రుకనగఁవేదికన్ శంకరున్
    సిద్దిపేట కేగవద్దుకవులు

    కలువనింటకవులకష్టమా రోజులన్
    మనసువిప్పినిడివిమాటలాడ!
    ---గాదిరాజు మధుసూదనరాజు


    కంది శంకరయ్య వారే స్వయంగా ప్రకటన చేశాక..ఇక కవులను కలిసేందుకు .....ఆ అవధానాలు ఉండే రోజులలో సమయంలో. .కవుల ఇళ్ళకు వెళ్ళటం వృధా ..ఆ వేదికల వద్దే ఉంటారు మంచి వారూ మంచికవులుకూడా..ఆనందోత్సాహాలతో. ఉత్కంఠగా.. చూస్తూ వింటూ.

    రిప్లయితొలగించండి
  33. విద్దెలమ్మ గొలువ వేడ్కగ జేరిరి
    పెద్దలందరచట పేర్మి గాని
    మొద్దు తెగువ వలదు మూతి ముసుగు లేక
    సిద్దిపేట కేగవద్దు కవులు

    రిప్లయితొలగించండి
  34. పెద్దలుపిన్నలున్ కలిసి ప్రేమయుగౌరవముండగుండెలన్
    రద్దులుగుద్దులన్ గొడవలన్ దరిజేరనీక తా
    మిద్దరినిద్రమానిపరమేశుగుడిన్ శివరాత్రినుంద్రహో!
    వద్దురసిద్దిపేటఁజనవద్దుకవుల్ గన రారు సజ్జనుల్

    గాదిరాజు మధుసూదనరాజు

    కవులు ...కవిత్వాలు అవధానాలు అంటూ సిద్దిపేట కు శివరాత్రి రోజు రావద్దు.ఆ రోజు పెద్దలు పిన్నలు సజ్జనులందరూ పూజలు జాగారాలతో శివాలయాలలో గడుపుతూ ఉంటారు మీ ప్రోగ్రాములు చూసేందుకు సజ్జనులెవ్వరూ రారు అని భావం.

    రిప్లయితొలగించండి
  35. పెద్దలుపిన్నలున్ కలిసి ప్రేమయుగౌరవముండగుండెలన్
    రద్దులుగుద్దులన్ గొడవలన్ దరిజేరనీక తా
    మిద్దరినిద్రమానిపరమేశుగుడిన్ శివరాత్రినుంద్రహో!
    వద్దురసిద్దిపేటఁజనవద్దుకవుల్ గన రారు సజ్జనుల్

    గాదిరాజు మధుసూదనరాజు

    కవులు ...కవిత్వాలు అవధానాలు అంటూ సిద్దిపేట కు శివరాత్రి రోజు రావద్దు.ఆ రోజు పెద్దలు పిన్నలు సజ్జనులందరూ పూజలు జాగారాలతో శివాలయాలలో గడుపుతూ ఉంటారు మీ ప్రోగ్రాములు చూసేందుకు సజ్జనులెవ్వరూ రారు అని భావం.

    రిప్లయితొలగించండి


  36. సమస్య:
    సిద్ధిపేట కేగవద్దు కవులు


    ఆ.వె.
    సిద్ధిపేటయనగ బుద్ధిజీవులనేల
    కావ్యఝరులు విరియు కవులసీమ
    బుర్ర పదునుపెట్టి పోవలె, వట్టిగా
    *సిద్ధిపేట కేగవద్దు కవులు*

    @శ్రీధర్ కొమ్మోజు, వరంగల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనతెలంగాణమదిఘనమంచుపలికి
      సిద్ధిపేటతీరునుతెల్పె శ్రీధరకవి
      అలుసుగఁదలంచియడుగిడనలుపెదక్కు
      సిద్దిపేటకేగ వద్దుకవులు

      తొలగించండి